
ఇకపై లోఓల్టేజీ సమస్య ఉండదు..
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో ఇకపై లోఓల్టేజీ సమస్య ఉండదని ఎమ్మెల్యే యెన్నం అ న్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద రూ. 3.29కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా లోఓల్టేజీ కారణంగా వ్యవసాయ బోరుమోటార్లు కాలిపోవడంతో పాటు వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. లోఓల్టేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత, విద్యుత్ ఎస్‌ఈ పీవీ రమేశ్, డీఈ లక్ష్మణ్, ఏడీ మద్దిలేటి, ఏఈ నర్సిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, మాజీ వైస్‌చైర్మన్ షబ్బీర్ అహ్మద్, రామాంజనేయులు, అంజద్, ఖాజా పాషా, చిన్నా, జేసీఆర్, ప్రశాంత్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.