
ఇక్కడ డ్యూటీ చేయలేం..!
మంచిర్యాలక్రైం: ఆ పోలీసుస్టేషన్‌లో ఖాకీ కొలువు కత్తిమీద సాములా మారింది. అటు పోలీసు ఉన్నతాధికారులు.. ఇటు రాజకీయ నాయకుల ఒత్తిడి మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. పోలీసుశాఖలో బ దిలీల సందర్భంలో నచ్చిన చోట పోస్టింగ్ కోసం పోలీసులు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చే స్తుంటారు. జిల్లాలో డిమాండ్ ఉన్న పోలీసుస్టేషన్లలో ఎస్‌హెచ్‌వో పోస్టింగ్ కోసం రూ.లక్షలు వెచ్చించడానికై నా విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఉన్నతా ధికారులు, రాజకీయ నాయకుల కనుసన్నల్లో ‘మామూలు’గా పని చేసుకుంటారు. పోలీసు శాఖలో ఇది సర్వసాధారణమే అయినా దీనికి భిన్నంగా జి ల్లాలోని ఓ పోలీసుస్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోగా పని చే యాలంటే దమ్ము, ధైర్యం, అధికార బలం ఉండాల్సిందే. ఇక్కడికి వచ్చేందుకు ఎంతైనా ఖర్చు చేసి రావడానికి ఉత్సాహం చూపిస్తారు. విధుల్లో చేరి ఓ ఆరు నెలలు గడిచాక శాంతిభద్రతల పరిరక్షణ, రా జకీయ నాయకుల ఒత్తిడితో ఇక్కడ విధి నిర్వహణ కత్తి మీద సాములా మారుతుంది. ఎందుకు వచ్చా మా.. అనుకుంటూ మళ్లీ రూ.లక్షలు వెచ్చించి బది లీపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచడంలో పోలీసుశాఖలో నిజా యతీ అధికారిగా పేరున్న ఓ అధికారి 2024 ఫిబ్రవరిలో ఇక్కడ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు చేపట్టారు. నెల రోజులకే ఇక్కడ పని చేయాలేనంటూ ఉన్నతా ధికారులకు పరిస్థితి వివరించి బదిలీ కోసం దరఖా స్తు చేసుకున్నారు. ఆరోగ్య సమస్య అంటూ బదిలీపై వెళ్లిపోయారు. ఆయన తర్వాత బాధ్యతలు చేపట్టిన అధికారి ఒక వర్గానికే మద్దతు ఇవ్వడంతో అధికారులు బదిలీ వేటు వేశారు. ఓ అధికారి సాధారణ బదిలీల్లో భాగంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ పని చేయడం కష్టమేనని బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడాది కాలంలో ముగ్గురు అధి కారులు మారారు. ప్రస్తుతం పని చేస్తున్న ఓ అధికా రితోపాటు మరో అధికారి సైతం ఎలాగైనా ఇక్కడి నుంచి మరోచోటికి వెళ్లేందుకై నా, లూప్‌లైన్‌లో విధులు నిర్వర్తించడానికై నా సిద్ధమేనంటూ ఉన్నతాధికారులకు అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం.
అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
జిల్లాలో జరిగిన కొన్ని దాడుల కేసుల్లో తీవ్రంగా పరిగణిస్తుండగా.. మరికొన్ని కేసుల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిడా.. ‘మామూలు’గా వ్య వహరిస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. కొన్ని కేసుల్లో దాడులకు పాల్పడిన వారిపై కా కుండా గాయపడిన వారిపై కేసులు నమోదు చేయ డం, ఒకవేళ ఇరువర్గాలపై కేసులు చేయాల్సి వస్తే గాయడిన వారిపై నాన్‌బెయిలేబుల్ కేసులు, దాడి చేసిన వారిపై స్టేషన్ బెయిల్ కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలున్నా యి. జిల్లా కేంద్రంలోని శివాజీ గ్రౌండ్‌లో రౌడీషీటర్‌పై జరిగిన దాడిలో ఇప్పటికీ నిందితులను గుర్తించకపోవడం, పైగా గాయపడిన వ్యక్తి ఫిర్యాదు చే యలేదని పోలీసులు చేతులెత్తేయడం గమనార్హం.
పోలీసు అధికారుల అనాసక్తి
లూప్‌లైన్‌లోకి వెళ్లేందుకై నా సిద్ధమే..