
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
బెజ్జూర్: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన సుంకరి లక్ష్మి (55) కుటుంబ కలహాలతో శనివారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం 108లో కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి భర్త సుంకరి పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు.