
బాలీవుడ్ నటి ఆదితి పోహంకర్ బాలీవుడ్‌లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది. లాల్ భారీ అనే మరాఠీ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆదితి.. ఆ తర్వాత తమిళ చిత్రాల్లోనూ కనిపించింది. బాలీవుడ్‌లో షీ, ఆశ్రమ్ లాంటి వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆశ్రమ్ వెబ్ సిరీస్‌లో బాబీ డియోల్‌తో చేసిన ఇంటిమేట్ సీన్లపై స్పందించింది.
ఇద్దరు నటీనటులు సన్నిహితంగా ఉండే సన్నివేశాలు చేయడం చాలా కష్టమని ఆదితి పోహంకర్ తెలిపింది. ఇలాంటి సీన్స్‌లో పురుషులే ఎక్కువగా కష్టపడతారని ఒకరు నాతో చెప్పారని గుర్తు చేసుకుంది. ఇలాంటి విషయాల్లో ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని తెలిపింది. ఆశ్రమ్ సిరీస్‌లో నటించే సమయంలో మా మధ్య రిలేషన్ బలంగా ఉందని.. ఏదైనా సీన్స్ మళ్లీ చేయాల్సి వస్తే.. తప్పకుండా చేసే వాళ్లమని వెల్లడించింది.
ఇంటిమేట్ సీన్స్‌పై అదితి మాట్లాడుతూ.. " అసలు అలాంటి కాన్సెప్ట్ ఉందని నాకు తెలియదు. కానీ ఇద్దరు నటీనటుల మధ్య దూరం ఉంటే.. అది తెరపై మరింత ఇబ్బందికరంగా మారుతుందని నేను నిజంగా నమ్ముతున్నా. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, మీ స్వంత లయను కనిపెట్టడం మంచిది. ఈ విషయాల్లో కచ్చితంగా దర్శకుడు సాయం చేస్తాడు. కానీ ఇద్దరి మధ్య మానసికంగా దూరం లేనప్పుడే నిజమైన ఫలితం వస్తుంది. ఇలాంటి సన్నివేశాల్లో ఎంత సహజంగా నటించారనేదే ముఖ్యం. ఎందుకంటే ఆ సీన్‌లో లిమిట్స్ మనకు తెలుసు. అందుకే నటీనటులు భయపడకూడదు" అని అన్నారు.