
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ఇటీవలే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్ గురించి బయటపెట్టాక ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిపోయారు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు ఓ తన బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. దాదాపు 60 ఏళ్ల వయసులో డేటింగ్ ఉన్నానంటూ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చారు.
అయితే తాజాగా అమిర్ ఖాన్, తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసి సందడి చేశారు. వారితో పాటు టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న సోఫీ షైన్ కూడా ఉన్నారు. చైనాలో జరిగిన రెండో మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్‌లో వీరు కనిపించారు. వీరితో పాటు అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కూడా ఉన్నారు.
గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్
కాగా.. ఇటీవలే తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌కు మీడియాను పరిచయం చేశాడు. వీరిద్దరూ దాదాపు 25 సంవత్సరాల క్రితం కలుసుకున్నారు. బెంగళూరులో నివసించే గౌరికి గతంలోనే వివాహమై ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. తాజాగా ఈ జంట చైనాలోని మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్‌లో జంటగా కనిపించారు. కాగా.. అమిర్ ఖాన్ అంతకుముందు డైరెక్టర్ కిరణ్ రావుతో జూలై 2021లో విడాకులు తీసుకుంటున్నారు. అంతకుముందే రీనా దత్తాను పెళ్లాడిన ఆయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అమీర్ సితారే జమీన్ పర్ మూవీలో కనిపించనున్నారు. చివరిసారిగా లాల్ సింగ్ చద్దాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడంతో విఫలమైంది.