
హైదరాబాద్ మహా నగరంలో కొత్త జర్నీని ప్రారంభించిన తనకు ఎదురైన ఆటుపోట్లు ఏంటి? వాటి వల్ల అతను ఏం నేర్చుకున్నాడనే కథాంశంతో ‘అర్థమైందా అరుణ్ కుమార్
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా మరో కొత్త వెబ్ సిరీస్‌ను తీసుకు వస్తోంది. అరుణ్ కుమార్ ముందా అనే వ్యక్తి జీవితంలో.. ఆఫీసులో జరిగిన ఆకర్షణీయమైన అంశాలతో ‘అర్థమైందా అరుణ్ కుమార్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించింది. ఈ మేరకు బుధవారం నాడు పోస్టర్ విడుదల చేసింది. చిన్న పట్టణ ప్రాంతంలో నివసించే యువకుడు అరుణ్ కుమార్, జీవితంలో ఏదో సాధించాలనే కలలతో కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు.
హైదరాబాద్ మహా నగరంలో కొత్త జర్నీని ప్రారంభించిన తనకు ఎదురైన ఆటుపోట్లు ఏంటి? వాటి వల్ల అతను ఏం నేర్చుకున్నాడనే కథాంశంతో ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్‌సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్‌ను ఆరె స్టూడియోస్, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ బ్యానర్స్ రూపొందిస్తున్నాయి. హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. కార్పొరేట్ ఉద్యోగులు వారి ప్రయాణంలో పడే బాధలు, వారి కలలను సాధించే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, సాధించే విజయాలు వంటి వాటిని ఈ సిరీస్‌లో మనం చూడొచ్చు.
Corporate Samrajyam...
— ahavideoin (@ahavideoIN) June 7, 2023
Asmakam..Ajeyam..!
Arunkumar ki suffocation 🤯
Here is the first look of
Ardham Ayinda Arun kumar #AAKOnAHA Coming Soon ✌🏻@HarshithReddyM @TejaswiMadivada @ananyaontweet #JonathanEdwards @Tanvi1908 @ArreTweets @polasaninaresh1 @bnreddystar pic.twitter.com/27LM5TpcfB