
నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తనదైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు రవి ఆంథోని. ఈ పేరు మ్యాడ్ మూవీతో ఫేమస్ అయినా మ్యాడ్ స్క్వేర్‌తో మరోసారి మార్మోగిపోయింది. టాలెంట్ ఉంటే సినీ ప్రేక్షకులు ఎంత దూరమైనా ఒక నటుడిని తీసుకెళ్లగలరు అని మరోసారి రుజువు చేశారు.
ఆంథోనీ అసలు పేరు రవి ఆంథోనీ. స్క్రీన్ నేమ్ ఆంథోనీగా అందరికి సుపరిచితుడు. తన కామెడీ టైమింగ్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇటీవల జరిగిన మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్‌లో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆంథోనీ నటనకి ఫిదా అయ్యానని తెలిపారు. అతని నటనకి మంచి భవిష్యత్తు కూడా ఉందని అన్నారు. ప్రస్తుతం ఆంథోనీ పలు సినిమాల్లో నటిస్తూ.. మరిన్ని ప్రాజెక్టులు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.