కాలమే సమాధానమిస్తుంది.. పోలీసు విచారణ తర్వాత విష్ణుప్రియ | Anchor Vishnu Priya First Reaction After Police Investigation | Sakshi
Sakshi News home page

Vishnu Priya Bhimeneni: పోలీస్ స్టేషన్ దగ్గర సైలెంట్.. ఇన్ స్టాలో మాత్రం

Published Fri, Mar 21 2025 12:26 PM | Last Updated on Fri, Mar 21 2025 12:26 PM

Anchor Vishnu Priya First Reaction After Police Investigation

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, పలువురు ఇన్ఫ్లూయెన్సర్స్ పై పోలీస్ కేసుల హడావుడి నడుస్తోంది. నిన్నటికి నిన్న యాంకర్స్ విష్ణుప్రియ, రీతూ చౌదరి.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి విచారణ కోసం హాజరయ్యారు. ఇద్దరినీ కొన్ని గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది. 

అయితే స్టేషన్ కి వచ్చినప్పుడు ముఖం మొత్తం కప్పేసేలా స్కార్ఫ్ కట్టుకుని వచ్చిన వీళ్లిద్దరూ ఒక్కటంటే ఒక్క మాట కూడా మీడియాతో మాట్లాడలేదు. కానీ విచారణ అంతా ముగిసి ఇంటికెళ్లిన తర్వాత మాత్రం విష్ణుప్రియ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అందులో ఏమందంటే?

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)

'కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. అప్పటివరకు ఓర్పుతో ఉండటమే' అని విష్ణుప్రియ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీనిబట్టి చూస్తుంటే ఈ కేసులో ఏదో ఒకటి తేలేంత వరకు స్పందించనని క్లారిటీ ఇచ్చినట్లయింది.

విష్ణుప్రియ విచారణ విషయానికొస్తే.. ఈమె లాయర్ తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చింది. దాదాపు 10 గంటల పాటు విచారించారు. మూడింటికి మాత్రమే ప్రమోషన్ చేశానని ఈమె చెప్పగా.. తమ దగ్గర 15 వీడియోలు ఉన్నాయని పోలీసులు ఈమెతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈమె బ్యాంక్ లావాదేవీలని కూడా పరిశీలించి, నిధులపై పోలీసులు ఆరా తీశారని అంటున్నారు. ఈనెల 25న మరోసారి విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించారట.

(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్‌: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్‌..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement