
తమిళ హీరో, రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయకాంత్ అనారోగ్యంతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో చాలామంది ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అలానే ఆయన సినిమాల్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఓ స్టార్ దర్శకుడు మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన చనిపోలేదని, కొందరు హత్య చేశారని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలేం జరిగింది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
మలయాళంలో 'ప్రేమమ్', 'గోల్డ్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అల్ఫోన్స్ పుత్రెన్.. ప్రస్తుతం కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. తాజాగా విజయకాంత్ మృతిపై స్పందించిన ఇతడు.. ఇన్ స్టా స్టోరీలో షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఈ హత్య ఎవరు చేశారో కనిపెట్టకపోతే మాత్రం.. నెక్స్ట్ మీ తండ్రి స్టాలిన్, అలానే మిమ్మల్ని కూడా వాళ్లు టార్గెట్ చేసే అవకాశముందని ఇతడు రాసుకొచ్చాడు.
'కరుణానిధి, జయలలితని మర్డర్ చేసింది ఎవరో కనిపెట్టాలని మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు మీరు కెప్టెన్ విజయకాంత్‌ను ఎవరు హత్య చేశారో కూడా కనిపెట్టాలి. ఇదంతా ఏముందిలే అని పక్కన పెట్టేస్తారేమో.. ఇప్పటికే స్టాలిన్ సార్‌పై, ఇండియన్ 2 సెట్స్‌లో కమల్ హాసన్‌పై హత్యా ప్రయత్నం జరిగింది. ఒకవేళ ఈ హంతకులను పట్టుకునే ప్రయత్నం చేయకపోతే మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు' అని ఆల్ఫోన్స్ రాసుకొచ్చాడు. అయితే అసలు ఈయన ఎందుకు ఇలా రాసుకొచ్చాడా? అని అనుకుంటున్నారు.
(ఇదీ చదవండి: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ)