
సండే వచ్చిందంటే ఎవరైనా సరే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. లేదా జాలీగా ఎక్కడికైనా వెళ్లి రావాలనుకుంటారు. కుదిరితే పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న హీరో మాత్రం తన ఇల్లు తుడిచే పనిలో పడ్డాడు. తమిళ హీరో రవి మోహన్ (Ravi Mohan) ఇంటిని శుభ్రం చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేశాడు. శుభ్రంగా ఒకటికి రెండుసార్లు ఫ్లోర్ తుడుస్తున్నాడు. 'సొంతంగా ఇంటిని శుభ్రం చేసుకోవడమే ఈరోజు నా పని.
జయం సినిమాతో హిట్
అదేంటోకానీ ఈ పని చేస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తోంది' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు మీరు గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. రవి మోహన్.. బావ బావమరిది, పల్నాటి పౌరుషం వంటి తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. జయం (తెలుగు జయం రీమక్) అనే తమిళ సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈయన పేరు జయం రవిగా స్థిరపడిపోయింది.
తమిళంలో హీరోగా..
దాస్, ఇదయ తిరుదన్, దీపావళి, పెరణ్మనై, ఎంగేయుమ్ కాదల్, ఆది భగవాన్, రోమియో జూలియట్, మిరుథన్, బోగన్, టిక్ టిక్ టిక్, భూమి, పొన్నియన్ సెల్వన్, బ్రదర్, భూలోహం, కాదలిక్క నేరమిళ్లై వంటి పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం అతడి చేతిలో కరాటే బాబు, పరాశక్తి, జీని, తని ఒరువన్ చిత్రాలున్నాయి.
విడాకులు?
ఇదిలా ఉంటే రవి.. నిర్మాత సుజాత విజయకుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరవ్, అయాన్ అని ఇద్దరు కుమారులు సంతానం. రవి- ఆర్తి గతేడాది విడిపోయారు. విడాకులకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు కొన్నేళ్లుగా జయం రవిగా స్థిరపడిపోయిన ఆయన.. తనను రవి అని మాత్రమే పిలవాలని కోరాడు.
చదవండి: నన్ను పెళ్లి చేసుకుంటావా? స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు