
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్‌గా నటించింది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా మే 1న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ హైదరాబాద్‌సో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే తాను అగరం పౌండేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ చూసి తాను స్ఫూర్తి పొందినట్లు సూర్య వివరించారు. మెగాస్టార్‌ను ఆదర్శంగా తీసుకుని చెన్నైలో అగరం ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు సూర్య వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ను సందర్శించిన తర్వాత తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
సూర్య మాట్లాడుతూ.. 'ఇదంతా ఇక్కడే మొదలైంది. ఇక్కడ ఒకరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి వెళ్లాను. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. " అన్నారు. ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. అగరం ఫౌండేషన్‌ను ప్రారంభించేందుకు మీరు నాకు శక్తిని, ధైర్యాన్ని అందించారు. మీ వల్ల ఎనిమిది వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు అయ్యారు. మీ అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. తన ఫౌండేషన్ కోసం తెలుగు వారి నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. ఐదేళ్ల క్రితం అగరం ఫౌండేషన్ కోసం నిధుల సేకరణ కోసం యుఎస్‌లో ఉన్నా. అక్కడ ఉన్న తమిళ విద్యార్థుల కోసం తెలుగు మాట్లాడే వారి నుంచే ఎక్కువ నిధులు వచ్చాయి. తెలుగు ప్రజలు చాలా దయగల హృదయం ఉన్న వ్యక్తులు. వారు ఇప్పటికీ తమిళ విద్యార్థుల చదువుకు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయంలో మీపట్ల చాలా కృతజ్ఞతతో ఉన్నా' అని అన్నారు. కాగా.. ఈ సినిమా నాని నటించిన హిట్-3 మూవీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.