
చిన్న చిత్రమైనా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా అయినా.. కంటెంట్ బాగుంటేనే థియేటర్‌కు వస్తామంటున్నారు ఆడియన్స్. లేదంటే మాత్రం చూసేదేలేదని తేల్చి చెప్తున్నారు. ఈ క్రమంలో 'హనుమాన్' వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవగా 'బడే మియా చోటే మియా' వంటి భారీ బడ్జెట్ సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయాయి.
చాలా పెద్ద విషయం
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా రాబట్టింది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 'ఇంత గొప్ప కలెక్షన్స్ అందుకుని ఈ మైలురాయిని చేరుకోవడం మా యంగ్ టీమ్‌కు చాలా పెద్ద విషయం.
సందీప్‌పై సెటైర్స్?
అయితే విధ్వంసం, అరాచకం, రక్తపాతం, అశ్లీలత లేకుండా ఈ విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు సపోర్ట్ చేసిన నటీనటులకు, సినీ ప్రేక్షకులకు థాంక్యూ' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు. దానికి రేపటికోసం అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేశాడు. ఇది చూసిన కొందరు.. యానిమల్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేస్తూ పై కామెంట్స్ చేశాడా? అని నాగ్ అశ్విన్‌ను అనుమానిస్తున్నారు.
పోలిక అవసరమా?
సందీప్ తన సినిమాలను కొత్తగా ట్రై చేస్తున్నాడు. అతడిని కించపర్చాల్సిన అవసరం లేదు. ఎవరి స్టైల్ వారికుంటుంది. పక్కవారిని ఎందుకు అనడం? ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని పలువురూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం కల్కి ఆల్‌రెడీ యానిమల్ సినిమా కలెక్షన్స్ దాటేసింది. నాగ్ అశ్విన్.. ఆ సినిమా డైరెక్టర్‌ను ఉద్దేశించి మాట్లాడలేదు. ఏదో సాధారణంగా చెప్పాడంతే! అని నాగిని వెనకేసుకొస్తున్నారు.
Man literally attacked Sandeep vanga like nobody ever could 🏃🏻♂️#SandeepReddy #Kalki28989AD #nagashwin pic.twitter.com/p3E6f4sZPE
— HARISH KS (@CinemaPaithiyom) July 14, 2024
చదవండి: బిగ్‌బీ కాళ్లకు నమస్కరించబోయిన రజనీకాంత్.. వీడియో వైరల్