
అక్కినేని హీరో నాగచైతన్య.. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ ఉండడు. సినిమాల రిలీజ్ టైంలో తప్పితే పోస్టులు కూడా పెద్దగా పెట్టడు. కానీ రీసెంట్ గా ఆదివారం ఇలా గడిచింది అని ఓ రెండు మూడు ఫొటోలు పోస్ట్ చేశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తర్వాతే అకస్మాత్తుగా ఓ రూమర్ బయటకొచ్చింది.
గతంలో హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేశాడు. కొన్నాళ్ల పాటు సింగిల్ గానే ఉన్నాడు. కానీ గతేడాది డిసెంబరులో తెలుగమ్మాయి, హీరోయిన్ శోభితని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతానికైతే వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం)
అయితే సడన్ గా శోభిత ప్రెగ్నెంట్ అయ్యిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. అసలు ఈ పుకారు ఎవరు ఎందుకు సృష్టించారో గానీ సడన్ గా అంతటా వైరల్ అవుతోంది.
శోభిత విషయానికొస్తే గతేడాది మంకీ మ్యాన్, లవ్ సితార అనే సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతానికైతే కొత్త మూవీస్ గానీ వెబ్ సిరీసులు గానీ చేయట్లేదు. అక్కినేని ఫ్యామిలీ నుంచి క్లారిటీ వస్తే తప్ప ఈ రూమర్స్ ఆగవేమో!
(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్)