Naga Chaitanya
-
శోభిత ధూళిపాళ టైమ్ వచ్చింది.. స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
కోలీవుడ్ దర్శకుడు పా.రంజిత్( Pa. Ranjith) కథలే కాదు ఆయన దర్శకత్వం శైలి కూడా ఇతర చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అట్టకత్తి, మద్రాస్ చిత్రాల నుంచి సార్పట్ట పరంపర, తంగలాన్ వంటి చిత్రాలే పా.రంజిత్ వైవిధ్య దర్శక శైలికి నిదర్శనం. తంగలాన్‌లో నటుడు విక్రమ్ , నటి పార్వతీ, మాళవికా మోహన్ల వేషధారణ, హావభావాలకు మంచి పేరు వచ్చింది. కాగా పా.రంజిత్ తదుపరి సార్పట్ట పరంపర– 2 చిత్రం చేయబోతున్నట్లు, అదే విధంగా హిందీలో పర్సీ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అవేవీ కాకుండా ప్రస్తుతం ఆయన వెట్టువన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు దినేశ్ హీరోగా,ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. అట్టకత్తి చిత్రం తరువాత వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అదే విధంగా నటుడు అశోక్ సెల్వన్, ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటి శోభిత ధూళిపాళ( Sobhita Dhulipala) నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలవడలేదన్నది గమనార్హం. కాగా ఈమె ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్ర పోషించారన్నది గమనార్హం. మేడ్ ఇన్ హెవన్, మేజర్ వంటి చిత్రాల్లో శోభిత తన నటనతో మెప్పించింది. అయితే, పా.రంజిత్ లాంటి డైరెక్టర్ సినిమాలో ఒకరు నటిస్తున్నారంటే వారి పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. అందుకు వారు సెట్ అవుతారని ఆయన భావిస్తేనే ఛాన్స్ ఇస్తారు. శోభితకు సరైన పాత్ర పడితే దుమ్మురేపుతుందని పేరు ఉంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయితే శోభిత టాలెంట్ చూపే టైమ్ వచ్చిందని చెప్పవచ్చు. నాగచైతన్యతో( Naga Chaitanya) పెళ్లి తర్వాత ఆమె ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో భాగం కానుందని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని గోల్డన్ రెయోమ్స్ సంస్థతో కలిసి దర్శకుడు .పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్ర పస్ట్‌లుక్ పోస్టర్‌ను 2022లో జరిగిన కాన్ చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించారన్నది గమనార్హం. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
‘మ్యాడ్ స్క్వేర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు : శోభిత
-
తప్పెవరిదైనా సారీ చెప్పేదొకరే.. భార్య కోసం వంట చేసిపెడ్తున్న చై!?
టాలీవుడ్ జంట నాగచైతన్య (Naga Chaitanya)- శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ప్రముఖ మ్యాగజైన్ వోగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్‌స్టాగ్రామ్‌లోనే తమ ప్రేమ మొదలైందని వెల్లడించారు. తాజాగా ఎవరు సారీ చెప్తారు? పెళ్లి తర్వాత వంట ఎవరు చేసిపెడ్తున్నారు? వంటి విషయాలను అన్నింటినీ వోగ్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.సారీ ఎవరు చెప్తారు?తప్పు ఎవరిదైనా సరే ఎవరు సారీ చెప్తారు? అన్న ప్రశ్నకు శోభిత తనే క్షమాపణలు చెప్తానంది. అది విని ఆశ్చర్యపోయిన చై.. నువ్వసలు సారీలు, థాంక్స్ నమ్మవు కదా అన్నాడు. అందుకామె ప్రేమలో క్షమాపణలు, కృతజ్ఞతలకు చోటు లేదు అని పేర్కొంది. దాంతో నవ్వేసిన చైతూ.. తనే సారీ చెప్తానని ఒప్పుకుంటూనే మొదటగా ప్రేమను వ్యక్తపరిచింది కూడా తానే అని ఒప్పుకున్నాడు. నీకది లేదులే.. చై సెటైర్లుఎవరు బాగా వంట చేస్తారంటే తామిద్దరికీ వంట రాదన్నారు. కాకపోతే ప్రతిరోజు షూట్ నుంచి ఇంటికి రాగానే చై.. హాట్ చాక్లెట్ చేసిస్తాడంది శోభిత. అది వంట కిందకు రాదని, అది ప్రతి ఒక్కరికీ ఉండే కనీస నైపుణ్యం. కానీ నీకు లేదులే అని సెటైర్ వేశాడు. సినిమాలు చూడటం ఇష్టమని చై అంటుంటే.. చైను చూస్తూ ఉండిపోవడం నాకిష్టం అని పేర్కొంది శోభిత. చై 100 సినిమాలు చూస్తే నేను ఐదు చూసుంటానంది. వాదనల్లో ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు ఎప్పుడూ చైతూయే గెలుస్తాడంది.అదే శోభిత హాబీశోభిత ఎక్కువ సరదాగా ఉంటుంది. నాకు ఫేమస్ పాటల హుక్ స్టెప్స్ నేర్పిస్తూ ఉంటుంది. అది తనకు హాబీ.. కాకపోతే అనారోగ్యానికి గురైనప్పుడు మాత్రం ప్రాణం పోయినట్లే చేస్తుంది. కాస్త అస్వస్థతకు గురైనా అసలు ఓర్చుకోలేదు. నీరసంతో కింద పడిపోతుంది అన్నాడు నాగచైతన్య.చదవండి: బిగ్‌బాస్ నుంచి నాగార్జున తప్పుకోవాలి.. రానా బెటర్: సోనియా -
నాగచైతన్య- శోభిత లవ్ స్టోరీ.. ఎలా, ఎక్కడ మొదలైందో తెలుసా? (ఫోటోలు)
-
శోభితలో నాకు బాగా నచ్చేదదే.. తన నుంచి నేర్చుకోవాలి: నాగచైతన్య
పెళ్లయ్యాక అదృష్టం కలిసొస్తుందంటారు. కిరణ్ అబ్బవరం.. రహస్యను పెళ్లి చేసుకున్నా 'క' మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. అటు నాగచైతన్య (Naga Chaitanya).. శోభిత (Sobhita Dhulipala)ను పెళ్లాడాక 'తండేల్'తో పెద్ద హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అవకపోతే ఇంట్లో పరువు పోతుందని తెగ భయపడిపోయాడు. చివరకు విజయం దక్కడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ మధ్యే ఇద్దరూ మెక్సికోలో హనీమూన్‌కు కూడా వెళ్లొచ్చారు.అప్పటిదాకా చైను ఫాలో కాలేతాజాగా ఈ జంట వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శోభిత మాట్లాడుతూ.. ఓసారి నేను సోషల్ మీడియాలో అభిమానులడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాను. అప్పుడో వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతున్న అక్కినేని నాగచైతన్యను తిరిగి ఎందుకు ఫాలో అవడం లేదు? అని ప్రశ్నించారు. అవునా అని ఆశ్చర్యపోతూ అతడి ప్రొఫైల్ చెక్ చేశా.. తను కేవలం 70 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. అందులో నేనూ ఉన్నాను. నచ్చినవాటి కోసం..అది చూసి కాస్త ఖుషీ అయ్యాను. వెంటనే నేనూ ఫాలో కొట్టాను. అప్పటినుంచి అతడి పోస్టులు రావడం.. ఒకరికొకరం మెసేజ్ చేసుకోవడం మొదలైంది. 2022 ఏప్రిల్‌లో తొలిసారి ఇద్దరం కలుసుకుని లంచ్ డేట్‌కు వెళ్లాం. తను చాలా సింపుల్‌గా ఉంటాడు. తను ఇష్టపడే బైక్‌ను రెండు గంటల సమయం కేటాయించి తనే శుభ్రం చేసుకుంటాడు. తనకు నచ్చిన వస్తువుల కోసం, వ్యక్తుల కోసం ఏదైనా చేస్తాడు. (చదవండి: సినిమాల్లో అసభ్యకర స్టెప్పులు... మహిళా కమిషన్ సీరియస్)శోభితలో బాగా నచ్చే అంశం అదే!జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాడు. కస్టడీ ఫ్లాప్ అయినప్పుడు, తండేల్ హిట్టయినప్పుడు ఒకేలా ఉన్నాడు అని చెప్పుకొచ్చింది. నాగచైతన్య మాట్లాడుతూ.. శోభిత చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది. అది నాకు బాగా నచ్చుతుంది. మా ఇంట్లో వారంతా కూడా తెలుగులోనే మాట్లాడతారు. కానీ నేను చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళం భాష వచ్చేసింది. బయటకు వెళ్తే తమిళం, ఇంట్లో ఇంగ్లీష్‌లో మాట్లాడేవాడిని. ఫోటోలో స్మైల్ ఇవ్వు అంటే..శోభిత మాట్లాడే తెలుగు ముందు నా భాష దేనికీ పనికిరాదు. ఈ విషయంలో ఆమెను మెచ్చుకోవాల్సిందే! నాకూ తెలుగు నేర్పించమని అడుగుతూ ఉంటాను. అలాగే తన మేధస్సును కూడా పంచమని చెప్తుంటాను. ఇకపోతే శోభిత ఫోటోల్లో పెద్దగా నవ్వనే నవ్వదు. ఎందుకలా ఉంటావ్, కాస్త నవ్వుతూ దిగొచ్చుగా అంటే నేను లోపల నవ్వుతున్నాను, కానీ మీరెవరూ చూడలేకపోతున్నారు అని నాకే డైలాగ్స్ వేస్తుంది అని చై చెప్పుకొచ్చాడు. చై-శోభిత 2024 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు.చదవండి: తమన్‌ని అన్‌ఫాలో చేసిన రామ్ చరణ్..నిజమెంత? -
చైతూతో ప్రేమకథ అలా మొదలైంది.. రివీల్ చేసిన శోభిత ధూళిపాల
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు. గతేడాది డిసెంబర్ వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీతారలు హాజరయ్యారు.అయితే ఈ జంట పెళ్లి తర్వాత తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ప్రముఖ మ్యాగజైన్ వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తమ ప్రేమకథ తొలిసారి ఎక్కడ మొదలైందనే విషయాన్ని రివీల్ చేశారు. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శోభిత స్పందించారు. మిమ్మల్ని చైతూ ఫాలో అవుతున్నాడు.. కానీ మీరెందుకు ఫాలో కావడం లేదని ఓ నెటిజన్ తనను అడిగాడని వెల్లడించింది. ఆ తర్వాత నేను చైతూ ప్రొఫైల్‌కి వెళ్లి చూస్తే నాతో పాటు కేవలం 70 మందిని మాత్రమే అతను ఫాలో అవుతున్నాడని తెలుసుకున్నా.. ఆ తర్వాత చైతన్యను ఫాలో అయ్యానని తెలిపింది.అప్పటి నుంచి మేమిద్దరం చాటింగ్ ప్రారంభించినట్లు శోభిత తెలిపింది. ఏప్రిల్ 2022లో చైతన్య- నేను తొలిసారి కలుసుకున్నట్లు శోభిత వివరించింది. ముంబయికి టికెట్ బుక్ చేసుకుని వచ్చిన చైతూతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశా.. అప్పటి నుంచి మా డేటింగ్ మొదలైందని చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా చాలా నేచురల్‌గా జరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత ఒకరి కుటుంబాలను ఒకరు కలుసుకున్నట్లు పేర్కొంది. అలా తమ ప్రేమ మొదలైందని తాజా ఇంటర్వ్యూలో శోభిత తమ లవ్ స్టోరీని రివీల్ చేసింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) -
చైతూ టాటూ తొలగించిన సమంత.. నెటిజన్ల రియాక్షన్ చూశారా?
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన సమంత ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో చేయడం లేదు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో మాత్రమే కనిపించింది. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్ వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సామ్ రిలేషన్లో ఉన్నట్లు చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరు కలిసి తరచుగా ఈవెంట్లకు హాజరు కావడంతో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి.ఇవన్నీ పక్కనపెడితే తాజాగా సోషల్ మీడియాలో సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను నిర్మిస్తోన్న కొత్త మూవీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అందులో తన టీమ్‌తో ఉన్న ఫోటోలకు వరుసగా క్యాప్షన్ ఇస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే సామ్ షేర్ చేసిన తొలి ఫోటోపైనే అందరి కళ్లు పడ్డాయి. ఎందుకంటే ఆ ఫోటోలో సామ్ చేతికి టాటూ కనిపించడమే కారణం. టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రేమలో ఉన్నప్పుడు ఆ టాటూ వేయించుకుంది. ప్రస్తుతం ఆ టాటూను తొలగించుకున్నప్పటికీ.. కొద్ది కొద్దిగా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి నాగచైతన్యకు గుర్తుగా వేయించుకున్న టాటూను తొలగించుకున్నారంటూ కొందరు కామెంట్స్ చేశారు. సమంత ఎట్టకేలకు చైతూ టాటూను తొలగించినట్లు కనిపిస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇప్పటి నుంచి మీ స్వంత రియాలిటీని సృష్టించండి అంటూ రాసుకొచ్చారు. టాటూను తొలగించుకున్నందుకు మంచిది.. ఇకపై మీ భాగస్వామి పేరును ఎప్పుడూ టాటూలుగా వేయించుకోకండి అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ ఫోటోలతో పాటు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న పిక్‌ను కూడా సమంత పోస్ట్ చేసింది.కాగా.. చైతూ సినిమాలో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సమంత.. చాలా కాలం పాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే వీరిద్దరూ విడిపోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆ ఆ తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
భార్యని కూడా రేసులోకి దింపిన చైతూ
అక్కినేని కొత్త కోడలు శోభిత (Sobhita) గురించి కొత్తగా చెప్పేదేముంది. నటిగా ఇదివరకే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. హీరో నాగచైతన్యని(Naga Chaitanya) పెళ్లాడిన తర్వాత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఎందుకంటే గతంలో చైతూ, హీరోయిన్ సమంతని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు.సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే నాగచైతన్య నటుడిగానే కాకుండా రెస్టారెంట్, రేసు ట్రాక్ లాంటి వ్యాపకాలు ఉన్నాయి. హైదరాబాద్ లోనే ఇతడికి సోయూ అనే రెస్టారెంట్ ఉంది. అప్పుడప్పుడు రేసు ట్రాక్ పైనా రయ్ రయ్ మని దూసుకుపోతూ ఉంటాడు. తాజాగా అలా చెన్నైలో రేస్ సర్క్యూట్ కి వెళ్లాడు.(ఇదీ చదవండి: 'కోర్ట్'లో ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది.. ఎవరీ 'జాబిలి'?)కాకపోతే ఈసారి ఒక్కడ కాదు, భార్య శోభితని కూడా తోడు తీసుకెళ్లాడు. ఆమెని కూడా కారులో కూర్చొనబెట్టి రేసులోకి దింపాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలని శోభిత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. పలువురు సెలబ్రిటీలు ఈ పిక్స్ పై కామెంట్స్ పెడుతున్నారు.సినిమాల విషయానికొస్తే నాగచైతన్య.. ఈ మధ్యే 'తండేల్'తో (Thandel Movie) హిట్ కొట్టాడు. ప్రస్తుతం 'విరూపాక్ష' దర్శకుడు తీస్తున్న హారర్ మూవీలో నటిస్తున్నాడు. శోభిత అయితే ఒకటి రెండు సినిమాలు చేస్తూ కాస్త బిజీగా ఉంది.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
ఓటీటీలో తగ్గుతున్న వ్యూస్
-
శోభిత మొదట ప్రేమించింది నాగచైతన్యను కాదు.. ఎవర్నో తెలుసా?
నాగచైతన్య (Naga Chaitanya)- శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala).. కొంతకాలంపాటు దాగుడుమూతలు ఆడారు. డేటింగ్ గురించి ప్రశ్నలొస్తే.. ప్రేమాగీమా ఏదీ లేదనేది శోభిత. చై అయితే అసలు స్పందించేవాడే కాదు. మీరు చెప్పకపోయినా మాకు తెలుసులే అన్నట్లుగా అక్కినేని అభిమానులు ఈ జంట గాఢమైన ప్రేమలో ఉందని తేల్చేశారు. అది నిజమేనంటూ 2024 డిసెంబర్లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.అతడిపై మనసు పారేసుకున్న శోభితఅప్పటికే నాగచైతన్య.. గతంలో సమంతను ప్రేమించి పెళ్లిచేసుకోగా ఆమెకు విడాకులిచ్చేశాడు. శోభితకు మాత్రం ఇదే తొలి వివాహం. అయితే చై కంటే ముందు ఆమె వేరే వ్యక్తిపై మనసు పారేసుకున్న విషయం మీకు తెలుసా? గతంలో ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. చిన్నప్పుడు స్కూల్లో ఓ అబ్బాయిని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ వెధవ నన్నసలు పట్టించుకునేవాడే కాదు. అతడి గురించే ప్రత్యేకంగా..అతడి ప్రవర్తన చూసి నాకు బాధేసేది. అప్పుడు వ్యాసరచన వంటి కొన్ని అంశాల్లో ఎక్కువ ఫోకస్ చేశాను. అందులో టాప్ వస్తేనైనా నన్ను చూస్తాడేమోనని! కానీ అలా ప్రయత్నించే క్రమంలో నేను చాలా మారిపోయాను. అతడి గురించి పట్టించుకోవడం మానేశాను. కొంచెం పరిపక్వత చెందాను.సినిమా..కాలేజీలో నాకు లవ్ ప్రపోజల్స్ వచ్చేవి. నేను కూడా కొన్ని లెటర్స్ రాశాను. అయితే అబ్బాయిల విషయంలో నా టేస్ట్ అస్సలు బాగుండేది కాదు అని పేర్కొంది. గూఢచారి, మేజర్, కల్కి 2898 ఏడీ సినిమాలతో తెలుగులో మెప్పించిన ఈ బ్యూటీ బాలీవుడ్లో హీరోయిన్గా రాణించింది. ప్రస్తుతం గూఢచారి 2 మూవీలో నటిస్తోంది.చదవండి: సౌందర్య మరణం.. ఆ రోజు ఏం జరిగింది?హనీరోజ్ అమాయకురాలేం కాదు.. దేనికైనా లిమిట్ ఉంటుంది: నటి ఫైర్ -
అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నటుడు నాగచైతన్యతో వివాహం, విడాకులు తరువాత, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. సినీ పరిశ్రమలో అందం, ప్రతిభతో తానేంటో నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్గా అభిమానుల మనసుల్లో తన చోటును సుస్థిరం చేసుకుంది. తాజాగా సమంతాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.సమంత నిశ్చితార్థ ఉంగరాన్ని సరికొత్తగా మార్చేసినట్టు తెలుస్తోంది. తన ఎంగేజ్మెంట్ రింగ్‌ను లాకెట్టుగా మార్చేసిందని తాజా నివేదికల సమాచారం. ఈ మేరకు సూరత్‌కు చెందిన ఆభరణాల డిజైనర్ ధ్రుమిత్ మెరులియా అంచనాలు వైరల్‌గా మారాయి. నాలుగు సంవత్సరాల వివాహం తర్వాత, ఈ జంట 2021 లో విడాకులు తీసుకుంది. విడాకుల తీసుకున్న ఇన్నేళ్లకు ఇపుడు సమంత తన డైమండ్ రింగ్‌ను లాకెట్టుగా మార్చుకుంది. 3 క్యారెట్ల ప్రిన్సెస్-కట్ డైమండ్ రింగ్‌ను లాకెట్‌గా ఎలా మార్చుకుందో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. దీన్ని క్రమం తప్పకుండా ధరిస్తోందని, ఇది ప్రస్తుత ట్రెండ్ అంటూ పేర్కొన్నాడు. అయితే దీనిపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ ధ్రుమిత్ మెరులియా ఊహ మాత్రమే అయినప్పటికీ, ఇది ఫ్యాన్స్ మరియు, నెటిజనులను మనసులను కదిలించింది. View this post on Instagram A post shared by Dhrumit Merulia (@dhrumitmerulia) కాగా 2024లో, సమంత తన వెడ్డింగ్ గౌను అవార్డుల వేడుక కోసం కొత్తగా డిజైన్ చేయించుకుంది. వైట్ వెడ్డింగ్ గౌనును నల్లటి సాసీ గౌనుగా మార్చి ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్ దీనికి న్యూలుక్‌ను తీసుకురావడం విశేషం. దీంతో అభిమానులు దీనిని 'రివెంజ్ డ్రెస్' అని కూడా ట్యాగ్ చేశారు. ఈ డ్రెస్ ఫోటోలను కూడా సమంత ఇన్‌స్టాలో పంచుకుంది. గౌను ధరించిన చిత్రాలను పంచుకుంది. మన భూమాత రక్షణ కోసం, తన జీవన శైలిని సస్టైనబుల్‌గా మార్చుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో మనం తీసుకునే ప్రతీ చిన్న నిర్ణయాత్మక చర్య చాలా ముఖ్యం.అందరూ దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొంది. అంతేకాదు విడాకుల తర్వాత, సాధారణంగా ఒక అమ్మాయి 'సెకండ్ హ్యాండ్', 'ఆమె జీవితం వృధా అయింది' లాంటి ముద్రలు వేస్తారు. ఇది ఆమెకు, ఆమె కుటుంబానికి కూడా చాలా ఇబ్బంది. ఇక అంతా అయిపోయినట్టు, విఫలమై నట్లు భావిస్తారు. ఇది తనకు చాలా బాధపెట్టిందని, కానీ తాను విడాకులు తీసుకున్నాననే వాస్తవాన్ని జీర్ణించుకుంటున్నట్టు చెప్పింది. అలాగే తన పెళ్లి గౌనును మార్చుకోవడం అనేది ప్రతీకారం కోసం ఎంతమంత్రం కాదని, తన బలానికి అదొక చిహ్నమని సమంతా స్పష్టం చేసింది. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!…సమంతతో విడాకుల తరువాత నాగ చైతన్య డిసెంబర్ 2024లో నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్నాడు. అలాగే సమత ది ఫ్యామిలీ మ్యాన్ 2 , సిటాడెల్: హనీ బన్నీ లాంటి సిరీస్‌లతో కలిసి పనిచేసిన రాజ్ & డీకే ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందన్న పుకార్లు బాగా వినిపిస్తున్నాయి. -
ఓటీటీలో తండేల్.. ఏడిపించేస్తున్న బుజ్జితల్లి వీడియో సాంగ్
తండేల్ సినిమా (Thandel Movie)తో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ప్రేమకథలతో హిట్లు అందుకోవడం చైకి కొత్తేమీ కాదు. కానీ సెంచరీ కొట్టడం మాత్రం ఇదే తొలిసారి. చందూ మొండేటి దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టేసిన ఈ మూవీ సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేసింది. నేడు (మార్చి 7) తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.బుజ్జి తల్లి సాడ్ వర్షన్ఇటీవల బుజ్జితల్లి వీడియోసాంగ్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం నేడు బుజ్జితల్లి సాడ్ వర్షన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. సినిమాలో ఈ సాంగ్ వచ్చేటప్పుడు ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటారు. ఏమి తప్పు చేశానే.. ఇంత శిక్ష వేశావె.. ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావె.. అంటూ సాగే ఈ పాట బ్రేకప్ అయిన వారికి మరింత కనెక్ట్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను జావెద్ అలీ అద్భుతంగా పాడారు. శ్రీ మణి గుండెల్ని మెలిపెట్టే లిరిక్స్ రాశారు. చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన -
హైలెస్సో హైలెస్సా సాంగ్.. సాయిపల్లవి నెమలి నాట్యం చూశారా?
నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం (Thandel Movie) బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లపైనే రాబట్టింది. ఈ మూవీ కమర్షియల్ హిట్ మాత్రమే మ్యూజికల్ బ్లాక్బస్టర్గానూ నిలిచింది. ఈ చిత్రంలోని బుజ్జి తల్లి, హైలెస్సో హైలెస్సా.. వంటి పాటలు జనాల్ని ఎంతగానో అలరించాయి.తాజాగా హైలెస్సో హైలెస్సా వీడియో సాంగ్ వచ్చేసింది. ఇందులో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను అందంగా చూపించారు. అంతేకాదు, సాయిపల్లవి (Sai Pallavi) నెమలిలా డ్యాన్స్ చేసేది ఈ పాటలోనే! దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా నకశ్ అజీజ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు. తండేల్ సినిమా..శ్రీకాకుళం మత్స్యకారుల జీవితాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తండేల్ సినిమా తెరకెక్కింది. చందూ మొండేటి దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేశాడు. తండేల్ మార్చి 7న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. చదవండి: బంగారం అక్రమ రవాణా చేసిన హీరోయిన్.. తండ్రి డీజీపీ.. మరి భర్త?! -
నాగ చైతన్య 'తండేల్'.. 'బుజ్జి తల్లి' వచ్చేసింది
అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవలే తండేల్ మూవీతో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కించారు.ఈ చిత్రంలో ఓ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బుజ్జితల్లి అంటూ సాగే లవ్ సాంగ్ చైతూ ఫ్యాన్స్‌ను అలరించింది. ఈ ప్రేమకథా చిత్రంలోని ఈ సాంగ్ హైలెట్‌గా నిలిచింది. ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాను శ్రీకాకుళం మత్స్యకారుల రియల్ స్టోరీ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.(ఇది చదవండి: నాగచైతన్య వందకోట్ల మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)తండేల్ ఓటీటీ డేట్ ఫిక్స్..బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన తండేల్ ఓటీటీలోనూ సందడి చేయనుంది. మార్చి 7వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. -
నాగచైతన్యతో మొదటి సీన్.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంతకు ఇటీవల అరుదైన గౌరవం దక్కింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్‌ను అందుకుంది. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో సమంతకు అవార్డ్‌ను బహుకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తన తొలి చిత్రం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అక్కినేని హీరో నాగచైతన్యతో ఏ మాయ చేశావే మూవీతో సామ్ సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు.తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి సమంత మాట్లాడింది. ఈ సినిమాలో ప్రతి షాట్ తన జీవితాంతం గుర్తుండిపోతుందని వెల్లడించింది. అయితే ఈ 15 ఏళ్లలో తనకు మార్గనిర్దేశం చేసేవారు లేకపోవటం వల్ల కొన్ని మంచి సినిమాలు చేయలేకపోయాననని తెలిపింది. అంతేకాకుడా తనకు తమిళం రాకపోవడం వల్ల ఇబ్బంది పడినట్లు సామ్ చెప్పింది.అయితే సమంతా 2010లో రాహుల్ రవీంద్రన్తో మాస్కోయిన్ కావేరిలో నటించింది. అయితే ఆ సినిమా ఏమాయ చేశావే కంటే ముందే చిత్రీకరించినప్పటికీ విడుదల కాలేదు. ఆ సినిమా కంటే తనకు నాగ చైతన్యతో చేసిన సినిమాలోని ప్రతి షాట్ గుర్తుండిపోతుందని సమంత చెబుతోంది. ఈ చిత్రంలో జెస్సీ పాత్రలో కార్తీక్‌ను కలిసే మొదటి సన్నివేశం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని సమంత వెల్లడించింది. గౌతమ్ మీనన్‌తో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవమని తెలిపింది.కాగా.. 2010లో సినీ కెరీర్ ప్రారంభించిన సమంత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో బృందావనం, మహేశ్ బాబు దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఎలాంటి ప్రాజెక్ట్ చేయడం లేదు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషిలో నటించింది. అంతేకాకుండా గతేడాది వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో నటించింది. -
నాగచైతన్య వందకోట్ల మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తన పెళ్లి తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన ఈ మూవీలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ రియల్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను చేరుకుంది.బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ తాజాగా స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేసింది. ఈనెల 7 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది.తండేల్ అసలు కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్‌కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే 'తండేల్' మూవీని వీక్షించాల్సిందే.Prema kosam yedu samudhralaina dhaatadaniki osthunnadu mana Thandel! 😍❤️Watch Thandel, out 7 March on Netflix in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam!#ThandelOnNetflix pic.twitter.com/GIBBYHnME9— Netflix India South (@Netflix_INSouth) March 2, 2025 -
నాగచైతన్య తండేల్ మూవీ.. అలాంటి సీన్ రిపీట్!
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. శ్రీకాకుళం ప్రాంతంలోని మత్స్యకారుల నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఏపీకి చెందిన కొందరు జాలర్లు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో వారి బంధించి తీసుకెళ్లారు. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వారిని విడిపించారు. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా సక్సెస్ సాధించింది.అయితే తాజాగా ఇలాంటి సంఘటనే మరోసారి రిపీట్ అయింది. తమిళనాడుకు చెందిన కొందరు మత్స్యకారులు పొరపాటున సరిహద్దు రేఖ దాటారు. వీరి గుర్తించిన శ్రీలంక నావికాదళం దాదాపు 27 మందిని అరెస్ట్ చేసింది. దీంతో తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతానికి చెందిన దాదాపు 700 మంది జాలర్లు నిరవధిక సమ్మెకు దిగారు. వారి ఆందోళనలతో దిగొచ్చిన తమిళనాడు ప్రభుత్వం.. కేంద్రం సహకారంతో వారిని విడిపించారు. దీంతో మరోసారి తండేల్ సినిమా రిపీట్ అయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. నాగచైతన్య నటించిన తండేల్ మూవీ తమిళంలోనూ విడుదలైన సంగతి తెలిసిందే. -
'నమో నమః శివాయ' వీడియో సాంగ్ వచ్చేసింది
మహా శివరాత్రి సందర్భంగా తండేల్ నుంచి 'నమో నమః శివాయ' ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి లీడ్ రోల్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్న ఈ పాటను ఫుల్ వీడియో విడుదల చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది.జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన ఈ సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి, హరిప్రియ పాడారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటని నృత్య దర్శకుడు శేఖర్ నేతృత్వంలో కొనసాగింది. నాగచైతన్య, సాయిపల్లవితోపాటు, వెయ్యి మందికిపైగా డ్యాన్సర్లతో ఈ సాంగ్‌ను తెరకెక్కించారు. దక్షిణ కాశీగా పేరు పొందిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం. ప్రతి ఏటా అక్కడ నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాలో ఈ పాటను తెరకెక్కించారు. అందుకోసం భారీ సెట్స్‌తో వేసి ప్రేక్షకులకు చూపించారు. -
ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఆ హిట్ సినిమాలో దెయ్యంగా
చాలామంది బ్యూటీస్ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అవుతుంటారు. అలా హారర్ సినిమాలో దెయ్యంగా భయపెట్టిన ఈ బ్యూటీ.. చాన్నాళ్ల తర్వాత పార్టీలో కనిపించింది. టాలీవుడ్ సెలబ్రిటీలతోనూ తెగ ఫొటోలు దిగింది. మరి ఈమెని కనిపెట్టారా? ఎవరో మమ్మల్నే చెప్పేయమంటారా?2019లో మిస్ ఇండియా రన్నరప్ అయిన బాంధవి, మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019గా కూడా నిలిచింది. అలాగే మిస్ ఆంధ్రపదేశ్2019గా కూడా బాంధవి గెలిచింది. మొదట్లో మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల్లో నటించిన బాంధవికి మసూద సినిమా వరకు సరైన ఫేమ్ రాలేదు. మసూద తర్వాతే బాంధవి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయింది.(ఇదీ చదవండి: ఆ ఓటీటీలోనే 'మజాకా' సినిమా)అక్కినేని హీరో నాగచైతన్యకు చాలారోజుల నుంచి సరైన హిట్ పడలేదు. రీసెంట్ గా వచ్చిన 'తండేల్'.. ఆ లోటు తీర్చింది. రూ.100 కోట్ల వసూళ్లు కూడా వచ్చాయి. ఈ ఆనందంలో రెండు రోజుల క్రితం హైదరాబాద్ టీమ్ అందరికీ పార్టీ ఇచ్చాడు. ఈ సెలబ్రేషన్స్ కి వచ్చిన ఈ బ్యూటీ.. చైతూతో ఫొటో దిగింది.ఈమె ఎవరా అనుకుంటున్నారా? 'మసూద' సినిమాలో దెయ్యంగా నటించిన అమ్మాయే ఈమె. పేరు బాంధవి శ్రీధర్. మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. అదే ఏడాది మిస్ ఇండియా పోటీలో రన్నరప్. కానీ మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ పోటీలో విజేతగా నిలిచింది.కెరీర్ ప్రారంభంలో మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. మసూద చిత్రంలో దెయ్యంగా చేసిన తర్వాత కాస్త ఫేమ్ వచ్చింది. ఇప్పుడు తండేల్ సక్సెస్ పార్టీలో కనిపించి సోషల్ మీడియాలో వైరల్ అయింది.(ఇదీ చదవండి: Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ) -
చై-శోభితల మనసు బంగారం.. ఎంత మంచి పని చేశారో! (ఫోటోలు)
-
వంద కోట్ల తండేల్
నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందని చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఈ సినిమా కోసం నాగచైతన్య కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు.విడుదలైన తొలి రోజే ఆన్లైన్లో పైరసీ వెర్షన్ రిలీజ్ కావడం, ఫిబ్రవరి వంటి ఆఫ్–సీజన్ రిలీజ్ కావడం వంటి అవాంతరాలను దాటుకుని కూడా ‘తండేల్’ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఓవర్సీస్లోనూ వన్ మిలియన్ మార్క్‌ను చేరుకుంది. గీతా ఆర్ట్స్‌లో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలవడం సంతోషంగా ఉంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక నాగచైతన్య కెరీర్లో రూ. వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన తొలి చిత్రంగా ‘తండేల్’ నిలిచింది. -
బిగ్గెస్ట్ మైల్స్టోన్ చేరుకున్న 'తండేల్'.. నాగచైతన్యకు ఫస్ట్ సినిమా
తండేల్ సినిమా మరో అరుదైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. నాగచైతన్య, సాయిపల్లవి నటించిన ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన తండేల్ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది. నాగ చైతన్య కెరీర్లో వంద కోట్ల మొదటి చిత్రంగా నిలిచింది.తండేల్ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ దాటింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ అయిన తండేల్.. మొదటి రోజు నుంచే కలెక్షన్ల స్పీడ్ చూపింది. ఈ చిత్రం HD వెర్షన్ సినిమా విడుదలైన మొదటి రోజే లీక్ అయింది. పైరసీ ఆందోళనలు పెద్ద ఎత్తున తలెత్తాయి. అయితే అలాంటి అవాంతరాలని కూడా దాటుకొని వందకోట్ల క్లబ్లో చేరడం మామూలు విషయం కాదు. ఓవర్సీస్లో 1 మిలియన్ దాటింది. ఈ చిత్రం డొమస్టిక్ మార్కెట్లో అద్భుతంగా రాణించడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభదాయకమైన వెంచర్ అయ్యింది. ఇప్పటికే బ్రేక్ఈవెన్ అయి లాభాలు తెచ్చిపెట్టింది.పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ చిత్రానికి ప్రేక్షకులు క్యూ కట్టేశారు.. శ్రీకాకుళం,విజయనగరం , తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు పాక్ నుంచి ఎలా విడుదలయ్యారనే అంశాన్ని ఉన్నది ఉన్నట్లు సినిమాలో చూపలేదని వారు వాపోయిన విషయం తెలిసిందే. -
ఈ స్టార్ హీరోల రెస్టారెంట్స్, పబ్స్ గురించి తెలుసా..?
ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న వ్యాపారరంగంలోకి కంగనా రనౌత్ అడుగుపెట్టారు. సినీ, రాజకీయ రంగాల్లో బిజీగా ఉన్న ఆమె హిమాచల్‌లోని మనాలిలో కేఫ్‌ను ప్రారంభించారు. హిమాలయాల నడిబొడ్డున ‘ది మౌంటెన్ స్టోరీ’ పేరుతో ఒక సుందరమైన రెస్టారెంట్‌ను ప్రారంభించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, హైదరాబాద్ వేదికగా కొందరు సినీ సెలబ్రిటీలు పలు రెస్టారెంట్స్లను ప్రారంభించారు. విలాసవంతమైన ఆహారం, బ్రేవరేజస్తో పాటు, అధునాతన జీవన శైలికి అద్ధం పట్టే అద్భుతమైన ఇంటీరియర్ ఫ్యాషన్ లుక్ నేటి రెస్టారెంట్ కల్చర్‌లో భాగమైపోయింది. అయితే నగర వాసుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఆకర్షించేందుకు ఎవరికి వారు తమ సొంత స్టైల్లో యునీక్ యాంబియన్స్ కోసం తాపత్రయపడుతున్నారు.బంజారా హిల్స్‌లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 'AN రెస్టారెంట్'తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ డిసెంబర్ 8, 2022న AN రెస్టారెంట్‌ని బంజారా హిల్స్‌లో ప్రారంభించారు. మినర్వా, ఆసియన్ ఫుడ్ గ్రూపులతో కలిసి వారు దీనిని ప్రారంభించారు. రెస్టారెంట్లో అద్భుతమైన ఇంటీరియర్స్, అగ్రశ్రేణి సర్వీస్‌తో పాటు వివిధ రకాల ప్రపంచ వంటకాలతో భారీగానే మెనూ లిస్ట్ ఉంటుంది. ఆహార ప్రియులకు తప్పకుండా నచ్చేలా ఇక్కడి ఫుడ్ ఉంటుందని చాలామంది పేర్కొన్నారు.విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వన్–8 కమ్యూన్గత ఏడాదిలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీకి దగ్గరలో వన్–8 కమ్యూన్ పేరుతో ఒక లగ్జరీ రెస్టారెంట్‌ను కోహ్లీ, అనుష్క శర్మ ప్రారంభించారు. హైదరాబాద్‌కు ఉన్న రాజసాన్ని, రిచ్ ఫ్లేవర్‌ను ప్రతిబింబిస్తుంది. ఇందులోని కిచెన్.. పాక ప్రపంచానికి నూతన హంగులు అద్దిందని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు. వన్–8 కమ్యూన్ బ్రాండ్ ఎథోస్‌కు కట్టుబడి, రెస్టారెంట్ డిజైన్ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇక్కడి వింటేజ్ లుక్స్ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తుంది. జుహు, బెంగుళూరు, గుర్గావ్లలో ఇప్పటికే ఆదరణ పొందుతున్న ఈ రెస్ట్రో బార్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడంతో చాలామంది చిల్ అవుతున్నారు. ఫుడ్ లవర్స్‌తో పాటు క్రికెట్ ప్రియులు సైతం ఆసక్తిగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. రెస్ట్రో బార్లో భాగంగా రిచ్ ఫుడ్ డిషెస్‌తో పాటు బ్రేవరేజస్ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల వారికీ హాట్ స్పాట్‌గా మారింది. కోహ్లీకి అత్యంత ఇష్టమైన కార్న్ బార్లీ రిసోట్టో, మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్, టార్టేర్ టాప్డ్ అవకాడో వంటి పలు వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ 'ఆరంభం'గచ్చిబౌలి 'ఎఫ్ 45' పేరుతో జిమ్‌ను ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ .. జూబ్లీహిల్స్‌లో కూడా ఓ బ్రాంచ్ మొదలు పెట్టి లీజ్‌కు ఇచ్చేసింది. అయితే, ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంలో, నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌లో మిల్లెట్ ఆధారిత రెస్టారెంట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ వద్ద 'ఆరంభం' పేరుతో ఒక రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు. Curefoods భాగస్వామ్యంతో, సాంప్రదాయ భారతీయ వంటకాల డొమైన్లో మిల్లెట్-ఎయిడెడ్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేయడానికి ఆమె ఈ వెంచర్‌ను ప్రారంభించారు. మిల్లెట్‌ను భారతీయ ఆహారంలో ప్రధాన భాగం చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ఈ చొరవ తీసుకున్నట్లు ఆమె చెప్పారు. రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన, పోషకమైన భోజనం అందిస్తున్నట్లు ఆమె రెస్టారెంట్‌పై ప్రశంసలు వచ్చాయి. అల్లు అర్జున్ హైలైఫ్పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కూడా రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్నారు. అంతర్జాతీయ రేంజ్లో గుర్తింపు ఉన్న హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీ గురించి వినే వింటారు. హైలైఫ్ పేరుతో 2016లోనే జూబ్లీహిల్స్‌లో ఈ రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ హాస్పిటాలిటీ బ్రాండ్ M కిచెన్, నిర్మాత కేదార్ సెలగంశెట్టితో కలిసి రన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్లోబఫెలో వైల్డ్ వింగ్స్ (B-డబ్స్) అనే అమెరికన్ రెస్టారెంట్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ రెండూ కూడా హైదరాబాద్‌లోని పార్టీలకు స్వర్గధామంగా మారాయి. మీరు ఏదైనా సందర్బంలో పార్టీ కోసం వెతుకుతున్నట్లయితే, హైలైఫ్ మీకు సరైన స్థలమని చెప్పవచ్చు.అక్కినేని నాగార్జున యొక్క 'N గ్రిల్, N ఏషియన్'టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు కూడా హైదరాబాద్‌లో ప్రముఖ రెస్టారెంట్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ వద్ద N గ్రిల్ పేరుతో ఆయనకు ఒక రెస్టారెంట్ ఉంది. 2014లో ఎంటర్ప్రెన్యూర్ ప్రీతం రెడ్డి సహకారంతో ఆయన దీనిని ప్రారంభించారు. ఇది ఆధునిక గ్రిల్ హౌస్‌గా గుర్తింపు ఉంది. దీంతో పాటు జూబ్లీ హిల్స్‌లో కూడా ఎన్ ఏషియన్ అనే చైనీస్ రెస్టారెంట్‌ని కూడా నాగ్ ఏర్పాటు చేయడం విశేషం. రెండు రెస్టారెంట్లు భారతీయ, ఇటాలియన్, పాన్ ఆసియన్‌తో పాటు మెడిటరేనియన్ వంటకాలను అందించే విభిన్న మెనూకు ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్‌లో ప్రీమియం డైనింగ్ అనుభవం కోసం వెతుకుతున్న ఆహార ప్రియుల కోసం ఈ ప్రదేశాలు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. నాగ చైతన్య 'షోయూ'ఫుడ్ బిజినెస్‌లోకి 2022లోనే నాగచైతన్య ఎంట్రీ ఇచ్చేశాడు. 'షోయూ' పేరుతో జూబ్లీహిల్స్ ప్రాంతలో ఓ సరికొత్త రెస్టారెంట్‌ను ఆయన ఓపెన్ చేశాడు. అక్కడ అనేక రకాల పాన్-ఆసియన్ వంటకాలు దొరుకుతాయి. క్లౌడ్ కిచెన్‌గా తన వ్యాపారాన్ని ఆయన ప్రారంభించారు. స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆహారప్రియులకు తమ వంటకాలను అందిస్తుంది. రుచికరమైన జపనీస్ మీల్స్ అక్కడి ప్రత్యేకత. బ్రాండ్ స్థిరమైన ప్యాకేజింగ్‌ను ఉపయోగించడం ద్వారా పర్యావరణ స్పృహతో కూడిన విధానాన్ని అవలంబిస్తుంది, క్లయింట్లు పర్యావరణ ప్రయోజనకరమైన భోజన అనుభవాన్ని కలిగి ఉండేలా రెస్టారెంట్ యాజమాన్యం చూస్తుంది.నవదీప్- BPM పబ్హీరో నవదీప్ కూడా చాలా రోజుల క్రితమే ఒక పబ్‌ను ప్రారంభించారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ వ్యాపారంలో ఆయన రాణించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో బీట్స్ పర్ మినిట్ అకా BPM పబ్‌ను నవదీప్ నడుపుతున్నాడు. చాలామంది సెలబ్రిటీలు అక్కడకు వెళ్తూ ఉంటారు. -
శ్రీకాకుళంలో ‘తండేల్’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ‘తండేల్’ మూవీ యూనిట్ (ఫొటోలు)
-
మరోసారి ఆర్టీసీ బస్సులో 'తండేల్'.. వివరాలు షేర్ చేసిన నిర్మాత
నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన తండేల్ సినిమాను పైరసీ వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితమే పలాస నుంచి విజయవాడ వెళ్లిన ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఫైర్ అయింది. అయితే, తాజాగా మరోసారి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనే ఈ సినిమాను ప్రదర్శించడంతో ఆ వార్త నెట్టింట వైరల్ అయింది. దీనిపై నిర్మాత బన్ని వాసు తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో తండేల్ సినిమాను ప్రదర్శించినట్లు బన్నీ వాసు తెలిపారు. ఆ బస్సుకు సంబంధించిన వివరాలు (AP 39 WB. 5566) షేర్ చేశారు. రెండోసారి ఏపీఎస్ ఆర్టీసీలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని బన్నీ వాసు కోరారు. 'మా సినిమా పైరసీని రెండోసారి ప్రదర్శించారు. ఎంతో కష్టపడి సినిమా తీశాం. ఇలాంటి పనుల వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. ఎంతోమంది క్రియేటర్స్ శ్రమను అగౌరవపరచడమే అవుతుంది.' అని వాసు పేర్కొన్నారు.నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’(Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఇలాంటి సమయంలో ఇలా పైరసీని ప్రొత్సాహిస్తే చిత్ర పరిశ్రమకు తీరని నష్టాన్ని తెచ్చినట్లు అవుతుందని చాలామందిలో అభిప్రాయం వ్యక్తమౌతుంది. సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వస్తే సినిమా మనగుడ ఉండదని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు.Once again the pirated version of our #Thandel played on the @apsrtc bus (Vehicle No: AP 39 WB. 5566). Piracy harms the film industry and disrespects creators' hard work. APSRTC Chairman #KonakallaNarayanaRao Garu, kindly ensure a strict circular is issued, prohibiting the… pic.twitter.com/xIrhziUkNP— Bunny Vas (@TheBunnyVas) February 11, 2025 -
చైతన్య నటన చూశాక నాన్నగారు గుర్తొచ్చారు: అక్కినేని నాగార్జున
‘‘తండేల్’ కోసం చైతన్య రెండేళ్లు కష్టపడ్డాడు. ఓ రోజు ‘సముద్రంలో ఈ సినిమా షూటింగ్ చేస్తుంటే మత్స్యకారుల కష్టాలు అర్థం అవుతున్నాయి’ అన్నాడు చైతన్య. నెలల తరబడి సముద్రంలో చిన్న పడవపై ఉండే మత్స్యకారులందరికీ చేతు లెత్తి దండం పెడుతున్నాను. ఈ మూవీలో నాగచైతన్య నటన చూస్తుంటే మా నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) గుర్తొచ్చారు. 2025లో ‘తండేల్’ మంచి ముహూర్తం. వస్తున్నాం... కొడుతున్నాం’’ అన్నారు అక్కినేని నాగార్జున. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ ఈ నెల 7న విడుదలైంది.మంగళవారం నిర్వహించిన ‘తండేల్ లవ్ సునామీ సెలబ్రేషన్స్’కి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘అరవింద్‌గారు ‘తండేల్’ కథ విన్న, చందు మొండేటితో తీద్దామన్న, దేవిశ్రీతో మ్యూజిక్ చేయిద్దామన్న వేళా విశేషం... టీమ్ అందర్నీ సెట్ చేయడానికి బన్నీ వాసు, అందరూ ప్రయత్నించిన వేళా విశేషం... వీళ్లందరూ నాగచైతన్యని అడిగిన వేళా విశేషం.. శోభితని చైతన్య పెళ్లి చేసుకున్న వేళా విశేషం... ఇవన్నీ బాగున్నాయి. ‘తండేల్’ విడుదలైన రోజు ఉదయం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారిని కలిసేందుకు వెళ్లాం. అప్పుడు ఫోన్ సెక్యూరిటీలో ఇచ్చి వెళ్లాం.వచ్చాక ఫోన్ ఆన్ చేయగానే... ఫ్యాన్స్ వద్ద నుంచి కంగ్రాట్స్ అంటూ మెసేజులు. నాకన్నా, చైతన్య కన్నా మా శ్రేయోభిలాషులు, అక్కినేని ఫ్యాన్స్ ఎంత ఆనందపడుతున్నారో అప్పుడు అర్థమైంది. ‘తండేల్’ కథని నాక్కూడా వినిపించారు అరవింద్‌గారు. ‘100 పర్సెంట్ లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, తండేల్’... ఇలా మా ఫ్యామిలీకి ఒకదాన్ని మించి మరొక సక్సెస్ ఇచ్చిన మీకు థ్యాంక్స్. అల్లు... అక్కినేని కుటుంబాలకు బాగా సెట్టయింది. అరవింద్‌గారిని బన్నీ వాసు చక్కగా కన్విన్స్ చేసి, ఇలాంటి మంచి సినిమాలు తీసేలా చేస్తాడు. చైతన్యలోని ఒక నటుణ్ణి బయటకు తీసుకొచ్చాడు చందు’’ అన్నారు.‘‘తండేల్’కి సంబంధించి బిగ్గెస్ట్ తండేల్ (నాయకుడు) చందు మొండేటి. మా గీతా ఆర్ట్స్‌లో కలకాలం నిలిచి΄ోయే చిత్రాల్లో ‘తండేల్’ని ది బెస్ట్ సినిమాగా తీసుకుంటాం. తన నటనతో చింపేశాడు చైతు’’ అని పేర్కొన్నారు అల్లు అరవింద్. ‘‘నాపై నమ్మకంతో చైతన్యగారిని నాకు అప్పగించిన నాగార్జున సార్‌కి రిటర్న్ గిఫ్ట్‌గా ‘తండేల్’తో నాగచైతన్యగారిని వంద కోట్ల క్లబ్లో కూర్చోబెడతాం. నాలుగైదు రోజుల్లో 100 కోట్ల ΄పోస్టర్ని వేసి, పెద్ద వేడుక చేస్తాం. చైతన్యతో ‘100 పర్సెంట్ లవ్, తండేల్’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచి లర్’ వంటి హిట్ సినిమాలు తీశాం. ఇక మీరు (నాగార్జున) కూడా గీతా ఆర్ట్స్‌కి డేట్స్ ఇస్తే వీటన్నిటికంటే పెద్ద సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొడతాం’’ అని చె΄్పారు బన్నీ వాసు. ‘‘మా నాన్నగారిని చూసి నాకు క్రమశిక్షణ, భక్తి వచ్చాయి. నాన్నగారి కన్నా ఇంకా గొప్ప అర్హతలు ఎవరిలో అయినా ఉన్నాయా? అంటే అది అరవింద్‌గారే. చైతన్యగారితో భవిష్యత్తులో ఓ గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావుగారు చేసిన ‘తెనాలి రామకృష్ణ’ కథని మళ్లీ అత్యద్భుతంగా రాసి, ఈ తరానికి ఎలా కావాలి? ఏం చె΄్పాలి? అని తీసుకొస్తాం. ఆ మూవీలో ఏఎన్‌ఆర్‌గారు చేసినటువంటి అభినయం మళ్లీ చైతన్యగారు చేస్తారు. అది మనం చూడబోతున్నాం’’ అని తెలి΄ారు చందు మొండేటి. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘తండేల్ రాజులాంటిపాత్రలు అరుదుగా దొరుకుతాయి. ఈ మూవీతో వంద కోట్ల క్లబ్లో చేరతావని వాసు ఎప్పుడో చె΄్పాడు. ఈ మూవీ నీ కెరీ ర్లో బెస్ట్ అవుతుందని అరవింద్‌గారు చె΄్పారు. నేనూ నమ్మా. చందు, నా కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడం హ్యాపీగా ఉంది. ఎన్నోపాత్రలతో ఆడియన్స్‌ని అలరించాలి, ఎంతో కష్టపడాలనేప్రోత్సాహం, ధైర్యాన్ని ఈ సినిమా ద్వారా అరవింద్‌గారు, వాసు ఇచ్చారు. సినిమా లవర్స్ అంటే మన తెలుగు ప్రేక్షకుల తర్వాతే. మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే ఎలా ఆదరిస్తారో మీరు మాకు చూపించారు’’ అన్నారు. నిర్మాత అశ్వినీదత్, సహ నిర్మాత భాను, నటి, నాగచైతన్య వైఫ్ శోభితా ధూళి΄ాళ్ల,పాటల రచయిత శ్రీమణి, కథా రచయిత కార్తీక్ తదితరులుపాల్గొన్నారు. -
నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకున్న వేళా విశేషం: నాగార్జున ఆసక్తికర కామెంట్స్
అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ విజయోత్సవ వేడుకల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తండేల్ మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. తండేల్ మూవీ సక్సెస్ ఈవెంట్‌కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తండేల్ సినిమా గురించి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.నాగార్జున మాట్లాడుతూ.. ' తండేల్ సినిమా విడుదలైనరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ గారి దగ్గర ఉన్నాం. నా ఫోన్ కూడా నా దగ్గర లేదు.. ఫోన్ తీసుకున్నాక ఫోన్స్, మెసేజులతో నిండిపోయింది. అరవింద్ కథ విన్న వేళా విశేషం.. చందు మొండేటితో తీద్దామన్న వేళా విశేషం.. డీఎస్పీతో చేద్దామన్న వేళ.. మీరందరూ వచ్చి నాగచైతన్య అడిగిన వేళ.. శోభితను నాగచైతన్య పెళ్లి చేసుకున్న వేళా విశేషం ఇలా అన్నీ బాగున్నాయి. తండేల్ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. సక్సెస్ మీట్‌కు వచ్చి చాలా రోజులవుతోంది. చైతుని చూస్తే నాన్న గారు గుర్తొచ్చారు. 2025లో మళ్లీ వస్తున్నాం. గట్టిగా కొడుతున్నాం. అయితే దయచేసి కొంచెం కొడుకు, కోడలు ముందు నా రొమాంటిక్ వీడియోలను చూపించవద్దని' నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కొడుకు, కోడలు ముందు నా రొమాంటిక్ వీడియోలను చూపించవద్దు 😂 - #Nagarjuna #NagaChaitanya #SobhitaDhulipala #Thandel #TeluguFilmNagar pic.twitter.com/XyLy2bXmO3— Telugu FilmNagar (@telugufilmnagar) February 11, 2025 -
ఈ ప్రపంచంలో మీకు నచ్చినట్లు ఉండొచ్చు: సమంత పోస్ట్ వైరల్
ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ సమంత పేరు ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్య- శోభిత పెళ్లి తర్వాత సామ్ పేరు ఏదో ఒక సందర్భంలో బయటికి వినిపిస్తోంది. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్‌తో డేటింగ్లో ఉందంటూ మరోసారి రూమర్స్ వైరలైన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలోనే సమంత చేసిన తాజా పోస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నాగచైతన్య సైతం తన పెళ్లి, విడాకుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీంతో సమంత చేసిన క్రిప్టిక్ పోస్ట్‌పై నెట్టంట చర్చ మొదలైంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం పదండి.సమంతా తన పోస్ట్‌లో ఆధ్యాత్మిక గురువు సద్గురు చెప్పిన కోటేషన్‌ను షేర్ చేసింది. అందులో.. 'ఒక మనిషిగా ఈ ప్రపంచంలో మీరు శాశ్వతం కాదు. ఇది ఎప్పటికప్పుడు మారుతూ నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇక్కడ ఏదీ స్థిరంగా ఉండదు. ఈ ప్రపంచంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండవచ్చు.' అని ఆ కోట్లో రాసి ఉంది. ఈ పోస్ట్‌ను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. విడాకులపై స్పందించిన నాగచైతన్య..టాలీవుడ్ హీరో నాగచైతన్య తన మాజీ భాగస్వామి సమంత గురించి మొదటిసారి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వారు వివాహబంధం నుంచి విడిపోయిన తర్వాత పలుమార్లు సమంత రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ, నాగచైతన్య ఇప్పటి వరకు విడాకుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు. సమంతతో విడిపోయిన తర్వాత చాలా నెగటివ్ కామెంట్లు వచ్చాయని ఆయన అన్నారు. తను, నేను ఇద్దరం ఆలోచించే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ చాలామంది నెగటివ్ కామెంట్లు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు.నా లైఫ్‌లో రియల్ హీరో ఆమెనే..నటి శోభితాతో పెళ్లి విషయం గురించి ప్రకటించిన తర్వాత కూడా నెగటివ్‌గానే కామెంట్లు చేశారని చైతన్య అన్నారు. 'ఆమె నా జీవితంలోకి చాలా ఆర్గానిక్గానే ప్రవేశించింది. మా ఇద్దరి మధ్య మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం అయింది. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. కానీ, తన గురించి బ్యాడ్‌గా మాట్లాడటం చాలా తప్పు. నా పర్సనల్ లైఫ్ గురించి ఆమె చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తుంది. నా జీవితంలో నిజమైన హీరో శోభితానే..' అంటూ పేర్కొన్నారు.కాగా.. సమంత, నాగ చైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పరస్పర నిర్ణయంతో 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరు కలిసి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'ఏ మాయ చేసావే'లో స్క్రీన్‌ను పంచుకున్నారు. ఆ తర్వాత వివాహానికి ముందు పలు చిత్రాలలో నటించారు.ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. -
బోయపాటి దర్శకత్వంలో తండేల్
-
అరెస్ట్ చేయిస్తాం... జాగ్రత్త : అల్లు అరవింద్ వార్నింగ్
‘‘పైరసీ చేయడం పెద్ద క్రైమ్. ప్రస్తుతం సైబర్ సెల్స్ బాగా పని చేస్తున్నాయి. మిమ్మల్ని (పైరసీదారులను) పట్టుకోవడం తేలిక. వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్లకు ఇదే నా హెచ్చరిక... జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకు వెళ్లే అవకాశం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) హెచ్చరించారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’(Thandel). అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ అయింది. కాగా, ‘తండేల్’ సినిమాను పైరసీ చేసి, ఆన్లైన్లో పెట్టారు. ఈ విషయంపై సోమవారం ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వల్ల కొన్నేళ్లుగా సినిమా పైరసీ ఆగింది. కానీ రెండు నెలల నుంచి మళ్లీ పెరిగింది. మొన్న ‘దిల్’ రాజుగారి సినిమాను ఇలానే ఆన్లైన్లో విడుదల చేశారు. పైరసీ నియంత్రణకు ఫిల్మ్ ఛాంబర్లోని సెల్ రాత్రీ పగలూ పని చేస్తోంది. కానీ కొందరు వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వార్డ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల అడ్మిన్లను గుర్తించి, సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లాం. వారిని అరెస్ట్ చేయిస్తాం. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సినిమా పైరసీ ప్రింట్‌ను ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం. సినిమా సక్సెస్‌ను మేం ఆస్వాదించే క్రమంలో ఈ పైరసీ సమస్య మాకు ప్రతిబంధకం’’ అన్నారు. ‘‘క్రిమినల్ కేసులు నమోదు అయితే వెనక్కి తీసుకోలేము. పైరసీ చేసినవాళ్లకి, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. ‘తండేల్’ సినిమా పైరసీ కాపీ ఓవర్సీస్ నుంచే వచ్చింది. ఇది తమిళ ప్రింట్ నుంచి వచ్చింది. దానికి తెలుగు ఆడియో కలిపారు. పైరసీ కాపీని ప్రదర్శించవద్దని కేబుల్ ఆపరేటర్స్‌ని కూడా హెచ్చరిస్తున్నాం’’ అని బన్నీ వాసు అన్నారు. ఇదిలా ఉంటే... ఈ సమావేశం నిర్వహించిన కొంత సమయానికి బన్నీ వాసు ‘ఎక్స్’ వేదికగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కె. నారాయణరావుని ఉద్దేశించి, ‘‘పైరసీని అడ్డుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకోవడానికి నిజాయితీగా మీరు చేసిన ప్రయత్నాన్ని, ఈ విషయంపై త్వరితగతిన స్పందించినందుకు, ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్‘తండేల్’ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడినప్పుడు... ‘గేమ్ ఛేంజర్’ని తక్కువ చేసినట్లుగా ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ‘‘ఆ రోజు ‘దిల్’ రాజుగారిని ఉద్దేశించి, నేను మాట్లాడిన మాటలకు అర్థం... ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు–నష్టాలు–ఇన్కమ్ట్యాక్స్లు.. ఇవన్నీ అనుభవించారని. ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడిన మాటలు కాదు. మెగా అభిమానులు ఫీలై, నన్ను ట్రోల్ చేశారు. ఫీలైన ఆ అభిమానులకు చెబుతున్నాను... నాకు చరణ్ (రామ్‌చరణ్) కొడుకులాంటి వాడు. నాకున్న ఏకైక మేనల్లుడు. అందుకని ఎమోషనల్‌గా చెబుతున్నాను. ప్లీజ్... లీవ్ అజ్ బిహైండ్’’ అన్నారు. -
నాగచైతన్య తండేల్.. మహిళ అభిమాని ఫుల్ ఎమోషనల్
అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో తండేల్ టీమ్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంది. ఈ మూవీ సక్సెస్ కావడంతో సంబురాల్లో మునిగిపోయారు.అయితే ఈ మూవీ చూసిన ఓ మహిళ అభిమాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సినిమాలో నాగచైతన్యకు సంబంధించిన ఓ సీన్ ప్లే అవుతుండగా ఏడుపును ఆపుకోలేకపోయారు. వెక్కి వెక్కి మరీ ఏడుస్తూ కనిపించారుయ దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని బట్టి చూస్తే తండేల్ ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా ఎంతలా కనెక్ట్ అయిందో అర్థమవుతోంది.కాగా.. ఈ సినిమాను మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుల చేతికి చిక్కారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రియల్ లవ్ స్టోరీ కావడంతో ప్రేక్షకులకు మరింత ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. ఎన్ని ట్యాంక్ నీలు ఉన్నాయ్ అమ్మ..🥹🥹Proud of you Anna #NagaChaitanya 🧎థియేటర్స్ తీసుకొచ్చి మరి యేడిపిస్తునవ్ Actor @chay_akkineni ❤️🤌#Thandel #ThandelJaathara #ThandelRaju pic.twitter.com/8jzlo8j5J6— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) February 9, 2025 -
అక్కినేని ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌ను కలిసిన నాగచైతన్య.. ఎందుకంటే?
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. తండేల్ చిత్రం సక్సెస్ కావడంతో నాగచైతన్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శకుడు చందు మొండేటితో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే విజయవాడ వెళ్లిన నాగచైతన్య ఆలిండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షులు సర్వేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం తెలుసుకుని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.కాగా.. తండేల్ చిత్రాన్ని శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కొందరు జాలర్లు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకొచ్చారు. అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్‌గా పాత్రలో కనిపించారు. -
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తండేల్ టీమ్ (ఫోటోలు)
-
తండేల్‌ను వదలని పైరసీ భూతం.. రెెండో రోజే ఆన్లైన్లో ప్రత్యక్షం!
అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ (Thandel Movie) మూవీతో ప్రేక్షకులను పలకరించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది.తండేల్‌ను వదలని పైరసీ భూతం..అయితే సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. తాజాగా తండేల్ మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. సినీ ఇండస్ట్రీకి తీరని సమస్యగా మారింది. విడుదలైన రెండో రోజే తండేల్ సినిమా ఆన్లైన్లో పలు వెబ్‌సైట్స్‌లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిల్మీ జిల్లా లాంటి పైరసీ సైట్లో తండేల్ పూర్తి సినిమా అప్లోడ్ చేసినట్లు సమాచారం. దీంతో తండేల్ మూవీ మేకర్స్ ఆందోళనకు గురవుతున్నారు.కాగా.. అంతకుముందే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విడాముయార్చి మూవీని సైతం పైరసీ భూతం వదల్లేదు. ఈ చిత్రం రిలీజైన కొద్ది గంటల్లోనే ఆన్లైన్లో అప్లోడ్ చేసేశారు. సినీ ఇండస్ట్రీ, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పైరసీ కేటుగాళ్లను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా పైరసీ చేసేవారిని కఠినంగా శిక్షించాలని నిర్మాతలు, సినీ ప్రియులు కోరుతున్నారు. తొలిరోజే అదిరిపోయే కలెక్షన్స్..తండేల్ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే అత్యధికంగా వసూళు చేసింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా తండేల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు గతంలో తను నటించిన 'లవ్‌స్టోరీ' మొదటిరోజు సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడా రికార్డ్‌ను తండేల్ దాటేసింది.విదేశాల్లోనూ హవా..విదేశాల్లో మొదటిరోజు ఈ చిత్రం రూ. 3.7 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. 'అలలు మరింత బలపడుతున్నాయి' అంటూ ఒక క్యాప్షన్‌ను పెట్టింది. విదేశాల్లోనే సుమారు రూ. 10 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
రెండుసార్లు మ్యాజిక్ రిపీట్... అందుకే హిట్ పెయిర్ అంటున్న ఇండస్ట్రీ
-
సమంతతో విడాకులు.. అలాంటి కామెంట్లు ఇకనైనా ఆపేయండి: నాగచైతన్య
టాలీవుడ్ హీరో నాగచైతన్య తన మాజీ భాగస్వామి సమంత గురించి మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. వారు వివాహబంధం నుంచి విడిపోయిన తర్వాత పలుమార్లు సమంత రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ, నాగచైతన్య ఇప్పటి వరకు విడాకుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. విడాకులు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత ఆయన రియాక్ట్ అయ్యారు. సమంతతో విడిపోయిన తర్వాత చాలా నెగటివ్ కామెంట్లు వచ్చాయని ఆయన అన్నారు. తను, నేను ఇద్దరం ఆలోచించే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ చాలామంది నెగటివ్ కామెంట్లు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో శోభితతో పెళ్లి గురించి కూడా ఆయన పంచుకున్నారు. 'సమంతతో విడాకుల తర్వాత సోషల్‌మీడియాలో ఎలాంటి పోస్ట్ షేర్ చేసినా కూడా నెగటివ్ కామెంట్లు వస్తున్నాయి. అవి ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని నేనూ చదవుతాను. సమంతతో విడిపోయిన తర్వాత ఇద్దరం కలిసే విడాకుల విషయాన్ని ప్రపంచానికి చెప్పాం. వ్యక్తిగత కారణాల వల్ల వేరువేరుగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రకటించాం. ఎవరిదారిలో వారి జర్నీ కొనసాగుతుందని తెలిపాం. మా వ్యక్తిగత జీవితం విషయంలో కాస్త ప్రైవసీ ఇవ్వండి అంటూ అభ్యర్థించాము కూడా.. అయితే, మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయింది. ఎన్నో గాసిప్స్ వార్తలు వచ్చాయి. అలాంటి సమయంలో మళ్లీ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే.. ఆ ఇంటర్వ్యూ నుంచి కూడా మరికొన్ని వార్తలు ప్రసారం అవుతాయి. అందుకే స్పందించలేదు. కానీ, కొన్ని సందర్భాల్లో పలు వేదికలపై ఈ విషయం గురించి అడిగారు. ఆ సమయంలో ఈ టాపిక్ గురించి వదిలేయండి అని కూడా రిక్వెస్ట్ చేశాను. అయినప్పటికీ అదే విషయంపై ప్రశ్నలు అడుగుతూ.. మళ్లీ ఆ గాయాన్ని గెలుకుతున్నారు. కానీ, మా నిర్ణయాన్ని ఎవరూ గౌరవించలేదు. మా విడాకుల వార్తలు, కామెంట్ల గురించి ఎవరూ ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. అలాంటి వార్తలు రాసే వారు ఇకనైన ఫుల్స్టాప్ పెట్టాలి. నా మీద నెగటివ్ కామెంట్లు చేసే వారు ఇకనైనా ఆపేయండి.. మీ భవిష్యత్ గురించి మంచిగా ఆలోచించండి. విడాకులు అనేది నా జీవితంలో మాత్రమే జరగలేదు. సమాజంలో చాలామంది లైఫ్‌లో జరిగాయి. నేనేమైనా క్రిమినల్‌ను కాదు కదా.. నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. వెయ్యి సార్లు ఆలోచించే విడాకులు తీసుకున్నాం. మా జీవితంలో విడాకులు అనేది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు.. చాలారోజుల పాటు చర్చించిన తర్వాతే ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఆయన అన్నారు.నా లైఫ్‌లో నిజమైన హీరో ఆమె..నటి శోభితాతో పెళ్లి విషయం గురించి ప్రకటించిన తర్వాత కూడా నెగటివ్‌గానే కామెంట్లు చేశారని చైతన్య అన్నారు. 'ఆమె నా జీవితంలోకి చాలా ఆర్గానిక్గానే ప్రవేశించింది. మా ఇద్దరి మధ్య మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం అయింది. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. కానీ, తన గురించి బ్యాడ్‌గా మాట్లాడటం చాలా తప్పు. నా పర్సనల్ లైఫ్ గురించి ఆమె చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తుంది. నా జీవితంలో నిజమైన హీరో శోభితానే..' అంటూ పేర్కొన్నారు. -
జగనన్న చేసిన సాయం.. ‘తండేల్’లో చూపకపోవడం బాధాకరం
శ్రీకాకుళం అర్బన్: తండేల్ సినిమా యథార్థ ఘటన ఆధారంగా తీసినప్పటికీ అందులో పూర్తిస్థాయిలో సన్నివేశాలు చూపలేదని కె.మత్స్యలేశం గ్రామవాసి, మత్స్యకార సంఘ నాయకుడు, న్యాయవాది మూగి గురుమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రీల్ స్టోరీ తీశారే తప్ప రియల్ స్టోరీ తీయలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018 నవంబర్ 28న 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో బందీలుగా చిక్కుకున్నారని, వారిని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అపుడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజాంలో జరుగుతున్న పాదయాత్రలో కలిశామని, మత్స్యకార కుటుంబాల సమస్య వివరించామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బందీలను విడిపించారన్నారు. అనంతరం 22 మంది మత్స్యకారులతో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారన్నారు. ఒక్కొక్కరికి రూ.5లక్షలు చొప్పున ఆర్ధిక సహాయం కూడా చేశారన్నారు. ఈ సంఘటన తండేల్ సినిమాలో లేకపోవడం బాధాకరమన్నారు.ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలుశ్రీకాకుళం అర్బన్: ‘తండేల్’ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సినిమా చిత్ర కథా రచయిత తీడ కార్తీక్ అన్నారు. శ్రీకాకుళంలోని ఎస్వీసీ థియేటర్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తండేల్ సినిమా విజయంతో వచ్చిన సౌండ్ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు దేశవ్యాప్తంగా వినిపిస్తోందన్నారు. సక్సెస్ మీట్‌కు చిత్ర యూనిట్ మొత్తం త్వరలోనే శ్రీకాకుళం రానుందని తెలిపారు. మత్స్యకారుడు గనగళ్ల రామారావు మాట్లాడుతూ పాకిస్తాన్లో తాము పడిన ఇబ్బందులు, బాధలను దర్శకుడు చందు కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. బందీగా ఉన్న సమయంలో అన్ని ప్రభుత్వాలు ఆదుకున్నాయన్నారు. సమావేశంలో ఎస్వీసీ థియేటర్ మేనేజర్ రవి, అభిమానులు పాల్గొన్నారు. -
హీరో నాగచైతన్య 'తండేల్' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
పెళ్లి తర్వాత తొలి చిత్రం.. చైతూ భార్య శోభిత ధూళిపాల అలాంటి పోస్ట్!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల థియేటర్లలో విడుదలైంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. రియల్ స్టోరీ ఆధారంగా తండేల్ సినిమాను తెరకెక్కించారు.అయితే శోభిత తన భర్త సినిమా రిలీజ్‌కు ముందు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ సినిమా విడుదల పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఈ చిత్రం కోసం మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసని అన్నారు. ఈ లవ్ స్టోరీని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆతృతగా ఉందని శోభిత తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అంతేకాదు ఇకనైనా మీరు గడ్డం గీసుకుంటారు.. మొదటిసారి గడ్డం లేకుండా నీ ముఖం చూసే దర్శనభాగ్యం కలుగుతుంది సామీ అని ఆమె రాసింది.' అంటూ తెలుగులోనే రాసుకొచ్చింది.కాగా.. గతేడాది డిసెంబర్లో శోభిత ధూళిపా- నాగచైతన్య వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఈ పెళ్లికి టాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిద్దరి పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో శోభిత దూళిపాల తన ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
ఆడియన్స్ ముందుకు తండేల్.. అవుతుందా బ్లాక్ బస్టర్ ?
-
Thandel Twitter Review: నాగచైతన్య 'తండేల్' ట్విటర్ రివ్యూ
అక్కినేని హీరో నాగచైతన్య తండేల్ మూవీతో ఫిబ్రవరి 7న థియేటర్స్‌లోకి వచ్చేశాడు. ఇప్పటికే ఓవర్సీస్లో షోలు పడ్డాయి. దీంతో సినిమా ఎలా ఉందో ట్విటర్ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి డైరెక్షన్‌కు తోడు ఈ మూవీలో సాయి పల్లవి ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెల కొన్నాయి. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన తండేల్ మూవీకి ప్రధాన బలం సంగీతం అంటూ ఎక్కువమంది దేవీ శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా కథ చెప్పడంలో కాస్త స్లోగా ఉన్నా ఫైనల్‌గా ప్రేక్షకులకు నచ్చుతుందని నెటిజన్లు అంటున్నారు. కథలో చాలా బలం ఉన్నప్పటికీ కొన్ని సీన్ల విషయంలో బాగా విసుగుతెప్పించాడని డైరెక్టర్‌పై విమర్శలు వస్తున్నాయి. కొందరు మాత్రం అలాంటిదేమీ లేదని, కొందరు కావాలనే పనికట్టుకుని మరీ సినిమాపై నెగటివిటిని తీసుకొస్తున్నారని తెలుపుతున్నారు. 'లవ్‌స్టోరి' హిట్ తర్వాత ఈ జోడి మరోసారి భారీ విజయం అందుకుందని తెలుపుతున్నారు.తండేల్ ప్రయాణంలో నాగచైతన్య, సాయి పల్లవి నటన అద్భుతమని కొందరు అంటున్నారు. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, సెకండాఫ్ మాత్రం దుమ్మురేపారని చెబుతున్నారు. ముఖ్యంగా నాగచైతన్య కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలుస్తోంది. తెరపై ఆయన్ను చూసిన ఆభిమానులే ఆశ్చర్యపోతున్నారు. ప్రతి సీన్లో ఏంతమాత్రం తగ్గకుండా మెప్పించాడంటూ ప్రశంసలు వస్తున్నాయి.తండేల్ సినిమాకు మరో బలం దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటూ కొందరు చెబుతున్నారు. ప్రతి సీన్లో బీజీఎమ్‌తో గూస్బంప్స్ తెప్పించాడని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బుజ్జి తల్లి పాటతో సినిమాను మరింత పీక్స్‌కు తీసుకెళ్లారని చెబుతున్నారు. సినిమా విషంయలో ఒకటి లేదా రెండు నెగటివ్ కామెంట్లకు మించి పెద్దగా ఎక్కడేకాని కనిపించడం లేదు. ట్విటర్లో సినిమాపై బాగుందనే ఎక్కువగా వినిపిస్తుంది. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా తండేల్ కథ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇదీ 'లవ్‌స్టోరి' బ్లాక్ బస్టర్ జోడీ అంటూ సినిమాపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం ట్విటర్లో వచ్చిన అంశాలను మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి రివ్యూ గురించి మరి కొన్ని గంటల్లో తెలుసుకుందాం.Sad version em kottav ra 🫡@ThisIsDSP #Thandel ❤️🔥 pic.twitter.com/CQZzw3V3of— Nick9999 (@NickTarak9999) February 6, 2025#ThandelReview- Oka manchi love track 🧡- Beautiful Songs 👌🎶- koncham patriotic touch tho movie ni end chestaad bhayya 👌Chatinaya Comeback after 5yrs 🔥 3.5/5 #Thandel pic.twitter.com/uwOJnYKLZO— ᴏʀᴀɴɢᴇ ᴀʀᴍʏ 🧡 (@Baahubali230) February 7, 2025#Thandel storms overseas premieres with BLOCKBUSTER reports. 🔥🔥🔥Yuvasamrat @chay_akkineni & @Sai_Pallavi92 shine with their electrifying performances, winning hearts everywhere. 💥💥Rockstar @ThisIsDSP strikes gold again, his songs & BGM receive thunderous applause. 🤘… pic.twitter.com/lx7m5Qc2ll— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 7, 2025Show completed :- #thandel My rating 3/5Ok first half Solid blockbuster 2nd half 👌👏@chay_akkineni performance and @Sai_Pallavi92 performance Vera level 👌👌👌👌Finally movie dhulla kottesindi 👌👌 pic.twitter.com/DeUm3q1zqB— venkatesh kilaru (@kilaru_venki) February 6, 2025Just now finished watching #ThandelIt’s simply a comeback film for @chay_akkineni❤️🔥. He delivered a very good performance in his career after Majili and YMC.🙇🏻🫂It has decent first half followed by a good second half 🙌🏻.Dsp is the soul for the movie🙇🏻❤️🔥 #ThandelReview pic.twitter.com/smAwxuQcOD— Legend Prabhas (@CanadaPrabhasFN) February 7, 2025The #LOVESTORY MAGIC REPEATS AGAIN 🤩All praises & love pouring in from the USA PREMIERES for the BLOCKBUSTER JODI of @chay_akkineni & @Sai_Pallavi92 as RAJU & SATYA in #Thandel 💕 pic.twitter.com/fth6ywe972— Ramesh Bala (@rameshlaus) February 7, 20253/5 rating hit bomma @ThisIsDSP bgm #Thandel ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/2JlkMQTjKN— PAWANKALYAN ✨ (@PSPk9999999) February 7, 2025Unanimous blockbuster reports from USA premieres! 🤩🇺🇸💥💥Blockbuster #Thandel 🔥 pic.twitter.com/UE7WveG18i— Prathyangira Cinemas (@PrathyangiraUS) February 7, 2025#Thandel - Unanimous FEEL GOOD BLOCKBUSTER- 3.25/5 🔥YUVASAMRAT @chay_akkineni is the biggest asset of the film 🎥 entertains throughout the film with his stunning chemistry and career BEST PERFORMANCE with @Sai_Pallavi92 💥💥💥💥💥💥💥🔥🔥🔥MAINLY @ThisIsDSP BGM AND SONGS… pic.twitter.com/wIjGqj1Bvm— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) February 6, 2025Chandu Mondeti pedda boring Ass**l asalu veedena Karthikeya tisindi anipistundi.scenes asalu engaging levvu neersam teppinchadu manchi line inka yavarikanna iste bagundedi,ee movie chusaka #Uppena tisina @BuchiBabuSana meeda respect perigindi #NagaChaitanya #SaiPallavi #Thandel— E.Mahesh babu (@babu_mahesh99) February 7, 2025 -
తెలుగు నిర్మాత అంటే తలెత్తి చూస్తున్నారు: అల్లు అరవింద్
‘‘నేను నిర్మించిన ‘మగధీర’ సమయంలో రూ.40 కోట్లు బడ్జెట్ అంటే... ఈ రోజు ద్రవ్యోల్బణం తీసుకుంటే సుమారు రూ. 350 కోట్లు అవుతుంది. ప్రస్తుతం దాదాపు అందరూ ఇంత బడ్జెట్‌తో సినిమాలు తీస్తున్నారు. ఈ రోజు తెలుగు సినిమా నిర్మాత అంటే తలెత్తి చూస్తున్నారు. దీనికి కారణం అలాంటి సినిమాలు చేయగల హీరోలు, దర్శకులు తెలుగులో ఉన్నారు. ఇది తెలుగు వారి విజయం’’ అని అల్లు అరవింద్(Allu Aravind) తెలిపారు. అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘మా కంట్రోల్లో లేని ఏరియాల్లో మా చిత్రాల విడుదలని బయటి వారికి ఇస్తాం తప్పితే మిగతా అంతా మేమే రిలీజ్ చేస్తున్నాం. మేం అనుకున్న దానికంటే ‘తండేల్’కి బడ్జెట్ ఎక్కువ అయ్యింది. నా వద్దకు బన్నీ వాసు వచ్చి ‘మన సినిమా బయటకి అమ్మేద్దామా?’ అన్నాడు. ఏం ఫర్వాలేదు.. మనమే రిలీజ్ చేస్తున్నామని చెప్పాను’’ అని పేర్కొన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ–‘‘నాన్న(నాగార్జున) గారికి మా సినిమా చాలా నచ్చింది. ఆయన్ని సక్సెస్ మీట్‌కి తీసుకొస్తాం’’ అని చెప్పారు.చందు మొండేటి మాట్లాడుతూ– ‘‘తొమ్మిది నెలలు ఓ మనిషి కోసం ఎదురుచూడటం, ఆ మనిషి తనకోసం వస్తాడనే నమ్మకం.. ఇలా చాలా అందమైన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ మూవీ చూశాక చైతన్య, సాయి పల్లవిలో ఎవరి నటన బాగుందనే చర్చ పెడతారు. నన్ను అడిగే చైతన్య చేసిన రాజుపాత్ర అని చెబుతాను’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలోపాకిస్తాన్ సీక్వెన్ ్స కోసం చందూగారు చాలా పరిశోధన చేశారు. నాగేంద్రగారు అద్భుతమైన సెట్ వేశారు’’ అని చెప్పారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర,పాటల రచయిత శ్రీమణి మాట్లాడారు. -
నాగచైతన్య తండేల్ మూవీ.. సాయిపల్లవిలా అదరగొట్టిన దేవీశ్రీ ప్రసాద్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు దర్శకుడు చందు, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తండేల్‌ను వీక్షించారు. సినిమా ఫైనల్ కాపీ చూసిన దేవీశ్రీ, చందు డ్యాన్స్‌తో అదరగొట్టారు. హైలెస్సా హైలెస్సా అంటూ సాంగే పాటకు స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండేల్ సినిమా ఫర్ఫెక్ట్గా రావడంతో సంతోషంతో డ్యాన్స్ చేశారు. దీంతో తండేల్ సూపర్ హిట్ కావడం ఖాయమని ఫ్యాన్స్‌తో పాటు మేకర్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.(ఇది చదవండి: తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?)మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రాన్ని రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. గుజరాత్లో చేపల వేటకు వెళ్లిన కొందరు శ్రీకాకుళం మత్స్యకారులను పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ చేతికి చిక్కడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తండేల్ మూవీని రూపొందించారు. నిజజీవితంలో జరిగిన కథ కావడంతో తండేల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా శోభితతో నాగచైతన్య పెళ్లి తర్వాత వస్తోన్న మొదటి చిత్రం కావడం మరో విశేషం. ఏదేమైనా చైతూ ఖాతాలో హిట్టా? సూపర్ హిట్టా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. వస్తున్నాం దుల్లగొడ్తున్నాం 🌊🔥⚓That's the tweet. 😎🤙🏻#Thandel in cinemas from tomorrow 🔥 pic.twitter.com/YLclLTci5L— Geetha Arts (@GeethaArts) February 6, 2025 -
‘తండేల్’ మూవీ విశేషాలు చెప్పిన నాగచైతన్య (ఫొటోలు)
-
'అన్ని చెడులకు అదే కారణం'.. రిలేషన్స్‌పై సమంత కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. గతేడాది సిటాడెల్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సామ్ ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్‌లోనూ నటించండ లేదు. మరోవైపు పికిల్ బాల్ టోర్నమెంట్లో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ సమంత అతనితో రిలేషన్లో ఉందంటూ కామెంట్స్ చేశారు. దీంతో నెట్టింట మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిలేషన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో ఉన్న సంబంధాలపై మాట్లాడింది. ఈ సందర్బంగా జీవితంలో చాలా కష్టాలు పడ్డానని తెలిపింది సామ్. అందుకే ప్రస్తుతం రిలేషన్ గురించి ఆలోచించట్లేదని వెల్లడించింది. అంతే కాకుండా గతంలో రిలేషన్షిప్లో ఉన్న వారిపట్ల తనకేలాంటి అసూయ, కోపం ఉండవని తెలిపింది. ఎందుకంటే అసూయ అన్నీ చెడులకు కారణమని చెబుతోంది సమంత.కాగా.. గతంలో టాలీవుడ్ నాగచైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2017లో వివాహం చేసుకున్న చైతూ- సామ్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి సమంత ఒంటరిగానే ఉంటున్నారు.నాగచైతన్య రెండో పెళ్లి..నాగచైతన్య గతేడాది రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాలను ఆయన పెళ్లాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
అవే నాకు వెయ్యి ఏనుగుల బలం ఇస్తాయి: దేవిశ్రీ ప్రసాద్
ఆరు పాటలూ లవ్ సాంగ్స్ ఉండే ఓ ప్రేమకథ చేయాలనే కోరిక బన్నీకి (అల్లు అర్జున్) ఎప్పట్నుంచో ఉంది. ‘గుర్తుపెట్టుకో.. మనం అలాంటి సినిమా చేద్దాం’ అంటూ మొన్న ఓ పేపర్ మీద రాసిచ్చారు (నవ్వుతూ). ‘తండేల్’ మూవీ మ్యూజిక్‌కి దేవిని ఫిక్స్ అయిపోమని అరవింద్ అంకుల్‌తో బన్నీ ముందే చెప్పారు. ‘‘చాలా రోజుల తర్వాత వస్తున్న అందమైన ప్రేమకథా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలోని ‘బుజ్జి తల్లి...’ పాట విన్న సుకుమార్‌గారు.. ‘నీ ఆల్ టైమ్ టాప్ ఫైవ్‌లో ఉంటుంది’ అన్నారు. ఆ సాంగ్ రిలీజైన వెంటనే ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే శివుని పాట, హైలెస్సో... పాటలు గొప్పగా జనాల్లోకి వెళ్లాయి. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్ అవడం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వం వహించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విలేకరులతో పంచుకున్న విశేషాలు. ⇒ నా కెరీర్ ఆరంభంలో నేను చేసిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఆర్య, 100% లవ్’ వంటి ప్రేమకథలతో పాటు ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్, మాస్’ లాంటి కమర్షియల్ సినిమాలకు కూడా మ్యూజిక్ పరంగా ప్రేక్షకుల నుంచి అంతే అద్భుతమైన స్పందన వచ్చింది. ఎలాంటి సినిమా అయినా చేయగలననే పేరు రావడం, అందులోనూ ప్రేమకథలకి మంచి సంగీతం ఇస్తానని అందరూ అనుకోవడం దేవుడి ఆశీస్సులుగా భావిస్తాను⇒ ‘తండేల్’ స్వచ్ఛమైన ప్రేమకథ. వాస్తవ ఘటనల ఆధారంగా రాసుకున్న కథ. చందు మొండేటి గ్రేట్ విజన్‌తో ఈ సినిమా తీశాడు. చైతన్యగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కొత్త నాగచైతన్యని చూడబోతున్నారు. సాయిపల్లవి నటన కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది⇒ యంగ్ ఏజ్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేశా. నేనే నా మ్యూజిక్ వింటూ పెరిగాను (నవ్వుతూ). అన్ని జానర్ సినిమాలు చేసే అవకాశం రావడం, అన్ని వయసుల వారికి నచ్చే మ్యూజిక్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. లైవ్ షోస్ చేయడం నాకు వెయ్యి ఏనుగుల బలం ఇస్తుంది. ప్రేక్షకులు అభిమానం, ఆదరణ నాకు గొప్ప ఎనర్జీతో పాటు ఇంకా గొప్ప మ్యూజిక్ చేయాలనే స్ఫూర్తినిస్తాయి. ప్రస్తుతం ‘కుబేర’ సినిమాకి సంగీతం అందిస్తున్నాను. -
నాగచైతన్య తండేల్.. టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి
టాలీవుడ్ హీరో నాగచైతన్య తాజా చిత్రం తండేల్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిలిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 అదనంగా వసూలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (ఇది చదవండి: తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?)చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీ అధారంగా ఈ సినిమాను రూపొందించారు. పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారులను బంధించి పాక్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి చైతూ సరసన హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా కోసం చైతూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్..తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. ఈ విషయాన్ని బన్నీ తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ ఈవెంట్లో రియల్ తండేల్ రాజ్ అలియాస్ రామారావు తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. -
మా పెళ్లి ప్లానింగ్ అంతా తనదే: నాగచైతన్య ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీ అధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి చైతూ సరసన హీరోయిన్గా కనిపించనుంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మన తండేల్ హీరో చైతూ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన భార్య శోభిత ధూలిపాళ్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా వెడ్డింగ్ ప్లానింగ్ విషయంలో క్రెడిట్ అంతా తన భార్యకే దక్కుతుందన్నారు. శోభిత మన తెలుగు సంప్రదాయాలను పాటిస్తుందని తెలిపారు. మా పెళ్లికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆమెనే డిజైన్ చేసిందని వెల్లడించారు. నా జీవితంలో ఆ క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేనని నాగచైతన్య అన్నారు. -
చైతు, సాయి పల్లవి స్టెప్పులకు పూనకాలు గ్యారెంటీ: బన్నీ వాసు
‘‘తండేల్’ మూవీ యాభై శాతం ఫిక్షన్ అయితే యాభై శాతం నాన్ ఫిక్షన్. రాజు, సత్య అనే ఫిక్షనల్ క్యారెక్టర్స్‌ని చందు అద్భుతంగా డిజైన్ చేశారు. మా సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే స్వచ్ఛమైన ప్రేమకథ. ఆ లవ్ స్టోరీ ద్వారా వాస్తవ ఘటనలను ప్రేక్షకులకు చూపిస్తున్నాం’’ అని నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) చెప్పారు. నాగచైతన్య, సాయి పల్లవి(sai Pallavi) జోడీగా నటించిన చిత్రం ‘తండేల్’(Thandel). చందు మొండేటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బన్నీ వాసు విలేకరులతో మాట్లాడుతూ–‘‘రచయిత కార్తీక్ రాసిన కథ నా క్లాస్ మేట్ భానుకి నచ్చింది. దీంతో కార్తీక్‌ని నా వద్దకు తీసుకొచ్చాడు.. నాకూ బాగా నచ్చడంతో కథ వినమని చందూగారికి చెప్పాను. ఆయనకి కూడా నచ్చడంతో చాలా పరిశోధన చేసి, పూర్తి కథని డెవలప్ చేశాం. మత్సలేశ్యం అనే ఊరు ఆధారంగా తీసుకున్న కథ ‘తండేల్’. ఇక్కడి వారు గుజరాత్ పోర్ట్‌కి చేపల వేటకి వెళుతుంటారు. మెయిన్ లీడర్ని తండేల్ అంటారు. అలా మా మూవీకి ‘తండేల్’ టైటిల్ పెట్టాం. ఈ చిత్రంలో రాజు పాత్ర కోసం నాగచైతన్య మౌల్డ్ అయిన విధానం అద్భుతం.ఈ చిత్రం కథ నాగార్జున గారికి బాగా నచ్చిందని చైతన్యగారు చెప్పారు. సాయి పల్లవి కూడా చైతన్యకి మ్యాచ్ అయ్యేలా నటించారు. ‘నమో నమశ్శివాయ..’ పాటలో చైతన్య, సాయి పల్లవి డ్యాన్స్ థియేటర్స్‌లో పూనకం తెప్పిస్తుంది. అరవింద్‌గారు ‘తండేల్’ చూసి, విజయంపై చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ప్రమోషన్స్‌లో చాలా ఉత్సాహంగా, ఎంజాయ్‌మెంట్‌గా కనిపిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయింది. శ్యామ్దత్గారి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి’’ అని తెలిపారు. -
తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన తండేల్ మూవీ ట్రైలర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మత్స్యకార బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది.తాజాగా ఈ మూవీ నుంచి ఓ సర్ప్రైజ్ వీడియోను అక్కినేని నాగచైతన్య షేర్ చేశారు. ది జర్నీ ఆఫ్ తండేల్(Thandel Transformation) పేరుతో గ్లింప్స్‌ను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. నాగచైతన్య తండేల్ రాజ్‌గా మారడాన్ని ఇందులో చూపించారు. తండేల్ షూటింగ్లో చైతూ జర్నీని వీడియో రూపంలో ప్రేక్షకులకు అందించారు. చైతూ నుంచి ఇంతలా ఫర్మామెన్స్ మాత్రం ఊహించలేదని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు.మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. ఈ విషయాన్ని బన్నీ తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ ఈవెంట్లో రియల్ తండేల్ రాజ్ అలియాస్ రామారావు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.Becoming Thandel Raju was challenging and extremely satisfying Here’s a glimpse into the journey https://t.co/uEuMtmVwWj-- #Thandel RajuSEE YOU ALL IN CINEMAS 7TH FEB. #ThandelonFeb7th pic.twitter.com/8rx997jCro— chaitanya akkineni (@chay_akkineni) February 3, 2025 -
‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా రియల్ లైఫ్ హీరోలు వీళ్లే!
‘‘ఒక యాక్టర్‌కి ఒక లిస్ట్ ఉంటుంది.. ఫలానా డైరెక్టర్‌తో చేస్తే కెరీర్‌కి ఉపయోగపడుతుందని. కానీ నా లిస్ట్‌లో గీతా ఆర్ట్స్ పేరు టాప్‌లో ఉంటుంది. ఈ బేనర్లో సినిమా చేసిన ఏ యాక్టర్ అయినా ఒక మంచి రిజల్ట్‌తో బయటికొస్తారు’’ అని హీరో నాగచైతన్య అన్నారు. నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’(Thandel). 2018లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘తండేల్ జాతర’ అంటూ యూనిట్ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event)లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ వేడుకకు వచ్చినందుకు సందీప్ రెడ్డిగారికి ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో మీలా నిజాయతీ ఉన్న వ్యక్తిని చూడలేదు. మీ సినిమాలే కాదు... మీ ఇంటర్వ్యూల్లో ఓ నిజాయితీ కనిపిస్తుంది. ఇక నా రియల్ లైఫ్‌కి, తండేల్ రాజు క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంటుంది. నేను రాజుగా ట్రాన్స్‌ఫార్మ్ కావడానికి టైమ్ ఇచ్చారు. చందు నన్ను నమ్మాడు. చందూతో నాకిది మూడో సినిమా. ప్రతి సినిమాకి నన్ను కొత్తగా చూపిస్తాడు. దేవిశ్రీ ప్రసాద్ ట్రూ రాక్‌స్టార్. ‘నమో నమః శివాయ...’ పాట రిహార్శల్స్ జరుగుతున్నపుడు దేవి సెట్‌కి వచ్చి ఎంతో ఎనర్జీ ఇచ్చాడు. కెమేరామేన్ శ్యామ్ సార్, ఇతర యూనిట్ అందరికీ థ్యాంక్స్. శ్రీకాకుళం నుంచి వచ్చిన మత్స్యకారులందరూ వేదిక మీదకు రావాలి.వీళ్లు లేకుండా ఈ తండేల్ రాజు క్యారెక్టరే లేదు. చందు నాకు ఈ కథను ఓ ఐడియాలా చెప్పాడు. చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఆ తర్వాత మచ్చలేశంకి తీసుకెళ్లాడు. అక్కడ వీళ్లందర్నీ కలిశాను. అక్కడి మట్టి వాసన, వాళ్ల లైఫ్ స్టయిల్, ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలు, తీసుకునే ఆహారం అన్నీ తెలుసుకున్నాను. అప్పుడు తండేల్ రాజు పాత్ర ఎలా చేయాలో ఐడియా వచ్చింది. పాకిస్తాన్ లో సంవత్సరం పైన జైల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వచ్చారు కదా... మళ్లీ ఎందుకు వేటకి వెళుతున్నారని వీళ్లని అడిగితే... ‘మాకు ఇదే వచ్చు. సముద్రం తప్ప వేరే తెలియదు’ అన్నారు. వాళ్ల ఆడవాళ్లల్లో భయం కనిపించింది. ఇది నిజమైన హ్యూమన్ ఎమోషన్ . వీళ్లే నా రియల్ లైఫ్ హీరోలు. వ్యక్తులుగా వీళ్లు నన్ను ఎంతో ఇన్ స్పైర్ చేశారు. ఈ సినిమా చూసి మీరంతా సంతోషపడతారని అనుకుంటున్నాను’’ అని అన్నారు.‘‘ట్రైలర్, టీజర్, సాంగ్స్... ఏది చూసినా సినిమాలో మంచి ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తోంది. నాగచైతన్య – సాయిపల్లవి స్క్రీన్‌పై రియల్ పీపుల్లా కనిపిస్తున్నారు. ఇలా ఆర్టిస్టులు కనిపించిన సినిమాలన్నీ హిట్స్‌గా నిలిచాయి. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కోసం హీరోయిన్ గా సాయిపల్లవిని సంప్రదించాలని కో ఆర్డినేటర్‌తో మాట్లాడాను. ఆమె స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించరని చెప్పారు. భవిష్యత్‌లో అలానే ఉంటారా? అనిపించింది. ఆమె ఇప్పటికీ అలానే ఉన్నారు’’ అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ‘‘నాగచైతన్య, సాయిపల్లవి, అరవింద్‌గారు, చందు... ఇలాంటి టీమ్ అంతా కష్టపడి చేసిన మూవీ తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో మాట్లాడతాను’’ అన్నారు చందు మొండేటి.సాయిపల్లవి మాట్లాడుతూ– ‘‘తండేల్ రాజుగా నాగచైతన్యగారు మారిన తీరు స్ఫూర్తిదాయకం. చందూగారికి ఫుల్ క్లారిటీ ఉంటుంది. దర్శకుడు సందీప్‌గారు ఎవరితో మాట్లాడారో నాకు తెలియదు. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో షాలినీ బాగా యాక్ట్ చేశారు. ఎవరు చేయాల్సిన మూవీ వారికే వెళ్తుంటుంది. ‘తండేల్’ వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందింది. ఈ ఘటనలో భాగమైన మహిళలందరూ ధైర్యవంతులు’’ అన్నారు.దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారి ‘ఢమరుకం’ కోసం శివుడు పాట చేశాను. ఇప్పుడు చైతూ కోసం శివుడి పాట చేశాను. తండ్రీకొడుకులతో శివుడి పాట చేయడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘రాజు–సత్యల మధ్య జరిగే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కార్తీక్ రాసిన మంచి కథకు చందు మంచి స్క్రీన్ ప్లే ఇచ్చారు’’ అన్నారు బన్నీ వాసు. 2018లో శ్రీకాకుళం నుంచి గుజరాత్‌కు వలస వెళ్లిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ బోర్డర్ క్రాస్ చేసి, అక్కడి కోస్టుగార్డులకు బందీలుగా చిక్కారు. ఈ ఘటన ఆధారంగా ‘తండేల్’ తీశారు. ఈ ఘటనలో నిజంగా భాగమైన వారిలో తండేల్ రామారావు, రాజు, కిశోర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని, వారి అనుభవాలను పంచుకున్నారు.‘‘ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో మాట్లాడతాను. ఇక ఈ ఈవెంట్‌కు బన్నీ (అల్లు అర్జున్) వస్తారని అనుకున్నాం. కానీ ఫారిన్ నుంచి వచ్చాడు. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్‌తో రాలేక΄ోయాడు’’ అని తెలిపారు అల్లు అరవింద్. -
సందీప్ రెడ్డి వంగా చిత్రంలో సాయి పల్లవి.. కానీ..?
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన 'తండేల్' చిత్రం ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది యాక్టర్లను చూసిన వెంటనే ఇష్టం కలుగుతుంది. వారితో పరిచయం లేకపోయినా వాళ్ళని ప్రత్యేకంగా ఇష్టపడతాం. నేను కేడి చిత్ర షూటింగ్ సమయంలో నాగ చైతన్యని తొలిసారి చూశాను. అప్పటి నుంచే చైతు అంటే నాకు చాలా ఇష్టం అన్నారు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ప్రేమమ్ చిత్రం దగ్గర నుంచి సాయి పల్లవి నటన అంటే నాకు ఇష్టం. నా అర్జున్ రెడ్డి చిత్రం మొదట తనని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నాను. కేరళలో సాయి పల్లవిని అప్రోచ్ కావాలని ఒక వ్యక్తిని అడిగాను. అతను స్టోరి ఎంటని అడిగితే లవ్ డెస్ట్రోయ్ అయిన వ్యక్తి స్టోరి అని, ఇది చాలా రొమాంటిక్ మూవీ అని చెప్పా. దానికి సమాధానంగా అతడు వెంటనే.. సార్ ఆ అమ్మాయి గురించి మీరు మరచిపోండి. ఎందుకంటే సాయి పల్లవి కనీసం స్లీవ్ లెస్ డ్రెస్ కూడా వేసుకోదు అని తనతో చెప్పినట్లు సందీప్ రెడ్డి తెలిపారు. ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఒక పెద్ద ఆఫర్ వస్తే గ్లామర్ రోల్స్ చేద్దాం అని అనుకుంటారు. మొదట్లో అలా ఉండి ఆ తర్వాత అవకాశాల కోసం మారిపోతారు. కానీ సాయి పల్లవి వచ్చి ఇన్నేళ్లైనా ఆమె మాత్రం మారలేదు. అది సాయి పల్లవి గొప్పతనం అంటూ సందీప్ రెడ్డి ప్రశంసించారు. -
బన్నీ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ‘తండేల్’ టీమ్.. నో ఎంట్రీ!
‘సంధ్య థియేటర్’ ఘటన తర్వాత అల్లు అర్జున్ సినిమా ఈవెంట్లకు దూరంగా ఉన్నాడు. ఇంతవరకు ఏ సినిమా ఫంక్షన్‌కి కానీ, ఇతర ఈవెంట్స్‌కి కానీ రాలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ‘తండేల్’(Thandel) ప్రీరిలీజ్‌కి వస్తున్నాడు. ఈ వార్త వినగానే బన్నీ ఫ్యాన్స్ ఆనందంతో చిందులేశారు. తమ అభిమాన నటుడిని నేరు చూడొచ్చని చాలా మంది ఫ్యాన్స్ భావించారు. కానీ వారందరికి ‘తండేల్’ టీమ్ షాకిచ్చింది. ఈ రోజు(ఫిబ్రవరి 2) సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్‌కి పబ్లిక్‌కి ఎంట్రీ లేదని ప్రకటించింది. ‘కొన్ని కారణాల రీత్యా దురదృష్టవశాత్తు ‘ఐకానిక్ తండేల్ జాతర’ను చిత్రబృందం సమక్షంలో మాత్రమే నిర్వహిస్తున్నాం. ఈవెంట్లోకి పబ్లిక్కు ఎలాంటి ప్రవేశం లేదు. ప్రసార మాధ్యమాల వేదికగా ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ వీక్షించి ఎంజాయ్ చేయండి’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత బన్నీ హాజరవుతున్న తొలి ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడతారా? అని అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. . నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallav)i జంటగా నటించిన చిత్రం తండేల్. ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్ సాంగ్సే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.తండేల్ కథేంటి?శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి కథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. అయితే సినిమా మొత్తంలో పాకిస్తాన్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతా కథంతా రాజు-బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతుందట. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
సాయి పల్లవికి అనారోగ్యం.. బెడ్ రెస్ట్ అవసరమన్న వైద్యులు!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) అనారోగ్యానికి గురయ్యారు. కొన్ని రోజులుగా ఆమె విపరీతమైన జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారని తండేల్(Thandel) సినిమా దర్శకుడు చందు మొండేటి తెలిపారు. అంతేకాదు ఆమెకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని, అందుకే ఆమె ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రాలేదని చెప్పాడు. అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సాయి పల్లవి మినహా మిగతా యూనిట్ అంతా హాజరైంది. దీంతో నేచురల్ బ్యూటీ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఈవెంట్‌కి రాకపోవడానికి గల కారణం ఏంటని ఆరా తీశారు. సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ చందునే క్లారిటీ ఇచ్చాడు.బెడ్ రెస్ట్‘సాయి పల్లవి కొన్ని రోజులుగా జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని చెప్పారు. అందుకే ముంబైలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి రాలేకపోయింది. ఆమె ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మళ్లీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది’ అని చందూ మొండేటి తెలిపారు.ఆమీర్ చేతుల మీదుగా హిందీ ట్రైలర్తండేల్ హిందీ ట్రైలర్‌ని బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండేల్ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఫెంటాస్టిక్ గా ఉంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. దేవిశ్రీ చేసిన డింకచిక డింకచిక సాంగ్ నా ఫేవరెట్. బేసిగ్గా నాకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదు కానీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. తండేల్ ట్రైలర్ లో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ వున్నాయి. చైతన్య ఫెంటాస్టిక్ యాక్టర్. ఐడియల్ కోస్టార్. తనతో వర్క్ చేయడం చాలా అమెజింగ్ ఎక్స్ పీరియన్స్’ అన్నారు.నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘సాయి పల్లవి తో చేసిన లవ్ స్టోరీ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు చూసి చాలా బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు తండేల్ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు లాంచ్ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. అరవింద్ గారితో చేసిన 100% లవ్ నా కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్. తండేల్’ కూడా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాను.చందు చాలా అద్భుతంగా సినిమాని తీశాడు. దేవిశ్రీ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. మీరంతా ఫిబ్రవరి 7న సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
శోభితతో పెళ్లి.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా: నాగచైతన్య
లవ్‌స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి మరోసారి జత కట్టిన మూవీ తండేల్ (Thandel Movie). కార్తికేయ 2 ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీపై నిర్మాత అల్లు అరవింద్ ధీమాగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా..వైజాగ్ తనకు స్పెషల్ అని.. అక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే అన్నాడు. వైజాగ్ తనకు ఎంత క్లోజ్ అంటే వైజాగ్ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని.. ఇప్పుడు తన ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే ఉందన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చై.. వైజాగ్ రూలింగ్ పార్టీ గురించి మాట్లాడాడు. వైవాహిక జీవితం చాలా బాగుంది. ప్రస్తుతం లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. మా పెళ్లయి కొన్ని నెలలే అవుతోంది. ఈ సమయంలో ఇద్దరం ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క మాకంటూ ప్రత్యేక సమయం కేటాయించుకుంటున్నాం. (చదవండి: 93% సినిమాలు ఫ్లాప్.. వెయ్యి కోట్ల నష్టం.. నిర్మాతల కంట రక్తకన్నీరు!)అదే మమ్మల్ని ఒకటిగా..వర్క్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. మా ఇద్దరికీ ఉన్న సేమ్ లక్షణాల్లో ఇదీ ఒకటి. అలాగే సినిమాపై మాకున్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. జీవితంపైనా మాకు ఎంతో ఆసక్తి ఉంది. అదే మమ్మల్ని ఒకటిగా ముందుకు నడిపించింది. మాకు ట్రావెలింగ్ అంటే కూడా ఇష్టం. భవిష్యత్తులో శోభిత, నేను ఒకే సినిమాలో కలిసి నటిస్తామా? లేదా? అన్నది నేనిప్పుడే చెప్పలేను. మంచి స్క్రిప్ట్ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాం అన్నాడు.గతంలో నాగచైతన్య.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత పొరపచ్చాలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చాడు. గతేడాది హీరోయిన్ శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: పెళ్లి తర్వాత నా భర్తనే మారిపోయాడు: వరలక్ష్మి శరత్ కుమార్ -
‘తండేల్’ సెన్సార్ టాక్.. బొమ్మ అదిరిందట!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత రిలీజ్‌కు ముందే ఫుల్ పాజిటివ్ బజ్ ఏర్పాటు చేసుకున్న సినిమా తండేల్(Thandel Movie). నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallav)i జంటగా నటించిన ఈ చిత్రానికి ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్ సాంగ్సే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. మరి సెన్సార్ సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. బ్లాక్ బస్టర్ పక్కా!సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదని, 'బ్లాక్ బస్టర్' పక్కా అని సెన్సార్ సభ్యులు తీర్పు ఇచ్చారట. ఇప్పటికే ఈ చిత్రంపై నిర్మాత అల్లు అరవింద్ ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. 'తండేల్'కు అల్లు అరవింద్ 100 కు వంద మార్కులు ఇచ్చారని గీతా ఆర్ట్ సంస్థ తెలిపింది. ఇక నాగచైతన్య కెరీర్లో భారీ కలెక్షన్స్ తెచ్చే చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాత బన్నీ వాసు మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు.నిడివి ఎంతంటే.. తండేల్ సినిమాను చాలా క్రిస్పీగా కట్ చేశారట. అనవసరం సన్నివేశాలు లేకుండా కథను మాత్రమే ఎలివేట్ చేసేలా సీన్స్ ఉంటాయట. యాడ్స్‌తో కలిసి 2:32 గంటల నిడివి మాత్రమే ఉంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుందని చిత్రబృందం తెలుపుతోంది.తండేల్ కథేంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి కథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. అయితే సినిమా మొత్తంలో పాకిస్తాన్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతా కథంతా రాజు-బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతుందట. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
300 కోట్ల బడ్జెట్.. హీరోగాసూర్య లేదా చరణ్, నో చెప్పిన దర్శకుడు!
చిత్ర పరిశ్రమలో విజయానికే విలువెక్కువ. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే..ఫ్లాప్ ఇస్తే మరో చాన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది. గతంలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా సరే.. ప్లాప్ డైరెక్టర్‌తో సినిమా తీసేందుకు నిర్మాతలు కాస్త ఆలోచిస్తారు. అదే ఒక్క హిట్ పడితే చాలు కోట్ల అడ్వాన్స్ ఇచ్చి మరీ బుక్ చేసుకుంటారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా మాక్కూడా బ్లాక్ బస్టర్ అందించని ఎంత డబ్బులైనా ఇచ్చేస్తారు. కార్తికేయ 2 తర్వాత దర్శకుడు చందూ మొండేటి(Chandoo Mondeti )కి కూడా ఇలాంటి ఆఫరే వచ్చిందట. 300 కోట్ల బడ్జెట్ ఇస్తా.. రామ్ చరణ్, సూర్య లాంటి హీరోలను సెట్ చేస్తా భారీ సినిమా చెయ్ అని నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) అన్నారట.కానీ ఆయన మాత్రం తండేల్(Thandel) కథనే చేస్తానని, అది కూడా నాగచైతన్యతోనే చేస్తానని చెప్పడంతో వారి ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా చందు మొండేటి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.‘కార్తికేయ-2 తర్వాత గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయాల్సి వచ్చినపుడు.. తండేల్ కథ నా ముందుకు వచ్చింది. అయితే అల్లు అరవింద్, బన్నీవాసు ఆ కథ సినిమాకు సెట్ కాదని అనుకున్నారు. కార్తికేయ-2ను నేను హ్యాండిల్ చేసిన తీరు గురించి చెబుతూ పెద్ద సినిమా చేద్దామన్నారు. ‘మన దగ్గర సూర్య ఉన్నాడు, అలాగే రామ్ చరణ్ సైతం అందుబాటులో ఉన్నాడు. 300 కోట్ల దాక బడ్జెట్ ఇస్తాం. భారీ సినిమా ప్లాన్ చెయ్’ అని చెప్పారు. నీ నేను మాత్రం ‘తండేల్’ కథే ఎందకు చేయకూడదు అన్నాను. ఆ కథే నాకు ఎక్కువ నచ్చి దాన్నే చేయడానికి రెడీ అయ్యాను’ అని చందూ మొండేటి అన్నారు.ఇక తండేల్ విషయానికొస్తే.. కార్తికేయ 2 తర్వాత చందు దర్శకత్వం వహించిన చిత్రమిది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే: నాగచైతన్య
నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘తండేల్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను వైజాగ్‌లోని రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌లో నిర్వహించింది చిత్రం యూనిట్. ఈ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మన పుష్పకా బాప్ అల్లు అరవింద్‌గారు. ఏడాదిన్నర నుంచి నా లైఫ్‌లో నిజమైన తండేల్ ఆయనే. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన గైడెన్స్ చాలా విలువైనది. ఏ సినిమా రిలీజ్ తర్వాత అయినా వైజాగ్ టాక్ ఏంటి? అని కనుక్కుంటాను. ఎందుకంటే... వైజాగ్‌లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయి (శోభిత)ని ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఇప్పుడు... నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగే. ‘తండేల్’(Thandel) సినిమాకు వైజాగ్‌లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేకపోతే ఇంట్లో నా పరువు పోతుంది (సరదాగా). దద్దా... గుర్తెట్టుకో... ఈ పాలి యాట గురి తప్పేదేలేదేస్. ఫిబ్రవరి 7న రాజులమ్మ జాతరే’’ అని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథను సినిమాగా తీశాం. నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ కథను చందు మొండేటి అత్యద్భుతంగా మలిచి, చాలా బాగా తీశారు. సాయిపల్లవిగారు అద్భుతంగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చించిపడేశాడు’’ అని తెలిపారు. తండేల్ ట్రైలర్ విషయానికొస్తే.. నాతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరి నోటా ఉత్తరాంధ్ర యాస బాగా పలికింది. తండేల్ అంటే లీడర్ అనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. ‘రాజూ.. ఊళ్లో అందరూ మన గురించి ఏటేటో మాటాడుకుంటున్నారు రా’ అనే సాయి పల్లవి డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్లు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు.. ఆమెకు దూరమవుతూ ఉంటాడు. కానీ ఓసారి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. అక్కడితో ట్రైలర్ కాస్తా లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి వైపు వెళ్తుంది. మా దేశంలోని ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది.. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని రెండు పవర్ ఫుల్ డైలాగులు చైతూ నోటి వెంట వినిపిస్తాయి. మొత్తం ట్రైలర్ ఒక పవర్ ప్యాక్డ్గా ప్రేక్షకులను తొలిరోజే థియేటర్లకు రప్పించేలా ఉంది. -
అలా జరగకపోతే నా పరువు పోతుంది: నాగచైతన్య కామెంట్స్ వైరల్
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో చైతూ సరసన సాయిపల్లవి హీరోయిన్ నటించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైజాగ్‌లో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య అభిమానులతో మాట్లాడారు.నాగచైతన్య అభిమానులతో మాట్లాడుతూ.. 'వైజాగ్ నాకు ఎంతో క్లోజ్. నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్ అమ్మాయే. అభిమానులకు నా చిన్న రిక్వెస్ట్. వైజాగ్‌లో తండేల్ మూవీ కలెక్షన్స్ షేక్ అయిపోవాలి. లేదంటే ఇంట్లో నా పరువు పోతుందని' సరదాగా మాట్లాడారు. కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు.తండేల్ కథేంటంటే..శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటన్నదే తండేల్ మూవీ కథ. వైజాగ్ లో కలెక్షన్స్ రాకపోతే పెళ్ళాం ముందు నా పరువు పోతుంది - Yuvasamrat #NagaChaitanya #SobhitaDhulipala #Thandel #TeluguFilmNagar pic.twitter.com/izN3MSaue2— Telugu FilmNagar (@telugufilmnagar) January 28, 2025 -
బాక్సాఫీస్ వద్ద తండేల్ మరో ఉప్పెన అవుతుందా?
-
హైలేస్సో హైలెస్సా.. సాయిపల్లవి డ్యాన్సే హైలెట్!
ఎవరైనా అందంగా నాట్యం చేస్తే.. అచ్చం నెమలిలా నాట్యం చేసినట్లుందని పొగుడుతాం. అంటే నెమలిని మించిన నాట్యం ఎవరు చేయలేరని అర్థం.నెమలి నాట్యాన్ని వర్ణించడం చాల కష్టం. నెమలి నాట్యం చేయడం చూస్తే.. ప్రకృతిలో ఇంతకు మించిన అందమైన దృశ్యం ఉంటుందా అని అనిపించక మానదు. అలాంటి అనుభూతి తండేల్(Thandel) సినిమా ద్వారా పొందుతారట. సాయి పల్లవి(Sai Pallavi ), నాగచైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘హైలెస్సో హైలెస్సా... నీవైపే తెరచాపని తిప్పేసా...’ అంటూ సాగే పాట ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. అందులో సాయి పల్లవి వేసే స్టెప్పు ఒకటి బాగా వైరల్ అయింది. పాట ఎంత వినసొంపుగా ఉందో.. ఆ డ్యాన్స్ కూడా అంతే చూడ ముచ్చటగా ఉంది. అయితే లిరికల్ వీడియోలో చూసింది తక్కువేనట. ఆ పాటలో సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులేసిందట.నెమలిని గుర్తు చేస్తుందిఇప్పుడు ఎక్కడ చూసిన హైలెస్సో హైలెస్సా..పాటే వినిపిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ మెస్మరైజ్ వాయిస్‌తో వేరే స్థాయికి తీసుకెళ్లారు. ఈ పాటలో సాయి పల్లవి వేసిన హుక్ స్టెప్ అయితే నెక్ట్స్ లెవెల్ అనే చెప్పాలి. మెలికలు తిరుగుతూ సాయి పల్లవి చేసిన డాన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్లో వచ్చే మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఆమె తన బాడీని కదిలించింది. అయితే లిరికల్ వీడియోలో చూసింది చాలా తక్కువేనట. మొత్తం పాటలు దాదాపు ఒక నిమిషం పాటు సాయి పల్లవి నాన్‌స్టాప్‌గా డ్యాన్స్ చేస్తుందట. ఆమె వేసిన స్టెప్పులు నెమలి నాట్యాన్ని గుర్తు చేస్తుందని నిర్మాత బన్నీవాసు చెబుతున్నాడు. లవ్‌స్టోరీలో కూడా సాయి పల్లవి ఇలాంటి నెమలి స్టెప్పులు వేసింది. మళ్లీ తండేల్‌లో కూడా అలాంటి డాన్సే చేసింది. సాయి పల్లవి నెమలిలా మెలికలు తిరిగుతూ డాన్స్ చేస్తుంటే చూడముచ్చటగా ఉంది.రెండోసారి.. నాగచైతన్య, సాయి పల్లవి తొలిసారి లవ్‌స్టోరీ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం..2021లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ తండేల్ సినిమా కోసం ఒకటయ్యారు.కార్తికేయ--2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలవడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ట్రైలర్‌కి వేళాయె
నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’ ట్రైలర్ విడుదలకు వేళయింది. ఈ నెల 28న ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, నాగచైనత్య కొత్త లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘లవ్ స్టోరీ’ (2021) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జోడీగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందిన చిత్రం ‘తండేల్’. లవ్ ఎలిమెంట్స్‌తోపాటు మంచి యాక్షన్ కూడా ఉంటుంది. తండేల్ రాజుపాత్రలో నాగచైతన్య అద్భుతమైన నటన చూస్తారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా...’పాటలు మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: శ్యామ్‌దత్.. -
నాగచైతన్య ‘తండేల్’ HD మూవీ స్టిల్స్
-
హైలెస్సో హైలెస్సా
‘హైలెస్సో హైలెస్సా...’ అంటూ ఆడి పాడేస్తున్నారు నాగచైతన్య (Naga Chaitanya) , సాయిపల్లవి. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జోడీగా నటించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘హైలెస్సో హైలెస్సా... నీవైపే తెరచాపని తిప్పేసా...’ అంటూ సాగే మూడో పాటని గురువారం రిలీజ్ చేశారు.శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటని శ్రేయా ఘోషల్, నకాష్ అజీజ్ పాడారు. ‘‘మోస్ట్ ఎవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘తండేల్’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘బుజ్జి తల్లి..’, ‘నమో నమః శివాయ...’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. వండర్ఫుల్ మెలోడీస్‌ని కంపోజ్ చేయడంలో మాస్టర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా ‘హైలెస్సో హైలెస్సా..’ అంటూ సాగే మరొక లవ్ మెలోడీని కంపోజ్ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
అక్కినేని వారి మరో పెళ్లి సందడి.. శోభిత- నాగచైతన్యకే ఆ బాధ్యతలు..! (ఫోటోలు)
-
నాగచైతన్య పాన్ ఇండియా ప్రాజెక్ట్.. కీలక పాత్రలో లాపతా లేడీస్ నటుడు!
అక్కినేని నాగచైతన్య పెళ్లి తర్వాత తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల షూటింగ్లో చైతూ వంట వండుతున్న వీడియోలు వైరలయ్యాయి. అంతేకాకుండా నమో నమశ్శివాయ అనే రెండో లికరికల్ సింగిల్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.అయితే ఈ మూవీ తర్వాత చైతూ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. ఎన్సీ24 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పనులు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు. విరూపాక్ష మూవీతో హిట్ కొట్టిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు.విలన్‌గా లపట్టా లేడీస్ నటుడు..అయితే ఈ మూవీలో లాపతా లేడీస్ యాక్టర్ స్పార్ష్ శ్రీవాస్తవ నటిస్తారని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. అమిర్ ఖాన్- కిరణ్ రావు తెరకెక్కించిన లాపతా లేడీస్ గతేడాది విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో తన అమాయకమైన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు శ్రీవాస్తవ. దీంతో నాగ చైతన్య రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో శ్రీవాస్తవ విలన్‌గా చేయనున్నారని ఇటీవల ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కాగా.. గతంలో చైతూ పుట్టిన రోజు సందర్భంగా ఎన్సీ24 మూవీ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో చైతూ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తారని కూడా తెలుస్తోంది. ఈ మూవీలో నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
క్షమాపణలు చెప్పిన వేణుస్వామి
తెలంగాణ మహిళా కమిషన్‌కి జ్యోతిష్యుడు వేణుస్వామి క్షమాపణలు చెప్పారు. హీరో నాగచైతన్య-శోభితలపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారదకు రాతపూర్వకంగా లేఖను అందజేశారు.అసలేం జరిగిందంటే?సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణుస్వామి(Venu Swamy).. అక్కినేని హీరో నాగచైతన్య-శోభితల వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ..వారిద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పారు. త్వరలోనే ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని వేణుస్వామి తేల్చి చెప్పారు. వారిద్దరు విడిపోతారంటూ జోస్యం చెప్పడంపై అక్కినేని అభిమానులతో పాటు మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. వేణు స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమెన్ కమిషన్‌కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ ఉమెన్ కమిషన్ వేణు స్వామికి నోటీసులు పంపించి వివరణ కోరింది. మహిళా కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా కమిషన్ ముందే హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణ మహిళా కమిషన్ మరోసారి వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది. బహిరంగ క్షమాపణలుమహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేయడంతో వేణుస్వామి తప్పనిసరి పరిస్థితుల్లో వేణుస్వామి మంగళవారం ఉమెన్ కమిషన్ కార్యాలయానికి హాజరై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.అంతేకాదు బహిరంగ క్షమాపణలు చెబుతున్నాంటూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరళ్ల శారదకు ఓ లేఖను అందజేశాడు. వేణు స్వామి క్షమాపణలు స్వీకరించిన మహిళా కమిషన్.. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని హెచ్చరించింది. సమంత విషయంలోనూ..సెలబ్రేటీల పర్సనల్ విషయాలపై జ్యోతిష్యాలు చెబుతూ వేణుస్వామి ఫేమస్ అయ్యాడు. గతంలో సమంత విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. నాగచైతన్య, సమంత విడిపోతారని ముందే చెప్పాడు. సమంత, చైతు విడాకులు తీసుకున్న తర్వాత వేణు స్వామి మరింత ఫేమస్ అయ్యాడు. అయితే ఆ తర్వాత తరచూ సినీ ప్రముఖులపై జోతిష్యం చెప్పడంతో వేణుస్వామిపై విమర్శలు వచ్చాయి. -
మొట్టమొదటిసారి చేపల పులుసు వండిన నాగచైతన్య (ఫోటోలు)
-
కట్టెలపొయ్యి మీద చేపల పులుసు వండిన నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో చై మత్య్సకారుడిగా నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం నాగచైతన్య.. మత్య్సకారుల జీవితాల్ని దగ్గరి నుంచి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు. ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అని షూటింగ్ ప్రారంభంలో మత్య్సకారులకు మాటిచ్చాడట! అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు.చేపల పులుసు వండిన చైకట్టెల పొయ్యిపై మట్టి పాత్ర పెట్టాడు. అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు, ఉప్పు, కారం దట్టించాడు. తర్వాత నూనె వేసి, కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు. మధ్యలో కాస్తంత రుచి చూసి బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నాడు. చివర్లో కొత్తిమీర చల్లి.. చేపల పులుసు సిద్ధం చేశాడు. మత్య్సకారులకు ఆ చేపల పులసుతో భోజనం పెట్టాడు. తన చేతి వంట బాగుందా? అని అడగ్గా తిన్నవారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు.ఏమీ అనుకోవద్దంటూ..అయితే తన వంటపై తనే డౌట్ పడ్డ చై.. చేపల పులుసు వండటం ఇదే తొలిసారి. బాగోలేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతూ చెప్పాడు. మత్య్సకారులతో కలిసి చేపల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే తండేల్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చదవండి: -
డార్క్ గ్రీన్ గౌనులో స్టైలిష్‌గా,ఫ్యాషన్ క్వీన్‌లా శోభిత ధూళిపాళ
నటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) తన ష్యాషన్ స్టైల్‌తో అందర్నీ మరోసారి మెస్మరైజ్ చేసింది. ఇటీవల అక్కినేని నాగచైతన్యతో వివాహ వేడుకలలో సంప్రదాయ చీరలు, నగలతో అందంగా మురిపించిన శోభిత తాజాగా ఒక జ్యువెల్లరీ యాడ్‌లో మెరిసింది. ఈ సందర్భంగా ఫ్యాషన్ పట్ల తనకున్న అభిరుచిని చెప్పకనే చెప్పింది.డీప్ గ్రీన్ ఫ్రాక్, డైమండ్ ఆభరణాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఫ్యాషన్ అండ్ స్టైల్‌కు పర్యాయపదంగా తన లుక్‌తో అభిమానులను ఫిదా చేసింది. రోహిత్ గాంధీ. రాహుల్ ఖన్నా కలెక్షన్లో డీప్ గ్రీన్ డ్రెస్‌ను ఎంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది. స్క్వేర్ నెక్లైన్, షోల్టర్ స్ట్రాప్స్, అలాగే ముందు భాగంలో, వీ ఆకారంలో డీప్ నెక్లైన్కట్ డ్రెస్‌ను ఎంచుకుంది. ఇక నగల విషయానికి వస్తే మల్టీ-స్ట్రాండ్ చోకర్ నెక్లెస్ , వేలాడే చెవిపోగులు, గాజులు, రింగ్ ధరించింది. డైమండ్ ఆభరణాలు హైలైట్ అయ్యేలా, జుట్టును అందంగా ముడి వేసుకుంది. మరీ ముఖ్యంగా క్యాట్ ఐలైనర్ ఆమె ముఖానికి మరింత అందాన్నిచ్చింది.కాగా శోభితా ధూళిపాళ టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన వీరిద్దరి వివాహం సాంప్రదాయ పద్దతిలో ఘనంగా జరిగింది. అంతకుముందు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందర్నీఆశ్చర్యపరిచింది. తెలుగు సాంప్రదాయాలు, కట్టుబట్టు ఇష్టం అని చెప్పే శోభిత పసుపు కొట్టింది మొదలు, మూడు ముళ్ల వేడుక దాకా ప్రతి సందర్భంలోనూ తనదైన శైలితో శోభితా ఆకట్టుకుంది.అంతేకాదు వీరికి పెళ్లి తరువాత వచ్చిన తొలి సంక్రాంతి పండుగను కూడా ఈ జంట ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దంపతులిద్దరూ ఇద్దరు పట్టు వస్త్రాలు ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేసింది శోభితా . ఈ ఫోటోల్లో రెడ్ కలర్ గోల్డెన్ అంచు శారీలో అందంగా ముస్తాబైంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. -
ఓ బుజ్జి తల్లీ వీడియో సాంగ్ విడుదల
‘గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీ ఊసందక నాప్రాణం... నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం...’’ అంటూ భావోద్వేగంతో సాగుతుంది ‘బుజ్జి తల్లీ..’ పాట. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా ప్రేమకథా చిత్రం ‘తండేల్’.చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘బుజ్జి తల్లీ...’ పాట వీడియోను శనివారం విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను జావేద్ అలీ పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ‘తండేల్’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. -
నమో నమః శివాయ సాంగ్: చై, సాయిపల్లవి తాండవం చూశారా?
యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'తండేల్' (Thandel Movie). చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ "బుజ్జి తల్లి" సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ "నమో నమః శివాయ" లిరికల్ (Namo Namah Shivaya Lyrical Song) వీడియోను రిలీజ్ చేశారు. మహాదేవ్ నామస్మరణతో కొనసాగిన ఈ శివ శక్తి పాట బ్రీత్ టేకింగ్ మాస్టర్ పీస్. డ్యాన్స్, డివొషన్, గ్రాండియర్ విజువల్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.జొన్నవిత్తుల సాహిత్యం శివుని సర్వశక్తి, ఆధ్యాత్మికత సారాంశాన్ని అద్భుతంగా చూపించింది. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడాడు. హరిప్రియ గాత్రం పాటకు మరింత అందాన్ని తెచ్చింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరొక హైలైట్. డ్యాన్స్ ద్వారా భక్తి గాథను అందంగా వివరించడం బాగుంది. 'లవ్ స్టోరీ' మూవీలో తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగ చైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) ఈ పాటలో మెస్మరైజ్ చేశారు. నాగ చైతన్య పవర్ ఫుల్ ప్రెజెన్స్, సాయి పల్లవి అత్యద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ మూవీకి షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చదవండి: మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు -
నాగచైతన్య తండేల్ మూవీ.. న్యూ ఇయర్ అప్డేట్ వచ్చేసింది
అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తోన్న చిత్రం 'తండేల్'. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నేచరల్ బ్యూటీ సాయిపల్లవి ఈ మూవీ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.జనవరి 4న రెండో సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నమో నమశివాయ అంటూ సాగే పాటను జనవరి 4వ తేదీన సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను షేర్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అనే క్రేజీ సాంగ్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. ఈ లవ్ సాంగ్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. సింగర్ జావెద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.కాగా.. తండేల్ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Happy New Year 2025 ✨Let us begin the year with the divine chants of Mahadev 🔱#Thandel second single #NamoNamahShivaya - The ShivShakti Song out on January 4th at 5:04 PM ❤️🔥A 'Rockstar' @ThisIsDSP divine trance on @adityamusic 🔥🔊#ThandelonFeb7th pic.twitter.com/WcdhAUxWex— Thandel (@ThandelTheMovie) January 1, 2025 -
బుజ్జితల్లి క్రేజ్.. తండేల్ సాంగ్ అరుదైన ఘనత..!
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'తండేల్'. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. తాజాగా ఈ పాట అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఏకంగా 40 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో చైతూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తండేల్ రిలీజ్ ఎప్పుడంటే?ఈ సినిమా విడుదల డేట్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల మరో తేదీకి తండేల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలో ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.కానీ మొదట డిసెంబర్ 28న 'తండేల్' విడుదల చేయాలనుకుంటే కుదరలేదు. అయితే, సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని ప్లాన్ చేస్తే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీలో ఉండటంతో విరమించుకున్నట్లు నిర్మాత అరవింద్ పేర్కొన్నారు. అలా ఫైనల్‌గా ఫిబ్రవరి 7న వస్తున్నట్లు ప్రకటించారు.తండేల్ కథేంటంటే..నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. Biggest chartbuster of the season is playing in every headphone and heart ❤🔥'Love Song of the Year' #BujjiThalli from #Thandel hits 40 MILLION+ VIEWS, 450K+ LIKES on YouTube and 610K+ REELS on Instagram ✨▶️ https://t.co/52ZLxEJe7IA 'Rockstar' @ThisIsDSP's soulful melody… pic.twitter.com/OVi5KpZaRm— Thandel (@ThandelTheMovie) December 30, 2024 -
రివైండ్-2024: గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ ఇండస్ట్రీని వెంటాడిన వివాదాలు, కేసులు
-
Year Ender 2024: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సీనీ తారలు వీళ్లే
‘శ్రీరస్తూ శుభమస్తు... శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం... ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’... ‘పెళ్ళి పుస్తకం’ చిత్రంలోని ఈ పాట తెలుగింటి పెళ్లి వేడుకల్లో వినబడుతుంటుంది. 2024లో పెళ్లితో ‘కల్యాణం... కమనీయం...’ అంటూ తమ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించిన స్టార్స్ చాలామందే ఉన్నారు. ఇక ఏయే తారలు ఏయే నెలలో, ఏ తేదీన పెళ్లి చేసుకున్నారనే విశేషాలు తెలుసుకుందాం.ఫిబ్రవరిలో... నార్త్, సౌత్‌లో హీరోయిన్గా ఓ మంచి స్థాయికి వెళ్లిన ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ ఉత్తరాది ఇంటి కోడలు అయ్యారు. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో 21న ఆమె ఏడడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. పెద్దల సమ్మతితో గోవాలో పెళ్లి చేసుకున్నారు. మార్చిలో... పంజాబీ భామ కృతీ కర్బందా, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో మార్చి 15న ఏడు అడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. గుర్గావ్లో వీరి వివాహం జరిగింది. ⇒ సౌత్, నార్త్‌లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోని 23న వివాహం చేసుకున్నారు. పదేళ్లు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. జూన్‌లో... నటుడు అర్జున్ పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్యా అర్జున్, తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, నటుడు ఉమాపతిల వివాహం చెన్నైలో జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఐశ్వర్య–ఉమాపతి పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె, హీరోయిన్ సోనాక్షీ సిన్హా, బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్ ఏడడుగులు వేశారు. 23న వీరి వివాహం ఘనంగా జరిగింది. జూలైలో... వరలక్ష్మీ శరత్ కుమార్ తన ప్రేమికుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడైన నికోలయ్ సచ్దేవ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో థాయ్‌ల్యాండ్‌లో 2న వీరి పెళ్లి జరిగింది. ఆగస్టులో... ‘రాజావారు రాణిగారు’ (2019) సినిమాతో తెలుగులో హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. రీల్ లైఫ్‌లో ప్రేమికులుగా నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్‌లో భార్యాభర్తలయ్యారు. ఆ మూవీ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో కర్నాటకలోని కూర్గ్‌లో 22న కిరణ్–రహస్య వివాహం చేసుకున్నారు. సెప్టెంబరులో... హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. వీరి వివాహం 15న చెన్నైలో ఘనంగా జరిగింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో మేఘా ఆకాశ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపడంతో ఏడడుగులు వేశారు. ⇒ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో సిద్ధార్థ్, హీరో యిన్ అదితీరావు హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తొలుత తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో మార్చి 27న, ఆ తర్వాత రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో సెప్టెంబరు 16న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. నవంబరులో... ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పెళ్లి పీటలెక్కారు. డాక్టర్ ప్రీతీ చల్లాతో 11న ఆయన ఏడడుగులు వేశారు. ‘వేదం, గమ్యం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు క్రిష్. ప్రీతీతో ఆయన వివాహం హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ⇒ తెలుగు చిత్ర పరిశ్రమలో గాయకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి 15న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ⇒ నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న సుబ్బరాజు పెళ్లి పీటలెక్కారు. స్రవంతితో ఆయన ఏడడుగులు వేశారు. 26న వీరి వివాహం జరిగింది. డిసెంబరులో.. హీరో అక్కినేని నాగచైతన్య– హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక పెళ్లి పందరిలో వీరిద్దరూ ఏడడుగులు వేశారు. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా చైతన్య–శోభితల పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత పెళ్లి పీటల వరకూ వచ్చింది. పెద్దల అంగీకారంతో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ⇒ ‘కలర్ ఫొటో’ (2020) సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావుతో కలిసి ఏడడుగులు వేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమలలో 7న వీరి వివాహం జరిగింది. ‘కలర్ ఫొటో’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన చాందినీ రావుతో ఆయన పెళ్లి జరగడం విశేషం. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ⇒ ‘నువ్వేకావాలి, ప్రేమించు’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సాయికిరణ్. ఆ తర్వాత సీరియల్స్ వైపు వెళ్లిన ఆయన బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెల 9న ఆయన స్రవంతి అనే సీరియల్ ఆర్టిస్ట్‌ని వివాహం చేసుకున్నారు. ⇒ మహానటిగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సొంతం చేసుకున్నారు కీర్తీ సురేష్ తన చిన్న నాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌తో ఈ నెల 12న ఏడడుగులు వేశారు. వీరిద్దరి మధ్య 15 ఏళ్లుగా స్నేహం, ప్రేమ కొనసాగుతోంది. ఇరు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో గోవాలో వీరి వివాహం జరిగింది. ⇒ ‘మత్తు వదలరా, మత్తు వదలరా 2’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీసింహా (సంగీతదర్శకుడు కీరవాణి తనయుడు). ఆయన వివాహం నటుడు మురళీమోహన్ మనవరాలు మాగంటి రాగతో దుబాయ్‌లో 14న జరిగింది. ⇒ ఇలా 2024లో ఎక్కువమంది తారలు వివాహబంధంలోకి అడుగుపెట్టం విశేషం. -
కాశీలో శివశక్తి
నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కాగా ‘తండేల్’ లోని శివశక్తి పాటను ఈ నెల 22న కాశీలోని డివైన్ ఘాట్స్‌లో లాంచ్ చేయనున్నాను.‘‘శ్రీకాకుళం గొప్ప సాంస్కృతిక వారసత్యాన్ని, పురాతన శ్రీముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించేలా ఈ పాట ఉంటుంది. సంగీతం పరంగా, విజువల్‌గా ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. పండగను వైభవంగా జరుపుకుంటున్న అనుభూతిని కలిగించే ఈ జాతర పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. -
నాగ చైతన్య... శోభితా లవ్ స్టోరీ..
-
శోభిత పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫొటోలు)
-
‘భయం’తో బాక్సాఫీస్‌పై దాడి.. కాసుల వర్షం కురిసేనా?
హారర్ సినిమాలు ఏ మాత్రం ఆడియన్స్‌కు కనెక్ట్ అయినా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. అందుకే కథాబలం ఉన్న భయపెట్టే కథలు తమ దగ్గరకి వస్తే చేసేందుకు భయపడరు హీరోలు, హీరోయిన్లు. కథలోని భయాన్నే భరోసాగా చేసుకుని, ప్రస్తుతం కొందరు నటీనటులు హారర్ సినిమాలు చేస్తున్నారు. ఆ స్టార్స్ చేస్తున్న హారర్ చిత్రాల గురించి తెలుసుకుందాం.రాజా డీలక్స్ థియేటర్లో రాజా సాబ్ ప్రభాస్ కటౌట్ చాలు బాక్సాఫీస్ భయపడటానికి. కానీ వెండితెరపై ప్రభాస్ భయపడితే ఎలా ఉంటుంది? ఆడియన్స్‌ను ప్రభాస్ భయపెడితే ఎలా ఉంటుంది? అనేది ‘రాజా సాబ్’ సినిమాలో చూడొచ్చు. ‘ప్రేమకథా చిత్రమ్’తో ఆడియన్స్‌ని నవ్విస్తూనే భయపెట్టి, బాక్సాఫీస్ కాసులను కురిపించిన దర్శకుడు మారుతి ‘రాజా సాబ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో సీరియస్ హారర్ సీన్స్ ఉన్నాయని సమాచారం. ‘రాజా డీలక్స్’ అనే థియేటర్లో జరిగే హారర్ సీన్స్ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్‌నగర్ భోగట్టా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉంది. దీంతో వీలైనంత తొందరగా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హారర్ తరహా జానర్లో ప్రభాస్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్‌లోను నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇప్పుడు సినిమాలోనూ... నాగచైతన్య కెరీర్లో ఇప్పటివరకూ హారర్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు లేవు. అయితే హారర్ టచ్ ఉన్న ‘ధూత’ అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ సిరీస్‌కు వీక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఓ పర్ఫెక్ట్ హారర్ మూవీతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ సినిమాతో దర్శకుడు కార్తీక్‌వర్మ దండు ఆడియన్స్‌ను బాగా భయపెట్టి, బాక్సాఫీస్ వద్ద డబ్బులు రాబట్టుకున్నారు. ఈ దర్శకుడు తెరకెక్కించనున్న కొత్త సినిమాలో నాగచైతన్య హీరోగా నటించనున్నారు. ‘విరూపాక్ష’ను మించిన హారర్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని, కథకు కాస్త మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఓ ఎత్తైన పర్వతం పైకి ఎక్కుతున్న నాగచైతన్యను ఓ పక్షి కన్నులో నుంచి చూపించారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్‌కు ఆసక్తి నెలకొంది. ఈ నెలాఖర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. నాగచైతన్య కెరీర్‌లోని ఈ 24వ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. కొరియన్ కనకరాజు లవ్‌స్టోరీ, యాక్షన్ జానర్స్‌లో సినిమాలు చేశారు వరుణ్ తేజ్. అయితే ఈసారి కొత్తగా ప్రయత్నించాలని వరుణ్ తేజ్ డిసైడ్ అయ్యారు. అందుకే ఓ హారర్ కామెడీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్. ‘రన్ రాజా రన్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ వంటి చిత్రాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ సినిమా కథనం రాయలసీమ నేపథ్యంలో ఉంటుంది. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది పీరియాడికల్ ఫిల్మ్‌గా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. మార్చిలో చిత్రీకరణ అంటున్నారు కాబట్టి, వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఊహించవచ్చు. చీకటి–వెలుగుల మధ్యలో...! చీకటి వెలుగుల మధ్య దాగి ఉన్న ఓ మిస్టరీని చేధించే పనిలో పడ్డారట బెల్లకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా కౌశిక్ పెగుళ్లపాటి దర్శకత్వంలో ఓ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది. సాయి శ్రీనివాస్ కెరీర్‌లోని ఈ 11వ చిత్రంలో ‘కిష్కింధపురి’ అనే కల్పిత ప్రాంతం ఉంటుందని, అక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయని, ఈ నేపథ్యంలో ఓ హారర్ కథను కౌశిక్ రెడీ చేసుకున్నారనీ భోగట్టా. ఈ సినిమాకు ‘కిష్కింధపురి’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చు. రహస్యాలను కనిపెట్టే యువతిగా∙ఈ ఏడాది ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘బాకు’) వంటి హారర్ సినిమాతో ఆడియన్స్‌ను ఆలరించారు తమన్నా. ఈ సినిమాలో ఓ పాజిటివ్ ఆత్మగానే కనిపించారు. అలాగే ఈ ఏడాదే విడుదలైన హిందీ బ్లాక్‌బస్టర్ హారర్ ఫిల్మ్ ‘స్త్రీ 2’లోనూ మెరిశారు తమన్నా. కానీ ఆమె పాత్రకు హారర్ టచ్ లేదు. ఓ స్పెషల్ సాంగ్‌తోనే సరిపోయింది. కాగా ప్రస్తుతం తమన్నా ‘ఓదెల 2’ అనే మైథలాజికల్ హారర్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో నాగసాధువు శివశక్తి పాత్రలో కనిపిస్తారు తమన్నా. హెబ్బా పటేల్, వశిష్ఠ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ పతాకాలపై డి. మధు ఈ నిర్మిస్తున్నారు. మరోవైపు గాంధారి కోటలోని రహస్యాలను కనిపెట్టే యువతి పాత్రలో నటించారు హన్సిక. ‘శ్రీ గాంధారీ’ సినిమా కోసం హన్సిక ఈ పాత్ర చేశారు. హారర్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్ ఇతర కీలక పాత్రధారులు. ఆర్. కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇంకా సత్యం రాజేశ్ ‘పొలిమేర 3’, తిరువీర్ ‘మసూద 2’, వంటి హారర్ సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయని తెలుస్తోంది. మరికొందరు యువ దర్శకులు కూడా హారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. - ముసిమి శివాంజనేయులు -
నాగ చైతన్య మరదలినే పెళ్లి చేసుకుంటే బాగుండేది కదా!
-
2024లో ఇంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారా? (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత రిసెప్షన్లో మెరిసిన చైతూ - శోభిత.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మోడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు టాలీవుడ్ సినీతారలు హాజరయ్యారు.తాజాగా వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి జంటగా కనిపించారు చైతూ- శోభిత. ప్రముఖ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురి వివాహానికి హాజరయ్యారు. ముంబయిలో జరిగిన ఆలియా కశ్యప్ వెడ్డింగ్ రిసెప్షన్లో జంటగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. #SobhitaDhulipala and #NagaChaitanya, who recently tied the knot, attend #AaliyahKashyap and #ShaneGregoire’s reception as newlyweds. ✨#FilmfareLens pic.twitter.com/P5Dw8fmqA4— Filmfare (@filmfare) December 11, 2024 -
అనురాగ్ కశ్యప్ కూతురి పెళ్లి పార్టీలో.. నాగ చైతన్య,శోభిత (ఫొటోలు)
-
సమంత సంచలన పోస్ట్.. టార్గెట్ అతనేనా..?
-
అక్కినేనివారి కోడలు.. ఆనందంలో స్టెప్పులు అదుర్స్.. వీడియో వైరల్!
ఇటీవలే అక్కినేనివారి ఇంట పెళ్లి వేడుక జరిగింది. ఈనెల 4న అక్కినేని హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ మెడలో మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిపెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ తారలు పాల్గొన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను నాగార్జున తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు.అయితే పెళ్లికి ముందు శోభిత డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. పెళ్లి కూతురిగా ముస్తాబయ్యే సమయంలో తెలుగు సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలోని బ్లాక్‌బస్టర్ బ్లాకబస్టరే అంటూ సాగే పాటకు తనదైన స్టైల్లో చిందులు వేసింది. This video of #SobhitaDhulipala proves happiest brides are the prettiest #NagaChaitanya #viralvideo #GalattaIndia pic.twitter.com/9MUHLG0K35— Galatta India (@galattaindia) December 10, 2024 -
పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత
శోభిత... అక్కినేని ఇంటి కోడలైంది. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యని ఇటీవలే పెళ్లి చేసుకుంది. తర్వాత భర్త, మామతో కలిసి శ్రీశైల మల్లిఖార్జునుడిని కూడా దర్శించుకుంది. గత కొన్నిరోజులుగా పెళ్లి పనులతో బిజీగా ఉన్న శోభిత.. కాస్త తీరిక దొరకడంతో భర్త, పెళ్లి తర్వాత జీవితం గురించి మాట్లాడింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్)'చైతన్య.. నా జీవితంలోకి రావడం అదృష్టం. చైతూ సింప్లిసిటీ, అందరితో గౌరవంగా ఉండే విధంగా నాకు ఎంతో నచ్చేశాయి. ప్రేమలో ఆత్మీయత ఎక్కువగా ఉండాలనేది చైతూ నుంచి నేను నేర్చుకున్నాను. పెళ్లి తర్వాత శ్రీశైలం వెళ్లి శివుడిని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతనిచ్చింది. చిన్నప్పటి నుంచి నా జీవితంలో దైవభక్తి భాగమే. టైమ్ దొరికినప్పుడల్లా కూచిపూడి, భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తుంటాను. వంట విషయంలోనూ ప్రాక్టీస్ ఉంది. ఆవకాయ, ముద్దపప్పు చేయడమంటే చాలా ఇంట్రెస్ట్' అని శోభిత చెప్పుకొచ్చింది.నాగచైతన్య హీరోగా నటించిన 'తండేల్'.. రాబోయే ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. ఈ నెల నుంచి 'విరూపాక్ష' దర్శకుడు తీసే కొత్త సినిమాలోనూ చైతూ నటించబోతున్నాడు. శోభిత విషయానికొస్తే ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లు ఏవి లేనట్లు కనిపిస్తున్నాయి. కొన్నాళ్ల పాటు పెళ్లి జీవితాన్ని ఆస్వాదించి ఆ తర్వాత తిరిగి సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తుందేమో!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) -
మోస్ట్ పాపులర్ లిస్ట్ లో శోభిత తర్వాతే సమంత
-
మల్లిఖార్జుని సన్నిధిలో నూతన దంపతులు చై- శోభిత (ఫోటోలు)
-
పిల్లలు పుడితే ఆ పని చేస్తా..: నాగచైతన్య
నాగచైతన్య- శోభిత ధూళిపాళ తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో పదిలపర్చుకున్నారు. ఇన్నాళ్లు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట ఇకమీదట భార్యాభర్తలుగా జీవితప్రయాణం చేయనున్నారు. డిసెంబర్ 4న రాత్రి అక్కినేని స్టూడియోలో వీరి వివాహం ఘనంగా జరిగింది.ఇద్దరు పిల్లలైనా ఓకే..పెళ్లి తర్వాత ఇద్దరూ జంటగా గుడికి వెళ్లి భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇకపోతే నాగచైతన్య.. దగ్గుబాటి రానా టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే! ఈ టాక్ షోలో అతడు ఎన్నో విషయాలు పంచుకున్నాడు. చై మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉండాలి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలైనా ఓకే. వారిని కార్ రేసింగ్‌కు తీసుకెళ్తా.. వాళ్లతో ఉంటూ మళ్లీ నా బాల్యంలోకి వెళ్లిపోతా.. అని చెప్పాడు.నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వే..ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్రెండ్స్ ఎందుకు లేరన్న ప్రశ్నకు.. నువ్వు ఉన్నావ్ కదా అని రానాకు బదులిచ్చాడు. ఎక్కడేం జరిగినా అన్నీ చెప్తుంటావ్.. నేను ఏ టాక్ షోకు వెళ్లినా కూడా నా ఫ్రెండ్ ఎవరంటే నీ పేరే చెప్తాను. వాళ్లేమో ఆయన నీ బంధువు కదా? అని అడుగుతుంటారు. నా బంధువు, ఫ్రెండ్ రెండూ నువ్వేనని సమాధానమిస్తుంటాను అని చై తెలిపాడు.వింతకల నిజం చేస్తానన్న చచైఈ సందర్భంగా రానా తనకు వచ్చిన ఓ వింతకల బయటపెట్టాడు. ఓ పార్టీలో చై చొక్కా విప్పేసి బార్లో డ్యాన్స్ చేస్తున్నట్లు కల వచ్చిందన్నాడు. అది విని నవ్విన చై త్వరలోనే దాన్ని నిజం చేస్తానన్నాడు. ఈ చిట్‌చాట్‌కు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్‌లో శనివారం (డిసెంబర్ 6) అందుబాటులోకి రానుంది.చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్! -
మేనమామలతో నాగచైతన్య.. దగ్గుబాటి స్పెషల్ (ఫోటోలు)
-
పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా గుడికి వెళ్లిన నాగచైతన్య-శోభిత
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే, ఈ నూతన దంపతులు కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించాలని అక్కినేని అభిమానులు, ఆత్మీయులు ఆశీర్వదించారు. పెళ్లి అయిన వెంటనే వారిద్దరూ మొదటగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.నూతన వధూవరులతో పాటు అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు అందరూ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. కొత్త దంపతులకు అర్చకులు వేదాశీర్వచనంతో పాటు ఆలయ మహాద్వారం వద్ద వారికి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రసాదాలు వారికి అందించారు. పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా చై-శోభిత కనిపించడంతో అభిమానులు భారీగా గుమికూడారు. -
కొత్త జంట చైతూ-శోభితకు ఏఎన్నార్ ఆశీర్వాదం! (ఫొటోలు)
-
శోభిత-నాగ చైతన్య పెళ్లి : అప్పుడు అలా.. ఇపుడు ఇలా!
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్ల వేడుకతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లికి వధువు శోభితా ధూళిపాళ సింపుల్ మేకప్, టెంపుల్ జ్యుయల్లరీతో బంగారు రంగు కంజీవరం ప్యూర్ గోల్డ్ జరీ చీరలో అందంగా ముస్తాబైంది. వరుడు నాగచైతన్య టెంపుల్ బోర్డర్ఉన్న పంచె (మధుపర్కం) కట్టుకొని ఎలిగెంట్ లుక్‌లో అలరించాడు. అయితే కుటుంబ వారసత్వాన్ని గౌరవిస్తూ, తన జీవితంలో కీలకమైన శుభకార్యానికి తాతగారి పంచెను కట్టుకున్నాడంటూ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. తాజా నివేదికల ప్రకారం నాగ చైతన్య శోభిత ధూళిపాళతో తన పెళ్లికి తన తాత పంచెను ధరించాడుట. కుర్తా-పైజామాతో పాటు ముహూర్తం సమయానికి తనతాత టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంతగ అక్కినేని నాగేశ్వరావు తెల్లటి పంచెను ఎంచుకున్నాడట. అలా అక్కినేని కుటుంబ వారసత్వాన్ని పాటించాడు అంటున్నారు ఫ్యాన్స్. (మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్, నాగ్ భావోద్వేగ సందేశం)తాజాగా సోషల్‌మీడియాలో వీరి పెళ్లి ఫోటోలతో పాటు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతాతో చైతన్య మొదటి పెళ్లినాటి ఫోటోలు, సమంత ఎంగేజ్మెంట్కు, పెళ్లికి కట్టుకున్న చీర వివరాలు కూడా మరోసారి వార్తల్లో నిలిచాయి. అప్పుడు సమంతా అమ్మమ్మ చీరను మురిపెంగా కట్టుకుంటే, ఇపుడు చైతన్య తాత పంచెను కట్టుకున్నాడు అంటున్నారు ఫ్యాన్స్. కాగా నాగ చైతన్యతో పెళ్లి సందర్బంగా సమంత ‘చే’ అమ్మమ్మ చీరను ప్రత్యేకంగా రీడిజైన్ చేయించుకుంది. అలాగే చే, సామ్ లవ్ స్టోరీతో ఆధారంగా వారి ఎంగేజ్మెంట్ చీరను తీర్చిదిద్దుకున్న సంగతి తెలిసిందే. -
మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్, నాగ్ భావోద్వేగ సందేశం
వివాహం అనేది ప్రతీఅమ్మాయికి ఒక అందమైన అనుభూతి. బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రో ఛ్చారణల మధ్య మెడలో పవిత్రమైన మూడు ముళ్లూ పడే సందర్భంకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తారు. ఈ క్షణాల్లో భావోద్వేగాన్ని అదుపుచేసుకోవడం చాలా కష్టం. అక్కినేని వారి ఇంట పెళ్లి సందడిలో ఇలాంటి దృశ్యాలు నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచాయి.సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ, నాగచైతన్య మూడుముళ్ల వేడుకకు సంబంధించిన ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో (డిసెంబర్ 4, 2024న) అంగరంగ వైభవంగా ముగిసాయి. ఈ సందర్భంగా నాగ చైతన్య , తన మెడలో మంగళసూత్రాన్ని కడుతున్న సందర్భంలో శోభిత ఎమోషనల్ అయింది. మంగళసూత్రాలను తనివితీరా చూసుకుంటూ ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకుంది. ఈ దృశ్యాలు అభిమానులను హత్తుకున్నాయి. <Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐 This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024మంగళ సూత్ర ధారణ సందర్భంగా ముత్తయిదువలు ఈలలు వేస్తూ, తెగ అల్లరి చేశారు. ఇది చూస్తూ అలాగే నాగ చైతన్య తండ్రి, నాగార్జున మురిపెంగా నవ్వుకున్నారు. . నాగార్జునతో పాటు వెంకటేష్ దగ్గుబాటి, దగ్గుబాటి సురేష్ బాబుతోపాటు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని కూడా ఈలలతో తెగ ఎంజాయ్ చేసిన దృశ్యాలు ఆకట్టు కుంటున్నాయి. అలాగే చే శోభిత పెళ్లిపై ఒక ప్రకటన చేశారు నాగార్జున. ట్విటర్లో ఒక భావోద్వేగ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. "ఈ రోజు మాపై కురిపించిన అమితమైనఆశీర్వాదాలకు, ప్రేమకు కృతజ్ఞతలు. శోభిత-చే కలిసి ఈ అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం ఒక ప్రత్యేకమైన , భావోద్వేగ క్షణం. నా ప్రియమైన చేకి అభినందనలు, డియర్ శోభిత- మా కుటుంబంలోకి స్వాగతం. నువ్వు ఇప్పటికే మా జీవితాల్లో ఎనలేని సంతోషాన్ని నింపావు" అంటూ ట్వీట్ చేయడం విశేషం. పసుపు బట్టల్లో , శోభిత , చే పెళ్లి కళ్ల ఉట్టిపడేలా కనిపిస్తున్న ఫోటోలు వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. -
వైభవంగా నాగచైతన్య - శోభిత వివాహం..ప్రముఖుల సందడి (ఫోటోలు)
-
తాళికట్టే శుభవేళ.. శోభిత- నాగచైతన్య పెళ్లి వీడియో వైరల్!
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి ముగిసింది. వేదమంత్రాల సాక్షిగా నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీ తారలు సందడి చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను అక్కినేని నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు.తాజాగా శోభిత- నాగచైతన్య పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శోభిత మెడలో చైతూ తాళి కడుతున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో నాగార్జునతో పాటు వెంకటేశ్ కూడా కనిపించారు. ఇది చూసిన ఫ్యాన్స్ కొత్త జంటకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. Once again Happy marriage life @chay_akkineni @sobhitaD 💐💐💐Happy for you #SoChay #Chayo #SoChayWedding pic.twitter.com/tLPP4xARqG— Яavindra (@Nag_chay_akhil) December 5, 2024 -
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన నాగచైతన్య- శోభిత ధూళిపాళ (ఫోటోలు)
-
నాగచైతన్య-శోభిత వివాహం.. నాగార్జున స్పెషల్ ట్వీట్
హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇన్నాళ్లు ప్రేమపక్షులుగా ఉన్న ఈ జంట నేడు (డిసెంబర్ 4న) భార్యాభర్తలుగా ప్రమోషన్ పొందారు. బుధవారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో 8.13 గంటలకు చై.. శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇరుకుటుంబ సభ్యులు సహా బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు అల్లు అరవింద్ దంపతులు, కీరవాణి, దర్శకుడు శశికిరణ్ తిక్క, అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటి, టి సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, రానా దగ్గుబాటి, సుహాసిని, అడివి శేష్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదితరులు హాజరయ్యారు.నా మనసు సంతోషంతో నిండిపోయిందికుమారుడి వివాహం గురించి నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పెళ్లి మా కుటుంబానికి చాలా గొప్ప క్షణం. చై, శోభిత అన్నపూర్ణ స్టూడియోస్‌లో వారి ప్రయాణాన్ని ప్రారంభించడం.. కుటుంబం, స్నేహితుల ప్రేమతో నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతోంది. ఇది ప్రేమ, సాంప్రదాయం, ఐక్యత కలగలిపిన వేడుక, ఇది మా నాన్న కోసం నిలబడిన విలువలను ప్రతిబింబిస్తుంది. శోభితను మా కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నువ్వు ఆల్రెడీ మా జీవితాల్లో అంతులేని ఆనందాన్ని తీసుకొచ్చావు అని రాసుకొచ్చాడు. Watching Sobhita and Chay begin this beautiful chapter together has been a special and emotional moment for me. 🌸💫 Congratulations to my beloved Chay, and welcome to the family dear Sobhita—you’ve already brought so much happiness into our lives. 💐 This celebration holds… pic.twitter.com/oBy83Q9qNm— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 4, 2024 చదవండి: ఆదిత్య 369 సీక్వెల్ ఫిక్స్.. హీరోగా బాలకృష్ణ కాదు! -
ఇన్నాళ్లకు బయటకొచ్చిన చై-శోభిత డేటింగ్ పిక్స్
తారలు ప్రేమలో పడితే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. జంటగా విహారయాత్రలకు వెళ్లినా, విందుకు వెళ్లినా, ఏం చేసినా సోషల్ మీడియాలో లీకైపోతుంటుంది. మరికొద్ది గంటల్లో భార్యాభర్తలు కాబోతున్న శోభిత ధూళిపాళ- నాగచైతన్య కూడా డేటింగ్ చేసుకునేటప్పుడు ఎంచక్కా ట్రిప్పులకు వెళ్లారు. డిన్నర్ డేట్స్‌కు వెళ్లారు. చై-శోభిత డేటింగ్ పిక్స్ కానీ ఎక్కడా తమ ఫోటోలు రిలీజ్ కాకుండా వీలైనంతవరకు జాగ్రత్తపడ్డారు. మీడియా గుచ్చిగుచ్చి అడిగినా మౌనం వహించారే తప్ప తమ ప్రేమ కహానీని బయటపెట్టలేదు. ఇన్నాళ్లకు నాగచైతన్య-శోభితల డేటింగ్ పిక్స్ బయటకు వచ్చాయి. అదెలాగంటే.. హీరో రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ద రానా దగ్గుబాటి షోకి చై అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెనయ్యాడు.లైఫ్ అలా ఉందన్న చైలైఫ్ ఎలా ఉందన్న ప్రశ్నకు చై.. శుభ్రంగా, బాగానే ఉందన్నాడు. పనిలోపనిగా ఈ ప్రేమజంట కలిసున్న కొన్ని ఫోటోలను ప్రోమోలో చూపించారు. అందులో ఒకదాంట్లో చై.. శోభిత బ్యాగు పట్టుకుని నిల్చున్నాడు. మరో ఫోటోలో శోభిత.. ప్రియుడి భుజంపై చేయేసి దర్జాగా నిలుచుంది. ఇక ఈ వినోదాత్మక ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ శనివారం (డిసెంబర్ 7న) అందుబాటులోకి రానుంది. View this post on Instagram A post shared by Rana Daggubati (@ranadaggubati) చదవండి: నేడు హీరో నాగచైతన్య-శోభితల వివాహం -
నేడు హీరో నాగచైతన్య-శోభితల వివాహం
అక్కినేని ఫ్యామిలీలో మరికొన్ని గంటల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య.. బుధవారం రాత్రి 8:13 గంటల ముహూర్తానికి శోభిత మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోని ఈ వేడుక జరగనుంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్)నాగార్జున-లక్ష్మిల కుమారుడైన నాగచైతన్య.. ధూళిపాళ శాంతకామాక్షి, వేణుగోపాలరావుల కుమార్తె అయిన శోభితతో ఏడడుగులు నడవబోతున్నాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగనుంది. టాలీవుడ్ నుంచి కూడా మెగా, దగ్గుబాటి కుటుంబాలు రాబోతున్నాయి. రాజమౌళి, మహేష్, ప్రభాస్ తదితర స్టార్ హీరోలు కూడా ఈ పెళ్లికి విచ్చేయనున్నారు.(ఇదీ చదవండి: నిఖిల్‌ని ఓడించిన ప్రేరణ.. సారీ చెప్పిన గౌతమ్) -
పెళ్లి సందడి : పెళ్ళికూతురుగా మారిన శోభిత.. ఫోటోలు వైరల్
-
శోభిత ధూళిపాళ పెళ్లి దుస్తుల డిజైనర్ ఎవరో తెలుసా..?
పెళ్లిళ్ల సీజన్ ఒక్కసారిగా హాట్‌గా మారడానికి సిటీలో జరుగుతున్న హీరో అక్కినేని నాగ చైతన్య శోభితా ధూళిపాళల వివాహం ఓ రీజన్‌గా చెప్పొచ్చు. సిటీలో చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న టాప్ సెలబ్రిటీల వివాహ వేడుక కావడంతో వీరి పెళ్లి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. మరోవైపు వధూవరుల దుస్తుల డిజైన్ చేసే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారా అని సిటీ ఫ్యాషన్ సర్కిల్ ఆసక్తిగా ఎదురు చూసింది. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. శోభిత స్వయంగా తానే డిజైనర్‌గా మారినంత పనిచేసి మరీ తమ పెళ్లి దుస్తుల్ని శ్రద్ధగా రూపొందించుకోవడం విశేషం. తన పెళ్లి వేడుకల్లో ధరించే దుస్తుల కోసం శోభిత ఏ ఫ్యాషన్ డిజైనర్నీ సంప్రదించడం లేదట. తన పెళ్లి దుస్తుల కోసం, ఆమె తల్లితో కలిసి షాపింగ్ చేశారనీ, బంగారు జరీ వర్క్‌తో కూడిన కంజీవరం చీరను ఎంపిక చేసుకున్నారని, మరో చీరను ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక నేత పనివారి ద్వారా తయారు చేయించారని సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి పొందిన పొందూరు ఖాదీ చీరను కూడా ఆమె తీసుకున్నారట. ఈ దుస్తులను డిసెంబర్ 4న తన పెళ్లి వేడుకలో ఆమె ధరించనున్నారు.దానితో పాటే చైతన్య కోసం కూడా ఒక మ్యాచింగ్ జతను ఎంచుకున్నారట. గతంలో మోడల్‌గా ర్యాంప్‌పై మెరిసిన శోభితకు ఫ్యాషన్ రంగంతో సన్నిహితంగా మెలిగిన అనుభవం ఉంది. అయితే ఆమె తన సంప్రదాయ నిశ్చితార్థ వేడుక కోసం మనీష్ మల్హోత్రా చీరను ధరించారు. మరోవైపు పెళ్లి వేడుకల్లో.. డిజైనర్ ఆభరణాలకు బదులుగా.. శోభిత వారసత్వంగా వచ్చిన ఆభరణాలను ధరిస్తున్నారు. వేడుక సందర్భంగా తన తల్లి, అమ్మమ్మ నుంచి వారసత్వంగా పొందిన ఆభరణాలతో తనను తాను అలంకరించుకున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా భావోద్వేగాన్ని పంచుకున్నారు. -
'చివాస్ లక్స్ కలెక్టివ్' ఈవెంట్లో తారల సందడి (ఫొటోలు)
-
కొత్త కోడలు గురించి తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన 'అమల అక్కినేని'
తెరమీద పోషించిన పాత్రల సంగతి అటుంచితే, ‘నిత్య జీవితంలో తాను పోషించిన ప్రతి పాత్రా తనకు పూర్తి సంతృప్తిని అందించింది’ అని చెబుతున్నారు సీనియర్ నటి, అగ్రనటుడు అక్కినేని నాగార్జున భార్య అమల అక్కినేని. తమ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్న నేపథ్యంలో.. ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.సాక్షి: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో పాల్గొన్నారు కదా.. ఎలా అనిపించింది?అమల : ఈ సారి అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు ఐదుగురు లెజెండరీ సెంచురీ ఇయర్‌ను ఇఫీ నిర్వహించింది. అదే కాకుండా ప్రారంభ కార్యక్రమం నుంచి ఇఫీ బాగా నచ్చింది. బొమన్ ఇరానీ లెజెండ్స్ గురించి ఎంతో బాగా చెప్పారు. క్లాసిక్స్ నుంచి న్యూ టాలెంట్స్ దాకా, అలాగే ప్రపంచ సినిమాని, ఇండియన్ సినిమాని ఒకే చోట చేర్చడం అద్భుతం. ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. మనం అంతా మన చిన్న ప్రపంచంలో బిజీగా ఉంటాం. ఇలాంటివి జరిగితేనే ఎన్నో మననం చేసుకోగలుగుతాం.. మరెన్నో తెలుసుకోగలుగుతాం.. సాక్షి: మీ ‘అన్నపూర్ణ’ స్టూడెంట్స్‌కి కూడా ఇఫీలో చోటు దక్కిందా..?అమల : ఎస్.. గతంలో ఎన్నో చోట్ల మా విద్యార్థుల చిత్రాలను ప్రదర్శించారు. కానీ ఇఫీలో మా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకి అవకాశం రావడం తొలిసారి. సంస్థ డైరెక్టర్‌గా ఇది నాకు చాలా సంతోషాన్ని అందిస్తోంది.సాక్షి: సీనియర్ నటిగా సినిమా రంగంలోకి వచ్చే యువతులకు ఏం చెబుతారు? అమల : ఇప్పుడు కొందరు నిర్మాతలు మంచి పాత్రల్ని మహిళలకు ఇస్తున్నారు. అయినా మహిళలంటే కెమెరా ముందు కేవలం నటిగా మాత్రమే కాదు టెక్నీషియన్స్ కావచ్చు, ఫిల్మ్ మేకర్స్‌గా కూడా కావచ్చు. సినిమా పరిశ్రమలోకి ఎటువంటి జంకూ లేకుండా రమ్మంటూ అమ్మాయిలకు నేను ధైర్యాన్ని ఇస్తున్నాను.సాక్షి: నిత్య జీవితంలో మీరు పోషించిన పాత్రలు ఎలా అనిపించాయి.. అమల : నేను పోషించిన ప్రతి పాత్రా నన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. ఇంట్లో భార్యగా, కోడలిగా, తల్లిగా.. ఇవన్నీ నాకు ప్రత్యేకమైన పాత్రలు. అద్భుతమైన ప్రయాణాన్ని అందించాయి. అలాగే గడపదాటితే.. బ్లూ క్రాస్ ద్వారా జంతు సంరక్షణ.. మరోవైపు భవిష్యత్తు సినిమా రంగం కోసం యువతను తీర్చిదిద్దడం.. అన్నీ మధురమైనవి మాత్రమే కాక నేనేంటో నాకు చూపించాయి. సాక్షి: కొత్త కోడలికి ఏవైనా సలహా లాంటివి.. అమల : ఆమె చాలా టాలెంటెడ్. చాలా మెచ్యూర్డ్ మహిళ. ఆ అమ్మాయికి నేను సలహా అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వనక్కర్లేదు. ఆమె తప్పకుండా ఒక మంచి భార్యగా మంచి జీవితాన్ని ఆస్వాదించాలని నా కోరిక. మీ పాఠకులు కూడా కొత్త జంట భవిష్యత్తు బాగుండాలని ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నా. సాక్షి: పిల్లల విజయాలా? విద్యార్థుల విజయాలా? ఏవి ఎక్కువ? అమల : సినిమా రంగంలో నా పిల్లల విజయాలు సంతోషాన్ని అందిస్తాయనేది నిజమే, కానీ నిజం చెప్పాలంటే.. నా విద్యార్థుల విజయాలు అంతకన్నా ఒకింత ఎక్కువ ఆనందాన్నే పంచుతాయి.. పంచుతున్నాయి. -
శోభిత మంగళస్నాన వేడుక.. ఆభరణాలకు ప్రత్యేక సెంటిమెంట్!
మరో మూడు రోజుల్లో అక్కినేనివారి కోడలు కానుంది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ఇప్పటికే నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్న శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. అయితే శోభిత ఇంట్లో ప్రీ-వెడ్డింగ్ సంబురం మొదలైంది. సంప్రదాయ పద్ధతిలో రాత వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగానే శోభిత ధూళిపాళ్లకు మంగళస్నానం చేయించారు. ఈ వేడుకల్లో శోభిత తన కుటుంబ సంప్రదాయ పద్ధతులను పాటించారు.శనివారం జరిగిన మంగళస్నానం వేడుకల్లో శోభితా ధూళిపాళ్ల తన కుటుంబ సంప్రదాయంగా వస్తున్న ఆభరణాలను ధరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన రాత వేడుకలో తన తల్లి, అమ్మమ్మల నగలు ధరించింది. ఈ వేడుకలో పసుపుతో స్నానం చేయించడం మన తెలుగువారి సంప్రదాయంలో ముఖ్యమైన వేడుక. పెళ్లికి ముందు జరిగే ఈ వేడుకలో ఆచారం ప్రకారం ఎనిమిది దిక్కుల దేవతలకు ప్రార్థనలు చేస్తారు. ఈ ఆచారం పెళ్లికి ముందు వధువును శుద్ధి చేసి ఆశీర్వదిస్తుందని నమ్ముతారు.అన్నపూర్ణ స్టూడియోస్ పెళ్లి వేడుకనాగ చైతన్య - శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట ఏర్పాటు మండపంలో వీరిద్దరు ఒక్కటి కానున్నారు. డిసెంబర్ 4న చైతన్య, శోభితల వివాహం జరగనుంది. -
కోడలు శోభితకి నాగార్జున ఆ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా?
అక్కినేని వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. రెండు రోజుల క్రితం మంగళస్నానాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలని స్వయంగా శోభితనే ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మరోవైపు పెళ్లి కోసం ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అదే టైంలో కాబోయే కోడలికి అక్కినేని ఫ్యామిలీ ఇవ్వబోయే బహుమతుల ఇవేనంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)నాగచైతన్య-శోభిత గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబరు 4న అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలోనే వివాహం జరగనుంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి మెగా, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు రాజమౌళి లాంటి అతికొద్ది మందే హాజరుకానున్నారని టాక్.రీసెంట్గా నాగార్జున.. రూ.2 కోట్లు విలువైన లెక్సెస్ కారు కొన్నారు. అయితే ఇది శోభితకి బహుమతిగా ఇవ్వడం కోసమే కొన్నారనే అనుకుంటున్నారు. దీనితో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాల్ని కూడా శోభితకు అక్కినేని ఫ్యామిలీ బహుమతిగా ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ధనుష్‌తో వివాదం.. విఘ్నేశ్ శివన్ మిస్సింగ్!) -
నాగచైతన్య-శోభితల వయసు గురించి గూగుల్‌లో వెతుకుతున్న నెటిజన్స్
టాలీవుడ్ నటుడు నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల పెళ్లిపీటలు ఎక్కనున్నారు. డిసెంబర్ 4న వారి వివాహం ఘనంగా జరగనుంది. ఇదిలాఉండగా, వారిద్దరి వయసుకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతుంది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా వారి పెళ్లి జరగనుంది. ఇప్పటికే ఇరువురి ఇంట పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కినేని అభిమానులు కూడా కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.నాగ చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని కూడా త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. తనకు కాబోయే భార్య జైనాబ్ రావ్జీ మధ్య తొమ్మిదేళ్ల గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతుంది. అఖిల్ కంటే జైనాబ్ వయసు ఎక్కువని సోషల్‌మీడియాలో ప్రచారంలో జరుగుతుంది. అయితే, ఇప్పుడు చైతూ, శోభిత వయస్సు వ్యత్యాసం గురించి సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు. వారి వయస్సుకు సంబంధించిన వివరాలను ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. నవంబర్ 23, 1986లో జన్మించిన నాగ చైతన్యకు ఇటీవలే 38 ఏళ్లు కాగా, 1992 మే 31న జన్మించిన శోభితా ధూళిపాళకు 32 ఏళ్లు. వీరిద్దరి మధ్య 6 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. వారిద్దరి మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ ప్రభావం చూపించకపోయినప్పటికి నెటిజన్లు మాత్రం వారి వివరాల గురించి ఈ మధ్య ఎక్కువ గూగుల్ చేస్తున్నారు.అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా నాగచైతన్య-శోభితల పెళ్లి జరగనుంది. డిసెంబరు 4న రాత్రి 8.13 నిమిషాలకు వారిద్దరూ ఒకటి కానున్నారు. దివంగత నటులు నాగేశ్వరరావుకు ఇష్టమైన ప్రదేశం అన్నపూర్ణ స్టూడియో కావడంతో ఈ వేడుకను అక్కడే జరిపించాలని వారు ఫిక్స్ అయ్యారు. ఈ వివాహం కోసం కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని ఆహ్వానిస్తున్నట్లు నాగ్ ఇప్పటికే ప్రకటించారు. నాగచైతన్య-శోభితల పెళ్లి సంప్రదాయమైన తెలుగు పెళ్లి కానుందని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. -
చైతూ-శోభిత పెళ్లి సందడి..
-
పెళ్లి సందడి.. నాగ చైతన్య- శోభిత మంగళస్నానాలు (ఫోటోలు)
-
చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్
అక్కినేని కుటుంబంలో పెళ్లి భాజాలు మోగాయి. నాగచైతన్య-శోభిత డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. హల్దీ (పసుపు దంచడం) ఇప్పుడు జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)నాగచైతన్య-శోభిత పెళ్లి డిసెంబర్ 4న రాత్రి 8:13 గంటలకు జరగనుంది. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు. టాలీవుడ్ నుంచి మెగా, దగ్గుబాటి ఫ్యామిలీలతో పాటు రాజమౌళి లాంటి స్టార్స్ విచ్చేయనున్నారు. చైతూ-శోభిత.. ఇద్దరూ కూడా సంప్రదాయ దుస్తుల్లోనే మెరిసిపోనున్నారు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే) -
చైతూ-శోభిత పెళ్లి.. టాలీవుడ్ నుంచి ఎవరెవరికి ఆహ్వానం!? (ఫొటోలు)
-
నయనతార దారిలో నాగ చైతన్య..? రూ. 50 కోట్లకు?
-
చైతూ-శోభిత పెళ్లి.. అవన్నీ రూమర్స్ మాత్రమే
హీరో నాగచైతన్య మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ శుభకార్యం జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలైపోయాయి. సరిగ్గా ఈ టైంలో ఓ పుకారు బయటకొచ్చింది. చైతూ-శోభిత పెళ్లిని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.50 కోట్లకు డీల్ మాట్లాడుకుందని అన్నారు. కానీ అందులో నిజం లేదు.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)చైతూ-శోభితకు సన్నిహితుడైన ఓ వ్యక్తి.. ఓటీటీ డీల్ అనేది కేవలం రూమర్ మాత్రమే అని తేల్చేశారు. పెళ్లి.. చాలా ప్రైవేట్‌గా జరగనుందని క్లారిటీ ఇచ్చారు. ఈ రూమర్లు రావడానికి ఓ కారణముంది. రీసెంట్గా 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరిట ఈమె జీవితాన్ని డాక్యుమెంటరీగా తీసి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. దీనిపై నెగిటివ్ కామెంట్సే వినిపించాయి.ఇదే డాక్యుమెంటరీలో నయన పెళ్లి వీడియోని కూడా చూపించారు. ఈ క్రమంలోనే చైతూ-శోభిత పెళ్లిని కూడా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓటీటీలో ప్రసారం చేయనుందనే రూమర్ పుట్టుకొచ్చింది. ఇదంతా అబద్ధమని తేలింది. ప్రస్తుతం చైతూ 'తండేల్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'విరూపాక్ష' దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
అక్కినేని వారి గ్రాండ్ వెడ్డింగ్.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య మరికొద్ది రోజుల్లో ఓ ఇంటివాడు కానున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి పెళ్లి వేడుక జరగనుంది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వేదికను సిద్ధం చేస్తున్నట్లు చైతూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.అయితే వీరి పెళ్లి వేడుకను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో ఓటీటీ రైట్స్‌కు ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. నాగ చైతన్య, శోభితాల వివాహ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ. 50 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల గురించిన వార్తలను అక్కినేని ఫ్యామలీ ఇంకా ధృవీకరించలేదు.అయితే ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. చైతూ- శోభిత డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకోనున్నారు. తమ పెళ్లిని సింపుల్‌గానే నిర్వహించాలని నాగ చైతన్య కోరినట్లు ఇటీవల నాగార్జున వెల్లడించారు. అందుకే పెళ్లి పనులను శోభిత, చైతూనే చూసుకుంటున్నట్లు తెలిపారు. Naga Chaitanya - Sobhita Dhulipala wedding rights bagged by netflix for a whopping ₹50 cr. pic.twitter.com/w6P4x1i9ZK— Manobala Vijayabalan (@ManobalaV) November 26, 2024 -
సెకండ్ హ్యాండ్.. అమ్మాయిలకే అలాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత
సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని ఏళ్లు గడుతుస్తున్నా..ఇప్పటికీ వీరిద్దరిపై ఏదో ఒక పుకారు వస్తున్నే ఉన్నాయి. అయితే అటు చైతూ కానీ ఇటు సామ్ కానీ వాటిని పెద్దగా పటించుకోకుండా తమ పనిలో బిజీ అయిపోయారు. ప్రస్తుతం చైతన్య ‘తండేల్’ సినిమా చేస్తున్నాడు. ఇక సమంత ఇటీవల విడుదలైన ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. నవంబర్ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత తాజాగా వరుణ్ ధావన్‌తో కలిసి సరదా చిట్ చాట్ నిర్వహించింది. అందులో తన మాజీ భర్త నాగ చైతన్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఖరీదైన బహుమతులు ఇచ్చాసమంతతో వరుణ్ ధావన్ ‘స్పైసీ రాపిడ్ ఫైర్’ నిర్వహించాడు. అందులో భాగంగా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టంలేకపోతే పచ్చిమిర్చి తినాలి. ఈ క్రమంలో వరుణ్ అడుగుతూ.. ‘నీ జీవితంలో అవసరం లేకపోయినా అత్యధిక డబ్బులు దేని కోసం ఖర్చు చేశారు?’ అని అడిగాడు.వరుణ్ ప్రశ్నకు సమంత సమాధానం చెబుబూత.. ‘నా మాజీ కోసం ఖరీదైన బహుమతులు కొనుగోలు చేశాను’ అని చెప్పింది. ‘వాటి ధర ఎంత ఉంటుంది?’అని వరుణ్ అడగ్గా.. ‘కాస్త ఎక్కువే..ఇక విషయం మాట్లాడదామా’ అంటూ ఆ టాపిక్కు అక్కడితో చెక్ పెట్టింది. సామ్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న సమంత, నాగచైతన్యలు 2017లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు. అమ్మాయిలకే ఎందుకలా?ఇక మరో ఇంటర్వ్యూలో విడాకుల సమయంలో తనపై వచ్చిన ట్రోలింగ్‌పై మాట్లాడుతూ.. ‘ ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నమైతే అమ్మాయిలనే నిందిస్తారన్నారు. విడాకుల తర్వాత అమ్మాయిలకు ఈ సమాజం కొన్ని ట్యాగులను తలిగిస్తుంది. ‘సెకండ్ హ్యాండ్,యూజ్డ్’ అనే ట్యాగ్స్‌ని అమ్మాయిలకు మాత్రమే ఎందుకు యాడ్ చేస్తారో అర్థం కాదు. కష్టాల్లో ఉన్న అమ్మాయికి ఇలాంటి మాటలు మరింత బాధను కలిగిస్తాయి. నా విడాకుల విషయంలో కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారు. అవన్నీ అబద్దాలే కాబట్టి నేను స్పందించలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుంబసభ్యులుతో పాటు చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు’ అని చెప్పారు. -
అదే ట్రెండ్ ఫాలో అవుతోన్న నాగచైతన్య- శోభిత!
మరి కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ హీరో నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. డిసెంబర్ 4న వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా శోభిత- చైతూ ఒక్కటి కానున్నారు. ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ నడుస్తోంది. తమ పెళ్లి వేడుక చిరకాల గుర్తుండిపోయేలా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే గ్రాండ్ వెడ్డింగ్‌ను ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. గతంలోనూ హన్సిక, నయనతార సైతం ఇదే ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. వీరిద్దరి బాటలోనే శోభిత- నాగచైతన్య నడుస్తున్నట్లు సమాచారం. తమ పెళ్లి వేడుకను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ పెళ్లి వేడుక స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్‌తోపాటు మరికొన్ని ఓటీటీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవల కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.కాగా.. అన్నపూర్ణ స్టూడియోస్‌లోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా వీరి పెళ్లి వేడుకను సిద్ధం చేశారు. తాతయ్య ఆశీస్సుల కోసమే ఇరు కుటుంబాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగచైతన్య వెల్లడించారు. పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరాడని నాగార్జున తెలిపారు. అందుకే పెళ్లి పనులు కూడా వారిద్దరే చూసుకుంటున్నారని పేర్కొన్నారు. -
వృథా ఖర్చు.. చైతూపై సమంత ఇన్‌డైరెక్ట్ కామెంట్స్
సమంత విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికీ పలు సందర్భాల్లో నాగచైతన్య ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మరోవైపు నాగచైతన్య కూడా మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. డిసెంబరు తొలివారం పెళ్లి జరగనుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు సమంత చేసిన ఓ కామెంట్స్ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' కోసం రెండేళ్లు పనిచేశా.. పక్కనబెట్టేశారు!)నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సామ్.. 'మయోసైటిస్' వ్యాధి బారిన తను పడ్డ విషయాన్ని బయటపెట్టింది. అలా కొన్నాళ్లపాటు చికిత్స తీసుకోవడంతో సరిపోయింది. దీంతో సినిమాలు పెద్దగా చేయలేదు. తెలుగులో చివరగా 'ఖుషి' చేసింది. ఇది వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. ఈమె చాన్నాళ్ల క్రితం చేసిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'.. ఈ నెల ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. అంతంత మాత్రంగానే ఉందనే కామెంట్స్ వినిపించాయి.ఆ సిరీస్ గురించి అందరూ చాలావరకు మర్చిపోయారు. అలాంటిది ఇప్పుడు మరోసారి ప్రమోషన్లో భాగంగా వరుణ్ ధావన్-సమంత ర్యాపిడ్ ఫైర్ ఆడిన ఓ వీడియోని అమెజాన్ ఓటీటీ రిలీజ్ చేసింది. ఇందులో చైతూ గురించి పరోక్షంగా సామ్ మాట్లాడింది. 'దేనికోసమైనా ఖర్చు చేసిన డబ్బు పనికిరాకుండా పోయిందా?' అని వరుణ్ ధావన్ అడగ్గా.. 'నా ఎక్స్ (మాజీ భర్త) ఖరీదైన గిఫ్ట్స్ కోసం' అని సమంత సమాధానమిచ్చింది. సరిగ్గా చైతూ రెండో పెళ్లికి కొన్నిరోజుల ముందు సామ్ ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: డైరెక్టర్ సుకుమార్ పనిమనిషికి ప్రభుత్వ ఉద్యోగం)When spies get spy-cy, it's very rapid, very fiery!🔥#CitadelHoneyBunnyOnPrime, watch now! pic.twitter.com/dNXZx5D55g— prime video IN (@PrimeVideoIN) November 23, 2024 -
పుట్టినరోజు ప్రత్యేకం
హీరో నాగచైతన్య పుట్టినరోజు (నవంబరు 23) సందర్భంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘తండేల్’ అప్డేట్తో పాటు మరో కొత్త చిత్రం ప్రకటన వెలువడింది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కాగా నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ‘తండేల్’ నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ‘‘వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రంలో తండేల్ రాజు పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయిన విధానం భారతీయ చిత్ర పరిశ్రమలో చిరకాలం గుర్తుండిపోతుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. డిసెంబరులో ప్రారంభం: ‘విరూపాక్ష’ (2023) దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా రూపొందనుంది. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంలో ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రం నిర్మించనున్నారు. నాగచైతన్య నటిస్తున్న 24వ సినిమా కావడంతో ‘ఎన్సీ 24’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రకటించారు. ‘‘మిథికల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రం ‘ఎన్సీ 24’. డిసెంబరులో ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శామ్ దత్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్. -
సుకుమార్ నిర్మాతగా చైతూ 'మిథికల్ థ్రిల్లర్'
నాగచైతన్య పుట్టినరోజున కొత్త సినిమాని ప్రకటించాడు. ప్రస్తుతం 'తండేల్' చేస్తున్న ఈ అక్కినేని హీరో.. ఇప్పుడు 'విరూపాక్ష' దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. మిథికల్ థ్రిల్లర్ అంటే.. మైథలాజికల్ ప్లస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ ఇది. తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు.(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో అజిత్)నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ అనుకుంటున్నారని తెలుస్తోంది. డిసెంబర్ నుంచే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఓ కన్ను.. అందులో నాగచైతన్య పర్వతంపై నిలబడ్డ ప్రతిబింబం రావడాన్ని చూపించారు.'కాంతార', 'విరూపాక్ష', 'మంగళవారం' చిత్రాలతో పాటు 'పుష్ప 2'కి కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్న అజనీష్ లోక్‌నాథ్ ఈ థ్రిల్లర్‌కు సంగీతం అందించబోతున్నాడు. హీరోయిన్లుగా మీనాక్షిని ఎంచుకున్నారు. కానీ ఆ డీటైల్స్ త్వరలో బయటపెడతారు. అలానే మిగతా విషయాలు కూడా త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?) -
ఇద్దరు దిగ్గజాల ముద్దుల మనవడు.. త్వరలో మళ్లీ పెళ్లి.. చైతూ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
IFFI : గోవా సినిమా పండుగ..సందడి చేసిన స్టార్లు (ఫొటోలు)
-
నాగచైతన్య తండేల్.. బుజ్జి తల్లి వచ్చేసింది
అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తోన్న చిత్రం తండేల్. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నేచరల్ బ్యూటీ సాయిపల్లవి ఈ మూవీ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అంటూ సాగే క్రేజీ సాంగ్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ లవ్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్‌తో కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. హీరో తన బాధలో ఉన్న ప్రియురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కథలో కీలకమైన సమయంలో ఈ సాంగ్ వస్తుంది. సింగర్ జావెద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Divided by the ocean, united by love 💕The 'Love Song of the year' is here for your to express the feelings of long distance love ✨ #Thandel First Single #BujjiThalli out now 🫶▶️ https://t.co/ZqKgx9roRiA @ThisIsDSP melody 🎼Sung by @javedali4u 🎙️Lyrics by @ShreeLyricist… pic.twitter.com/umR1JLTvHp— Geetha Arts (@GeethaArts) November 21, 2024 -
కాబోయే భార్యతో స్పెషల్ ఈవెంట్‌కు నాగచైతన్య.. ఫోటోలు వైరల్!
అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడుముళ్లు వేయనున్నారు. ఇటీవలే శోభిత తరఫు వారి పెళ్లి కార్డు కూడా రెడీ అయిపోయింది. ఇప్పటికే రెండు ఫ్యామిలీస్ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 4న వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలైనట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.అయితే శోభిత, నాగచైతన్య తాజాగా ఓ ఈవెంట్లో సందడి చేశారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ -2024) వేడుకల్లో కలిసి పాల్గొన్నారు. వీరితో పాటు అక్కినేని నాగార్జున, అమల, హీరో సుశాంత్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలను ప్రసారం చేయనున్నారు. ఇది వీక్షించేందుకు నాగార్జున సతీసమేతంగా వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ నవంబర్ 28 వరకు జరగనుంది. When style meets grace💫 Yuva Samrat @chay_akkineni and #SobhitaDhulipala are the true definition of red carpet royalty at #IFFI2024. #NagaChaitanya #SoChay pic.twitter.com/Jwpcym5r8j— Trends NagaChaitanya™ (@TrendsChaitu) November 21, 2024 Elegance and legacy come alive at #IFFI2024! Yuva Samrat #NagaChaitanya & #SobhitaDhulipala grace the red carpet ahead of the special screening of ANR's timeless masterpiece ♥️✨@chay_akkineni@sobhitaD#ANR100 #SoChay pic.twitter.com/gNKDJtjjfK— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 21, 2024 -
తండేల్ నుంచి 'బుజ్జి తల్లి' వచ్చేస్తుంది
నాగచైతన్య- సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'తండేల్'. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా.. బన్నివాసు నిర్మాతగా ఉన్నారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం రానున్నడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, ఈ చిత్రం నుంచి 'బుజ్జి తల్లి..' సాంగ్ విడుదలపై మేకర్స్ ఒక ప్రకటన చేశారు.నాగచైతన్య, సాయిపల్లవి మీద చిత్రీకరించిన బుజ్జి తల్లి పాటను నవంబర్ 21న విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్‌తో మేకర్స్ ప్రకటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు అదిరిపోయే సంగీతం ఇచ్చారని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలో తండేల్ మ్యూజిక్ జర్నీని మేకర్స్ ప్రారంభిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం నాగచైతన్య కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా నిలుస్తోందని అభిమానులు అంచనా వేస్తున్నారు.శ్రీకాకుళం జిల్లాకు డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తండేల్ చిత్రం తెరకెక్కుతుంది. వాస్తవ సంఘటనలను తీసుకున్నప్పటికీ.. ఇద్దరు ప్రేమికుల జీవితాల్లోని సంఘటనలు, భావోద్వేగాలను చాలా చక్కగా దర్శకుడు తీశాడని టాక్ వస్తుంది. ఈ సినిమా కోసం కొన్ని భారీ సెట్స్ వేసి బడ్జెట్ విషయంలో కూడా వెనుకాడలేదని తెలుస్తోంది. -
శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి : హాట్ టాపిక్‌గా శోభిత పెళ్లి చీర
టాలీవుడ్లో మోస్ట్ ఎవైటింగ్ వెడ్డింగ్ అంటే హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళదే. ఈ లవ్‌బర్డ్స్ వచ్చే నెల(డిసెంబర్ 4, 2024న) మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాలు జోరుగా చేస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య , శోభితా వివాహ ఆహ్వాన పత్రం కూడా ఆన్లైన్లో వైరల్‌గా మారింది. మరోవైపు శోభితా పెళ్లి చీర, షాపింగ్ వివరాలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. తన జీవితంలో అతి ముఖ్యమైన ఈరోజుకోసం శోభిత చాలా ఉత్సాహంగా ప్లాన్ చేసుకుంటోంది. తాజా నివేదికల ప్రకారం ఎలాంటి డిజైనర్ లేకుండానే తెలుగు వారసత్వాన్ని చాటుకునేలా స్వయంగా తానే దుస్తులను ఎంపిక చేసుకుంటోందట శోభితా ధూళిపాళ. ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అమ్మతో కలిసి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో షాపింగ్‌లో బిజీబిజీగా గడుపుతోంది. తన పెళ్లిలో ప్రతిదీ ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటోందట. పెళ్లి రోజు కోసం ప్యూర్ గోల్డ్ జరీతో నేసిన కంజీవరం పట్టుచీరలో అందంగా మెరిసిపోనుంది. అలాగే కాబోయే వరుడు నాగ చైతన్య కోసం కూడా మ్యాచింగ్ సెట్‌ను సెలెక్ట్ చేసినట్టు తెలిప్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని పొందూరులో నేసిన తెల్లటి ఖాదీ చీరను కూడా కొనుగోలు చేసిందట.కాగా ఇటీవల నిశ్చితార్థ వేడుకలు పసుపు దంచడం లాంటి కీలకమైన వేడుకల్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా శోభితా ధూళిపాళ చీరలో అందంగా కనిపించింది. పెళ్లి పనులు మొదలు పెట్టిన సందర్భంలో బంగారు, ఆకుపచ్చ క్రీమ్ షేడ్స్‌లో, ఆరెంజ్ కలర్ బార్డర్చీరతో కనిపించిన సంగతి తెలిసిందే. -
లవ్ యాక్షన్ డ్రామా
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కాగా ఈ సినిమాలోని ‘బుజ్జితల్లి..’ అనేపాట లిరికల్ వీడియోను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.‘‘ఈపాట రాజు (ఈ సినిమాలో నాగచైతన్యపాత్ర పేరు) హృదయంలో ఓ భాగం’’ అంటూ ‘బుజ్జితల్లి’పాటను ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు నాగచైతన్య. ‘‘ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ‘తండేల్’ రూపొందుతోంది. లవ్, యాక్షన్ డ్రామా అంశాలు ఉన్నాయి. నాగచైతన్య, సాయి పల్లవిల కెమిస్ట్రీ, స్వచ్ఛమైన భావోద్వేగాలు అద్భుతంగా ఉంటాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. -
F4 రేస్‌లో సత్తా చాటి టైటిల్ గెల్చిన అక్కినేని నాగచైతన్య టీం హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (చిత్రాలు)
-
నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్
అక్కినేని ఫ్యామిలీలో త్వరలో శుభకార్యం జరగనుంది. ఈ పాటికే పెళ్లి పనులు మొదలైపోయాయి. కొన్నిరోజుల క్రితం శోభిత పోస్ట్ పెట్టడంతో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు శుభలేఖలు పంచే కార్యక్రమం కూడా షురూ అయిపోయింది. అమ్మాయి తరఫున వాళ్లు ఇచ్చే పెళ్లికార్డుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అయింది.(ఇదీ చదవండి: 'కంగువ'ని తొక్కేస్తున్నారు.. ప్లాన్ చేసి ఇలా: జ్యోతిక)ఈ పెళ్లి కార్డులో శోభిత-నాగచైతన్యకు డిసెంబరు 4న పెళ్లి జరగనుందని, తామెల్లరూ విచ్చేసి ఆశీర్వదించాలని అని రాసుకొచ్చారు. అయితే కేవలం పెళ్లి కార్డు అనే కాకుండా వెదురు బుట్టలో చీర, పసుపు కుంకుమ, వెండి వస్తువు.. వీటన్నింటిని కలిపి పెళ్లి కార్డ్‌గా ఆహ్వానం అందించినట్లు వైరల్ అయిన ఫొటో చూస్తుంటే తెలుస్తోంది.ఈ పెళ్లి కార్డులో 4వ తేదీ అని ఉంది గానీ వేదిక ఎక్కడనేది కనిపించలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు అక్కినేని ఫ్యామిలీ సొంతమైన అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రత్యేకంగా వేసే మండపం సెట్లో శుభకార్యం జరగనుంది. ఈ మేరకు త్వరలో ఏర్పాట్లు మొదలవుతాయి. ఆడపిల్ల తరఫున పెళ్లి పనులు ప్రారంభమయ్యాయంటే.. మరో రెండు మూడు రోజుల్లో అబ్బాయి తరఫు నుంచి కూడా పెళ్లి ఏర్పాటు షురూ అవుతాయని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్) -
రానాతో టాక్ షో.. పెళ్లి, పిల్లల గురించి నాగచైతన్య ఏం చెప్పారంటే..?
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా ఒక టాక్ షో రానుంది. 'ది రానా దగ్గుబాటి షో' పేరుతో తాజాగా ఒక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టాక్ షో కార్యక్రమంలో సౌత్ ఇండియా సెలబ్రిటీలు పాల్గొన్నారు. ట్రైలర్లో మొదట నాగచైతన్య, శ్రీలీల కనిపిస్తే.. రాజమౌళి, నానిలతో రానా ముచ్చట్లు రన్ అవుతాయి. ప్రియాంక మోహన్, దుల్కర్ సల్మాన్, తేజ సజ్జా, రిషభ్ శెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ పాటు రానా సతీమణి మిహికా బజాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 23 నుంచి ప్రతి శనివారం ఒక అతిథితో రానా ప్రేక్షకుల ముందుకు వస్తాడు. సుమారు 10కి పైగా ఎపిసోడ్స్ ఈ కార్యక్రమంలో ఉండనున్నాయి. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ షో చిత్రీకరించారు. ఫస్ట్ ఎపిసోడ్ నాగచైతన్యకు సంబంధించినది ఉండొచ్చని తెలుస్తోంది.రానాతో చాలా సరదా విషయాలు వారందరూ పంచుకున్నారు. అయితే, 'నీ కుటుంబం ఎలా ఉండాలని అనుకుంటున్నావు..?' అని చైతూను రానా ప్రశ్నిస్తే.. 'సంతోషంగా పెళ్లి చేసుకుని.. కొంతమంది పిల్లలు'తో అని నవ్వుతూ బదులిచ్చారు. తాజాగా విడుదలైన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. -
శోభిత- నాగచైతన్య పెళ్లి.. అల్లుడికి అత్తమామల కానుకలేవో తెలుసా? (ఫొటోలు)
-
అక్కినేని ఇంట పెళ్లిసందడి.. ఆ విషయంలో సెంటిమెంట్!
అక్కినేని హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో కాబోయే అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల సందడి చేసింది.వచ్చేనెల డిసెంబర్ 4న వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది. అయితే పెళ్లి వేదిక విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య- శోభిత పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరగనుందట. ఎందుకంటే అక్కినేని కుటుంబానికి సెంటిమెంట్ కావడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగువారి సినీదిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం కూడా అక్కడే ఉంది. అందువల్లే పెళ్లి వేడుక అక్కడే నిర్వహిస్తే తాతయ్య ఆశీర్వాదాలు కూడా ఉంటాయని అక్కినేని కుటుంబసభ్యులు భావిస్తున్నారట. కాగా.. ఏఎన్నార్ శతజయంతి వేడుకలు కూడా అక్కడే నిర్వహించారు.పెళ్లి వేడుక కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ప్రత్యేకంగా వేదికను తయారు చేస్తున్నట్లు టాక్. తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడేలా వీరి వివాహా వేదికను అలంకరించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు, అత్యంత సన్నిహితులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ విహహం అత్యంత వైభవంగా జరగనుంది. -
తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత
ఒకప్పటితో పోలిస్తే సినిమాలు చేయడం సమంత చాలా తగ్గించేసింది. గతేడాది వచ్చిన 'ఖుషి' మూవీలో హీరోయిన్గా చేసింది. రీసెంట్గా 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇందులో సమంత కిస్ సీన్స్, గ్లామర్ క్లిప్స్ వైరల్ అయ్యాయి గానీ సిరీస్‌కి ఫ్లాప్ టాక్ వచ్చింది. సరే ఇదంతా పక్కనబెడితే ప్రమోషన్స్‌లో భాగంగా తల్లి కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.'సిటాడెల్'లో ఓ పాపకు తల్లిగా నటించిన సమంత.. నిజ జీవితంలోనూ తల్లి ఎప్పుడు అవుతానా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. 'సిటాడెల్లో తల్లిగా చైల్డ్ ఆర్టిస్టుతో కలిసి పనిచేయడం కొత్త అనుభవం. ఆ పాపతో సెట్లో ఉన్నన్నీ రోజులు నా సొంత కూతురితో ఉన్నట్లే అనిపించేది. తల్లి కావాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. ఇప్పుడు అనుకోవడం మరీ ఆలస్యం అని నేను అనుకోవట్లేదు'(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)'తల్లి కావడానికి వయసు అనేది అడ్డుకాదని నేను నమ్ముతాను. అమ్మ అనే అనుభూతి పొందాలని ఉంది. అదో అద్భుతమైన అనుభవం. ఆ టైం నా జీవితంలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఈ వయసులో తల్లి కావడం ఏంటని మీరు అంటారేమో.. అది అడ్డంకి అని అయితే నేను అనుకోను' అని సమంత తన అభిప్రాయాన్ని చెప్పింది.గతంలో హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సమంత.. నాలుగేళ్లకే విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. నాగచైతన్య మాత్రం హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో పెళ్లికి సిద్ధమయ్యాడు. డిసెంబరు తొలివారంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ వేడుక జరగనుంది.(ఇదీ చదవండి: స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ) -
నాగ చైతన్య తండేల్.. రిలీజ్ డేట్ కోసం ఇంతలా పోటీపడ్డారా?
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందా? లేదా అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. దీంతో తండేల్ మేకర్స్ రిలీజ్ డేట్‌పై అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిం తండేల్ విడుదల తేదీని ప్రకటించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు. ఈ ప్రకటనతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మొదట క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చిందని తెలిపారు.అయితే ఈ రిలీజ్ డేట్‌పై చేసిన వీడియో మాత్రం ఫన్నీగా తెగ ఆకట్టుకుంటోంది. కేవలం సినిమా విడుదల తేదీని నిర్ణయించేందుకు ఓ గేమ్ ఆడారు. అదే టగ్ ఆఫ్ వార్ పేరుతో చిన్న పోటీ నిర్వహించారు. సంక్రాంతి, సమ్మర్ పేరుతో రెండు టీమ్స్‌గా విభజించి 'టగ్స్ ఆఫ్ తండేల్' అంటూ పోటీ పెట్టారు. ఈ గేమ్‌లో రెండు టీములు గెలవకపోవడంతో మధ్యలో ఫిబ్రవరిని ఎంచుకున్నారు. అలా తండేల్ మూవీ రిలీజ్ డేట్ మేకర్స్ నిర్ణయించారు. ఈ వీడియో ఇదేందయ్యా ఇదీ.. ఇదీ నేను చూడలే అంటూ అల్లు అరవింద్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌కు నవ్వులు తెప్పిస్తున్నాయి. కాగా.. శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. How did team #Thandel decide on the release date? With a super fun game...❤🔥'Tugs of Thandel' out now 💥▶️ https://t.co/H0x2uNz02r#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7TH, 2025 ❤️🔥In Telugu, Tamil & Hindi.#ThandelonFeb7th#DhullakotteyalaYuvasamrat… pic.twitter.com/HYZQPsSegw— Geetha Arts (@GeethaArts) November 7, 2024 -
సాయిపల్లవికి కొత్త బిరుదు.. చైతూ అంత మాట అనేశాడేంటి?
అక్కినేని హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం తండేల్. ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ--2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాగ చైతన్య హీరోయిన్‌పై ప్రశంసలు కురిపించారు. సాయిపల్లవి బాక్సాఫీస్ క్వీన్ అంటూ కొనియాడారు. అంతేకాకుండా సినిమాలో కేవలం తన పాత్రకే పరిమితం కాదని.. ప్రతి విషయాన్ని చర్చిస్తుందని నాగచైతన్య తెలిపారు.నాగచైతన్య మాట్లాడుతూ..' మన బాక్సాఫీస్ క్వీన్ సాయిపల్లవి. ఈ సినిమాలో కేవలం తన క్యారెక్టర్ మాత్రమే కాదు.. నా సీన్స్ గురించి కూడా చర్చిస్తుంది. అందరి గురించి మాట్లాడుతూ నాకు ఎప్పుడు కూడా ఎంకరేజ్‌గా ఉంటుంది. డ్యాన్స్ విషయంలో కూడా సాయిపల్లవితో కష్టమే. ఆమెతో డ్యాన్స్ చేయాలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది. గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్ గురించి వినగానే నాకు చేయాలనిపించింది. తండేల్ చాలా గొప్ప చిత్రం అవుతుంది. నా పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులను కలిశా' అని అన్నారు.తండేల్ కథేంటంటే..నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. -
అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 'తండేల్' విడుదలపై ప్రకటన
నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న 'తండేల్' సినిమా విడుదల డేట్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. అయితే, పలు కారణాల వల్ల ఈ అవకాశం లేకుండాపోయింది. దీంతో మరో తేదీకి తండేల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియ రేంజ్లో ఈ సినిమా విడుదల కానుంది.'తండేల్' సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని ఫ్యాన్స్‌కు నిర్మాత అల్లు అరవింద్ గుడ్‌న్యూస్ చెప్పారు. పాన్ ఇండియా రేంజ్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళంలో ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మొదట డిసెంబర్ 28న 'తండేల్' విడుదల చేయాలనుకుంటే కుదరలేదని ఆయన చెప్పారు. అయితే, సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని ప్లాన్ చేస్తే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీలో ఉండటంతో విరమించుకున్నట్లు అరవింద్ పేర్కొన్నారు. అలా ఫైనల్‌గా ఫిబ్రవరి 7న వస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. -
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?
అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఆగష్టులో వారిద్దరి నిశ్చితార్థం జరగగా ఇప్పుడు పెళ్లి వేడుకకు ముస్తాబు అవుతున్నారు. శోభిత ఇంట్లో గోధుమరాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.నాగచైతన్య-శోభితాల పెళ్లి డిసెంబర్ 4న జరగనుందని తెలుస్తోంది. అధికారికంగా అయితే ప్రకటించలేదు. ముందుగా డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారట. కానీ, నాగార్జున ఆ ఆలోచనను విరమించుకొని రాజస్థాన్‌లోని ఓ మంచి ప్యాలెస్‌లో పెళ్లి చేద్దామని ఆలోచించారట. అయితే, ఇప్పుడు ఆ ప్లాన్‌ను కూడా నాగ్ వద్దనుకున్నారట. హైదరాబాద్‌లోనే తన కుమారుడి పెళ్లి చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారట. అందుకు వేదికగా అన్నపూర్ణ స్టూడియోను ఎంపిక చేశారని సమాచారం. ఈ వేదికను సిద్ధం చేసేందుకు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్‌కు పనులు కూడా అప్పగించారని తెలుస్తోంది.అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఎన్-కన్వెన్షన్ టాపిక్‌ను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌లో ఎన్-కన్వెన్షన్ వేదికకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో సెలబ్రీటిల శుభకార్యాలు అక్కడ జరిగాయి. కానీ, తమ హీరో పెళ్లి మాత్రం అక్కడ జరగకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. ఒకవేల ఆ వేదిక అందుబాటులో ఉంటే మరో ఆలోచన లేకుండా చైతూ-శోభిత పెళ్లి అక్కడే జరిగి ఉండేది. -
శోభిత ధూళిపాళ్ల దీపావళి విషెస్.. ఆ ఫోటోను షేర్ చేస్తూ!
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలోనే అక్కినేని వారి కోడలు కానుంది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి పీటలెక్కనుంది. వీరి పెళ్లి తేదీపై ఇప్పటికే అక్కినేని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 4న పెళ్లి వేడుక జరగనుందని ప్రకటించారు. ఇటీవల ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లోనూ శోభిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాబోయే కోడలిని చిరంజీవికి నాగార్జున పరిచయం చేశారు.ఈరోజు దీపావళి సందర్భంగా శోభిత ఇన్‌స్టా ద్వారా విషెస్ తెలిపింది. టపాసులపై తన ఫోటోను ముద్రించి ఉన్న వాటిని షేర్ చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపింది. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పెళ్లి పనులతో బిజీగా శోభిత..శోభితా ధూళిపాళ్ల ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పసుపు దంచుతూ పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. త్వరలోనే జరగనున్న చైతూ- శోభిత గ్రాండ్ వెడ్డింగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరి పెళ్లి వేదిక ఎక్కడనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. -
వేణు స్వామి జోస్యం.. చర్యలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తనపై ఉన్న స్టే ఎత్తివేస్తూ.. చర్యలు తీసుకోవడానికి మహిళా కమిషన్‌కు పూర్తి అధికారాలు ఉన్నాయని సోమవారం తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా.. వారం రోజుల్లో వేణుస్వామిపై తదుపరి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకున్న అనంతరం వారి వైవాహిక జీవితం సక్రమంగా సాగదంటూ ఇటీవల వేణుస్వామి జోస్యం చెప్పారు. నిశ్చితార్థం చేసుకున్నరోజునే.. నాగచైతన్య, శోభిత మూడేళ్లలో విడిపోతారని అన్నారు. మరో మహిళ ప్రమేయంతో 2027లో ఈ జంట విడిపోతారని అంచనా వేశారు. వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో వైరల్ కావటంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు పాలయ్యారు.వేణుస్వామి జోస్యంపై తెలుగు ఫిల్మ్ జర్న లిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగష్టు 13న రాష్ట్ర మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో.. తనపై చర్యలు తీసుకునే అధికారం మహిళా కమిషన్‌కు లేదని వేణు స్వామి స్టే తెచ్చుకున్నారు. -
అఫీషియల్: నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లి తేదీ ఖరారు
అక్కినేని వారి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. ఈ ఏడాది ఆగస్టులో శోభిత- నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఏడాదిలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవల ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లోనూ శోభిత ధూళిపాళ్ల మెరిసింది. తమ కాబోయే కోడలిని మెగాస్టార్ చిరంజీవికి నాగార్జున పరిచయం కూడా చేశారు.తాజాాగా వీరి పెళ్లి తేదీపై నాగార్జున కుటుంబసభ్యులు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 4న వీరి పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలపై స్పందించారు. అదే రోజున వివాహం జరగనుందని అక్కినేని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నుంచి వీరి పెళ్లి తేదీపై నెట్టింట చర్చ నడుస్తూనే ఉంది. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కుతారా? లేదంటే కొత్త సంవత్సరంలో గ్రాండ్ వెడ్డింగ్ ఉంటుందా? అని నెటిజన్స్‌తో పాటు అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు. తాజాగా జరిగిన ఏఎన్నాఆర్ శతజయంతి వేడుకల్లో శోభిత కనిపించడంతో మరోసారి పెళ్లి తేదీపై మరోసారి ఆరా తీశారు.పెళ్లి తేదీపై రూమర్స్...గత కొద్ది రోజులుగా ఈ జంట ఈ ఏడాది డిసెంబర్లోనే పెళ్లికి సిద్ధమవుతున్నట్లు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. చై- శోభిత డిసెంబర్ మొదటి వారంలో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలొచ్చాయి. అక్కినేని కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్లు టాలీవుడ్‌లోనూ టాక్ వినిపించింది. వచ్చే డిసెంబరు 4న వీరిద్దరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. అందరూ అనుకున్నట్లుగానే పెళ్లి తేదీ విషయంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి క్లారిటీ వచ్చేసింది. (ఇది చదవండి: రామ్‌చరణ్,వెంకటేష్ కోసం వారిద్దరూ ఆలోచిస్తే మేము తగ్గాల్సిందే: దర్శకుడు )మొదలైన పెళ్లి పనులు..ఇటీవల పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని శోభిత తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసింది. సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించింది. శోభిత ఇంట్లో తన తల్లి, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన వేడుకను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. టాలీవుడ్ సినీ ప్రియులతో పాటు అక్కినేని ఫ్యాన్స్ వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండేల్తో చైతూ బిజీ..కాగా.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. మత్స్యకారుల బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
'ఆ కష్టమేంటో నాకు జీవితంలో తెలియదు.. ఎందుకంటే?'.. నాగచైతన్య కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి రెడీ అయిపోయాడు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుజీత్, సందీప్ డైరెక్షన్లో వస్తోన్న క మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైపోయింది. ఈ నెల 31న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. దీంతో విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు అక్కినేని హీరో నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.నేనే మొదటి అభిమానిని..నాగ చైతన్య మాట్లాడుతూ..'కిరణ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చాను. కానీ కిరణ్ లాంటి వాళ్ల స్టోరీస్ వినగలుతాను. కానీ ఆ కష్టం ఏంటో నాకు తెలియదు. నేను చెప్పేది ఒక్కటే కిరణ్ జర్నీకి నేను అభిమానిని. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రావాలంటే నీలాంటి స్టోరీస్ ఆదర్శం. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నీలో చాలా సత్తా ఉంది. ట్రోల్ చేసేవాళ్లు చేస్తారు. వాళ్ల చేతుల్లో కేవలం ఫోన్ మాత్రమే ఉంది. అలాంటి వారి గురించి భయపడాల్సిన పనే లేదు. నీ టాలెంట్ ఏంటో చూస్తూనే ఉన్నాం. అమ్మ గురించి చెప్పినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. ప్రతి సక్సెస్ వెనకాల ఓ మహిళ ఉంటుంది. నీకు రహస్య సపోర్ట్ ఫుల్‌గా ఉంది. క టీమ్ బృందం పడిన కష్టం నా కళ్లముందే కనిపిస్తోంది. కిరణ్‌కు నేనే మొదటి అభిమానిని. ఆల్ ది బెస్ట్' అంటూ మాట్లాడారు.ట్రోల్స్‌పై కిరణ్ కౌంటర్..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఓ సినిమాలో తనని ట్రోల్ చేయడంపై ఫైర్ అయ్యాడు. అలానే తనపై వస్తున్న ఫేక్ ఆర్టికల్స్ గురించి కూడా ఇచ్చిపడేశాడు. నాతో మీకేంటి సమస్య? నా గురించి ఏది పడితే అది ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించాడు. ఒకడేమో నేను బాగా డబ్బున్న వాడిని.. మరొకడేమో రాజకీయ నాయకుడి కొడుకుని అని రాస్తాడని అన్నారు. అసలు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదని కిరణ్ మాట్లాడారు. దీంతో కిరణ్ స్పీచ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. -
కిరణ్ అబ్బవరం 'క' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రామ్‌చరణ్,వెంకటేష్ కోసం వారిద్దరూ ఆలోచిస్తే మేము తగ్గాల్సిందే: దర్శకుడు
నాగచైతన్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'తండేల్' కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల గురించి తాజాగా దర్శకుడు చందూ మొండేటి క్లారిటీ ఇచ్చారు.'తండేల్' షూటింగ్ గురించి మాట్లాడుతూ దర్శకుడు చందూ ఇలా చెప్పుకొచ్చారు. 'సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. జనవరిలో విడుదల చేసేందుకు మేము రెడీగా ఉన్నాం. ఇంకో పదిరోజులు షూట్ చేస్తే సినిమా పూర్తి అవుతుంది. కానీ, చరణ్ గారి సినిమా వస్తుందని అరవింద్ గారు.. వెంకీ మామ సినిమా వస్తుందని చైతూ గారు ఆలోచిస్తే.. మాత్రం సంక్రాంతి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. జనవరి 26న విడుదల చేద్దామనుకుంటే ఆదివారం కాబట్టి అవకాశం లేదు. సంక్రాంతి కంటే ముందే రిలీజ్ చేయాలంటే సినిమా పూర్తి కాదు.' అని చందూ మొండేటి తెలిపారు.తండేల్ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 'లవ్ స్టోరీ' చిత్రం తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటిస్తున్న రెండో చిత్రం. ఈ మూవీలో ఆమె డీగ్లామర్ పాత్రలో కనిపించనుంది. అయితే.. చైతూ- చందు మొడేటి కాంబినేషన్లో మూడో చిత్రంగా తండేల్ రానుంది. వారిద్దరి నుంచి ఇప్పటికే ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అక్కినేని అభిమానులకి నా విన్నప౦.. దయచేసి త౦డేల్ గురించి ఆలోచించడం మానేసి మీ లైఫ్ గురి౦చి ఆలోచి౦చ౦డి..సంక్రాంతికి రావాలని అభిమానులు ఎ౦త కోరుకున్నా వాళ్ళు మన గురి౦చి 1% కూడా ఆలోచన చేయరు..Don't west ur Time.. Skip it#BoycottThandel 🗡 #Thandel@chay_akkineni @GeethaArts pic.twitter.com/QeXSObAWr9— King Venky (@KingVenkyKv) October 29, 2024 -
ANR అవార్డు అందుకున్న హీరో చిరంజీవి (ఫొటోలు)
-
కాబోయే కోడలు అంటూ.. శోభితను చిరంజీవికి పరిచయం చేసిన నాగార్జున (ఫొటోలు)
-
త్వరలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి.. ఆ ఫోటోను డిలీట్ చేసిన చైతూ!
అక్కినేని హీరో నాగచైతన్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న చైతూ ఈ ఏడాది డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత వీరిద్దరు తొలిసారిగా జంటగా కనిపించారు. అంతేకాకుండా ఇటీవలే పెళ్లి పనులు మొదలైన ఫోటోలను శోభిత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.అయితే గతంలో సమంతను పెళ్లాడిన నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు 2021లో తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే ఆగస్టులో శోభిత-చైతూ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా ఆయన ఇన్‌స్టాలో సమంతతో ఉన్న ఫోటోలను నెటిజన్స్ గుర్తించారు. అందులో విడాకులకు సంబంధించిన పోస్ట్, 2018లో మజిలీ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఉన్నాయి. అంతేకాకుండా సమంతతో కలిసి రేస్ ట్రాక్‌పై తీసిన చిత్రం కూడా ఉంది. అందులో "బ్యాక్ త్రో ...మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్" అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.అయితే తాజాగా ఆ ఫోటోను నాగ చైతన్య తన ఇన్‌స్టా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇటీవల చైతూ నిశ్చితార్థం సమయంలో ఆమెపై గౌరవంతో ఆ పోస్ట్‌ను తొలగించాలంటూ సమంత అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరారు. దీంతో శోభితతో పెళ్లికి ముందే ఆ పోస్ట్ నాగచైతన్య తొలగించినట్లు అర్థమవుతోంది. కాగా.. 2017లో పెళ్లి చేసుకున్న సమంత- చైతూ వ్యక్తిగత కారణాలతో 2021లో విడిపోయారు. -
అక్కినేని ఇంట పెళ్లి సందడి.. నాగచైతన్య- శోభిత వివాహం అప్పుడేనా?
అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల ఈ ఏడాదిలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా ఇవాళ పెళ్లి పనులు మొదలైనట్లు శోభిత ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. పసుపు దంచడంతో చైతూ- శోభిత పెళ్లి సందడి మొదలెట్టారు. పెళ్లి పనుల్లో సంప్రదాయ దుస్తుల్లో శోభిత ధూళిపాళ్ల మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.అయితే పెళ్లి పనులు మొదలు కావడంతో అందరి దృష్టి వివాహం ఎప్పుడనే విషయంపై అప్పుడే చర్చ మొదలైంది. ఈనెలలోనే ఉంటుందా? లేదంటే నవంబర్, డిసెంబర్లోనా అని అందరు తెగ ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా వీరి పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.(ఇది చదవండి: నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల ఇంట మొదలైన పెళ్లి పనులు)తాజా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక డిసెంబర్ మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాబోయే జంట నాగ చైతన్య- శోభితా ధూళిపాళ్ల తమ గ్రాండ్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్‌లోని ప్యాలెస్‌ని ఎంపిక చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే వీరి పెళ్లి తేదీ, వేదికపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉంది. ఆ తర్వాతే చైతూ-శోభిత పెళ్లి తేదీలు, వేదికపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 8న హైదరాబాద్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.