నాగచైతన్య-శోభితల వయసు గురించి గూగుల్‌లో వెతుకుతున్న నెటిజన్స్‌ | Netizens Search Age Gap Between Naga Chaitanya And Sobhita Dhulipala | Sakshi
Sakshi News home page

నాగచైతన్య-శోభితల వయసు గురించి గూగుల్‌లో వెతుకుతున్న నెటిజన్స్‌

Published Sat, Nov 30 2024 1:02 PM | Last Updated on Sat, Nov 30 2024 1:13 PM

Naga Chaitanya And Sobhita Dhulipala Age Gap Search Netizens

టాలీవుడ్‌ నటుడు నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల పెళ్లిపీటలు ఎక్కనున్నారు. డిసెంబర్‌ 4న వారి వివాహం ఘనంగా జరగనుంది. ఇదిలాఉండగా, వారిద్దరి వయసుకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్‌ అవుతుంది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా వారి పెళ్లి జరగనుంది. ఇప్పటికే ఇరువురి ఇంట పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కినేని అభిమానులు కూడా కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

నాగ చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని కూడా త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. తనకు కాబోయే భార్య జైనాబ్ రావ్‌జీ మధ్య తొమ్మిదేళ్ల గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతుంది. అఖిల్‌ కంటే జైనాబ్‌ వయసు ఎక్కువని సోషల్‌మీడియాలో ప్రచారంలో జరుగుతుంది. అయితే, ఇప్పుడు  చైతూ, శోభిత వయస్సు వ్యత్యాసం గురించి సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు. వారి వయస్సుకు సంబంధించిన వివరాలను ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. నవంబర్ 23, 1986లో జన్మించిన నాగ చైతన్యకు ఇటీవలే 38 ఏళ్లు కాగా, 1992 మే 31న జన్మించిన శోభితా ధూళిపాళకు 32 ఏళ్లు. వీరిద్దరి మధ్య 6 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. వారిద్దరి మధ్య పెద్దగా ఏజ్‌ గ్యాప్‌ ప్రభావం చూపించకపోయినప్పటికి నెటిజన్లు మాత్రం వారి వివరాల గురించి ఈ మధ్య ఎక్కువ గూగుల్‌ చేస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా నాగచైతన్య-శోభితల పెళ్లి జరగనుంది. డిసెంబరు 4న రాత్రి 8.13 నిమిషాలకు వారిద్దరూ ఒకటి కానున్నారు. దివంగత నటులు నాగేశ్వరరావుకు ఇష్టమైన ప్రదేశం అన్నపూర్ణ స్టూడియో కావడంతో ఈ వేడుకను అక్కడే జరిపించాలని వారు ఫిక్స్‌ అయ్యారు. ఈ వివాహం కోసం  కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని ఆహ్వానిస్తున్నట్లు నాగ్‌ ఇప్పటికే ప్రకటించారు. నాగచైతన్య-శోభితల పెళ్లి సంప్రదాయమైన తెలుగు పెళ్లి కానుందని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement