
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ నెట్టింట పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అది నిజమేనని ధృవీకరించాడు శివరాజ్‌కుమార్. భైరతి రణగల్ అనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ఆయన తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడాడు.
చికిత్స తీసుకుంటున్నా..
'నేను కూడా మనిషినే కదా.. నాకు సమస్యలు వస్తుంటాయి. అలా ఓ అనారోగ్య సమస్య ఎదురైంది. మొదట దాని గురించి తెలిసి భయపడ్డాను. తర్వాత ధైర్యం తెచ్చుకుని పోరాడుతున్నాను.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. చికిత్సలో భాగంగా ఇప్పటికే నాలుగు సెషన్లు పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను' అని తెలిపాడు. అయితే ఆయన దేని వల్ల సతమతమవుతున్నాడన్న విషయాన్ని మాత్రం బయటపట్టలేదు. ఇంకో రెండు సెషన్ల తర్వాత ఆయన అమెరికాలో సర్జరీ చేయించుకోనున్నాడని తెలుస్తోంది.
సినిమా
కాగా శివరాజ్‌కుమార్ గతేడాది జైలర్ మూవీలో అతిథి పాత్రలో అదరగొట్టాడు. ప్రస్తుతం అతడు నటించిన భైరతి రణగల్ మూవీ నవంబర్ 15న విడుదల కానుంది. రాహుల్ బోస్, చాయా సింగ్, దేవరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం కన్నడతో పాటు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇది శివరాజ్‌కుమార్ సూపర్ హిట్ మూవీ మఫ్టీకి ప్రీక్వెల్‌గా వస్తోంది.
చదవండి: Urfi Javed: తృప్తికి డ్యాన్సే రాదు.. క్లాసులకు వెళ్లి నేర్చుకోవచ్చుగా!