Shivarajkumar
-
మొదట భయపడ్డా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా: కన్నడ స్టార్ హీరో
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ నెట్టింట పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అది నిజమేనని ధృవీకరించాడు శివరాజ్‌కుమార్. భైరతి రణగల్ అనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ఆయన తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడాడు.చికిత్స తీసుకుంటున్నా..'నేను కూడా మనిషినే కదా.. నాకు సమస్యలు వస్తుంటాయి. అలా ఓ అనారోగ్య సమస్య ఎదురైంది. మొదట దాని గురించి తెలిసి భయపడ్డాను. తర్వాత ధైర్యం తెచ్చుకుని పోరాడుతున్నాను.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. చికిత్సలో భాగంగా ఇప్పటికే నాలుగు సెషన్లు పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను' అని తెలిపాడు. అయితే ఆయన దేని వల్ల సతమతమవుతున్నాడన్న విషయాన్ని మాత్రం బయటపట్టలేదు. ఇంకో రెండు సెషన్ల తర్వాత ఆయన అమెరికాలో సర్జరీ చేయించుకోనున్నాడని తెలుస్తోంది.సినిమాకాగా శివరాజ్‌కుమార్ గతేడాది జైలర్ మూవీలో అతిథి పాత్రలో అదరగొట్టాడు. ప్రస్తుతం అతడు నటించిన భైరతి రణగల్ మూవీ నవంబర్ 15న విడుదల కానుంది. రాహుల్ బోస్, చాయా సింగ్, దేవరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం కన్నడతో పాటు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇది శివరాజ్‌కుమార్ సూపర్ హిట్ మూవీ మఫ్టీకి ప్రీక్వెల్‌గా వస్తోంది.చదవండి: Urfi Javed: తృప్తికి డ్యాన్సే రాదు.. క్లాసులకు వెళ్లి నేర్చుకోవచ్చుగా! -
ఓటీటీలో శివన్న, ప్రభుదేవా సినిమా స్ట్రీమింగ్
శివరాజ్‌కుమార్, ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన కన్నడ సినిమా 'కరటక దమనక'. ముఖ్యంగా ఈ సినిమాలోని ఒక సాంగ్ దేశవ్యాప్తంగా ఊపేసింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కన్నడ ప్రముఖ డైరెక్టర్ యోగరాజ్ భట్ తెరకెక్కించారు. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమా మార్చి నెలలో విడుదలైంది. అయితే, తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సడన్‌గా స్ట్రీమింగ్ అవుతుంది.శివరాజ్ కుమార్‌తో యోగరాజ్ భట్ మొదటి సారి ఈ సినిమా తెరకెక్కించారు. ఆపై శివన్న- ప్రభదేవా కాంబినేషన్లో నటించిన తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ప్రభుదేవా హీరోగా కన్నడ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, వారు ఆశించనంతగా ఈ చిత్రం మెప్పించలేదని టాక్ వచ్చింది. అయితే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో తెలుగు, తమిళ్ వర్షన్స్ కూడా విడుదల కానున్నాయని సమాచారం.కరటక (శివరాజ్‌కుమార్), దమనక (ప్రభుదేవా) పాత్రలలో ఇద్దరూ పోటీపడి నటించారు. ఒక కేసు కారణంతో జైలులో ఉన్న వారిద్దరిని ఒక పనిచేసి పెట్టాలని జైలర్ విడుదల చేస్తాడు. అప్పుడు వారిద్దరూ ఒక పల్లెటూరుకు వెళ్తారు. అక్కడ ఊరును మోసం చేసి, దొంగతనాలు చేస్తూ జీవనం సాగించే మోసగాళ్లలా ఉంటారు. అదే గ్రామంలో నీటి కోసం అల్లాడుతున్న ప్రజల ఇబ్బందులు చూసి చలించిపోతారు. నీళ్లు లేకపోవడంతో కొందరు ప్రజలు అక్కడి నుంచి పట్టణాలకు వెళ్లిపోతారు. కానీ, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా అక్కడే ఉండాలని కొందరు అనుకుంటారు. ఇలాంటి సమయంలో జిత్తులమారి నక్కలుగా ఉన్న వారిద్దరూ ఆ గ్రామం కోసం ఏం చేశారు. వారికి ఆ జైలర్ అప్పగించిన పని ఏంటి..? అనేది ఆసక్తిని పెంచుతుంది. ప్రియా ఆనంద్, నిశ్విక నాయుడు, రవిశంకర్, రంగాయణ రఘు, తనికెళ్ల భరణి తదితరలు ఈ సినిమాలో నటించారు. తనికెళ్ల భరణి పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఇంటి వద్దే చూసేయండి. -
#RC16లో స్టార్ హీరో.. తెలుగులో తొలిసారి..!
శివరాజ్‌కుమార్.. కన్నడలో స్టార్ హీరో! తన సినిమాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడివారికీ సుపరిచితుడే! గతేడాది జైలర్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను అబ్బురపరిచాడు. ప్రస్తుతం ఆయన తెలుగులో డైరెక్ట్‌గా ఓ సినిమా చేస్తున్నాడు. నేడు (జూలై 12న) శివరాజ్‌కుమార్ బర్త్‌డే కావడంతో ఓ సర్ప్రైజ్ వదిలారు. రామ్ చరణ్- బుచ్చిబాబు సన కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో శివన్న భాగమైనట్లు ఓ పోస్టర్ వదిలారు. అందులో తెలుగు సినిమాకు స్వాగతమని పేర్కొన్నారు.అప్పుడు అతిథిగా..శివన్న తొలిసారి తెలుగులో పూర్తి స్థాయిలో నటించనున్నాడన్నమాట! 2017లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణిలో అతిథి పాత్రలో మెరిశారు. ఆ తర్వాత తెలుగులో డైరెక్ట్ సినిమాలో నటించనేలేదు. కన్నప్ప మూవీలోనూ ఈయన నటించనున్నట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. దీనిపై విష్ణు స్పందిస్తూ హరహర మహాదేవ్ అని ట్వీట్ వేశాడు. దీంతో ఈ సినిమాలోనూ శివన్న ఉన్నాడని అభిమానులు ఫిక్సయిపోయారు.మేకోవర్..రామ్‌చరణ్ 16వ సినిమా విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చరణ్ కండలు పెంచాలనుకుంటున్నాడట! ఈ మేకోవర్ కోసం ఆస్ట్రేలియా వెళ్లి కొంతకాలం అక్కడ శిక్షణ తీసుకోనున్నాడట! ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్నారు. ఆగస్టు నెలాఖరులో షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) Har Har Mahadev ❤️ https://t.co/liGw4R0Rxv— Vishnu Manchu (@iVishnuManchu) October 12, 2023చదవండి: 25 రోజులు మిస్సింగ్.. నటుడిని గుర్తుపట్టని తల్లి! -
తెలుగులో 'కెప్టెన్ మిల్లర్' వచ్చేస్తున్నాడు.. పండుగరోజు సందడే
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లోకి వచ్చేసింది. కానీ తెలుగులో విడుదల కాలేదు. దీనికి ప్రధాన కారణం సంక్రాంతికి టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు విడుదల కావడమే అని చెప్పవచ్చు. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయలేదు. తాజాగా కెప్టెన్ మిల్లర్ తెలుగు రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ వారు విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ప్రకటించారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్‌ను కూడా వారు విడుదల చేశారు. అదే సమయంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా కూడా రాబోతుంది. కానీ తెలుగులో ధునుష్కు ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి కెప్టెన్ మిల్లర్‌కు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. నేడు విడుదల అయిన కెప్టెన్ మిల్లర్ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. 1930ల బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ తెరకెక్కింది. సినిమాలో సెట్టింగ్స్‌తో పాటు సినిమాటోగ్రఫీ చాలా బాగుందని ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఈ చిత్రంలో జివి ప్రకాష్ బిజిఎమ్ మరో లెవెల్ అని విమర్శకులు అంటున్నారు. కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అని, సెకండాఫ్ యాక్షన్ ప్యాక్డ్ ఎఫైర్ అని అంటున్నారు. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్ నటీనటులు ఇందులో నటించారు. #CaptainMiller is set for a grand release in Andhra Pradesh and Telangana by @SureshProdns and @AsianCinemas_ 🔥 Releasing in theatres on Jan 25th!@dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/GuZDej5Q5W — Suresh Productions (@SureshProdns) January 12, 2024 -
భారీ యాక్షన్ సీన్స్‌తో ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' ట్రైలర్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. కానీ తెలుగులో విడదల కావడం లేదు. దీనికి ప్రధాన కారణం థియేటర్ల కొరతే అని చెప్పవచ్చు. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ వంటి స్టార్ నటీనటులు ఇందులో నటించారు. తాజాగా కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ విడుదలైంది. ధనుష్‌తో పాటు చిత్ర బృందం కూడా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తమ ఎక్స్ పేజీలో విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. 1930ల బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా కెప్టెన్ మిల్లర్ తెరకెక్కింది. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే పాత్రలో ధనుష్ నటించాడు. ఈ సినిమా రన్‌టైమ్ 157 నిమిషాలుగా ఉంది. అంటే 2 గంటల 37 నిమిషాలు. దీంతో పార్ట్-2 కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్‌లో కెప్టెన్ మిల్లర్ చిత్రానికి శివ కార్తికేయన్ నటించిన అయలాన్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే ఆ చిత్రం నుంచి తెలుగు ట్రైలర్ వచ్చింది. -
Ghost Movie Review : ‘ఘోస్ట్’మూవీ రివ్యూ
టైటిల్: ఘోస్ట్ నటీనటులు: శివరాజ్ కుమార్, జయరామ్, అనుపమ్ ఖేర్, అర్చనా జాయిస్, ప్రశాంత్ నారాయణన్, సత్య ప్రకాశ్, అభిజీత్ తదితరులు నిర్మాత: సందేశ్ నాగరాజ్ దర్శకత్వం: ఎంజీ శ్రీనివాస్ సంగీతం: అర్జున్ జన్యా సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహా విడుదల తేది: నవంబర్ 4, 2023 కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌కి తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది. పలు తెలుగు సినిమాల్లో అతిథి పాత్ర చేశారు. ఇటీవల రజనీకాంత్ ‘జైలర్’లో కూడా మెరిశాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఘోస్ట్’. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 19న కన్నడలో రిలీజైన ఈ చిత్రం..నేడు(నవంబర్ 3) అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వామన్ శ్రీనివాస్(ప్రశాంత్ నారాయణన్) సీబీఐ మాజీ అధికారి. పదేళ్లుగా పోరాటం చేసి జైళ్ల ప్రైవేటీకరణ బిల్లుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటాడు. భూమి పూజ చేయడానికి వెళ్లిన వామన్..అతన్ని మనుషులను ఓ ముఠా కిడ్నాప్ చేసి, అదే జైలులో ఉన్న మరో టవర్‌లో బందీ చేస్తుంది. ఈ కేసును పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రత్యేక అధికారి చరణ్ రాజ్(జయరామ్) రంగంలోకి దిగుతాడు. వామన్ గ్యాంగ్‌ని బందీ చేసింది బిగ్డాడీ(శివరాజ్ కుమార్)అని చరణ్ తెలుసుకుంటాడు. అసలు బిగ్డాడీ ఎవరు? జైలులోనే వామన్ని ఎలా కిడ్నాప్ చేశాడు? ఎందుకు చేశాడు? జైలులో ఉన్న 1000 కేజీల బంగారం కథేంటి? ఈ కథలో అనుపమ్ ఖేర్ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే ఘోస్ట్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కేజీయఫ్ తర్వాత గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రాలు ఎక్కువ అయ్యాయి. టాలీవుడ్లోనే కాకుండా ప్రతి ఇండస్ట్రీలోనూన ఈ తరహా చిత్రాలే వస్తున్నాయి. ఘోస్ట్ కూడా గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రమే. చివరల్లో స్పై థ్రిల్లర్ టచ్ ఇచ్చారు అంతే. కథ, కథనాలను పట్టించుకోవకుండా.. కేవలం మాస్ ఎలివేషన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలు మధ్యలో ఓ సీబీఐ మాజీ అధికారిని హీరో గ్యాంగ్ కిడ్నాప్ చేయడం.. అతన్ని అడ్డుగా పెట్టుకొని ప్రభుత్వంతో తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం.. క్లుప్తంగా చెప్పాలంటే ఈ సినిమా కథ ఇంతే. అయితే ఇలాంటి కథలకు స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉండాలి. పోలీసులకు, హీరో గ్యాంగ్ మధ్య జరిగే వార్తో పాటు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఆడే మైండ్ గేమ్.. చాలా ఉత్కంఠ భరితంగా అనిపించాలి. కానీ ఘోస్ట్ విషయం అది మిస్ అయింది. ప్రతిసారి కథ పదేళ్ల వెనక్కి వెళ్లడం..మళ్లీ ప్రస్తుతానికి రావడం.. ఇబ్బందికరంగా మారుతుంది. శివరాజ్‌కుమార్‌ని ఎలివేట్ చేసే సీన్స్ మాత్రం ఫ్యాన్స్‌ని అలరిస్తాయి. వామన్‌ను బిగ్డాడీ గ్యాంగ్ కిడ్నాప్ చేసే భారీ యాక్షన్ సీన్‌తో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ప్రత్యేక అధికారి చరణ్ రాజ్ రంగంలోకి దిగాక కథలో వేగం పుంజుకుంటుంది. అయితే పోలీసులకు, హీరో గ్యాంగ్‌కు మధ్య జరిగే మైండ్ గేమ్ అంత ఆసక్తికరంగా సాగదు. ప్రధాన పాత్రల ఫ్లాష్ బ్యాక్‌ని కొంచెం కొంచెంగా చూపిస్తూ.. అసలు విషయం ఏంటో చెప్పకుండా గందరగోళానికి గురిచేశారు. కథంతా జైలు గోడమధ్యే తిరుగుతూ.. ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతుంది. పైగా మహిళా జర్నలిస్ట్.. ఆమె తండ్రికి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోవడమే కాకుండా..అనవసరం అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. బిగ్డాడీ నేపథ్యం ఏంటి? వామన్ని ఎందుకు కిడ్నాప్ చేశాడు? జైలులో ఉన్న 1000 కేజీల బంగారంతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలన్నీంటికి సెకండాఫ్‌లో సమాధానం దొరుకుంది. అయితే ద్వితియార్థంలో కూడా హీరోని ఎలివేట్ చేసే సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమంత్రి కొడుకుని హీరో చంపేసే సీన్ ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో చరణ్ రాజ్‌కు బిగ్డాడీ ఇచ్చే వార్నింగ్ సీన్ కూడా అదిరిపోతుంది. యాక్షన్ పరంగా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది. కానీ కథ,కథనంలో పసలేదు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కథకి ఇరికించినట్లుగా అనిపిస్తుంది. సీక్వెల్ కోసమే అనట్లుగా పలు ప్రశ్నలు లేవనెత్తి.. అసంతృప్తిగా సినిమాను ముగించారు. ఎవరెలా చేశారంటే.. ఇది పక్కా శివరాజ్ కుమార్ చిత్రం. దర్శకుడు ఆయనను దృష్టిలో పెట్టుకొనే కథను రాసుకుని ఉంటాడు. కొన్ని స్టైలీష్ యాక్షన్ సీన్స్ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కళ్లతోనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. సినిమా క్లైమాక్స్‌లో టెక్నాలజీ ద్వారా శివరాజ్‌ని యంగ్‌గా చూపించడం అభిమానులను అలరిస్తుంది. పోలీసు అధికారి చరణ్‌రాజ్ పాత్రలో జయరామ్ ఒదిగిపోయాడు.. వామన్ శ్రీనివాసన్ పాత్రలో ప్రశాంత్ నారాయణన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. అర్జున్ జన్యా నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్ హీరో
శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న తాజా మైథలాజికల్ ఫిల్మ్ ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి కన్నడ యాక్టర్ శివ రాజ్‌కుమార్ పేరు చేరింది. ఓ కీలక పాత్రకు శివ రాజ్‌కుమార్‌ని తీసుకున్న విషయాన్ని గురువారం యూనిట్ తెలియజేసింది. సినిమాలో కీలకపై శివుని పాత్రలో ప్రభాస్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్‌కి జోడిగా..అంటే పార్వతిగా నయనతార నటించబోతున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో శివరాజ్ కుమార్ చేరడంతో ‘కన్నప్ప’పై మరింత హైప్ క్రియేట్అయింది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం చేశారు. Har Har Mahadev ❤️ https://t.co/liGw4R0Rxv — Vishnu Manchu (@iVishnuManchu) October 12, 2023 -
ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' టీజర్ రిలీజ్
సౌత్ ఇండియా స్టార్ ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ సినిమా 'కెప్టెన్ మిల్లర్'. జి.శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. సందీప్ కిషన్‌తో పాటు శివరాజ్ కుమార్, ప్రియాంక మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేడు (జులై 28) ధనుష్ పుట్టినరోజు సందర్భంగా కెప్టెన్ మిల్లర్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?) 1930-40ల నేపథ్యంలో సాగే పీరియాడికల్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. అందులో ధనుష్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన లూయిస్ మెషిన్ గన్ను చేతిలో పట్టుకొని యుద్ధభూమిలో కనిపించాడు. ఈ టీజర్ నిడివి 100 సెకన్స్ లోపు మాత్రమే ఉన్నా.. ఈ సినిమాకు చెందిన ప్రధాన పాత్రలు అన్నిటినీ చూపించారు. ధనుష్ గొడ్డలితోనే కాకుండా తుపాకీతో తూటాలు విదిల్చిన తీరు కూడా అమోఘం. డిసెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ధనుష్కెరీయర్లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. దానికి తోడు పీరియాడిక్ నేపథ్యం సినిమా కాబట్టి మరిన్ని అంచనాలు పెంచింది. -
నా కళ్లతో భయపెట్టాను!
‘‘మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నా కళ్లతో భయపెట్టాను. దే కాల్ మీ ఓజీ... ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే డైలాగ్‌తో ‘ఘోస్ట్’ సినిమా టీజర్ విడుదలైంది. కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ నటించిన చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని (బీర్బల్) దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. బుధవారం శివ రాజ్ కుమార్ పుట్టినరోజుని (జూలై 12) పురస్కరించుకుని ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దసరాకి ‘ఘోస్ట్’ ప్రేక్షకుల ముందుకి రానుంది. తెలుగు నిర్మాతతో... శివ రాజ్‌కుమార్ హీరోగా తెలుగు నిర్మాత సుధీర్ చంద్ర పదిరి కన్నడంలో ఓ సినిమా నిర్మించనున్నారు. శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి కార్తీక్ అద్వైత్ దర్శకత్వం వహించనున్నారు. ఎస్సీఎఫ్సీపై (సుధీర్ చంద్ర ఫిల్మ్ కంపెనీ) సుధీర్ చంద్ర పదిరి నిర్మించనున్న ఈ మూవీ క్యారెక్టర్ కాన్సెప్ట్ ΄ోస్టర్‌ని బుధవారం రిలీజ్ చేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్. -
ప్రభాస్‌కు వేద టీమ్ కృతజ్ఞతలు
కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ 125వ చిత్రం వేద. అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్లో ఇది మొదటి వెంచర్‌గా నిర్మితమైంది. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న తెలుగులో రిలీజ్ కానుంది. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్స్ ఇదివరకే ఆవిష్కరించింది చిత్ర బృందం. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది చిత్రయూనిట్. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ.. 'ఈ సినిమా కథ నచ్చి కొనుక్కున్నాను. ఒక మంచి సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ నాకు అవకాశం దక్కింది. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నాము. శివ రాజ్ కుమార్ ఫ్యామిలీకి మన తెలుగులో ఎంతో ఆదరణ ఉంది. మనం కూడా శివన్న అని పిలుచుకుంటాం. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వాళ్ళు కూడా హాజరవుతారు' అంటూ తెలిపారు. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై విజయం సాధించింది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది ఈ చిత్రంలో నటించారు. చదవండి: నా భర్తకు మరొకరితో ఎఫైర్.. నన్ను వాడుకున్నాడంటూ ఏడుపందుకున్న నటి ఆ రికార్డులు తిరగరాసిన పఠాన్.. దంగల్‌కు ఒక్క అడుగు దూరంలో -
ధనుష్‌కి వీరాభిమాని: కన్నడ స్టార్ హీరో
చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు ధనుష్. కోలీవుడ్, హాలీవుడ్ వయా బాలీవుడ్ అంటూ పరుగులు పెడుతున్న ఈయన ఇప్పటికే తెలుగు చిత్రపశ్రమంలోనూ అడుగు పెట్టారు. ఈ ఏడాది ఈయన నటించిన మారన్, ది గ్రే మెన్, తిరుచ్చిట్రం ఫలం, నానే వరువేన్ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. తాజాగా తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్న వాతి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తెరపై రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా మరో తెలుగు చిత్రంలో కూడా నటిస్తున్నారు. తమిళంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం చేస్తున్నారు. రాఖీ, సానికాగితం చిత్రాల ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇందులో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ధనుష్‌కు అన్నయ్యగా నటించడం విశేషం. ప్రస్తుతం ఈయన ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ధనుష్‌తో కలిసి నటించడం గురించి శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. తాను ధనుష్‌కు వీరాభిమాని అన్నారు. ఆయన నటించిన అన్ని చిత్రాలు చూస్తానని చెప్పారు. అలాంటిది ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. కాగా శివరాజ్ కుమార్, రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న జైలర్ చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషి స్తున్నారు. ఇలా ఒకేసారి ధనుష్, ఆయన మామతోనూ శివరాజ్ కుమార్ కలిసి నటించడం విశేషం. చదవండి: హీరోయిన్ అయితే అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్ ఘాటు రిప్లై తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన కీర్తి సురేశ్ -
తలైవాతో ఢీ అంటున్న శివరాజ్‌కుమార్
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నాత్తే తరువాత నటిస్తున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. పడయప్పా తరువాత నటి రమ్యకృష్ణ రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అదే విధంగా నటుడు వసంత్ రవి, యోగిబాబు, వినాయగన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోకి తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వచ్చారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న జైలర్ చిత్రం గత ఆగస్టు నెలలో ప్రారంభమైంది. ఇటీవల కడలూర్ ప్రాంతంలో రెండో షెడ్యూల్ జరుపుకుంది. ఇప్పటికే 59 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై జైలర్ చిత్రంపై అంచనాలను పెంచేసింది. చిత్రంలో తలైవా యాక్షన్ సన్నివేశాలు హైఓల్టేజ్‌లో ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. చిత్ర మేకింగ్ వీడియోను విడుదల చేయగా అది ట్రెండింగ్ అవుతోంది. కాగా జైలర్ చిత్రంలో శివరాజ్ కుమార్ రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబంతో రజినీకాంత్‌కు ఎంతో అనుబంధం ఉంది. అలాంటిది జైలర్ చిత్రంలో రజనీకాంత్‌ను శివ రాజ్ కుమార్ ఢీ కొనే సన్నివేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. -
‘ఘోస్ట్’గా శివరాజ్ కుమార్.. ఫస్ట్‌లుక్ అదిరింది!
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఘోస్ట్’. హైయెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘బీర్బల్’ ఫేమ్ శ్రీని దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నేడు(జులై 12) శివరాజ్ కుమార్ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘ఘోస్ట్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ని కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విడుదల చేశారు. గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్న శివరాజ్ కుమార్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది.సెర్చ్ లైట్, బైకర్స్, కార్స్, గన్స్... వీటితో డిజైన్ చేసిన పోస్టర్ చూస్తే.. ఇది భారీ యాక్షన్ చిత్రమని తెలిసిపోతుంది. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. తగరు, సలగ చిత్రాలకు మాటలందించిన మస్తీ, కన్నడ చిత్రాల్లో అత్యుత్తమ థ్రిల్లర్స్ లో ఒకటిగా చెప్పుకునే బీర్బల్ కి సంభాషణలు రాసిన ప్రసన్న వి ఎం 'ఘోస్ట్' కి డైలాగ్స్ రాస్తున్నారు. కేజీయఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు.ఆగస్ట్ చివరి వారంలో 'ఘోస్ట్' చిత్రీకరణ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. -
కత్రినా పెళ్లి.. తల్లిదండ్రులుగా బిగ్‌బీ దంపతులు!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు తల్లిదండ్రుగా మారి ఆమె వివాహాం జరిపించారు బాలీవుడ్ బిగ్‌బీ దంపతులు అమితాబ్ బచ్చన్, జయబచ్చన్లు. ఈ వివాహా మహోత్సవానికి తెలుగు, తమిళ, కన్నడ అగ్రకథానాయకులు నాగార్జున, ప్రభు, శివరాజ్‌లు హజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటి కత్రినా పెళ్లి జరిగిందా! ఎవరితో.. అది కూడా బిగ్‌బీ దంపతులు తల్లిదండ్రులుగా ఆమెకు వివాహాం జరిపించడమేంటి అని షాక్ అవుతున్నారా. అయితే ఇదంతా జరిగింది రీల్లో రీయల్గా కాదు. అసలు విషయం ఎంటంటే కత్రినా ప్రముఖ కళ్యాణ్ జ్యూవెల్లర్స్ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ నగల దుకాణం ప్రమోషన్లో భాగంగా ఓ యాడ్‌ను చిత్రికరిస్తున్నారు. ఇందులో కత్రినా పెళ్లి కూతిరిగా కనిపించగా ఆమెకు తల్లిదండ్రులుగా బిగ్‌బీ, ఆయన సతిమణి జయ బచ్చన్లు కనిపించనున్నారు. ఈ పెళ్లిలో నాగార్జున, ప్రభు గణేషన్, శివ రాజ్కూమార్లు ముఖ్య అతిథులుగా హాజరై పెళ్లి జరిపించారు. కాగా కళ్యాణ్ జ్యూవెల్లర్స్‌కు తెలుగులో అంబాసిడర్‌గా నాగార్జున వ్యవహిరించగా తమిళంలో ప్రభు గణేషన్, కన్నడలో శివరాజ్ కుమార్‌లు అంబాసిడర్లుగా వ్యవహిరస్తున్నారు. వీరితో పాటు అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ అంబాసిడర్లుగా ఉన్నారు. T 3419 - - Historic moment for Jaya and me .. 3 superstar sons of 3 Iconic Legends of Indian Film Industry , work together with us .. what honour .. Nagarjun - son Akkineni Nageshwara Rao, Telugu Shivraj Kumar - son Dr Raaj Kumar, Kannada Prabhu - son Shivaji Ganesan, Tamil pic.twitter.com/Plvtd372ZH — Amitabh Bachchan (@SrBachchan) 24 January 2020 కాగా ఈ యాడ్‌కు సంబంధించిన షూటింగ్ ఫొటోలను బిగ్ బీ తన ట్విటర్ షేర్ చేస్తూ.. ‘జయకు నాకు ఇది ఎంతో గౌరవకారణమైనది. దీన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం. సీనీ పరిశ్రమలోని ముగ్గురూ లెజెండరి సూపరస్టార్ కుమారులతో కలిసి నటించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. తెలుగు అగ్రకథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున, తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేషన్ తనయుడు ప్రభు గణేషన్, కన్నడ స్టార్ రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్ కుమార్‌లతో కలిసి నటించాము’ అంటూ షేర్ చేశారు. తమ అభిమాన సూపర్ స్టార్లను ఒకే వేధికపై చూసిన ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా ఉండదు. అలాంటిది ఒకే తెరపై కలిసి నటిస్తూ అది కూడా వివాహా వేడుకల్లో చూస్తే ఇంకా అభిమానులకు ఎంతటి కనుల పండగగా ఉంటుందో మీరే ఊహించుకోండి. -
కన్నడ దాడుల్లో 11 కోట్ల ఆస్తులు లభ్యం
బెంగళూరు: కన్నడ సినీ ప్రముఖుల నివాసాల్లో చేపట్టిన సోదాల్లో రూ. 11 కోట్ల విలువైన ఆస్తులు, నగదు లభ్యమైనట్లు ఆదాయ పన్ను అధికారులు వెల్లడించారు. అలాగే, లెక్కల్లో చూపని రూ.109 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉన్నట్లు కూడా నిందితులు అంగీకరించినట్లు తెలిపారు. నటులు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, యశ్, నిర్మాతలు సీఆర్ మనోహర్, రాక్‌లైన్ వెంకటేశ్, విజయ్ కిరిగందూర్ ఇళ్లపై గురువారం నుంచి శనివారం వరకు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ వివరాల్ని అధికారులు ఆదివారం మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన రూ.11 కోట్ల ఆస్తుల్లో రూ.2.85 కోట్ల నగదు, 25.3 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు చెప్పారు. తమకు దొరికిన ఆధారాల్ని రెవెన్యూ, ఇతర విచారణ సంస్థలకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. కర్ణాటక, గోవాలో పనిచేస్తున్న 180 మంది అధికారులు మొత్తం 26 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. -
వెబ్ సిరీస్‌లో...
ప్రేక్షకులు ఎక్కడుంటే అక్కడికి వెళ్లడానికి వెనకాడటం లేదు యాక్టర్స్. అది బిగ్ స్క్రీన్ అయినా, స్మాల్ స్క్రీన్ అయినా, డిజిటల్ ఫ్లాట్‌ఫారమ్ అయినా ఆలోచించడం లేదు. వాళ్లను అలరించడమే అంతిమ లక్ష్యం అంటున్నారు. ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నట్టున్నారు. తన కుమార్తె నిర్మించే ఓ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారాయన. ‘మానస సరోవర’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సిరీస్‌ను ఎక్కువ శాతం ఫారిన్లో షూట్ చేయనున్నారని శాండిల్‌వుడ్ సమాచారమ్. ఈ వెబ్ సిరీస్‌లో కన్నడలోని స్టార్ యాక్టర్స్‌తో పాటు టీవీ ఆర్టిస్ట్‌లు కూడా కనిపిస్తారట. -
ఏప్రిల్ 7, 8న కేసీసీ క్రికెట్ టోర్నీ
కేపీఎల్, సీసీఎల్ తరహాలో సాండల్‌వుడ్ హీరోలతో కొత్తగా కేసీసీ టోర్నీ నిర్వహించటానికి రంగం సిద్దమైంది. కర్ణాటక చలనచిత్ర కప్ పేరుతో నిర్వహించే ఈ పోటీలకు జట్టును ఎంపిక చేశారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఆరు జట్లను ఎంపిక చేశారు. మాజీ క్రికెటర్ అనిల్‌కుంబ్లే జట్టు ఎంపికకు సంబంధించి నియమ, నిబంధనలను వివరించారు. ఈ పోటీలు ఏప్రిల్ 7, 8 రెండు రోజుల పాటు 10 ఓవర్లతో ఆదిత్య గోబ్లల్ మైదానంలో జరుగునుంది. ఇందులో పాత్రికేయులు, సినిమా డైరక్టర్లు, నిర్మాతలు, నటులకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుధీప్, రవిచంద్రన్, వినయ్‌కుమార్, అశోక్ఖేణిలు పాల్గొన్నారు. -
ఆరుగురు హీరోయిన్లు... ఒక హీరో
ఏకంగా ఆరుగురు గోపికలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు స్టార్ హీరో శివరాజ్‌కుమార్. సుదీప్, శివరాజ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా ప్రేమ్ దర్శకత్వంలో సీఆర్ మనోహర్ నిర్మిస్తోన్న మల్టీస్టారర్ మూవీ ‘ది విలన్’. ఆల్రెడీ సుదీప్ వంతు టాకీపార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు శివరాజ్ కుమార్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే.. అదిరిపోయే లెవల్లో శివరాజ్‌కుమార్‌పై ఓ ఇంట్రడక్షన్ సాంగ్‌ను ప్లాన్ చేశారు ప్రేమ్. ఈ సాంగ్‌లోనే ఆరుగురు హీరోయిన్లు కనిపిస్తారట. ఆల్రెడీ రచితా రామ్, శ్రద్ధా శ్రీనాథ్, రాధికా చేతన్‌లను ఈ సాంగ్ కోసం ఎంపిక చేశారని శాండిల్‌వుడ్ సమాచారం. మరో ముగ్గురి ఎంపిక జరుగుతోందట. అంతేకాదు.. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇందులో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్ రోల్ చేస్తున్నారు. ‘ది విలన్’ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
శాండిల్‌వుడ్‌లో సూపర్ ఆఫర్
నటి ఎమీజాక్సన్‌కు శాండిల్‌వుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. అదీ సూపర్ ఆఫర్‌తో, ఎమీ కోలీవుడ్‌కు వచ్చే ముందు నక్కను తొక్కొచ్చి ఉంటుంది. వరుసగా లక్కీ ఆఫర్లు తలుపు తడుతున్నాయి. మదరాసుపట్టణంతో కోలీవుడ్ గడప తొక్కిన ఈ ఇంగ్లీష్ భామకు ఆ తరువాత పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా స్టార్ డైరెక్టర్ శంకర్ నుంచి ఐ చిత్రంలో నటించే భారీ అవకాశం తలుపు తట్టింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందించకపోయినా బాలీవుడ్‌కు ఎగుమతి అయ్యింది. అక్కడా విజయాన్ని అందుకోలేకపోయినా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేసే అనూహ్య అవకాశాన్ని మళ్లీ దర్శకుడు శంకర్‌నే కల్పించారు. దీన్ని లక్కు అనక మరేమంటారు. మధ్యలో టాలీవుడ్‌లోనూ ఎవడు అనే చిత్రంతో అడుగు పెట్టేసింది. ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా నటించిన 2.ఓ చిత్రం విజయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఎమీజాక్సన్ పనిలో పనిగా చెన్నైలో ఇక అందమైన ఇల్లు కొనేసుకుంది. ఇలా స్థిరాస్తులు కూడగట్టుకుంటున్న ఈ బ్యూటీ తదుపరి చిత్రం ఏంటని ఆలోచించుకునేలోపే శాండిల్‌వుడ్ నుంచి ఒక సూపర్ ఆఫర్ వచ్చేసింది. అక్కడ సూపర్‌స్టార్స్‌గా రాణిస్తున్న శివరాజ్‌కుమార్, కిచ్చా సుధీప్లతో కలిసి నటించే మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశం ఎమీ ముంగిట వాలింది. అంతే సంతోషంతో ఎగిరి గంతేసి ఒప్పేసుకుందట. దీనికి ది విలన్ అనే టైటిల్ నిర్ణయించారు. ఈ చిత్రానికి ప్రేమ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రేజీ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. -
జల సాధనే ధ్యేయం
శాశ్వత నీటి పారుదల పోరాట వేదిక ప్రారంభోత్సవంలో సినీనటుడు శివరాజ్‌కుమార్ నీటి పోరాటానికి శాండిల్‌వుడ్ బాసట కోలారుకు కదలి వచ్చిన సినీ ప్రముఖులు కోలారు : ప్రపంచానికి బంగారాన్ని అందించిన కోలారు జిల్లా నేడు తాగు, సాగునీటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, ఈ ప్రాంతానికి శాశ్వత జలాల సౌలభ్యాలు అందాలంటే నిరంతర పోరాటాలే శరణ్యమని సినీ నటుడు శివరాజ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజలు చేపట్టే ఆందోళనలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. బయలుసీమ జిల్లాలకు శాశ్వత నీటి పారుదల సౌలభ్యాల కోసం ఏర్పాటు చేసిన శాశ్వత నీటిపారుదల పోరాట వేదికను ఆదివారం ఆయన పలువురు సినీ ప్రముఖులతో కలిసి కోలారులో ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న సినీ ప్రముఖులు శివరాజ్‌కుమార్, యశ్, సాధుకోకిల, పూజాగాంధీ, రాగిణి ద్వివేది, పద్మావాసంతి, చిరంజీవి సర్జా, రాక్‌లైన్ వెంకటేష్, చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు థామస్ డిసౌజా, సారా గోవిందు, ఆది లోకేష్, ప్రముఖ నిర్మాత, ఎమ్మెల్సీ మనోహర్, చలన చిత్ర రంగానికి చెందిన కార్మిక, నిర్మాపక, దర్శక సంఘాల ప్రముఖులు ఐషర్ వాహనంలో ర్యాలీగా సర్వజ్ఞ పార్కు వద్ద ఏర్పాటు చేసిన శాశ్విత నీటిపారుదల పోరాట వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా శాశ్వత నీటి పారుదల పోరాట వేదికను జ్యోతి వెలిగించి ప్రారంభించిన శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ ఈ పోరాట వేదికలో జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నీటి సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమించాలన్నారు. ఈ పోరాటంలో తాము కూడా పాలు పంచుకుంటామన్నారు. జిల్లాకు తాగునీటిని అందించే విషయంలో తాము ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమన్నారు. నిర్మాత, ఎమ్మెల్సీ మనోహర్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. పశ్చిమ కనుమల నుంచి 250 నుంచి 300 టీఎంసీల వరకు నీరు సముద్రంలో కలుస్తోందని, అందులో నుంచి 25 టీఎంసీలను బయలు సీమ జిల్లాలకు అందిస్తే ఈ ప్రాంతం సస్యశామలం అవుతుందన్నారు. అనంతరం నటులు యశ్, చిరంజీవి సర్జా, సాధుకోకిల, పూజాగాంధీ, రాగిణి మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘటనల కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సినీ నటుల రాకతో కోలారు జనసంద్రమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు వారికి నీరాజనం పలికారు. -
'హత్తుకున్నాక.. 4 రోజులు స్నానం చేయలేదు'
బెంగళూరు: జీవితంలో తాను సాధించిన విజయాలు, పేరు ప్రతిష్ఠలు తన తండ్రి, కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్‌కు అంకిత మిస్తున్నట్టు ఆయన కుమారుడు శివరాజ్ కుమార్ ప్రకటించారు. కర్ణాటక చలనచిత్ర అకాడమీ, బెంగళూరులో నిర్వహించిన బెళ్లి హెజ్జి కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ దంపతులకు నిర్వాహకులు ఘన సన్మానం చేశారు. అనంతరం శివరాజక్ కుమార్ తన జీవితంలోని కొన్ని సంగతులను మీడియాతో పంచుకున్నారు. తండ్రి అడుగు జాడల్లోనే తాను నడుస్తున్నానని, ఆయనే తనకు ఆదర్శమని పేర్కొన్నారు. . ఆయన తన నటజీవితంలో చిన్నా, పెద్దా నటులందరితోనూ కలిసి పనిచేశారని ఈ స్టార్ హీరో గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా శంకర్ నాగ్, అనంత్ నాగ్, విష్ణువర్ధన్, అంబరీష్ అందరితో నటించారన్నారు. తాను కూడా భవిష్యత్తులో కన్నడ సినీ పరిశ్రమలో హీరోలందరితోనూ నటించే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పారు. తాను చిన్నప్పటినుంచి స్టార్ కొడుకుగా కాకుండా సాధారణ పిల్లాడిలా పెరిగానని చెప్పుకొచ్చారు. కాలేజీకి బస్ లో వెళ్లేవాడినన్నారు. తాను సినిమాల్లోకి రాకుండా ఉండి వుంటే మంచి క్రికెటర్ అయి వుండేవాడినని తెలిపారు. కాలేజీలో చదువుకునే సమయంలో క్రికెట్ బాగా ఆడేవాడిననీ, దాన్ని అలా కొనసాగించి ఉండి ఉంటే దేశం కోసం మంచి క్రికెటర్‌గా మిగలేవాడినన్నారు. కానీ విధి మరోలా ఉండి యాక్టింగ్ స్కూలుకు వెళ్లాల్సి వచ్చిందంటూ చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనొక ఆసక్తికర విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే తనకు చాలా ఇష్టమని, వల్లమాలిన అభిమానమని చెప్పారు. అందుకే ఒకసారి కమల్ హాసన్ తనను ఆలింగనం చేసుకున్నపుడు నాలుగు రోజులు స్నానం చేయలేదన్నారు. ఎందుకంటే ఆయన్ని హత్తుకున్న పరిమళం తనను వీడిపోవడం ఇష్టంలేక అలా చేశానని వెల్లడించారు. కాగా ఇప్పటికే 100 సినిమాల మార్క్ ను దాటి విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న శివరాజ్ కుమార్, యువహీరో సందీప్‌తో కలిసి 'కుంభ మేళా'లో నటించనున్నారు. దీంతోపాటు సోదరుడు, మరో టాప్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. -
సూపర్ స్టార్లతో ఏలేటి సాహసం
రెగ్యులర్ కమర్షియల్ జానర్‌కు భిన్నంగా కొత్త తరహా సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలను తీస్తూ వస్తున్న ఈ డైరెక్టర్, ఇంతవరకు ఒక్క భారీ కమర్షియల్ సక్సెస్ కూడా అందుకోలేకపోయినా, దర్శకుడిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. సాహసం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న చంద్రశేఖర్ ఏలేటి ప్రస్తుతం ఓ మల్టీ లింగ్యువల్ సినిమాకు రెడీ అవుతున్నాడు. వారాహి చలనచిత్ర బ్యానర్‌పై సాయి కొరపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లీడ్రోల్లో నటిస్తుండగా చాలాకాలం తరువాత గౌతమి హీరోయిన్గా నటిస్తుంది. తెలుగు, తమిళ్‌తో పాటు ఈ సినిమాను కన్నడలో కూడా తెరకెక్కించాలని భావిస్తున్న ఏలేటి, కన్నడ వర్షన్లో హీరోగా సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ను ఒప్పించాలని ట్రై చేస్తున్నాడు. బాలీవుడ్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
వైభవంగా శివన్న తనయ వివాహం
శాండల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్ కుమార్తె డాక్టర్ నిరుపమా వివాహం సోమవారం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌కు చెందిన ఎల్.మంజేగౌడ, పార్వతి దంపతుల ద్వితీయ కుమారుడు డాక్టర్ దిలీప్ కుమార్‌తో డాక్టర్ నిరుపమా ఏడడుగులు నడిచి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునతో పాటు తమిళనటుడు ప్రభు, శాండల్‌వుడ్ నటులు దర్శన్, కిచ్చా సుదీప్, రవిచంద్రన్, గణేష్, సీనియర్ నటీమణులు జయంతి, అంబికా, లీలావతి, భారతి, జయమాలా తదితరులు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు ఎస్.ఎంృకష్ణ, రాష్ట్ర మంత్రి ఆర్.వి.దేశ్‌పాండే, తమిళనాడుకు చెందిన స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం త్రిపుర వాసినిలో నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి హాజరుకావడం విశేషం. - సాక్షి, బెంగళూరు -
స్మగ్లర్ వీరప్పన్ షూటింగ్ ప్రారంభం
హైదరాబాద్ : గంధపు చెక్కల స్మగ్లింగ్‌తో పలు రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన స్మగ్లర్ వీరప్పన్. అతడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభించినట్లు రాంగోపాల్ వర్మ గురువారం ట్విట్టర్లో వెల్లడించారు. వీరప్పన్ వేట కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు... ఆ క్రమంలో అతడిని మట్టుబెట్టడం కథాంశంగా ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్నారు. గంధపు చెక్కల వీరప్పన్ కోసం ప్రభుత్వం చేపట్టిన వేట అప్పట్లో ఆసియా ఖండంలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శివరాజుకుమార్ ఉన్నతాధికారిగా కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రంలో వీరప్పన్ పాత్రధారిని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఎంపిక చేసిన విషయం విదితమే. రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగశెట్టి, పరుల్ యాదవ్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రం తెరకెక్కించే క్రమంలో రాంగోపాల్ వర్మ... వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీని కలిశారు. -
కన్నడ సినీ దర్శకుడు రాజేంద్ర బాబు కన్నుమూత!
ప్రముఖ కన్నడ సినీ దర్శకుడు, రచయిత డి రాజేంద్ర బాబు ఆదివారం గుండెపోటుతో బెంగళూరులో కన్నుమూశారు. 62 సంవత్సరాల రాజేంద్ర బాబు కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. మా నాన్నకు గుండెపోటు రావడంతో వెంటనే రామయ్య ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరకముందే కన్నుమూశారు అని వైద్యులు నిర్ధారించారని రాజేంద్ర బాబు కూతురు నక్షత్ర మీడియాకు తెలిపారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన గత కొద్దికాలంగా అస్వస్థతకు గురయ్యారన్నారు. రాజేంద్ర బాబు 50 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కెరీర్ లో పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. ఆయన కొన్ని తెలుగు, మలయాళ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. 1987లో గోవిందా, మందాకిని నటించిన ప్యార్ కర్కే దేఖో అనే హిందీ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. నాను నన్న హెందతి, ఒలవినా ఉదుగోరే, రామాచారి, రామరాజ్యదల్లి రక్షసరు, హలుందా తవరు, అప్పాజీ, దిగ్గజారు, అమ్మ, ఎన్ కౌంటర్ దయానాయక్, బిందాస్ వంటి హిట్ చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. రాజేంద్ర బాబు మృతికి కన్నడ నటులు శివరాజ్ కుమార్, ఉపేంద్ర, లోకసభ సభ్యులు రమ్యతోపాటు పలువురు సంతాపం వెలిబుచ్చారు.