#RC16లో స్టార్‌ హీరో.. తెలుగులో తొలిసారి..! | Shivarajkumar Joins Ram Charan 16th Movie | Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్‌ సినిమాలో మరో స్టార్‌ హీరో..

Published Fri, Jul 12 2024 2:11 PM | Last Updated on Fri, Jul 12 2024 3:21 PM

Shivarajkumar Joins Ram Charan 16th Movie

శివరాజ్‌కుమార్‌.. కన్నడలో స్టార్‌ హీరో! తన సినిమాలు తెలుగులోనూ డబ్‌ కావడంతో ఇక్కడివారికీ సుపరిచితుడే! గతేడాది జైలర్‌ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను అబ్బురపరిచాడు. ప్రస్తుతం ఆయన తెలుగులో డైరెక్ట్‌గా ఓ సినిమా చేస్తున్నాడు. నేడు (జూలై 12న) శివరాజ్‌కుమార్‌ బర్త్‌డే కావడంతో ఓ సర్‌ప్రైజ్‌ వదిలారు. రామ్‌ చరణ్‌- బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో శివన్న భాగమైనట్లు ఓ పోస్టర్‌ వదిలారు. అందులో తెలుగు సినిమాకు స్వాగతమని పేర్కొన్నారు.

అప్పుడు అతిథిగా..
శివన్న తొలిసారి తెలుగులో పూర్తి స్థాయిలో నటించనున్నాడన్నమాట! 2017లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణిలో అతిథి పాత్రలో మెరిశారు. ఆ తర్వాత తెలుగులో డైరెక్ట్‌ సినిమాలో నటించనేలేదు. కన్నప్ప మూవీలోనూ ఈయన నటించనున్నట్లు అప్పట్లో రూమర్స్‌ వచ్చాయి. దీనిపై విష్ణు స్పందిస్తూ హరహర మహాదేవ్‌ అని ట్వీట్‌ వేశాడు.  దీంతో ఈ సినిమాలోనూ శివన్న ఉన్నాడని అభిమానులు ఫిక్సయిపోయారు.

మేకోవర్‌..
రామ్‌చరణ్‌ 16వ సినిమా విషయానికి వస్తే.. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చరణ్‌ కండలు పెంచాలనుకుంటున్నాడట! ఈ మేకోవర్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లి కొంతకాలం అక్కడ శిక్షణ తీసుకోనున్నాడట! ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్, వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మించనున్నారు. ఆగస్టు నెలాఖరులో షూటింగ్‌ ప్రారంభించేందుకు చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

 

 

చదవండి: 25 రోజులు మిస్సింగ్‌.. నటుడిని గుర్తుపట్టని తల్లి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement