
కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ 125వ చిత్రం వేద. అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా నిర్మితమైంది. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న తెలుగులో రిలీజ్ కానుంది. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్స్ ఇదివరకే ఆవిష్కరించింది చిత్ర బృందం. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది చిత్రయూనిట్.
కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ.. 'ఈ సినిమా కథ నచ్చి కొనుక్కున్నాను. ఒక మంచి సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ నాకు అవకాశం దక్కింది. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నాము. శివ రాజ్ కుమార్ ఫ్యామిలీకి మన తెలుగులో ఎంతో ఆదరణ ఉంది. మనం కూడా శివన్న అని పిలుచుకుంటాం. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వాళ్ళు కూడా హాజరవుతారు' అంటూ తెలిపారు. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై విజయం సాధించింది. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ మరియు అనేక మంది ఈ చిత్రంలో నటించారు.
చదవండి: నా భర్తకు మరొకరితో ఎఫైర్.. నన్ను వాడుకున్నాడంటూ ఏడుపందుకున్న నటి
ఆ రికార్డులు తిరగరాసిన పఠాన్.. దంగల్‌కు ఒక్క అడుగు దూరంలో
Comments
Please login to add a commentAdd a comment