వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే? | Mad Square Day 4 Collection Worldwide | Sakshi
Sakshi News home page

Mad Square Collection: దుమ్ముదులుపుతున్న మ్యాడ్ స్క్వేర్

Published Tue, Apr 1 2025 3:13 PM | Last Updated on Tue, Apr 1 2025 3:28 PM

Mad Square Day 4 Collection Worldwide

ఉగాది-రంజాన్ కానుకగా థియేటర్లలోకి నాలుగైదు సినిమాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. వస్తున్న కలెక్షన్సే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిన ఈ చిత్రం.. రూ.100 కోట్లకు చేరువలో ఉంది.

(ఇదీ చదవండి: దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్‌ చేయండి: నాగవంశీ)

తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం.. 4 రోజుల్లో ఈ సినిమాకు రూ.69.4 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు పేర్కొన్నారు. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు తొలిరోజు వచ్చిన టాక్, ఇప్పుడు వస్తున్న వసూళ్లకు ఏ మాత్రం సంబంధం లేదని చె‍ప్పొచ్చు. ఓవర్సీస్ లోనూ ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్ వసూళ్లు దాటేసింది.

ప్రస్తుతం ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ అయ్యేసరికి రూ.100 కోట్ల మార్క్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉందని చివర్లో ప్రకటించారు. మరి అది ఎప్పుడు తీసి రిలీజ్ చేస్తారో చూడాలి?

(ఇదీ చదవండి: యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement