
నాగిని పాత్రలో నటించి యమ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మౌనీ రాయ్. తొలుత టీవీ సీరియల్స్ చేసినప్పటికీ.. ప్రస్తుతం సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈమె చేసిన లేటెస్ట్ మూవీ 'భూత్ని'. మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న మౌనీ.. తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని బయటపెట్టింది.
'సరిగా గుర్తులేదు. ఓసారి ఒక ఊరికి వెళ్లాం. ఎవరో వ్యక్తి నా హోటల్ రూం తాళం దొంగింలించాడు. అర్థరాత్రి తాళం ఉపయోగించి నా రూంలోకి రావాలని తెగ ప్రయత్నించాడు. అదే టైంలో నా మేనేజర్ తో కలిసి నేను గదిలోనే ఉన్నాను. తొలుత షాకయ్యాం గానీ తర్వాత గట్టిగా అరిచాం'
(ఇదీ చదవండి: యువ నటి ఇంట్లో భారీ దొంగతనం)
'ఈ సంఘటన గురించి హోటల్ రిసెప్షనిస్ట్ ని అడిగితే.. హౌస్ కీపింగ్ వాళ్లు అయ్యింటారని సమాధానమిచ్చారు. అర్థరాత్రి 12:30 గంటలకు హౌస్ కీపింగ్ ఏంటి? అని గట్టిగా అడిగా. అదే చాలా భయంకరమైన అనుభవం' అని మౌనీ రాయ్ చెప్పుకొచ్చింది.
మౌనీ రాయ్ వ్యక్తిగత విషయానికొస్తే.. 2022లో సూరజ్ నంబియార్ అనే కేరళకు చెందిన బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటుంది.
(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్)