
టాలీవుడ్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్‌లో 'ఆదిత్య 369' సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1991లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని దక్కించుకుంది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా 4కే డిజిటలైజేషన్ వెర్షన్‌లో ఏప్రిల్ 4న రీరిలీజ్ కానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలకృష్ణ ఈ మూవీలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో మెప్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీరిలీజ్‌తో మరోసారి టైమ్‌మిషన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండండి. ఆదిత్య 369 సినిమా సీక్వెల్‌కి కథ సిద్ధమైందని ఇప్పటికే బాలకృష్ణ ప్రకటించారు.