
‘‘నాకు ఒకే రకమైన పాత్రలు వస్తుండటంతో సినిమాలు వదిలేయాలనుకున్నాను. ఆ సమయంలో దేవుడు ‘రాచరికం’(Racharikam) టీమ్‌ని నా వద్దకి పంపించాడని అనిపించింది. ఈ చిత్రంలో మంచి పాత్ర చేశాను’’ అని అప్సరా రాణి(Apsara Rani) తెలిపారు. విజయ్ శంకర్, అప్సరా రాణి, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event)లో విజయ్ శంకర్ మాట్లాడుతూ–‘‘రాయలసీమ అంటే ఏంటో ‘రాచరికం’ చూపిస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేశాను’’ అని పేర్కొన్నారు వరుణ్ సందేశ్. ‘‘విజయ్‌గారు చాలా అంకితభావంతో ఈ మూవీ కోసం పని చేశారు’’ అని సురేశ్ లంకలపల్లి చెప్పారు. ‘‘ఈ మూవీ బడ్జెట్ పెరిగిపోతోన్న ప్రతిసారి నా మిత్రులే నన్ను సపోర్ట్ చేశారు’’ అన్నారు ఈశ్వర్. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి, ‘ఆదిత్య మ్యూజిక్’ నిరంజన్, కెమేరామేన్ ఆర్య సాయి తదితరులు మాట్లాడారు.