అది చాలా నిజం: రష్మిక | Rashmika Mandanna agrees her husband should be like VD | Sakshi
Sakshi News home page

అది చాలా నిజం: రష్మిక

Published Wed, Feb 28 2024 12:13 AM | Last Updated on Wed, Feb 28 2024 6:56 AM

Rashmika Mandanna agrees her husband should be like VD - Sakshi

వీడీలాంటి భర్త కావాలి 

‘‘రష్మికా మందన్నాకి భర్తగా రావాలంటే అత నికి ఏయే లక్షణాలు ఉండాలి? ఆమె నేషనల్‌ క్రష్‌ కాబట్టి ఆమె భర్త ప్రత్యేకంగా ఉండాలి. చెప్పాలంటే ఆమె భర్త వీడీలా ఉండాలి.. అంటే ‘వెరీ డేరింగ్‌’.. ఆమెను చక్కగా చూసుకోవాలి. మేం ఆమెను రాణి అని పిలుస్తాం. ఆమె భర్త రాజులా ఉండాలి’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా రష్మికా మందన్నా అభిమాని షేర్‌ చేశాడు.

ఆ పోస్ట్‌కి ‘అది..  చాలా నిజం’ అని రష్మిక స్పందించడం హాట్‌ టాపిక్‌ అయింది. అంటే.. ఆ అభిమాని పేర్కొన్నట్లు తనకు వీడీలాంటి భర్త కావాలని ఈ బ్యూటీ స్పష్టం చేశారు. ఇక.. ‘వీడీ’ అంటే విజయ్‌ దేవరకొండ అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా ఈపోస్ట్‌ వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement