
హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) చలనచిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. యానిమల్, పుష్ప 2: ద రూల్, ఛావా.. ఇలా వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకుని బాక్సాఫీస్ క్వీన్‌గానూ మారింది. అయితే రంజాన్ పండక్కి రిలీజైన హిందీ సినిమా సికందర్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
నా విషయంలో నిజం కాదు
అయితేనేం.. ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. మరో మూడు రోజుల్లో రష్మిక మందన్నా బర్త్‌డే (ఏప్రిల్ 4). ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. 'ఇది నా బర్త్‌డే మంత్.. చాలా ఎగ్జయిట్‌గా ఉన్నాను. వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్న ఆసక్తి సన్నగిల్లుతుందని విన్నాను.
నమ్మబుద్ధి కావట్లే
కానీ నా విషయంలో మాత్రం అది నిజం కాదు. ఏ యేటికాయేడు నా బర్త్‌డే జరుపుకునేందుకు మరింత సంతోషంగా, ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అప్పుడే నాకు 29 ఏళ్లు వచ్చేస్తున్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. గడిచిన ఏడాదిలో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. అందుకోసమైనా ఈ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే!' అని రాసుకొచ్చింది.

చదవండి: హెచ్‌సీయూ వివాదం.. నేనెలాగో చనిపోతాను.. దయచేసి.. : రేణూ దేశాయ్ విన్నపం