
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో నేడు (ఏప్రిల్ 28) పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. టాలీవుడ్ నుంచి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పద్మభూషణ్ అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారు.
కాగా కేంద్ర ప్రభుత్వం జనవరి 25న పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను అనౌన్స్ చేసింది.
బాలకృష్ణ ప్రస్థానం
నందమూరి బాలకృష్ణ.. తాతమ్మ కల (1974) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. 14 ఏళ్ల వయసులో తండ్రి రామారావుతో కలిసి నటించారు. సాహసమే జీవితం సినిమాతో హీరోగా మారారు. వందకు పైగా సినిమాలు చేశారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం అఖండ 2 మూవీ చేస్తున్నారు. ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు.
చదవండి: ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు