
పాక్ నౌకలపైనా ఆంక్షలు విధించాలని యోజన
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలను భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. తమ గగన తలం గుండా పాకిస్తానీ ఎయిర్‌లైన్స్ విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. భారత గగనతలాన్ని మూసివేస్తే పాకిస్తాన్ విమానాలకు ప్రయాణం మరింత భారమవుతుంది. సింగపూర్, మలేషియా వంటి ఆగ్నేయ ఆసియా దేశాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి చైనా లేదా శ్రీలంక మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
మరోవైపు పాకిస్తాన్ నౌకలపైనా ఆంక్షలు అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. భారత ఓడరేవుల్లో పాకిస్తాన్ నౌకలకు ఎలాంటి అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశానికి సైతం అనుమతి ఉండబోదు. ఇండియా విమానాలు ప్రయాణించకుండా తమ గగనతలాన్ని పాక్ ప్రభుత్వం గత వారం మూసి వేసిన సంగతి తెలిసిందే.
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగు తున్నాయి. ఇరుదేశాలు పరస్పరం ఆంక్షలు విధి స్తున్నాయి. ప్రధానంగా సింధూనది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేయడం సంచలనాత్మకంగా మారింది. ఇది తమపై ముమ్మాటికీ ప్రకటనేనని పాక్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.