
న్యూఢిల్లీ: ఎంపీగా నియోజకవర్గాన్ని వదులుకున్న వేళ కేరళలోని వయనాడ్ ప్రజలకు ఆదివారం(జూన్23) రాహుల్ గాంధీ భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ‘వయనాడ్‌ను వదులుకున్నందుకు బాధగా ఉంది. ఇన్ని రోజులు మీరిచ్చిన సహకారానికి నా కృతజ్ఞతలు.
మీరు ప్రియాంకను ఎంపీగా ఎన్నుకుంటే బాగా పనిచేస్తుంది. ఆమెను ఇక్కడి నుంచి పోటీ చేయమని నేనే ఒప్పించా. గతంలో నేనెవరో తెలియనపుడే మీరు నన్ను నమ్మారు.
మీ గొంతను పార్లమెంటులో వినిపించినందుకు ఆనందంగా ఉంది. రాయ్‌బరేలి, వయనాడ్ రెండింటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. దేశంలో విద్వేషాన్ని హింసను రెచ్చగొట్టేవారిపై కలిసి పోరాడదాం’అని రాహుల్‌గాంధీ లేఖలో తెలిపారు.
కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్ రెండు నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆయన ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వచ్చింది.