
ఢిల్లీ: ఇటీవలి కాలంలో కాబోయే అల్లుడితో అత్త పరారీ, తన కూతురు మామతో మరో మహిళ జంప్ వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు వారి కుటుంబాలను బజారుకీడుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తన భార్య కనిపించకపోవడంతో టెన్షన్ పడి భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కట్‌చేస్తే.. ఆమె మరో వ్యక్తితో తాజ్‌మహల్ వద్ద కనిపించడంతో సదరు భర్త ఖంగుతున్నాడు.
వివరాల ప్రకారం.. యూపీలోకి అలీఘర్‌కు చెందిన షకీర్, అంజుమ్ భార్యాభర్తలు. వీరిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు. కాగా, షకీర్ ఇటీవల తన కుటుంబ సభ్యుల వివాహం కోసం వేరే ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు, భార్య, పిల్లలు కనిపించలేదు. దీంతో, కంగారు పడిన షకీర్.. ఇంటి చుట్టుపక్కల వారిని అడిగి.. అంతా వెలికాడు. అయినప్పటికీ ఆమె కనిపించకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
అయితే, షకీర్ బంధువు ఒకరు తాజాగా తాజ్‌మహల్ పర్యటకనకు వెళ్లారు. ఈ క్రమంలో అంజుమ్ మరో వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. దీంతో, ఆమె ఫొటో, వీడియోను వాట్సాప్ ద్వారా షకీర్‌కు పంపించారు. దీంతో, షకీర్‌కు ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది. ఇదిలా ఉండగా.. సదరు వ్యక్తి తాను పనిచేసే చోటే వర్క్ చేస్తున్నట్టు గుర్తించాడు. దీంతో, వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. అలీఘర్ పోలీసులు ఆగ్రా పోలీసుల్ని అంజుమ్ గురించి అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఆ జంట కోసం పోలీసులు గాలిస్తున్నారు.