
పల్లెనిద్రలో ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ
సాక్షి టాస్క్‌ఫోర్స్ : బూర్జ గ్రామంలో ఈ నెల 21న జరిగిన పల్లె నిద్ర కార్యక్రమానికి హాజరై న ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్‌కు బొమ్మాళి రేవతి అనే మహిళ సమస్యలపై నిలదీసింది. ఉపాధి పనులు చేపట్టినప్పుడు సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని, సకాలంలో బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు. పార్టీలకతీతంగా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందజేయాలన్నారు.
పాలిసెట్ హాల్‌టికెట్లు సిద్ధం
ఎచ్చెర్ల క్యాంపస్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవే శాలకు సంబంధించి ఏపీ పాలిసెట్ – 2025కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశా ల కన్వీనర్ బి.జానకిరామయ్య కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశా రు. పీవోఎల్‌వైసీఈటీఏపీ.ఎన్‌ఐసీ.ఐఎన్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల ని సూచించారు. ఈ నెల 30న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
కూర్మనాథాలయ ఈఓగా నరసింహనాయుడు
గార: శ్రీకూర్మంలోని కూర్మనాథాలయ ఈవోగా కె.నరసింహ నాయుడు గురువా రం బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లు గా శ్రీకూర్మంతో పా టు రావివలస, పలా స గ్రూప్ ఆఫ్ టెంపుల్స్‌కు ఇన్‌చార్జి ఈవోగా గురునాథరావు వ్యవ హరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తాబేళ్లు దహనం ఘటన చోటుచేసుకోవడంతో దేవదాయశాఖ ఎట్టకేలకు రెగ్యులర్ ఈఓ నియామ కం చేపట్టింది. ఈ సందర్భంగా నరసింహనాయుడు తాబేళ్ల పార్కు, ఆలయ క్యూలైన్లు, నిత్యాన్నదాన సత్రాలను పరిశీలించారు.
10, 11వ తేదీల్లో
సాహితీ సంబరాలు
ఎచ్చెర్ల క్యాంపస్: ఏలూరులో శ్రీ శ్రీ కళావేదిక సంస్థ ఆధ్వర్యంలో మే 10, 11వ తేదీల్లో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలకు సంబంధించి స్వగత పత్రాలను గురువారం శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట గోపాల ధన బా లాజీ ఆవిష్కరించారు. సంబరాల్లో పాల్గొంటు న్న వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపా రు. కార్యక్రమంలో ఏవో ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, ప్రొఫె సర్ కొర్ల మోహన్‌కృష్ణ చౌదరి, సంక్షేమ డీన్ ర వి, తెలుగు బోధకులు పెద్దింటి ముకుందరా వు, పి.చిరంజీవిరావు, రాకోటి శ్రీనివాసరావు, కళావేదిక ఉత్తరాంధ్ర అధ్యక్షుడు వేమన, రచ యిత జంధ్యాల శరత్‌బాబు పాల్గొన్నారు.
సీఎం భద్రతా ఏర్పాట్ల సమీక్ష
ఎచ్చెర్ల క్యాంపస్: ఈ నెల 26న ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లు సమీక్ష నిర్వహించారు. అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజన్‌పై సీఎం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ ఎస్పీ ఎ.వి.రమణతో చర్చించారు. హెలిప్యాడ్, డయాస్, సభ నిర్వహణపై సమీక్షించారు. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.