
పకడ్బందీగా తొలిమెట్టు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు రూ పొందించిన తొలిమెట్టును పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన అభినంద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈవో మాధవితోపాటు ఉపాధ్యాయులను ఆయన సత్కరించి సర్టిఫికెట్లు అందించారు. అకడమిక్ అధికారి షేక్‌తో పాటు ఎంఈవోలు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన సేవలు..
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో క్లిష్ట పరిస్థితుల్లోని పేషెంట్లకు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసిన వైద్యాధికారులను కలెక్టర్ శ్రీహర్ష అభినందించారు. 92 ఏళ్ల వీరారెడ్డికి తుంటి ఎముక విరగడంతో ఈనెల12న అడ్మిట్ చేశారు. అతడి ఆరోగ్యపరిస్థితులను కుటుంబీకులకు వివరించి మంగళవారం వైద్యబృందం విజయవంతంగా శస్త్రచికిత్స చేసిందని కలెక్టర్ అన్నారు. సుల్తానాబాద్‌కు చెందిన ఆసియా తబస్సుంకు శస్త్రచికిత్స చేసిన సూపరింటెండెంట్ శ్రీధర్‌తోపాటు వైద్యులను కలెక్టర్ అభినందించారు.
ఎల్‌ఆర్‌ఎస్‌కు ఇదే ఆఖరుగడువు..
ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 25శాతం రాయితీని వర్తింపజేస్తూ ఈనెలాఖరు వరకు గడువు పెంచిందని, ఇదే ఆఖరు గడువుగా ప్రజలకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పలు అంశాలపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్లు వేణు, అరుణశ్రీ, ఆర్డీవో గంగయ్య పాల్గొన్నారు.
భూభూరతితో ‘సాదాబైనామా’కు పరిష్కారం
కమాన్‌పూర్/రామగిరి(మంథని): భూభారతి ఆర్వోఆర్ చట్టం ద్వారా పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కారవముతాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కమాన్‌పూర్ మండలం నాగారం రైతువేదిక, రామగిరి మండలం సెంటినరీకాలనీ కమ్యూనిటీఖాల్‌లో మంగళవారం భూభారతిపై నిర్వహించిన అవగహన సదస్సలో కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రతీ గ్రామంలో గ్రామపరిపాలన అధికారిని ప్రభుత్వం నియమిస్తుందని తెలిపారు. ఆధార్ మాదిరిగా భూధార్ సంఖ్య కేటాయించడంతో ఆక్రమణలకు తావుండదని అన్నారు. ఈ చట్టం ప్రకారం భూ సమస్యలపై అప్పీల్ చేసుకునే అవకా శం ఉందన్నారు. ఆర్డీవో, కలెక్టర్, భూమి ట్రిబ్యు నల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని అన్నారు. అప్పీల్ వ్యవస్థ ఇచ్చిన తీర్పుపై సంతృప్తి చెందకపోతే సివి ల్ కోర్టుకు వెళ్లవచ్చని, దరఖాస్తుదారులకు ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ వివరించారు. అదనపు కలెక్టర్ వేణు, మంథని ఆర్డీవో సురేశ్, తహసీల్దార్లు వాసంతి, సుమన్, ఎంపీడీవోలు లలిత, శైలజారాణి, డిప్యూటీ తహసీల్దార్ మానస, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్‌రావు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.
సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించాలి
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల కు సకాలంలో డబ్బులు చెల్లించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కల్వచర్ల, నవాబ్‌పేట, బేగంపేటలో ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

పకడ్బందీగా తొలిమెట్టు