‘సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి’ | AP Minister Kakani Slams Somireddy Chandra Mohan Over Raveparty Allegations | Sakshi
Sakshi News home page

‘సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి’.. రేవ్‌ పార్టీ ఆరోపణలకు మంత్రి కాకాణి కౌంటర్‌

Published Fri, May 24 2024 11:53 AM | Last Updated on Fri, May 24 2024 11:57 AM

AP Minister Kakani Slams Somireddy Chandra Mohan Over Raveparty Allegations

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలో చీకటి కోణాలు చాలానే ఉన్నాయి. విగ్రహాలు అమ్ముకునేందుకు విదేశాలకు వెళ్లొచ్చిన ఘనత..

నెల్లూరు, సాక్షి: బెంగళూరు రేవ్‌ పార్టీకి, ఆ కేసు నిందితులకు.. తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపణలు చేయడంతో తాజాగా కాకాణి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సోమిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. 

సోమిరెడ్డిది నీచమైన చరిత్ర. అలాంటి చరిత్ర నాకైతే లేదు. రిసార్ట్‌ ఓనర్‌ గోపాల్‌రెడ్డితో నాకు సంబంధాలు ఉన్నాయని సోమిరెడ్డి అంటున్నారు. దానికి ఒక్క ఆధారమైనా చూపించగలరా?. రాజకీయంగా ఎదుర్కొనేలేకే ఈ చౌకబారు ఆరోపణలు. సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి. పురాతన పంచలోహ విగ్రహాలను అమ్మేందుకు సోమిరెడ్డి విదేశాలకు వెళ్లారు. నేను చేస్తున్నవి ఆరోపణలు కావు.. పచ్చి నిజాలు.    

సోమిరెడ్డి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్‌ చేశారు. బెంగళూరు రేవ్‌ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. డ్రగ్స్‌ ఆరోపణల నేపథ్యంలో.. శాంపిల్స్‌ ఇవ్వడానికి నేను రెడీ. సోమిరెడ్డికి దమ్ముంటే నా ఛాలెంజ్‌ను స్వీకరిస్తారా?. నా పాస్ పోర్ట్ నా దగ్గరేదే ఉంది. ఇదివరకే మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని చెప్పా. అయినా ఆయన పదే పదే అదే ఆరోపణ చేస్తున్నారు. రేవ్ పార్టీతోగానీ, ఆ కేసు నిందితులకి నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నా కారు స్టిక్కర్ వాడకంపై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశాం అని కాకాణి మరోసారి స్పష్టత ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement