
సాక్షి, చిత్తూరు: నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కుప్పంలో టీడీపీ అరాచకం కొనసాగుతోంది. ఓటర్లను నేరుగా చంద్రబాబు ప్రలోభపెడుతున్నారు. ఆడియో కాన్ఫరెన్స్ పేరుతో చంద్రబాబు ఓటర్లకు ఫోన్ చేస్తున్నారు.
చాలామందికి చంద్రబాబు మాట్లాడిన ఆడియోను టీడీపీ నేతలు పంపిస్తున్నారు. టీడీపీ నాయకులంతా ఆందోళనకు దిగాలంటూ పరోక్షంగా చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. టీడీపీ నేతలు కుప్పం పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. ఆదివారం నుంచి కుప్పం ఓటర్లను టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లను టీడీపీ గూండాలు చెక్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికి ఓటు వేస్తారంటూ అడుగుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. టీడీపీ అరాచకాలతో కుప్పం ఓటర్లు భయపడిపోతున్నారు. అక్కడితో ఆగకుండా టీడీపీ నేతలు దొంగ ఓటర్లంటూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.