
రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామా చేశారు.
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కు గురువారం అందజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కేశవరావు ఆ పార్టీ గూటికి చేరారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు పార్టీ మారడంతో తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు.
రాజీనామా సమర్పించిన అనంతరం కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారని.. బీఆర్‌ఎస్ సింబల్‌పై ఎన్నికైన నేపథ్యంలో రాజీనామా చేశానని తెలిపారు. నైతిక విలువలు పాటించి, చట్టానికి కట్టుబడి రాజ్యసభ సీటుకు రాజీనామా చేశానని.. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా సమర్పించానని కేశవరావు చెప్పారు.
