
వరంగల్ సభను విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే మాణిక్‌రావు పిలుపు
జహీరాబాద్ టౌన్: బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు పార్టీ శ్రేణులను కోరారు. మండల కేంద్రమైన మొగుడంపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొగుడంపల్లి మండలం నుంచి పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలన్నారు. పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని మండిపడ్డారు. అనంతరం సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి, జహీరాబాద్ అధ్యక్షుడు తట్టునారాయణ, నాయకులు గుండప్ప, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా భ్రమరాంబికామల్లికార్జున స్వామి కల్యాణం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మల్లన్న గంపలు తీయటం, మల్లన్న కొట్నం, గొలుసు తెంపు, మల్లన్న బోనాలు సమర్పించడం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలుస్వీకరించారు.
అంబేడ్కర్ స్ఫూర్తిని
కొనసాగిద్దాం
కేవీపీఎస్ పిలుపు
నారాయణఖేడ్: అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగిద్దామని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొటారి నర్సింహులు, ఖేడ్ రక్తదాతల గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడు ముజాహిద్ చిష్తీ, మానవహక్కుల పరిరక్షణ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు ఓంప్రకాష్ పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఖేడ్ పల్లవి పాఠశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఆశయసాధన కోసం ప్రతీఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యువకులు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. ఆయా సంఘాల బాధ్యులు సంతోష్, గణపతి, సంతోష్‌రావు పాటిల్, కాన్షీరాం, సురేశ్‌గౌడ్, అరుణ్, మోహన్, శంకర్, సాయిలు, గౌతం పాల్గొని వలంటరీ సేవలు అందించారు.
అర్హులు ఇందిరమ్మఇళ్లు నిర్మించుకోవాలి
నారాయణఖేడ్: అర్హులైన ప్రతీ ఒక్కరూ ఇదిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. మనూరు మండలం దుదగొండలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ...అర్హులకే ఇళ్లను మంజూరు చేశామన్నారు. అనంతరం గ్రామంలో బీరప్పస్వామి, ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు వినోద్‌పాటిల్, దిగంబర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, సంగన్న, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

వరంగల్ సభను విజయవంతం చేయాలి

వరంగల్ సభను విజయవంతం చేయాలి