
వసతి.. ఇదీ దుసి్థతి
కౌడిపల్లిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్
వృథాగా మంచాలు,
డైనింగ్ టేబుల్స్
వసతి గృహంలోని గదుల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. లైట్లు వెలగడంలేదు. ఇక్కడి సమ స్యలు ఎవరికై నా చెబితే హాస్టల్ సిబ్బంది ఇబ్బందులు పెడతారని వాపోయారు. అలా గే, వసతి గృహంలో విద్యార్థుల సౌకర్యం కోసం రూ.లక్షలు వెచ్చించి మంచాలు, టేబుల్స్ కొనుగోలు చేసినా వినియోగించడం లేదు. దీంతో విద్యార్థులు కిందనే పడుకుంటున్నారు. కొత్త మంచాలు స్టోర్‌రూంలో పడేసి పాడైపోయేలా చేస్తున్నారు. బెడ్ షీట్స్‌సైతం వాడకపోవడంతో చిరిపోతున్నాయి. దీనికితోడు విద్యార్థులు డైనింగ్ స్టీల్ మెటీరియల్ టేబుల్స్, బెంచీలు డైనింగ్ హాల్‌లో వాడకుండా పడేశారు. విద్యార్థులు కింద కూర్చోని భోజనం చేస్తున్నారు. రక్షిత మంచినీటి పథకం ఫ్యూరీఫైడ్ మిషన్ పాడైపోయి ఏడాది గడిచినా బాగు చేయించలేదు. విద్యార్థులకు ఇచ్చిన డ్రెస్‌లు సైతం ఇవ్వకుండా మూలన పడేశారు.
కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహం సమస్యలకు నిలయంగా మారింది. దూరం ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి న వారిని అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. భోజనంలో వెంట్రుకలు వస్తాయి.. ఇంకొంచం పెట్టమంటే పెట్టరు. ఫ్యాన్లు తిరగవు లైట్లు వెలగవు. చిరిగిపోతున్న బెడ్లు, వృథాగా మంచాలు పడి ఉన్నాయి. అయినా ఎవరూ పట్టించుకోకరు. దీంతో విద్యార్థులు అరకొర వసతుల మధ్యే కొంటూ తమ చదువులు కొనసాగిస్తున్నారు.
కౌడిపల్లిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కావడంతో సాక్షి విజిట్ చేయగా పలు సమస్యలు వెలుగు చూశాయి. వసతి గృహంలో మొత్తం 154 మంది విద్యార్థినీలు ఉన్నారు. వార్డెన్ నర్సమ్మతోపాటు కుక్, వాచ్‌మెన్, కామాటీ విధులు నిర్వహిస్తున్నారు. పదవ తరగతి విద్యార్థులు 34 మంది పరీక్షలు పూర్తి అవడంతో ఇటీవల వెళ్లిపోయారు. 23 మంది విద్యార్థులు గైర్హాజరు కావడంతో ప్రస్తుతం 97 మంది వసతి గృహంలో ఉంటున్నారు. కాగా, ఉదయం టిఫిన్‌తోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం సరిగా వండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. భోజనంలో వెంకట్రుకలు వస్తున్నాయని, నీళ్ల చారు ఇష్ట మొచ్చినట్లు వండుతున్నారని చెబుతున్నారు. రెండు నెలలుగా గుడ్డుపెట్టడంలేదని వాపోతున్నారు. హాస్టల్ సిబ్బందికి మంచి భోజనం వండుకొని తమకు మాత్రం ఇష్టం వచ్చినట్లు వండి పెడుతున్నారని ఆరోపించారు. మరోసారి భోజనం పెట్టాలని వెళ్తే సిబ్బంది తిడుతున్నారని చెప్పారు.
వర్కర్‌లు లేక ఇబ్బంది
వసతి గృహంలో వర్కర్లు లేక సామగ్రిని వాడటంలేదు. భోజనం మంచిగా చేసేందు చర్యలు తీసుకుంటాం. సెలవులు పూర్తి అయిన తర్వాత అన్నింటినీ వినియోగంలోకి తీసుకొచ్చి విద్యార్థులకు సౌకర్యం కల్పిస్తాం.
– నర్సమ్మ, వార్డన్
సమస్యల వలయంలోఇంటిగ్రేటెడ్ హాస్టల్
ఫ్యాన్లు తిరగవు లైట్లు వెలగవు
పాడైన వాటర్ ఫ్యూరీఫైడ్ మిషన్
చిరిగిన బెడ్ షీట్స్, వృథాగా మంచాలు
భోజనంలో వెంట్రుకలు,మళ్లీ పెట్టమంటే తిట్లు

వసతి.. ఇదీ దుసి్థతి

వసతి.. ఇదీ దుసి్థతి