IPL 2025: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. బౌల‌ర్ల‌కు పండ‌గే? | BCCI Lifts Saliva Ban In Landmark Post-covid Move After Captains Approval, Check More Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2025: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. బౌల‌ర్ల‌కు పండ‌గే?

Published Thu, Mar 20 2025 4:54 PM | Last Updated on Thu, Mar 20 2025 6:50 PM

BCCI lifts saliva ban in landmark post-Covid move after captains approval

ఐపీఎల్‌-2025కు ముందు భార‌త క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల స‌మ‌యంలో బంతులపై లాలాజలం(స‌లైవా) వాడకంపై నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. గురువారం(మార్చి 20) జ‌రిగిన కెప్టెన్ల సమావేశం అనంత‌రం బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ముంబైలో జ‌రిగిన ఈమీట్‌లో ఎక్కువ మంది కెప్టెన్‌లు స‌లైవా ఉపయోగించాలనే ఆలోచనకు అంగీకరించారు.

ఈ ఏడాది సీజ‌న్ నుంచే ఈ రూల్ అమ‌లులోకి రానుంది. కాగా ఇదే విష‌యంపై  బీసీసీఐ పెద్ద‌లు ఇప్ప‌టికే ఐపీఎల్ జ‌ట్ల కెప్టెన్‌ల‌తో అంతర్గతంగా చ‌ర్చించారు. తుది నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కెప్టెన్ల‌కే బోర్డు విడిచిపెట్టింది. ఇప్పుడు అందుకు కెప్టెన్‌లు కూడా అంగీక‌రించ‌డంతో బీసీసీఐ త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంది.

"ఇది కెప్టెన్‌లు ఇష్టం. స‌లైవా వాడకాన్ని వారు కొన‌సాగించాల‌న‌కుంటే, మాకు ఎటువంటి సమస్య లేదు. మేము దానికి అంగీకరిస్తున్నాము. అయితే అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల సమ‌యంలో మాత్రం ఐసీసీ రూల్‌కు క‌ట్టుబడి ఉంటాము" అని బీసీసీఐ సీనియ‌ర్ అధికారి ఒక‌రు పేర్కొన్నారు.

2020లో బ్యాన్‌..
కోవిడ్-19 మహమ్మారి తర్వాత.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లాలాజల వాడకాన్ని నిషేధించింది. దీంతో ఫాస్ట్ బౌల‌ర్లు బంతిని రివర్స్ స్వింగ్‌ను చేయ‌డానికి కాస్త ఇబ్బంది ప‌డ్డారు. బంతిపై స‌లైవా ఉప‌యోగించితే అది ఎక్కువ‌గా రివర్స్ స్వింగ్ అవుతుంది.

ఐపీఎల్‌(2020)లో సైతం బీసీసీఐ సైతం లాలాజల వాడకంపై బ్యాన్ విధించింది. అప్ప‌టి నుంచి గ‌తసీజ‌న్ వ‌ర‌కు ఏ  ఫాస్ట్ బౌల‌ర్, ఏ ప్లేయ‌ర్ కూడా స‌లైవాను ఉప‌యోగించ‌లేదు. తాజాగా ఇదే విష‌యంపై భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా స్పందించాడు. లాలాజ‌ల వాడ‌కంపై బ్యాన్‌ను ఎత్తివేయాల‌ని ఐసీసీని ష‌మీ అభ్యర్థించాడు

"మేము రివర్స్ స్వింగ్ చేయ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాము. కానీ స‌లైవాను మాత్రం ఉప‌యోగించ‌డం లేదు. మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో స‌లైవా వాడకాన్ని అనుమతించమని మేము చాలా సార్లు ఐసీసీకి విజ్ఞప్తి చేశాము. అందుకు అనుమ‌తి ఇస్తే బంతి మ‌రింత ఎక్కువ‌గా రివ‌ర్స్ సింగ్ అయ్యే అవ‌కాశ‌ముంటుంది" అని ఛాంపియ‌న్స్ ట్రోఫీ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో ష‌మీ పేర్కొన్నాడు.

​కాగా ఐపీఎల్‌-2025 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
చదవండి: BCCI: ఒక్కో ఆటగాడికి రూ. 3 కోట్లు.. గంభీర్‌కు ఎంతో వెల్లడించిన బీసీసీఐ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement