
PC: BCCI/IPL.com
టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన మంచి మనసును చాటుకున్నాడు. తమిళనాడుకు చెందిన పది మంది యువ, ప్రతిభావంతులైన క్రీడాకారులకు రూ.7 లక్షల ఆర్ధిక సాయాన్ని దూబే చేశాడు. మంగళవారం జరిగిన తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TNSJA) అవార్డ్స్ అండ్ స్కాలర్‌షిప్‌ల ప్రధానోత్సవ కార్యక్రమంలో యంగ్ అథ్లెట్స్‌కు దూబే చెక్‌లను అందజేశాడు.
ఈ కార్యక్రమానికి దూబే ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అదేవిధంగా యువ అథ్లెట్లకు వారి విజయాలకు గుర్తింపుగా తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కూడా రూ. 30,000 స్కాలర్‌షిప్‌లను అందజేసింది. ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ.. "ఈ కార్యక్రమం యువ అథ్లెట్లందరికీ చాలా ప్రోత్సాహకరంగా ఉందని నేను భావిస్తున్నాను.
ఈ చిన్న విజయాలను గుర్తించి వారిలో కొత్త ఉత్సహాన్ని తమిళనాడు స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నింపుతోంది. వారు మరింత కష్టపడి పనిచేసి దేశానికి గర్వకారణంగా నిలుస్తారు ఆశిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రామానికి నన్ను ఆహ్వానించిందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముంబైలో కూడా ఇటువంటి కార్యాక్రమాలు నేను చూశాను. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా యువ క్రీడాకారులకు మద్దతునిచ్చే పోగ్రామ్స్ నిర్వహిస్తుండడం చాలా సంతోషంగా ఉందని" అన్నాడు.
నగదు సాయం అందుకున్న తమిళనాడు అథ్లెట్లు వీరే..
పిబి అభినంద్ (టేబుల్ టెన్నిస్)
కెఎస్ వెనిస శ్రీ (ఆర్చరీ)
ముత్తుమీనా వెల్లసామి (పారా అథ్లెటిక్స్)
షమీనా రియాజ్ (స్క్వాష్)
ఎస్ నంధన (క్రికెట్)
కమలి పి (సర్ఫింగ్)
ఆర్ అభినయ (అథ్లెటిక్స్)
ఆర్‌సి జితిన్ అర్జునన్ (అథ్లెటిక్స్)
తక్షంత్ (చెస్)
జయంత్ ఆర్కే (క్రికెట్)