నెల్లూరు రూరల్: జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో రైతుల భూములకు సంబంధించి రికార్డుల్లో నోషనల్ ఖాతాలుగా నమోదై, వివాదాలు లేని పట్టా భూములను రెగ్యులర్ ఖాతాగా మార్చేందుకు ఈ నెల 16వ తేదీ వరకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు డీఆర్వో ఉదయభాస్కర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టాదారులు ఎవరైనా తమ భూములకు నోషనల్ ఖాతా నమోదైనట్లు ఉంటే వారు తగిన రికార్డులతో సంబంధిత తహసీల్దారు, ఆర్డీఓకు సమర్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేటితో పది జవాబుపత్రాల
మూల్యాంకనం ముగింపు
నెల్లూరు (టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం గురువారంతో ముగియనుంది. గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన పది పరీక్షలు 31వ తేదీతో ముగిశాయి. ఈ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 3 నుంచి ప్రారంభించి 9వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే సోషల్ సబ్జెక్ట్‌కు సంబంధించి జవాబు పత్రాలు జిల్లాకు ఆలస్యంగా వచ్చాయి. దీంతో పది మూల్యాంకనం గురువారం మధ్యాహ్నానికి పూర్తి చేయనున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన 1,92,920 జవాబు పత్రాలను మూల్యాకనం చేశారు. మూల్యాకనంలో 1,076 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 174 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 348 మంది స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. పది ఫలితాలను ఈ నెల 15వ తేదీలోపు విడుదల చేసేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశా ఖాధికారులు చర్యలు ప్రారంభించారు.