
ఉద్యోగాల పేరిట మోసం
నెల్లూరు(క్రైమ్): ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బు తీసుకున్నారు. తక్కువ ధరకే బంగారం పేరిట మోసగించారు, కుమార్తె మృతికి అల్లుడు, అత్తింటివారు కారణం, కొడుకు, కోడలు ఆస్తి రాయించుకుని ఇంట్లో నుంచి తరిమేశారు, కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబాన్ని చక్కదిద్దాలి.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ. విచారించి న్యాయం చేయాలని బాధితులు ఎస్పీ జి.కృష్ణకాంత్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం నెల్లూరు ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా వ్యాప్తంగా 119 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీకి అందజేశారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేయాలని ఆయా ప్రాంత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీటీసీ డీఎస్పీ గిరిధర్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో
119 ఫిర్యాదులు