
ఖాకీ డ్రెస్సు వేసుకుని డ్యూటీ చేయాల్సిన పోలీసులు... టీడ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇప్పటివరకూ పని చేసిన ప్రతి చోటా విజయకుమార్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనంతపురం ఎస్పీగా అంజనా సిన్హా ఉన్నప్పుడు ఈయన చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐగా పనిచేశారు. ఆ సమయంలో స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేయగా, పోలీసు ఉన్నతాధికారులు అప్పట్లో కర్నూలుకు బదిలీ చేసి వీఆర్‌లో పెట్టారు. మైదుకూరులో డీఎస్పీగా పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు రావడంతో శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేసి వీఆర్‌లో ఉంచారు.
గార్లదిన్నెలో పదెకరాల భూమి!
విజయకుమార్ పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత అనంతపురం జిల్లాలోని గార్లదిన్నెలో హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారికి దగ్గరగా పదెకరాల భూమి కొన్నట్టు ఇప్పటికీ పోలీసు వర్గాలు కథలు కథలుగా చెప్పుకుంటున్నాయి. ఇంత పెద్ద ఎత్తున భూమి కొనడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కరపత్రాల కలకలం
గతంలో అనంతపురంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీఎస్పీగా విజయకుమార్ ఉన్న సమయంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీఎస్పీగా గంగయ్య ఉండేవారు. అప్పట్లో గంగయ్యకు, విజయమార్‌కు మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే గంగయ్యపై కొన్ని కరపత్రాలు బయటకు వచ్చాయి. వీటిని విజయకుమార్ వేయించారనే విమర్శలున్నాయి. ఆ తర్వాత విజయకుమార్ బండారాలన్నీ బయటపెడుతూ బయటకు వచ్చిన కరపత్రాలు కలకలం రేపాయి.
ప్రబోదానంద కేసులో సస్పెండ్..
తనకు నచ్చినవారి కోసం పరిధి దాటి ప్రవర్తిస్తారని విజయకుమార్‌కు పేరుంది. గతంలో జేసీ అనుచరులు ప్రబోదానంద ఆశ్రమంపై దాడి చేసిన సమయంలో విజయకుమార్ ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీగా ఉండేవారు. అయినా సరే తాడిపత్రి ఇన్‌చార్జ్ డీఎస్పీగా వెళ్లి ఆ కేసును డీల్ చేశారు. ఆ కేసులో తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు విజయకుమార్‌ను సస్పెండ్ చేశారు.
మహిళా సీఐపై పరుషంగా..
ప్రస్తుతం పుట్టపర్తి డీఎస్పీగా ఉన్న విజయకుమార్ ఇప్పటికీ తన వివాదాస్పద తీరు మార్చుకోలేదని తెలిసింది. కొన్ని రోజుల క్రితం ఓ మహిళా సీఐపై ఇష్టారాజ్యంగా నోరుపారేసుకున్నారు. దీంతో మహిళా సీఐ తీవ్ర మనస్తాపం చెంది విజయకుమార్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే, మహిళా సీఐకి న్యాయం చేయాల్సిన ఉన్నతాధికారులు.. బాధిత సీఐనే వీఆర్‌కు పంపించడం శ్రీసత్యసాయి జిల్లా పోలీసుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
రామగిరి హెలిప్యాడ్ ఘటనలో ఘోర వైఫల్యం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఇటీవల విజయకుమార్‌ను రామగిరి మండలం కుంటిమద్ది సమీపంలో హెలిప్యాడ్ వద్ద సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌గా వేశారు. ఒక మాజీ సీఎం వస్తున్న నేపథ్యంలో నిక్కచ్చిగా బందోబస్తు చేపట్టాల్సిన డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో హెలికాప్టర్ వద్దకు వేలాదిగా జనం వెళ్లడంతో విండ్‌షీల్డ్ విరిగింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పనిసరి పరిసితుల్లో రోడ్డుమార్గంలో బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఖాకీ డ్రెస్సు వేసు కున్న ఈ పోలీసు అధికారి ‘పచ్చ’చొక్కాల అడుగులకు మడుగులొత్తుతుండటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ ఎమ్మెల్యేలు ఆడినట్టే ఆట.. పాడినట్టే పాట
పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్
వ్యవహార శైలిపై సర్వత్రా తీవ్ర చర్చ
పల్లె రఘునాథరెడ్డి గీత గీస్తే దాటిపోకుండా డ్యూటీ
గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు
ఇప్పటికీ తీరు మార్చుకోని వైనం

ఖాకీ డ్రెస్సు వేసుకుని డ్యూటీ చేయాల్సిన పోలీసులు... టీడ