బాబు గారి షూటింగ్‌! | - | Sakshi
Sakshi News home page

బాబు గారి షూటింగ్‌!

Published Sun, Apr 27 2025 1:19 AM | Last Updated on Sun, Apr 27 2025 1:19 AM

బాబు

బాబు గారి షూటింగ్‌!

ప్రైవేటు కార్యక్రమంలా మత్స్యకారుల సేవలో పథకం కార్యక్రమం

ఎంపిక చేసిన టీడీపీ కార్యకర్తలకు

2వేల పాసులు జారీ

● సాధారణ మత్స్యకారులకు దక్కని ప్రవేశం

గుడారాల్లో సమావేశాలేమిటి?

రణస్థలం/ఎచ్చెర్ల క్యాంపస్‌: తమ ప్రాంతానికి వచ్చి తమ ఊర్లో సమావేశం పెట్టి పాసులున్నా వదలకపోవడం ఏమిటని బుడగట్లపాలెం, కుప్పిలి, కొవ్వాడ, కొచ్చెర్ల, పాతర్లపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులతోనూ కాసేపు వాగ్వా దం చేశారు. సీఎం చంద్రబాబు సభకు వారి వ ద్ద పాసులు ఉన్నా పోలీసులు లోపలకు పంపించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుడారాల్లో సమావేశాలు నిర్వహించడమేంటని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తమ గ్రామాల్లోకి వచ్చినప్పుడు చెబుతామని అన్నారు. చాలాసేపు ఎండలో నిల్చుని వెనుతిరిగారు.

విన్నపాలు వినలేదు

ఎచ్చెర్ల క్యాంపస్‌: ముఖ్యమంత్రి బుడగుట్లపాలెం పర్యటనకు వచ్చిన నేపథ్యంలో రెల్లికుల సంక్షేమ సేవా సంఘం ప్రతినిధులు వినతి ఇ చ్చేందుకు శనివారం వచ్చారు. సెక్యూరిటీ అనుమతించకపోవటంతో నిరాశగా వెనుదిరిగారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకుల దృష్టికి సమస్య తీసుకువెళ్లినా వారు సైతం చేతులెత్తేశా రు. ఎస్సీ వర్గీకరణ వల్ల రెల్లి కులస్తులకు తీరని అన్యాయం జరగుతుందని ఈ సంఘ ప్రతినిధులు గొల్లపల్లి మోహనరావు, బెవర రమణారావు తదితరులు అన్నారు.

బాబు గారి షూటింగ్‌!1
1/1

బాబు గారి షూటింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement