
సాక్షి,హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూముల వ‍్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్‌పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ‘ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా.. ఆమె ఐఏఎస్ అధికారిణి!’ అంటూ వ్యవంగంగా మాట్లాడారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఐఏఎస్ స్మితా సబర్వాల్ సోషల్‌మీడియా రీట్వీట్లను ప్రస్తావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 13 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికిందని ఆరోపించారు. ఆ చెట్లను నరికి వేసినప్పుడు స్మితా సబర్వాల్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. సోషల్ మీడియా పోస్టులు ఎందుకు పెట్టలేదని పునరుద్ఘాటించారు.
స్మితా సబర్వాల్.. అప్పుడు ఏం చేశినవ్? - గజ్జెల కాంతం
కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికేసినప్పుడు జింకలు, వణ్యప్రాణులు వేరే అడవులకు పోతుంటే నువేం చేశినవ్
అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండి ఇది కరెక్టు కాదని ఎందుకు ఖండించలేదు?
IAS అధికారి స్మితా సబర్వాల్‌పై రెచ్చిపోయిన… pic.twitter.com/FrHZkWO2dA— Telugu Galaxy (@Telugu_Galaxy) April 23, 2025