ధరణిలో గోల్‌మాల్‌.. మణికొండలో భారీ భూకబ్జా! | Huge Land Grabbing Scam In Manikonda Pokalwada | Sakshi
Sakshi News home page

ధరణిలో గోల్‌మాల్‌.. మణికొండలో రూ.1,000 కోట్ల విలువైన భూమి కబ్జా!

Published Mon, Jun 10 2024 1:32 PM | Last Updated on Mon, Jun 10 2024 4:11 PM

Huge Land Grabbing Scam In Manikonda Pokalwada

ధరణి ఉద్యోగులు మొత్తం ఐదు ఎకరాల ల్యాండ్‌ కోసం రూ.8 కోట్ల డీల్‌ కుదుర్చుకున్నారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాతే పాస్‌బుక్‌లు జారీ చేశారు. అయితే..

హైదరాబాద్‌, సాక్షి: మణికొండ పోకల్‌వాడలో భారీ  భూదందా వెలుగు చూసింది. ధరణిలో గోల్‌మాల్‌ చేసి వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశారు. కలెక్టర్లంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. ధరణి నుంచి పాస్‌బుక్‌లు జారీ అయ్యాయి. ధరణి ఉద్యోగులు చేతి వాటం ప్రదర్శించి ఈ స్కామ్‌కు పాల్పడ్డారు. ఎమ్మార్వో ఫిర్యాదు చేయడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది.

ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఐదెకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ధరణి ఉద్యోగులతో రూ.3 కోట్లకు డీల్‌ కుదుర్చుకున్నారు. కొంత డబ్బు తీసుకున్న తర్వాతే రంగారెడ్డి ఇద్దరు కలెక్టర్ల సంతకాలతో పాస్‌బుక్‌లు జారీ చేశారు. అయితే.. బ్లాక్‌​ లిస్ట్‌లో ఉన్న ల్యాండ్‌కు పాస్‌ బుక్‌లు జారీ కావడంతో ఎమ్మార్వో ఖంగుతిన్నారు.  స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. సైబరాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగారు. 

ఇద్దరు ధరణి ఉద్యోగులతో పాటు ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. భూమిని తమ పేరు మీద రిజిస్టర్‌ చేసుకున్న ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపైనా సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement