
ఎమ్మెల్యేల రహస్య భేటీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్‌రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే భేటీ.. రహస్య భేటీ కాదంటూ వ్యాఖ్యానించారు.
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల రహస్య భేటీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుథ్‌రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే భేటీ.. రహస్య భేటీ కాదంటూ వ్యాఖ్యానించారు. ‘‘కోహినూర్ హోటల్‌లో లంచ్ చేశాం. తాను ఏ ఫైల్ కూడా మంత్రుల దగ్గరకు తీసుకెళ్లలేదని అనిరుథ్ స్పష్టం చేశారు. ‘‘నా నియోజకవర్గ సమస్యలపై సమావేశంలో మాట్లాడా. బీఆర్‌ఎస్ హయాంలో భూముల ఆక్రమణకు గురయ్యాయి. భూముల అన్యాకాంతంపై విచారణ చేయాలని కోరా. భూముల అన్యాక్రాంతం ఎవరూ చేశారో విచారణలో తేలుతుంది’’ అని అనిరుథ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీలో కాకరేపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సీరియస్ అయ్యారు. సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని.. మ్మెల్యేలు రహస్య సమావేశాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు, కార్యకర్తల మధ్య గ్యాప్ ఉందంటూ మున్షీ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారంటూ మున్షీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని కులగణన, ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో చేసినా, అనుకున్న స్థాయిలో ప్రచారం చేయడం లేదన్న మున్షీ.. పార్టీ అంతర్గత విషయాలు బహిరంగ వేదికలపై మాట్లాడితే చర్యలు తప్పవన్నారు.
ఇదీ చదవండి: దీపాదాస్ మున్షీ సీరియస్.. ఎమ్మెల్యేలకు వార్నింగ్