
భారతీయుల్లోహెల్త్ ఇన్సూరెన్స్‌పై నిర్లక్ష్యం
అవగాహన ఉన్నవారిలో బీమా తీసుకుంటున్నది 23 శాతమే
వీరిలోనూ 50 శాతం మందిరూ.5 లక్షల లోపే పాలసీ
పాలసీ బజార్.కామ్ సర్వేలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య బీమా తీసుకునే విషయంలో భారతీయులు వెనకడుగు వేస్తున్నారు. ఆరోగ్య బీమా గురించి 83 శాతం మందికి అవగాహన ఉన్నా.. 23 శాతం మంది మాత్రమే హెల్త్ పాలసీలు తీసుకున్నారు. ఆరోగ్య బీమా లేని భారతీయుల్లో 75 శాతం కంటే ఎక్కువ మంది అనూహ్యంగా ఎదురయ్యే జీవన, ఆరోగ్య సంక్షోభాల వాస్తవ ఖర్చులపై ముందుచూపు లేక ఇబ్బందులు పడుతున్నారు.
టర్మ్ ఇన్సూరెన్స్ వంటివి లేనివారిలో 87 శాతం మంది ఆర్థికంగా పడబోయే భారాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. 13 శాతం మంది మాత్రమే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ అవసరాలను గుర్తిస్తున్నట్లు ‘హౌ ఇండియా బైస్ ఇన్సూరెన్స్ 2.0’పేరిట ‘పాలసీ బజార్ డాట్‌కామ్’సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ఈ నివేదికలోని ముఖ్యాంశాలు
» భారతీయులు ఆరోగ్య సంరక్షణ వ్యయాలు,ఆకస్మిక ఖర్చులను భరించేందుకు సిద్ధంగా లేరు.
» దేశ జనాభాలో ఆరోగ్య బీమా లేనివారే అధికం. పాలసీదారుల్లోనూ సుమారు 75 శాతం మంది రూ.10 లక్షల కంటే తక్కువ కవరేజీ ఉన్నవారే. 48 శాతం మంది రూ.5 లక్షలు, అంతకంటే తక్కువ కవరేజీతో సరిపెట్టుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలో ఈ సమస్య మరింత అధికంగా ఉంది. ఇక్కడ 66 శాతం పాలసీదారులు రూ 5 లక్షల అంతకంటే తక్కువ కవరేజీ కలిగి ఉన్నారు.
» పాలసీదారుల్లో 51 శాతం మంది క్యాన్సర్, కిడ్నీ మారి్పడి, గుండె జబ్బుల చికిత్సల ఖర్చు రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటుందనిభావిస్తున్నారు. 47.6 శాతం భారతీయులకు టర్మ్ ఇన్సూరెన్స్‌ప్రయోజనాల గురించి తెలియదు.
» ఇప్పటికీ బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బీమా సంబంధిత పొదుపు పథకాలు, రియల్ ఎస్టేట్ వంటి సంప్రదాయ పెట్టుబడులు ఆధిపత్యం వహిస్తున్నాయి.
» బీమా తీసుకోనివారిలో దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక లేకపోవడం ఆందోళనకరంగా మారింది.
» చాలామంది తమ కుటుంబ అవసరాలను అంచనా వేసేటప్పుడు పిల్లల విద్య, వివాహం, రుణ బాధ్యతలు, జీవిత భాగస్వామి పదవీ విరమణ, ఆకస్మిక వైద్య ఖర్చుల వంటివాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు.
అవగాహన పెంచుతున్నాం
ఈ నివేదికఆధారంగా ప్రజల్లో ఆరోగ్య బీమాపైఅవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టాం. అత్యవసర చికిత్సలతో ఆర్థిక సంక్షోభం ఎదురైనపుడు ఆస్తులను అమ్మటం, అప్పు చేయటానికి బదులు ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకోవటంమంచిది. అందరికీ ఆర్థిక భద్రత ఏర్పడేలా పాలసీలు, ఇతరత్రా సలహాల ద్వారా కష్టమర్లకు ప్రయోజనం కలిగేలా చూడాల్సిఉంది. – సర్బ్‌వీర్ సింగ్,జాయింట్ గ్రూప్ సీఈఓ, పీబీ ఫిన్‌టెక్.