
హఫీజ్‌పేట్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది.
సాక్షి, హైదరాబాద్: హఫీజ్‌పేట్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. బెట్టింగ్ నిర్వహిస్తున్న దంపతులు అజయ్, సంధ్యలను ఎస్వోటీ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముగ్గురు పంటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫేక్ కంపెనీల పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి.. రెండు మ్యాచ్‌లపై రూ.40 లక్షల వరకు లావాదేవీలు జరిపారు. మొత్తం ఏడు అకౌంట్లను పోలీసులు గుర్తించారు. బ్యాంక్ అకౌంట్లలోని రూ.22 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు అజయ్‌పై గతంలో నాలుగు బెట్టింగ్ కేసులు నమోదయ్యాయి.