Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Audio Release: Raj Kasireddy Said Dont Believe Vijaya Sai Says1
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్‌ చేసిన రాజ్‌ కసిరెడ్డి

సాక్షి, అమరావతి: విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్‌ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్‌ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్‌ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశా. న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతా. సాక్షిగా పిలిచి అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని లాయర్లు చెప్పారు. అందుకోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’’ అని రాజ్‌ కసిరెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే

Fire Accident In Hyderabad Nims2
Hyderabad: నిమ్స్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ఐదో అంతస్తులో మంటలు ఎగిసిడుతున్నాయి. నిమ్స్ ప్రాంతమంతా భారీగా పొగ కమ్ముకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Medico Jumps From College Building In Visakhapatnam3
విశాఖలో మెడికో ఆత్మహత్య

సాక్షి, విశాఖపట్నం: నగరంలో మెడికో శ్రీరామ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మెడికల్ కళాశాల వద్ద మెడికోలు ఆందోళన చేపట్టారు. కళాశాల డీన్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేకే శ్రీరామ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని నిరసనకు దిగారు. చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్న శ్రీరామ్ బంధువులు ఆరోపిస్తున్నారు.బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యమరో ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని ఇవాళ తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని కృష్ణవేణిగా గుర్తించారు. ఉగాది పండగకు ఇంటికి వెళ్లి నిన్న(శుక్రవారం) సాయంత్రం తల్లితో కలిసి కళాశాలకు విద్యార్థిని వచ్చింది.తల్లితో కలిసి రాత్రి హాస్టల్‌లో ఉన్న మృతురాలు కృష్ణవేణి.. తెల్లవారుజామున కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

IPL 2025, GT VS DC: KL Rahul Joins 200 Sixes Club In IPL4
GT VS DC: డబుల్‌ సెంచరీ పూర్తి చేసిన కేఎల్‌ రాహుల్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో సిక్సర్ల డబుల్‌ సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 19) జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్‌ ఈ ఘనత సాధించాడు. రాహుల్‌ ఐపీఎల్‌లో ఇప్పటిదాకా 129 ఇన్నింగ్స్‌లు ఆడి 200 సిక్సర్లు కొట్టాడు. రాహుల్‌కు ముందు భారత బ్యాటర్లలో రోహిత్‌ శర్మ (286), విరాట్‌ కోహ్లి (282), ఎంఎస్‌ ధోని (260), సంజూ శాంసన్‌ (216), సురేశ్‌ రైనా (203) సిక్సర్ల డబుల్‌ సెంచరీ పూర్తి చేశారు. ఓవరాల్‌గా రాహుల్‌కు ముందు క్రిస్‌ గేల్‌ (357), రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోని, ఏబీ డివిలియర్స్‌ (251), డేవిడ్‌ వార్నర్‌ (236), కీరన్‌ పోలార్డ్‌ (223), సంజూ శాంసన్‌, ఆండ్రీ రసెల్‌ (212), సురేశ్‌ రైనా ఈ ఘనత సాధించారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. అహ్మదాబాద్‌ వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్‌ 14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన అభిషేక్‌ పోరెల్‌ (9 బంతుల్లో 18; 3 ఫోర్లు, సిక్స్‌), కరుణ్‌ నాయర్‌ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడుగానే ఆడినప్పటికీ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. 10 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 1052గా ఉంది. అక్షర్‌ పటేల్‌ (15), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (8) క్రీజ్‌లో ఉన్నారు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 2 వికెట్లు పడగొట్టగా.. అర్షద్‌ ఖాన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) కొనసాగుతుండగా.. గుజరాత్‌ మూడో స్థానంలో (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఉంది. పంజాబ్‌ రెండు (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), ఆర్సీబీ నాలుగు (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) స్థానాల్లో ఉండగా.. లక్నో (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), కేకేఆర్‌ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), ముంబై ఇండియన్స్‌ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), రాజస్థాన్‌ రాయల్స్‌ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సన్‌రైజర్స్‌ (7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), సీఎస్‌కే వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Get Rs 20 Lakh in 5 Years From Post Office RD Scheme5
ఐదేళ్లలో రూ.20 లక్షలు: ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా?

ప్రతి మనిషి తన సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్ కోసం తప్పకుండా దాచుకోవాలి. లేకుంటే ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు చిన్న మొత్తాలలో సేవింగ్ చేసుకుంటుంటే.. మరికొందరు పిల్లల చదువులకు, వివాహం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి.. ఇలా కొంత పెద్ద మొత్తంలో కూడబెట్టాలనుకుంటున్నారు. అలాంటి వారికి 'పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్' మంచి ఎంపిక అవుతుంది.5 సంవత్సరాల్లో 20 లక్షలు ఇలా..ఐదేళ్లలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా రూ. 20లక్షలు పొందాలంటే.. నెలకు రూ. 28,100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఐదేళ్లు ఈ పథకంలో డిపాజిట్ చేస్తే.. రూ. 20 లక్షలు చేతికి అందుతాయి. ఈ స్కీమ్ కింద పెట్టుబడిదారు 6.7 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. ఇది త్రైమాసిక కాంపౌండింగ్ ఆధారంగా ఉంటుంది. అంటే.. వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ మొత్తం పెట్టుబడిన కొంత పెంచుతుంది.➤మొత్తం పెట్టుబడి (రూ. 28100 x 60 నెలలు): రూ. 16,86,000➤మీ పెట్టుబడికి వడ్డీ: రూ. 3,19,382➤మెచ్యూరిటీ మొత్తం: రూ. 20,05,382ఇదీ చదవండి: నెలకు ₹5000 ఆదాతో రూ.8 లక్షలు చేతికి: ప్లాన్ వివరాలివిగో..రిస్క్ లేకుండా పొదుపు చేయడానికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఉత్తమమైన మార్గం. ఈ ప్లాన్‌ను మీరు నెలకు 100 రూపాయల పెట్టుబడితో కూడా ప్రారభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఈ పథకం పూర్తిగా ప్రభుత్వ హామీతో ఉంటుంది, కాబట్టి మీ డబ్బు పూర్తిగా సురక్షితం. వడ్డీ రేట్లలో మార్పులు ప్రతి మూడు నెలలకు సమీక్షించబడతాయి. కాబట్టి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు, గృహిణులు అందరూ ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు.

YV Subba Reddy Strong Counter To Vijaysai Reddy Comments6
అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది

విజయవాడ, సాక్షి: లిక్కర్‌ కేసు విచారణ సందర్భంగా రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వైఎస్సార్‌సీపీ కోటరీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ పడింది. అసలు అలాంటి కోటరీ ఒకటి ఉందో లేదో ఆయనకే తెలియాలి అంటూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయసాయికి చురకలు అంటించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదోరకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయనే కదా ప్రధానంగా చక్రం తిప్పింది. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో? లేదో?.. కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా?. ఇప్పుడేమో నెంబర్‌ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని ఆయనే చెప్పుకుంటున్నాడు. .. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు.. రాబోయే రోజుల్లో కూడా ఉండదు. మా పార్టీలో నెంబర్‌ వన్‌ నుంచి 100 వరకూ అన్నీ జగన్ మోహన్ రెడ్డే’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘మా హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ అంటూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భయపెట్టి కొంతమందిని లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అన్నింటి పైనా న్యాయపోరాటం చేస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Vijayashanthi Angry on Negative Reviews on Arjun So Vyjayanthi Movie7
సినిమాను ఖూనీ చేద్దామని దుష్టశక్తుల ప్రయత్నం.. విజయశాంతి వార్నింగ్‌

నందమూరి కళ్యాణ్‌ రామ్‌, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి (Arjun S/O Vyjayanthi Movie). ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ రివ్యూలు వస్తున్నాయి. మిశ్రమ స్పందన మధ్య సినిమా తొలిరోజు దాదాపు రూ.5 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిందంతా మంగళవారం లోపు తిరిగి వచ్చేస్తుందని కళ్యాణ్‌ రామ్‌ ధీమాగా ఉన్నాడు. అయితే విజయశాంతి మాత్రం సినిమాకు నెగెటివ్‌ రివ్యూ ఇచ్చినవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదే మా హెచ్చరిక..శనివారం ఏర్పాటు చేసిన అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి సినిమా సక్సెస్‌ మీట్‌లో విజయశాంతి (Vijayashanthi) మాట్లాడుతూ.. సినిమాను ఖూనీ చేద్దామనుకునే వారికి మా హెచ్చరిక.. సినిమాలపై తప్పుడు ప్రచారం చేసే వారు తమ పద్దతి మార్చుకోవాలి. కొంత మంది కావాలనే శాడిజంతో సినిమాల్ని ఇబ్బండిపెడుతున్నారు. ప్రతి ఒక్క మూవీ ఆడాలనేది మా కోరిక. బాగున్న సినిమాను బాగా లేదని, బాగోలేని సినిమాను బాగుందని ప్రచారం చేయడం ఏంటి? చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వస్తారు. సినిమా నచ్చకపోతే చూడకండి, నిశ్శబ్దంగా ఉండండి.సినీ ఇండస్ట్రీని బతికించండిసినిమా నచ్చలేదని.. ఖూనీ చేద్దామని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి. థియేటర్లలో ప్రజలు మా మూవీ చూసి అద్భుతంగా ఉందంటున్నారు. ప్రజలకు నచ్చిన సినిమాలపై మీకెందుకు అంత పైశాచిక ఆనందం. మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి.. అంతేకానీ మంచి చిత్రాలను చంపే హక్కు మీకు లేదు. సినిమా ఇండస్ట్రీని బతికించండి. సినిమాను చంపేస్తే కొన్ని జీవితాలు పోతాయి. కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలను నాశనం చేసేవాళ్లను జీవితంలో క్షమించకూడదు అని విజయశాంతి పేర్కొంది.చదవండి: నటుడి పరిస్థితి విషమం.. కాలేయదానం చేస్తానన్న కూతురు..

Son gets married after father passed away to receive his blessings video viral8
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి

చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov— Thanthi TV (@ThanthiTV) April 18, 2025తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్‌(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్‌ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Kutami Atrocities No confidence motion against Vizag Mayor Live Updates9
GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి

విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో ప్రజాస్వామ్యం మళ్లీ మళ్లీ ఖూనీ అవుతోంది. బలం లేకున్నా విశాఖ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి.. కుట్రలు, ప్రలోభాల పర్వాలతో అడ్డదారిలో నెగ్గింది. ఏకంగా 30 మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ.. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిను మేయర్‌ పీఠం నుంచి దించేసింది. అధికార వ్యామోహంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. కేవలం పది నెలల కాలం ఉన్న ఓ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించడం గమనార్హం. ఈ క్రమంలో దిగజారుడు రాజకీయాలు చేసింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం, స్టార్‌ హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేయడం లాంటి చేష్టలకు పాల్పడింది. కేరళకు వెళ్లి మరీ వైస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించి.. బతిమాలి.. డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఒకవైపు డబ్బు ఎర, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు కిడ్నాపులు.. ఇలా టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా సరే బొటాబొటిగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గింది టీడీపీ. ఇక అవిశ్వాస ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే.. భారీ భద్రత నడుమ ఓటింగ్‌ నిర్వహించాలని, ఓటింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయించాలని వైఎస్సార్‌సీపీ చేసిన విజ్ఞప్తిని అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కూటమి నేతలను అడ్డుకోని పోలీసులుఅవిశ్వాసం వేళ.. కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి లోపలికి అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. ఓటింగ్‌కు వెళ్లిన సభ్యులతో కలిసి జీవీఎంసీ దర్జాగా కొందరు కూటమి నేతలు వెళ్తున్న దృశ్యాలు మీడియాకు చేరడం గమనార్హం. నీచమైన రాజకీయాలు వద్దని చెప్పాప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటినుంచి నేను వైఎస్సార్‌సీపీలో ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు. డబ్బులు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చెయ్యొద్దని చెప్పాను. వైయస్ జగన్ వలనే నేను కార్పోరేటర్ అయ్యాను అని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ శశికళ ఈ ఉదయం ఓ వీడియో విడుదల చేశారు కూడా. ఓటింగ్‌కు ముందు వాస్తవ బలాబలాలువైఎస్సార్సీపీ 58 టీడీపీ 29జనసేన 3బీజేపీ 1సీపీఐ 1సీపీఎం 1ఇండిపెండెన్స్ 4.ఖాళీలు 1.జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లుజీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులుటీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..వైఎస్సార్సీపీకి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్‌సీపీ మొత్తం బలం 61ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు.

Hydraa Shock to AP MLA Vasantha Krishna Prasad10
ఏపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్‌

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్‌ తగిలింది. కొండాపూర్‌ పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఆయన చేపట్టిన అక్రమ కట్టడాలను శనివారం ఉదయం అధికారులు కూల్చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.కొండాపూర్‌ ఆర్టీఏ కార్యాలయ సమీపంలోని సర్వే నెంబర్‌ 79లో 39 ఎకరాల స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు అక్కడికి చేరుకున్న హైడ్రా.. వసంత కృష్ణ ప్రసాద్‌ కబ్జాల పర్వాన్ని గుర్తించింది. ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తోపాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించింది. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. భారీ పోలీస్‌ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగించింది. ఈ క్రమంలో వసంత హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన ఆఫీస్‌తో పాటు భారీ షెడ్లను తొలగించారు. హఫీజ్‌పేటలో రూ.2000 కోట్ల విలువగల వివాదాస్పద భూమిలో ఆయన కబ్జా పెట్టినట్లు తేలింది. అలాగే.. మాదాపూర్‌లోని 20 ఎకరాల భూమిని వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ వ్యవహారంపై ఆయన అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement