
విద్యార్థులు గొప్పవారి చరిత్రను చదవాలి
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థి దశలో గొప్ప వారి చరిత్రలు చదివి వారి ఆదర్శనీయమైన ఆలోచనలను అనుసరించాలని యోగి వేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మ అన్నారు. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా వైవీయూ లలిత కళల శాఖలో బుధవారం నాటక రంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌తోపాటు డీన్ కె.గంగయ్య, శాఖ హెడ్ కె.మృత్యుంజయరావు కందుకూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పుత్తా పద్మ మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం బాల్య వివాహాలను నిషేధించడం, వితంతు వివాహాలను ప్రోత్సహించడంతోపాటు బాలికల విద్య కోసం కృషిచేసిన మహానుభావుడు అని వివరించారు. హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ప్రొఫెసర్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ డీన్ ప్రొఫెసర్ కె.గంగయ్య మాట్లాడుతూ దేశ సంస్కృతిని కాపాడేవీ నాటకాలేనని తెలిపారు. ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్ హెచ్‌ఓడీ డాక్టర్ కె.మృత్యుంజయ రావు మాట్లాడుతూ నాటకాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని, ఒక మంచి మార్గంలో తీసుకువెళ్తాయని తెలిపారు. అనంతరం నాటక రంగంలో నంది అవార్డులు, హంస అవార్డులు, కందుకూరి పురస్కారాలు అందుకున్న రంగస్థల కళాకారులు, నటులు అయిన కొడవలూరు చంద్రశేఖర్ రాజు, ఎడవల్లి కృష్ణమూర్తి,పి.యశోద, డా. నీలం బాలగంగాధర్ తిలక్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. డాక్టర్ కొప్పోలు రెడ్డిశేఖర్‌రెడ్డి, సీహెచ్.వెంకటేష్, బి.చినరాయుడు, బి.వీరప్ప, ఎం.వాసవి, చంటిసూరి, సిద్ధిరాజ్ పాల్గొన్నారు.
వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య పద్మ