YSR District Latest News
-
పల్లె.. తల్లడిల్లె !
● పల్లె గొంతులు ఎండుతున్నాయి.. ● పలు గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ● తాగునీటి రవాణా, అద్దెబోర్ల ఏర్పాటు ● అడుగంటుతున్న భూగర్భ జలాలు కడప సెవెన్‌రోడ్స్ : పల్లె గొంతులు తడారుతున్నాయి. గుక్కెడు మంచి నీటికోసం అల్లాడుతున్నాయి. అడుగంటిన భూగర్భ జలాలతో జిల్లాలలోని పలు గ్రామాలు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నాయి. వేసవి తీవ్రత అధికంగా ఉండడంతో జిల్లాలోని పలు గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. సరిపడా తాగునీరు లేక మనుషులు, పశువులు విలవిల్లాడాల్సిన దుస్థితి తలెత్తింది. అనేక మండలాల్లో భూగర్భ జలాలు శరవేగంగా అడుగంటుతున్నట్లు అధికారుల నుంచి నివేదికలు అందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మరిన్ని గ్రామాలను తాగునీటి ఎద్దడి చుట్టుముట్టనుంది. ఇప్పటికే చాలాచోట్ల తాగునీటి రవాణా, వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకోవడం వంటి ఉపశమన చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఇంకా రెండు నెలలపాటు నీటి ఎద్దడిని ఎదుర్కొవాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వర్షాలు సంవృద్ధిగా సకాలంలో కురిస్తే తప్ప నీటి ఎద్దడి నుంచి త్వరగా బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ముందుచూపుగా వ్యవహరించి ఉంటే ప్రజలకు ఈ కష్టాలు తప్పేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ● జిల్లాలోని 18 మండలాల్లో తాగునీటి ఎద్దడి అధికంగా ఉన్నట్లు అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో బోరు బావులను అద్దెకు తీసుకోవడం, తాగునీటిని ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరఫరా చేసే చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల కొత్త బోరుబావులను ఏర్పాటు, ఉన్న బోరుబావులను లోతు చేయడం వంటి పనులు చేపట్టారు. దాహ మేశాక బావి తవ్విన చందంగా ఉపశమన చర్యలు ఆలస్యంగా చేపట్టారు. ● పోరుమామిళ్ల మండలం వెంకటాపురం పంచాయతీలోని ముద్దంవారిపల్లె, వీఎన్ పల్లె మండలం అలిదెన పంచాయతీలోని ఎ.ఓబాయపల్లె, పెద్దముడియం మండలం దిగువ కల్వటాల పంచాయతీలోని బీసీ కాలనీ, చక్రాయపేట మండలం గడ్డంవారిపల్లె పంచాయతీ బయమ్మగారిపల్లె, మద్దికవాండ్లపల్లె, తాటికాడపల్లె, గండిలలో వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకున్నారు. అదే గ్రామ పంచాయతీలోని బీసీ కాలనీలో రవాణా జరుగుతోంది. ఈ గ్రామాల్లో జనవరి నుంచే నీటి ఎద్దడి ఉండడంతో అధికారులు ఈ చర్యలకు ఉపక్రమించారు. వేంపల్లె మండలం రాజీవ్ కాలనీ, మైలవరం మండలం బెస్తవేముల పంచాయతీలో ని జంగాలపల్లె, బెస్తవేముల, పెద్దముడియం మండలం దిగువ కల్వటాల బీసీ కాలనీలో పాపాయపల్లె, చక్రాయపేట మండలం సురభి గ్రామ పంచాయతీలోని లక్ష్మీపురం గ్రామాల్లో తాగునీరు రవాణా చేస్తున్నారు. దువ్వూరు మండలం చిన్న సింగనపల్లె, ఎస్సీకాలనీ, ఎర్రగుంట్ల మండలం వలసపల్లె, ఒంటిమిట్ట మండలం కె.మాధవరం పంచాయతీలోని ముకుందాశ్రమం గ్రామాల్లో సైతం నీటి ఎద్దడి అధికంగా ఉన్నట్లు అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ● గత సంవత్సరం జూన్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేది వరకు జిల్లా సాధారణ వర్షపాతం 636.05 మిల్లీమీటర్లకుగాను 772.6 మిల్లీమీటర్లు నమోదైందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. డీవియేషన్ 21.47గా ఉంది. జిల్లాలో ఈ ఏడాది మార్చికి సగటున భూగర్భ జల మట్టం 10.62 మీటర్ల లోతులో ఉంది. మండలాల వారీగా పరిశీలిస్తే అట్లూరు 13.47 మీటర్లు, బి.కోడూరు 10.51, బద్వేలు 10.04, బి.మఠం 1.32, చక్రాయపేట 8.47, చాపాడు 5.23, చెన్నూరు 6.34, సీకే దిన్నె 4.86, దువ్వూరు 10.22, జమ్మలమడుగు 8.77, కలసపాడు 12.88, కమలాపురం 4.03, ఖాజీపేట 14.78, కొండాపురం 5.67, లింగాల 7.02, ముద్దనూరు 12.82, మైలవరం 3.07, పెద్దముడియం 9.9, పెండ్లిమర్రి 25.02, పోరుమామిళ్ల 11.99, ప్రొద్దుటూరు 4.23, పులివెందుల 33.86, రాజుపాలెం 7.04, ఎస్.మైదుకూరు 7.88, సిద్దవటం 19.09, సింహాద్రిపురం 6.04, కాశినాయన 19.09, తొండూరు 6.09, వల్లూరు 5.94, వీఎన్ పల్లె 9.01, వేంపల్లె 8.93, వేముల 5.71, ఎర్రగుంట్ల 5.34 మీటర్లలో భూగర్భ జలాలు ఉన్నాయి. నీటి ఎద్దడి నివారణకు రూ. 5.67 కోట్లతో ప్రతిపాదనలు వేసవి కావడంతో జిల్లాలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రజలకు తాగునీరు అందించేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టాం. ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా, వ్యవసాయ బోరు బావులు అద్దెకు తీసుకోవడం, బోర్ల డీపెనింగ్, ఫ్లషింగ్, కొత్త బోర్ల ఏర్పాటు లాంటివి చేస్తున్నాం. జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులు, గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఇందుకు ఖర్చు చేస్తున్నాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు కోసం రూ. 5.67 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఎక్కడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అవసరమైన చర్యలను తీసుకుంటున్నాం. – ఏడుకొండలు, పర్యవేక్షక ఇంజనీరు, ఆర్డబ్ల్యూఎస్, కడప -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
పులివెందుల రూరల్ : పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఇతను గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిసి ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. బాల్య వివాహన్ని అడ్డుకున్న ఎస్ఐ పెండ్లిమర్రి : మండలంలోని కొత్తగంగిరెడ్డిపల్లె గ్రామంలో బాల్య వివాహం చేస్తున్నారని అందిన సమాచారం మేరకు సోమవారం ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి బాల్య వివాహన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 ఏళ్ల బాలికకు 26 ఏళ్ల యువకుడితో మరో రెండు రోజుల్లో వివాహం చేయాలని నిర్ణయించారు. ఎస్ఐ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువురిని పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇరువురి పెద్దలపై బైండోవర్ కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య వీరపునాయునిపల్లె : అప్పుల బాధ తాళలేక వెల్దుర్తి గ్రామానికి చెందిన మాతిగాళ్ల రఘు(42) అనే రైతు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా.. రైతు సోమవారం ఉదయం పొలం దగ్గరికి వెళ్లి అక్కడే ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకున్నాడు. చుట్టు పక్కల ఉన్న పొలాల రైతులు గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి 1.5 ఎకరం పొలం ఉందని పొలంలో పంటలు సరిగ్గా రాక పోవడం ఒక కారణం కాగా, ముగ్గురు కుమార్తెల పెళ్లిల్లు ఎలా చేయాలన్నదే ఆత్మహత్యకు ప్రధాన కారణమని బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతున్న వ్యక్తి అరెస్టు ప్రొద్దుటూరు క్రైం : ఆన్లైన్లో క్యాసినో అనే బెట్టింగ్ గేమ్‌ను ఆడుతున్న వ్యక్తిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని తాళ్లమాపురం గ్రామానికి చెందిన మాచిరెడ్డి చైతన్య రెడ్డి ఆన్లైన్లో క్యాసినో అనే బెట్టింగ్ గేమ్ ఆడుతుండగా సోమవారం రూరల్ ఎస్ఐ వెంకట సురేష్ అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.20,800 నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
సమస్యలపై సత్వరమే స్పందించాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన సమస్యల పట్ల అధికారులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ● బీసీ కుల గణన చేపట్టాలని బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేశు యాదవ్, ఏపీ దళితమిత్ర సంఘం అధ్యక్షుడు కై పు రామాంజనేయులు కోరారు. 1931లో కుల గణన నిర్వహించారని, ఇప్పటివరకు చేపట్టకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ● సర్వే నెంబరు 847/ఎలోని 4.79 ఎకరాల భూమిని రెవెన్యూ రికార్డుల్లో ఎండోమెంట్ భూమిగా చూపుతున్నారని, దాన్ని సవరించి తనకు న్యాయం చేయాలని కమలాపురం మండలం అప్పాయపల్లెకు చెందని ఎం.మునీర్ అహ్మద్ కోరారు. ● తనకు ఎలాంటి భూమి, ఆస్తిపాస్తులు లేవని, అయితే ఆన్లైన్లో తన పేరిట భూమి ఉన్నట్లు చూపుతోందని, ఇందువల్ల తన కుమారుడికి ప్రభుత్వ ఉపకార వేతనం అందకుండా పోయిందని, కనుక ఆన్లైన్లో తన పేరుతో ఉన్న రికార్డు వివరాలను తొలగించాలని సీకే దిన్నె మండలం మామిళ్లపల్లెకు చెందిన కృష్ణారెడ్డి కోరారు. ● తన ఇంటి స్థలాన్ని ఇతరులు ఆక్రమించి అక్రమంగా గేటు ఏర్పాటు చేశారని, అధికారులు విచారించి న్యాయం చేయాలంటూ కడప ప్రకాశ్‌నగర్‌కు చెందిన టి.నారాయణరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు శ్రీనివాసులు, వెంకటపతి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, మెప్మా పీడీ కిరణ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.డీఆర్వో విశ్వేశ్వరనాయుడు -
మట్టి టిప్పర్ పట్టివేత
పెండ్లిమర్రి : మండలంలోని వెల్లటూరు గ్రామ సమీపంలోని ఎగువ చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న ఒక టిప్పర్‌ను సోమవారం ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి సీజ్ చేశారు. సీజ్ చేసిన టిప్పర్‌ను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. గడ్డివామి, పూరిగుడిసె దగ్ధంబద్వేలు అర్బన్ : బద్వేలు అగ్నిమాపక కేంద్రం పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం ప్రమాదవశాత్తు గడ్డివామి, పూరిగుడిసె దగ్ధమైనట్లు ఫైర్ ఆఫీసర్ ఎం.చంద్రుడు తెలిపారు. పట్టణంలోని నెల్లూరు రోడ్డులో గల శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ గోశాలకు సంబంధించిన గడ్డివామి ప్రమాదవశాత్తు దగ్ధమవడంతో రూ.50 వేలు నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. అలాగే గోపవరం మండలం రాచాయపేట గ్రామంలో స్వర్ణకొండయ్యకు చెందిన పూరిగుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమైనట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలో రూ.40 వేలు నష్టం వాటిల్లిందన్నారు. ఉపాఽధి కూలీలపై తేనెటీగల దాడి రాజుపాళెం : మండలంలోని సోమాపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న దాదాపు 25 మంది ఉపాధి కూలీలపై సోమవారం తేనెటీగలు దాడి చేశాయి. గ్రామ సమీపంలోని వంకలో జమ్ము కోసే క్రమంలో తేనెటీగలు అక్కడ ఉండటంతో ఒక్క సారిగా వారిపై దాడి చేశాయి. మొత్తం 150 మంది కూలీలు అక్కడ పని చేస్తుండగా ఒక్క సారిగా తేనెటీగలు వచ్చి వారిపై దాడి చేయడంతో భయపడిన కూలీలు పరుగులు తీస్తూ కిందా మీద పడి గ్రామంలోకి చేరుకున్నారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారంతా రాజుపాళెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందారు. ఈ విషయాన్ని ఏపీఓ లక్ష్మీనారాయణ దృష్టికి కూలీలు తీసుకెళ్లారు. -
బసినికొండలో టీడీపీ బరితెగింపు
మదనపల్లె : కూటమిప్రభుత్వ పాలనలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. మదనపల్లె పట్టణశివారు ప్రాంతాల్లో ప్రధాన రహదారికి సమీపంలో కోట్ల విలువచేసే ప్రభుత్వస్థలాలు ఉండటంతో తమ్ము ళ్ల కన్ను వీటిపై పడింది. ముఖ్యంగా బసినికొండ పంచాయతీలో టీడీపీ నాయకులు బరితెగించి ప్రభుత్వస్థలాలను ఇష్టారాజ్యంగా ఆక్రమించేస్తున్నారు. ఏకంగా సచివాలయానికి కూతవేటు దూరంలో సోమవారం ఉదయం జేసీబీతో బహిరంగ మార్కెట్లో రూ.15కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించేందుకు పూనుకున్నారు. స్థానికులు గమనించి మొదట అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడకు వెళ్లి విచారిస్తే..ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరించారు. దీంతో వారు అక్కడ నుంచి వెనుదిరగడంతో స్థానికులు మీడియాకు తెలిపారు.... ఇది ప్రభుత్వగయాళు స్థలం. దీనికి సంబంధించి మీవద్ద ఏ రికార్డులు ఉన్నాయని రిపోర్టర్లు అడిగితే..తమకేమీ తెలియదని అంతా ఎమ్మెల్యేకే తెలుసు అంటూ బుకాయించారు. దీంతో మీడియా వ్యక్తులు తహసీల్దార్ ధనంజయులు, ఎమ్మెల్యే షాజహాన్‌బాషాకు వాట్సప్‌లో ఫొటోలు పంపి, సమాచారం తెలపడంతో ఆక్రమణదారులు పనులు నిలిపివేసి మెల్లగా జారుకున్నారు. ఆరేళ్ల క్రితమే సాక్షిలో కథనం... 2019 ఫిబ్రవరిలో బసినికొండకు చెందిన టీడీపీ మైనారిటీ నాయకుడు ఎస్ఎం.రఫీ..ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బసినికొండ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్.682 గయాళుభూమిలో తప్పుడు పత్రాలతో దరఖాస్తు పట్టాలు సృష్టించి భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన సాక్షి..ఆక్రమణపై కథనం ప్రచురించడంతో ఎట్టకేలకు పనులు నిలిపివేశారు. తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అఽధికారంలోకి రావడంతో తమ ఆటలు సాగవని గుట్టుగా ఉండిపోయారు. ప్రస్తుతం మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో..ఎలాగైనా విలువైన ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించుకునేందుకు తప్పుడు పత్రాలతో తమ్ముళ్లు సిద్ధమైపోయారు. దీనిపై తహసీల్దార్ ధనంజయులు వివరణ ఇస్తూ..సమాచారం తెలిసిన వెంటనే పనులు నిలిపివేయించామన్నారు. ఆక్రమణదారులు చూపిస్తున్న దరఖాస్తు పట్టాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని తెలిపారు. 15కోట్ల విలువైన ప్రభుత్వస్థలం ఆక్రమణకు సన్నాహాలు పట్టపగలే జేసీబీతో చదునుపనులు ఎమ్మెల్యే చెప్పాడంటూ అధికారులకు బెదిరింపులు -
‘ఉర్సా’కు కారుచౌకగా భూములు కట్టబెట్టడం దారుణం
కడప కార్పొరేషన్ : విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను ‘ఉర్సా’ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి అత్యంత కారుచౌకగా కట్టబెట్టడం దారుణమని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎకరా భూమిని టీసీఎస్ కంపెనీ, ఉర్సా కంపెనీలకు కేవలం ఒక రూపాయికే కట్టబెట్టడం అన్యాయమన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా ప్రభుత్వ భూములను తక్కువ ధరకే ఇవ్వడం సరికాదన్నారు. 2003లో కూడా చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాగే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐఎంజీ కంపెనీకి 850 ఎకరాలను కేటాయించారని, వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని రద్దు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇలా ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా భూములు కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, కార్యదర్శి సుహైల్ అహ్మద్, ఐటీ విభాగం నగర అధ్యక్షుడు ఫయాజ్ పాల్గొన్నారు. -
బాధితులకు చట్టపరిధిలో న్యాయం
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ఎ.ఆర్ డీఎస్పీ కె. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
కడప మహిళా స్టేషన్ డీఎస్పీగా బాలస్వామిరెడ్డి
కడప అర్బన్ : కడప మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బాలస్వామి రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1995 బ్యాచ్‌కి చెందిన ఈయన ఎస్ఐగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. 2007లో సీఐగా, 2020లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం కడప హ్యూమన్ రైట్స్ డీఎస్పీగా పనిచేస్తూ కడప మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ ఫిర్యాదులపై సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కడపలో బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలుకడప అర్బన్ : కడప నగరంలోని వైవీ స్ట్రీట్‌లో సోమవారం సాయంత్రం ఆకస్మికంగా పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి డాగ్‌స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ టీం బృందం వారు తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా అనుమానితులుగా ఉన్నా, వస్తు సామగ్రి కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వ్యాపారులకు, ప్రజలకు సూచించారు. రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కడప అర్బన్ : కడప రిమ్స్‌కు ఈనెల 24వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి (48)ని చికిత్స నిమిత్తం తీసుకు వచ్చారు. అతనికి వైద్య పరీక్షలు చేసిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ మరణించాడని నిర్ధారించారు. అతని మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. -
11న అరుణాచలానికి ప్రత్యేక సర్వీసులు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే వారి కోసం మే 11వ తేదీన ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. ● కడప డిపో నుంచి ఉదయం 6 గంటలకు గోల్డెన్ టెంపుల్ మీదుగా, రాత్రి 9 గంటలకు రాయచోటి, చిత్తూరు, వేలూరు మీదుగా బస్సులు బయలుదేరుతుందన్నారు. ఇందులో టిక్కెట్ ధర రూ. 1044 గా ఉందన్నారు. ● బద్వేలు డిపో నుంచి ఉదయం 9.00 గంటలకు కడప, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అల్ట్రా డీలక్స్ బస్సు బయలుదేరుతుందన్నారు. ఇందులో చార్జి రూ. 1282లు. ● మైదుకూరు డిపో నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కడప, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా సూపర్‌లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. ఇందులో రూ. 1209 చార్జీగా నిర్ణయించారు. ● ప్రొద్దుటూరు డిపో నుంచి సాయంత్రం 6 గంటలకు మైదుకూరు, కడప మీదుగా సూపర్‌లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. ఇందులో టిక్కెట్ ధర రూ. 1273లు. ● పులివెందుల డిపో నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు రాయచోటి, పీలేరు మీదుగా నడుస్తుందన్నారు. ఇందులో చార్జీ రూ. 1242గా ఉందన్నారు. ● జమ్మలమడుగు డిపో నుంచి రెండు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరి వెళుతాయన్నారు. ఒక బస్సు సాయంత్రం 6.00 గంటలకు మరో బస్సు రాత్రి 8.00 గంటలకు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప మీదుగా నడుస్తుందన్నారు. ఇందులో ఛార్జీగా రూ. 1363 చొప్పున నిర్ణయించారని తెలిపారు. -
సాంకేతిక విద్య.. భవితకు భరోసా!
కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి తరువాత వీలైనంత తొందరగా ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి పాలిటెక్నిక్ కోర్సులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సాధారణంగా పదవ తరగతి తరువాత ఇంటర్, డిగ్రీ కోర్సులు చేయడం సాధారణం. అయితే డిగ్రీ పూర్తయి ఉద్యోగం వచ్చేంత సమయం లేకపోవడంతో చాలామంది పాలిటెక్నిక్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. పదవ తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిసెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలలో ఉత్తమ ర్యాంకు సాధించిన వారికి రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి. ఇటీవలే పదవ తరగతి పరీక్షలు కూడా ముగిశాయి. ఫలితాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా పాలిసెట్ కోసం దాదాపు 8 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మెండుగా ఉద్యోగ అవకాశాలు.. పదవ తగరతి చదివిన వెంటనే సాంకేతిక విద్య చదవాలనే గ్రామీణ పేద విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సు గొప్ప అవకాశం. ఇంజనీరింగ్ వంటి అత్యున్నత సాంకేతిక విద్య అభ్యసించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. పాలిటెక్నిక్‌లో ఏ కోర్సు చేసినా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. దీంతో భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల వివిధ సంస్థలు నేరుగా కళాశాలలకు వెళ్లి పాలిటెక్నిక్ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులను తమ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు. ఈ నెల 30న ప్రవేశ పరీక్ష.. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ పరీక్ష రాయాల్సిందే. పాలిసెట్ దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 17వ తేదీతో గడువు ముగిసింది. ఈ నెల 30వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్షను కూడా నిర్వహించనున్నారు. ఈ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ఇందులో గణితం 50 మార్కులకు, ఫిజిక్స్ 40 మార్కులకు, కెమిస్ట్రీ 30 మార్కులకు ఉంటుంది. పదవ తరగతి సిలబస్ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం కడప, ప్రొద్దుటూరులలో 16 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 వేల మంది దాకా ఈ పాలిసెట్ ప్రవేశ పరీక్షను రాయనున్నారు. కోర్సుల వివరాలు ఇలా.. ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈఈ, కంప్యూటర్ మెకానిక్, ఈసీఈ, ఎంఈసీలతోపాటు ఒకటి రెండు కొత్త కో ర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. జిల్లా మొ త్తం పైన ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 15 పాలిటెక్నిక్ కళాశాలకుగాను 5600 సీట్లు అందుబాటులో ఉన్నా యని అధికారులు తెలిపారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ నిర్వహించారు. ఈ ఉచిత కోచింగ్ 28వ తేదీతో ముగిసింది. పదవ తరగతి విద్యార్థులకు చక్కటి అవకాశం పాలిటెక్నిక్ విద్యతో మంచి ఉద్యోగావకాశాలు రేపు పాలిసెట్ ప్రవేశ పరీక్ష జిల్లాలో 8 వేల మంది దాకా పరీక్ష రాయనున్న విద్యార్థులు జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల ఏర్పాటుపాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిజిల్లా వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకుఅన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు. సోమవారం కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అడిషనల్ కో ఆర్డినేటర్ దామోదరంతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం కడపలో 12 పరీక్షా కేంద్రాలను, ప్రొద్దుటూరులో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ 16 పరీక్షా కేంద్రాలలో దాదాపు 12500 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాస్తున్నారని తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుందని తెలిపారు. విద్యార్థులంతా ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్లో హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఎవరికై నా ఆన్లైన్లో హాల్‌టికెట్ డౌన్లోడ్ కాకపోతే 29వ తేదీ మధ్యాహ్నంలోగా కడపలోని ప్రభుత్వ మహిళా కళాశాలను సంప్రదించాలని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి పరీక్ష రాసేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. -
నిబంధనల ప్రకారం రెగ్యులర్ చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : ఆరు సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న తమకు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సందీప్‌కుమార్, జిల్లా అధ్యక్షులు గిఫ్టీ షీలా, ఉపాధ్యక్షులు హిమబిందు, ట్రెజరర్ తౌఫిక్అలీ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలన్నారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. హెచ్ఆర్ పాలసీ–ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్‌గ్రేషియా వంటివి అమలు చేయాలన్నారు.కలెక్టరేట్ వద్ద ఏపీ ఎంసీఏ ధర్నా -
వాహిద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
కడప కార్పొరేషన్ : ఒక మహిళను మోసం చేసి, ఆమె సోదరుడిపై దాడి చేయించిన కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి పీఏ వాహిద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండిదీప్తి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆయేషా అనే మహిళను రెండో వివాహం చేసుకున్న వాహిద్, పెళ్లి అయినప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలు పెట్టాడన్నారు. ఆమె నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తుండేవాడన్నారు. ఇదేమని ప్రశ్నించిన ఆమె సోదరుడిపై వాహిద్ అనుచరులు శనివారం రాత్రి దాడి చేశారన్నారు. రక్తగాయాలతో వెళ్లి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదన్నారు. అర్థరాత్రి ఆయేషా సోదరుడితో కలిసి ఎమ్మెల్యే ఇంటివద్దకు వెళ్లి ఆమెకు వాయిస్ మెసేజ్‌లు పెట్టి మొరపెట్టుకున్నా పట్టించుకునేవారు కరువయ్యారన్నారు. మహిళలకు రక్షణ కావాలి, భద్రత ఉండాలని అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే మాధవి తన వద్దకు వచ్చిన మహిళకే రక్షణ ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంతోమంది మహిళలను వాహిద్ లైంగికంగా వేధించాడని ఆరోపించారు. దాడికి పాల్పడిన వాహిద్, అతని అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దిశ చట్టం ఉన్నప్పుడే మహిళలకు తగిన భద్రత, రక్షణ ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయేషాకు న్యాయం జరిగేంత వరకూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ఈ సమావేశంలో మహిళా విభాగం రాష్ట్ర నేతలు మూలే సరస్వతీదేవి, రత్నకుమారి, కో ఆప్షన్ సభ్యురాలు బండి మరియలు, నారాయణమ్మ, శ్రీదేవి, సుశీలమ్మ పాల్గొన్నారు. -
అతివేగం తెచ్చిన అనర్థం
రైల్వేకోడూరు అర్బన్/నందలూరు: రైల్వేకోడూరు మండలంలోని అనంతరాజుపేట గుండాలేరు బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున నందలూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఆటోను అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయిన లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ఆటో నుజ్జు నుజ్జయింది.నందలూరుకు చెందిన పి.జహరాబీ (60), పి.సుహేల్ఖాన్ (15)లు అక్కడికక్కడే మృతి చెందారు.ఆటోలో ఉన్న రహీముల్లా, ఫరిహానా, సుహానాఖాన్, షాహీదా, అబ్దుల్లాలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 ద్వారా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిరుపతిలో నివాసముంటున్న రహీముల్లా నందలూరులోని అత్తగారి ఇంటికి వచ్చాడు. ఒక రోజు ఉండి వేసవి సెలవులు కావడంతో బంధువులను తిరుపతిలోని తన ఇంటికి ఆటోలో తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో అనంతరాజుపేట వద్ద రాజంపేట వైపు వెళుతున్న టీఎన్88ఎల్807 నంబర్ గల లారీ ఢీ కొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ రఘురామన్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్‌బాబు తెలిపారు. ఆటోను ఢీకొన్న లారీ ఇద్దరు మృతి : అయిదుగురికి గాయాలు -
కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి
కడప సెవెన్‌రోడ్స్ : అధికారం అండగా చూసుకుని జిల్లాలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సాయిదత్త, ప్రధాన కార్యదర్శి శ్యాం సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. అధిక ఫీజు వసూళ్ల వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ర్యాంకుల పేరుతో చేస్తున్న వేధింపులు తట్టుకోలేకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు దావుద్, రుద్రసేనారెడ్డి, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు -
వైవీయూ డిగ్రీ పరీక్షలు షురూ
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ ,బీకాం, బ్యాచిరల్ ఆఫ్ వొకేషనల్ 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు 80 కళాశాల నుంచి 55 కేంద్రాల్లో 25,892 మంది విద్యార్థులు రాస్తున్నారు. కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల, స్పిరిట్స్ డిగ్రీ కళాశాల కేంద్రాలను విశ్యవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాస రావు , వైవీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వి కృష్ణారావు మాట్లాడుతూ పరీక్షలు మే 24వ తేదీ వరకు ఉంటాయన్నారు. ఉపకులపతి ఆదేశాల మేరకు పరీక్షలలో ప్రతి కేంద్రానికి అబ్జర్వర్లను నియమించామని, అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాయన్నారు. -
వైభవంగా అష్టోత్తర కలశాభిషేకం
వల్లూరు : పుష్పగిరి శ్రీ కామాక్షీ వైద్యనాఽఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో అష్టోత్తర కలశాభిషేకాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి విశ్వక్సేన పూజ , పంచామృతాభిషేకం కార్యక్రమాలను జరిపారు. వివిధ రకాల పరిహారాల కోసం బింబశుద్ధితో 108 కలశాలను ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ నదులలోని పుణ్య జలాలు, విశేష ద్రవ్యాలతో నింపి 108 మంది దేవతలను ఆవాహన చేశారు. అనంతరం కలశాలలోని ద్రవ్యాలతో శ్రీదేవి, భూదేవి సమేత చెన్న కేశవ స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. రాత్రి శ్రీ చెన్న కేశవ స్వామి యాళీ వాహనంపై కొలువు దీరగా మంగళ వాయిద్యాల నడుమ దివిటీల వెలుగులో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ● శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం, శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి అమ్మవారికి కుంకుమార్చనలను నిర్వహించారు. రాత్రి శ్రీకామాక్షీ వైద్యనాథేశ్వర స్వామిని పురుషాన్ మృగ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పుష్పగిరిలో నేడు చందనోత్సవం బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో సుప్రభాత సేవ అనంతరం స్వామి వారికి చందనోత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. రాత్రి స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. కామాక్షీ వైద్యనాథ స్వామి ఆలయంలో ఉదయం స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు ఉంటాయి. రాత్రి మయూర వాహన సేవ జరుగుతుంది. -
నేడు మంత్రి సవిత రాక
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మంగళవారం ఒక రోజు పర్యటన నిమిత్తం కడపకు రానున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నగరంలోని ఎర్రముక్కపల్లిలో రూ.3.66 కోట్లతో నిర్మించనున్న సీపీ బ్రౌన్ అదనపు స్మారక గ్రంథాలయం, భాషా పరిజ్ఞానం కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఆర్ట్స్ కాలేజీ సమీపంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న స్టార్టప్ హబ్ భవన సముదాయ నిర్మాణానికి కూడా మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హార్టికల్చర్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హార్టికల్చర్ కన్ క్లేవ్–2025 కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు డయల్ యువర్ ఆర్ఎం కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలే పరిష్కారంగా నిర్వహిస్తున్న డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమాన్ని ఈనెల 30వ తేది నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని.. ప్రయాణికులు 99592 25848 నెంబరుకు ఫోన్ చేసిగానీ వాట్సాప్ చేసిగాని తమ సమస్యలు తెలియజేయవచ్చన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పాడి రైతులకు రాయితీతో దాణా కడప అగ్రికల్చర్ : జిల్లాలో పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రాయితీతో సమీకృత దాణాను అందిస్తుందని జిల్లా పశుసంవర్థశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శారదమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 50 కేజీల దాణా బ్యాగు పూర్తి ధర రూ. 1110 కాగా ప్రభుత్వం 50 శాతం రాయితీతో రూ. 555లకే అందిస్తుందని తెలిపారు. దాణా అవసరమైన పాడి రైతులు రైతు సేవా కేంద్రాల్లోగానీ, మండలాలోని పశువైద్యాధికారులను గానీ సంప్రదించాలని సూచించారు. భారత్ పశుధన్ యాప్‌లో రైతు పేరు నమోదు అయి ఉండాలని దీంతోపాటు పశువులకు టీకాలు వేసి ఉండాలని తెలిపారు. కేవలం తెల్లరేషన్ కార్డు కల్గిన పాడి రైతులకు ప్రారంభంగా 2,3 పశువులు కలిగిన వారికి ఒక బ్యాగు మాత్రమే అందిస్తామని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైభవంగా పల్లకి సేవ రాయచోటి టౌన్ : రాయచోటి భధ్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ నిర్వహించారు. సోమవారం రాత్రి మూల విరాట్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఉత్సవ మూర్తులను వివిధరకాల పూలు, పట్ట వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు.ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో డివి రమణారెడ్డి, స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. నూతన నియామకం రాజంపేట : రిప్లబికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షునిగా చౌడవరం సుబ్బనరసయ్య నియమితులయ్యారు. ఈమేరకు ఆర్పీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.వెంకటస్వామి ఉత్తర్వులను విడుదల చేశారు. కేంద్రమంత్రి (సామాజికన్యాయం, సాధికారిత) రాందాస్ అత్వాలే ఆదేశాల మేరకు రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం బొమ్మవరానికి చెందిన సుబ్బనర సయ్యను జిల్లా అధ్యక్షునిగా నియమించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ వీరబల్లి : మండలంలో తాటిగుంటపల్లి పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగాయంటూ పంచాయతీలోని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు సర్పంచ్‌పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సోమవారం జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి (డీపీఓ) ఖాదర్‌వల్లి విచారణ జరిపారు. ఫిర్యాదుదారులను సచివాలయానికి పిలిపించి వారి సమక్షంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నిధుల దుర్వినియోగానికి సంబంధించి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు. -
విద్యార్థిని చితకబాదిన స్కూలు యాజమాన్యంపై చర్యలకు డిమాండ్
కడప సెవెన్‌రోడ్స్ : ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామ పంచాయతీలోని పూజా ఇంటర్నేషనల్ స్కూలులో 9వ తరగతి చదువుతున్న మూల సాత్విక్‌రెడ్డిని చితకబాదిన పాఠశాల డీన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లి లెక్కల కొండమ్మ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర కో చైర్మన్ లెక్కల జమాల్‌రెడ్డి సోమవారం డీఆర్వో విశ్వేశ్వరనాయుడును కోరారు. విద్యార్థి పేరిట నకిలీ ఇన్‌స్ట్రాగామ్ సృష్టించి అమ్మాయిలను వేధించాడని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారని ఆరోపించారు. టీసీ కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. జరిగిన విషయాలను డీఈఓ, పోలీసులు, కలెక్టర్‌కు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. తమకు సంబంధం లేదంటూ ప్రొద్దుటూరు డీఎస్పీ మాట్లా డటం విచారకరమన్నా రు. ఇప్పటికై నా టీసీ ఇప్పించాలని కోరారు. -
డీసీసీబీ చైర్మన్‌గా సూర్యనారాయణరెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప : కడప డీసీసీబ్యాంకు చైర్మన్‌గా అట్లూరు మండలానికి చెందిన ఎం సూర్యనారాయణరెడ్డి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేమలూరు గ్రామానికి చెందిన ఆయన కాంట్రాక్టర్‌గా బెంగుళూరులో స్థిరపడ్డారు. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి పోయే సూర్యనారాయణరెడ్డిని డీసీసీబ్యాంకు చైర్మన్‌గిరి వరించింది. కడప పార్లమెంటు పరిధిలో డీసీసీబీ చైర్మన్ రెడ్డి సామాజిక వర్గానికి, రాజంపేట పార్లమెంటు పరిధిలో డీసీఎంఎస్ చైర్మన్ కాపు సామాజిక వర్గం ద్వారా నియమించాలనే దిశగా సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డీసీఎంఎస్ చైర్ పర్సన్‌గా రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన జయప్రకాష్‌ను నియమించారు. చక్రం తిప్పుతున్న వాసు... తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి చక్రం తిప్పుతున్నారు. సూర్యనారాయణరెడ్డికి డీసీసీబీ చైర్మన్ ఎంపిక కావడం వెనుక తెరవెనుక ప్రోత్సాహం అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బద్వేల్‌పై కన్నెసి ఉంచిన ఆయన టీడీపీ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డికి చాపకింద నీరులా వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్లు టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు. అవకాశం వస్తే ఒక్కమారుగా రితేష్‌రెడ్డి వ్యతిరేకులంతా శ్రీనివాసులరెడ్డి చెంతన చేరిపోయేలా పథక రచన చేస్తున్నట్లు సమాచారం. పార్టీకి చేసిన సేవా, సమర్థత కంటే ఆర్థిక బలం ఉన్న సూర్యనారాయణరెడ్డి లాంటి వారిని చేరదీస్తున్నట్లు పలువురు వివరిస్తున్నారు. దూరదృష్టితో ప్రతి సందర్భంలోనూ వ్యవహారం తనకు అనువుగా మల్చుకుంటున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. నమ్ముకున్న వారికి గుండు సున్నాతెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు అధినేత చంద్రబాబు ఎగనామం పెట్టారు. నామినేటెడ్ పోస్టులు భర్తీలో తగిన ప్రాధాన్యత లభిస్తుందనుకున్న వారికి నిరాశే ఎదురైంది. ఎన్నికల సమయంలో మాత్రమే కన్పించే సూర్యనారాయణరెడ్డి లాంటి వారికి డీసీసీబీ చైర్మన్‌గిరి లభించింది. వేమలూరు గ్రామం మినహా మండల స్థాయిలో కూడా ఇప్పటికీ రాజకీయాలు నెరపని సూర్యనారాయణరెడ్డికి పదవి లభించడం వెనుక ఆర్థిక స్థోమత మాత్రమే గుర్తించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా జీవితాంతం టీడీపీ జెండా మోస్తూ వచ్చిన నేతలను కనీస పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. డబ్బున్న నేతల్ని ఎంచుకొని నామినేటెడ్ పదవులు అప్పగిస్తున్నారు. పార్టీనే నమ్ముకొని అంటిపెట్టుకొని వస్తున్న సింగారెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, హరిప్రసాద్, అమీర్‌బాబు లాంటి నేతలు జిల్లా కేంద్రంలో అర్హులుగా ఉన్నప్పటికీ కనీస పరిగణలోకి తీసుకోలేదని పలువురు వివరిస్తున్నారు. ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా జమ్మలమడుగు నుంచి జంబాపురం రమణారెడ్డి, ప్రొద్దుటూరు నుంచి ఈవీ సుధాకరరెడ్డి, పులివెందుల నుంచి పేర్ల పార్థసారధిరెడ్డిలాంటి వారు అర్హులైనప్పటికీ వారిని పరిగణలోకి తీసుకోకపోవడంపై పలువురు టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. బెంగుళూరులో స్థిరపడ్డ సూర్యనారాయణ రెడ్డికి చైర్మన్‌గిరీ జిల్లాలో టీడీపీ జెండా మోసిన నాయకులకు రిక్తహస్తం డీసీఎంఎస్ చైర్మన్గాజయప్రకాష్ -
జెండా దిమ్మె ఏర్పాటుపై కార్మిక సంఘాల గొడవ
మదనపల్లె : మేడే సందర్భంగా జెండా ఎగుర వేసేందుకు దిమ్మె ఏర్పాటు విషయం రెండు యూనియన్ల మధ్య వివాదానికి కారణమైంది. మున్సిపాలిటీలో ఇతర యూనియన్ల జెండా దిమ్మె ఏర్పాటును అంగీకరించేది లేదంటూ ఏఐటీయూసీ నాయకులు అడ్డుకుంటే, ఎలాగైనా జెండా దిమ్మె ఏర్పాటుచేసి తీరుతామంటూ సీఐటీయూ నాయకులు పంతానికి దిగారు. చివరకు రెండు యూనియన్ల మధ్య జెండా దిమ్మె ఏర్పాటుపై మొదలైన వివాదం చిలికి, చిలికి గాలివానగా మారి ఒక వర్గంపై మరొకరు దాడులు చేసుకుని పోలీసు కేసులు పెట్టుకునేంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎట్టకేలకు పోలీసులు జోక్యం చేసుకుని ఆదివారం మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేరని, సోమవారం కమిషనర్ సూచనలతో ఏర్పాటు చేసుకోవాలని సర్దిచెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. మదనపల్లె మున్సిపాలిటీలో చాలాకాలంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మాత్రమే కార్మిక సంఘం ఉండేది. కొద్దిరోజుల క్రితం ఏఐటీయూసీ నాయకుల ఆధిపత్యం భరించలేక, కార్మికుల్లో కొందరు విడిపోయి సీఐటీయూ యూనియన్‌లో చేరారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య చిన్న చిన్న వివాదాలు జరుగుతుండేవి. ఒక యూనియన్‌లో నుంచి మరో యూనియన్‌లో చేరాల్సిందిగా కార్మికులపై ఒత్తిడి తెచ్చేవారు. అందులో భాగంగా ఆదివారం ఉదయం సీఐటీయూలోకి వెళ్లిన ఇద్దరు పర్మినెంట్, ఇద్దరు ఆప్కాస్ కార్మికులను ఏఐటీయూసీలోకి చేర్చుకున్నారు. ఇదిలాఉంటే.. మే1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా.. మున్సిపల్ కార్యాలయ ప్రహరీకి ఆనుకుని జెండా దిమ్మె ఏర్పాటు చేసుకునేందుకు సీఐటీయూ నాయకులు సామగ్రి తరలించారు. విషయం తెలుసుకున్న ఏఐటీయూసీ నాయకులు నాగరాజు, సురేష్, ముబారక్, సాంబశివ, పృథ్వీరాజ్, అశోక్, ఓబులేసు తదితరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సీఐటీయూ అనుబంధసంఘం కోశాధికారి రామకృష్ణ, ఏఐటీయూసీ నాయకులు ఓబులేసు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. -
జలాశయంలో ఈతకు వెళ్లి వ్యక్తి దుర్మరణం
మైలవరం : వేముల మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం (53) అనే వ్యక్తి మైలవరం జలాశయంలో ఈతకు వెళ్లి ఆదివారం సాయంత్రం దుర్మరణం చెందాడు. మైలవరం పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములకు చెందిన షేక్ ఇబ్రహీం జమ్మలమడుగు పట్టణంలో జరిగే హజరత్ సయ్యద్ షా గూడుమస్తాన్ వలీ ఉరుసు ఉత్సవానికి వేముల నుంచి శనివారం గూడెంచెరువు గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం మైలవరం మండలంలోని గైబుసా స్వామి కొండకు వెళ్లి అక్కడ చదివింపులు చేసుకుని మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులతో కలసి మైలవరం జలాశయానికి వచ్చాడు. జలాశయంలో ఈతకు వెళ్లి అక్కడి మట్టిలో కూరుకుపోయాడు. ఎంత సేపటికి బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మైలవరం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శ్యాంసుందర్‌రెడ్డి, సిబ్బందితో కలసి జాలర్లను రప్పించి మృతదేహన్ని బయటకు తీశారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. -
సింహ వాహనంపై వైద్యనాథేశ్వరుడు
వల్లూరు : పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ కామాక్షీ వైద్య నాథేశ్వర స్వామి సింహ వాహనంపై, శ్రీ చెన్న కేశవ స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ వైద్యనాథస్వామి ఆలయంలో అర్చకులు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ కామాక్షీ అమ్మవారికి, శ్రీ చక్రానికి కుంకుమార్ఛన చేశారు. రాత్రి మంగళ వాయిద్యాలు, దివిటీల వెలుగుల మధ్య స్వామి వారి గ్రామోత్సవాన్ని పుష్పగిరి మాడ వీధుల్లో ఘనంగా నిర్వహించారు. ● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, తోమాల సేవను నిర్వహించారు. శ్రీ లక్షీదేవికి అర్చనలు జరిపారు. యాగశాలార్చన, చతుస్థానార్చన, నిత్య హోమము, బలిహరణ కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం సాయంత్రం వివిధ హోమాలను నిర్వహించారు. రాత్రి హంస వాహనం అధిష్టించిన చెన్న కేశవ స్వామి వారిని కొండపై నుండి పెన్నా నది మీదుగా దివిటీల వెలుగులో గ్రామంలోకి తీసుకుని వచ్చి పుష్పగిరి గ్రామ మాడ వీధులలో మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు కాయ, కర్పూరాలను భక్తితో సమర్పించారు. -
రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ విజేత అన్నమయ్య జట్టు
మదనపల్లె సిటీ : స్థానిక నిమ్మనపల్లె రోడ్డులోని వశిష్ట పాఠశాలలో ఆదివారం జరిగిన 8వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల,బాలికల షూటింగ్‌బాల్ పోటీల్లో అన్నమయ్య జిల్లా బాల,బాలికల జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. గెలుపు, ఓటములు సహజమని ఓడినా, గెలిచినా సమానంగా తీసుకోవాలన్నారు. తమిళనాడులో జరగబోయే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు అన్ని జిల్లాల నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామన్నామని రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరుశురాముడు తెలిపారు. పోటీల నిర్వాహకులు నరేష్‌బాబు, గోల్డెన్‌వ్యాలీ రమణారెడ్డి, అనిల్ కుమార్‌రెడ్డి, పీడీలు గురు, బాలాజీ, గురుభాస్కర్, అంజనప్ప, భారతి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. బాలికల విభాగంలో ప్రథమ స్థానం అన్నమయ్య జిల్లా, ద్వితీయ స్థానం చిత్తూరు జిల్లా, తృతీయ స్థానం తిరుపతి జిల్లా, నాలుగో స్థానంలో కర్నూలు జిల్లా జట్టు నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానం అన్నమయ్య జిల్లా, ద్వితీయ స్థానం ఏలూరు జిల్లా, తృతీయస్థానం చిత్తూరు జిల్లా, నాలుగో స్థానం సత్యసాయి జిల్లా జట్లు సాధించాయి. అడవికి నిప్పు పెట్టిన ఆకతాయిలు సిద్దవటం : సిద్దవటం రేంజి పరిధిలోని మద్దూరు, సిద్దవటం బీట్లలో ఆకతాయిలు శనివారం సాయంత్రం అడవికి నిప్పు పెట్టారు. అటవీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారని రేంజర్ కళావతి తెలిపారు. సిద్దవటంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ ఫారెస్టు రేంజి పరిధిలోని మద్దూరు, సిద్దవటం బీట్లలో ఆకతాయిలు కొండకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసి పడుతున్నట్లు సమాచారం అందిందన్నారు. అటవీ సిబ్బంది అప్రమత్తమై మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు. అటవీ ప్రాంతం పచ్చదనంతో ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఓబులేస్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ సురేష్‌బాబు, ఎఫ్‌బీఓలు పెంచల్‌రెడ్డి, దీపిక, మధు, ఆది విశ్వనాథ్, ఏబీఓలు హైమావతి, నారాయణరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని గువ్వలచెరువు ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైకుపై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా.. కడప– చిత్తూరు జాతీయ రహదారిపై రెండవ మలుపు వద్ద ఆదివారం మధ్యాహ్నం టైరు పేలిపోవడంతో టమాటా లోడుతో రాయచోటి నుంచి కడప వైపు వస్తున్న బోలెరో పికప్ వాహనం (ఏపీ39 యూపీ 9477) అదుపు తప్పింది. దీంతో పక్కనే రహదారిపై వెళ్తున్న బజాజ్ సీటీ 100 బైక్ ఏపీ 39 బీఎల్ 8837ను ఢీకొని పల్టీ కొట్టడంతో బైక్ నడుపుతున్న ఓంకారేశ్వర రావు(30) బోలెరో పికప్ కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బోలెరో వాహన డ్రైవర్ ప్రమాద స్థలం నుంచి పారిపోయాడు. చనిపోయిన వ్యక్తి రామాపురం ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఐటీ ట్రైనర్‌గా ఆదివారం మధ్యాహ్నం వరకు ఉద్యోగ విధులు నిర్వహించాడు. అనంతరం కడప నగరం అక్కాయపల్లిలోని ఇంటికి వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. మృతునికి భార్య, సంవత్సరంలోపు వయస్సు గల కుమారుడు ఉన్నారు. ప్రమాదస్థలికి వచ్చిన మృతుని కుటుంబ సభ్యులను చూసి అక్కడి ప్రజలు తీవ్ర ఆవేదన చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న చింతకొమ్మదిన్నె పోలీసులు మృతుని కుటుంబీకులను రప్పించి, మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. టైరు పగిలి అదుపు తప్పి బైకును ఢీకొన్న బొలేరో వాహనం మోడల్ స్కూల్ ఐటీ ట్రైనర్ దుర్మరణం -
మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న బీజేపీ
కడప వైఎస్ఆర్ సర్కిల్ : దేశంలో గత పదేళ్లుగా బీజేపీ హిందుత్వ మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తోందని, కుల వివక్ష, ముస్లింలు, దళితులపై దాడులు పెరిగాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం కడప నగరంలోని రామకృష్ణ నగర్లో సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది చనిపోయారని, ఉగ్రవాదులను అడ్డుకున్న ముస్లిం యువకుల్ని గ్రవాదులు కాల్చి చంపారని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉండగా, దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ ప్రచార బీజేపీ సంఘ్ పరివార్ శక్తులు ముస్లింలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. దీన్ని ముస్లిమేతర సమాజం వ్యతిరేకించాలన్నారు. ఈ మారణ హోమానికి కేంద్ర ప్రభుత్వం భద్రతా వైఫల్యం కారణమన్నారు. మోడీ, అమిత్ షాలే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనది ఎన్డీఏ ప్రభుత్వం అని తరచూ చెబుతున్నారని కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకుని వచ్చిన సందర్భాలు లేవన్నారు. ఉండి నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు నగర్ ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు మద్దతు ఇచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పట్ల అనుచితంగా మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజును బర్తరఫ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్, ఏ.రామ్మోహన్, వి.అన్వేష్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కే.శ్రీనివాసుల రెడ్డి, పి.దస్తగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చుక్కల జింకను కాపాడిన అటవీ సిబ్బంది
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండలం మామిళ్లపల్లె ఫారెస్ట్ బీటు కొన్నేపల్లి గ్రామ పరిధిలో రెండేళ్ల వయస్సు గల ఒక మగ చుక్కల జింకను కుక్కలు తరుముకోవడంతో ప్రమాదవశాత్తు 100 అడుగుల లోతు గల బావిలో పడింది. బావిలో అట్టడుగున నీరు ఉండటంతో చిన్నపాటి గాయాలయ్యాయి. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే కడప ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ ఓబులేసు మామిళ్లపల్లి సెక్షన్ సిబ్బందితో కలిసి గ్రామస్తుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి జింకను ప్రాణాలతో కాపాడారు. జిల్లా వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స చేయించి రిజర్వ్ ఫారెస్ట్‌లో సురక్షితంగా వదిలి వేశారు. ఆటో బోల్తా 15 మంది కూలీలకు గాయాలు బ్రహ్మంగారిమఠం : మండలంలోని దిరసవంచ పంచాయతీ రాజుపేట దగ్గర ఆదివారం సాయంత్రం కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడడంతో 15 మంది కూలీలకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. నందిపల్లె దగ్గర మిరప పంటలో పనుల కోసం నాగిశెట్టిపల్లె, రాజుపేట, పెద్దిరాజుపల్లెకు చెంది మహిళలు వెళ్లారు. పనులకు తీసుకెళ్లిన ఆటో టైరు పంచర్ కావడంతో రాజుపేటకు చెందిన మరో ఆటోలో కూలీలు ఎక్కి వస్తుండగా రాజుపేట సమీపంలోని కాశినాయన ఆశ్రమం సమీపంలోని మలుపులో ఆటో బోల్తా పడింది. దీంతో కూలీలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిని కడపకు తరలించారు. వీరిలో కె.సుభద్రమ్మ, కె.సరోజమ్మ, ఎం.ఇంద్రమ్మల పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరువర్గాలపై కేసులు నమోదుమదనపల్లె : భూమి వివాదంలో భాగంగా గొడవ పడిన ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మండలంలోని వేంపల్లి పంచాయతీలోని సర్వే నంబర్ 221లో గల 2.5 ఎకరాల భూమి విషయమై బార్లపల్లెకు చెందిన షేక్ మస్తాన్, అతని కుటుంబ సభ్యులు, మరో ముగ్గురు కలిసి మదనపల్లె పట్టణం నక్కలదిన్నె మారెమ్మగుడి వద్ద ఉన్న నికలేష్తో పాటు ముగ్గురితో భూమి విషయమై ఆదివారం దాడులకు పాల్పడ్డారు. స్థానికులు సమాచారాన్ని తాలూకా పోలీసులకు తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న తాలూకా పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. -
హరి హర అభేద క్షేత్రం పుష్పగిరి
వల్లూరు : జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రాలలో పుష్పగిరి ఒకటి. వల్లూరు మండలంలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరి చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. శివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరునికి, విష్ణు స్వరూపుడైన చెన్న కేశవునికి నిలయమైన ఈ క్షేత్రం హరి హర క్షేత్రమై శివ కేశవుల మధ్య అభేదానికి ప్రతీకగా నిలుస్తోంది. భాస్కర క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన పుష్పగిరిలోని వైద్యనాథ స్వామి ఆలయాన్ని చోళుల కాలంలోను, చెన్నకేశవ స్వామి ఆలయాన్ని చాళుక్యుల కాలంలోనూ నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం. శివ కేశవులకు 9 రోజులపాటు బ్రహ్మోత్సవాలు.. సాధారణంగా శైవ క్షేత్రాలలో ఐదు రోజులు , విష్ణు క్షేత్రాలలో తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం పరిపాటి. కానీ పుష్పగిరిలో శివ కేశవులిద్దరికీ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతి కార్యక్రమంలోనూ సాక్షాత్తూ శ్రీరామ చంద్రునిచే పూజలందుకున్న శ్రీ కామాక్షీ వైద్యనాఽథ స్వామికి ముందుగా పూజలు నిర్వహించి, అనంతరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవునికి పూజలు నిర్వహిస్తారు. ప్రతి రోజూ రాత్రి మొదట వైద్యనాథస్వామికి, అనంతరం శ్రీ చెన్న కేశవ స్వామికి వాహన సేవలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో 29 వ తేదీన జరిగే చందనోత్సవానికి, 30 న అక్షయ తదియలో భాగంగా జరిగే గరుడవాహన సేవకు, మే 1 న జరిగే రెండు కల్యాణోత్సవాలకు, 2 న జరిగే రెండు రథోత్సవాలకు, బ్రహ్మోత్సవాల ముగింపు రోజైన 4 వ తేదీన జరిగే చక్రస్నానం, పుష్పయాగాలకు అత్యంత పాధాన్యత ఉంది. భారీ సంఖ్యలో భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తారు.ఈ నెల 29న చందనోత్సవం, 30న అక్షయ తదియ , మే 1 న కల్యాణోత్సవాలు, 2 న రథోత్సవాలు, 4 న చక్రస్నానం, పుష్పయాగం -
బరువెక్కిన గుండెతో అంత్యక్రియలు
ములకలచెరువు : చెరువులో మునిగి మృతి చెందిన ముగ్గురి అంత్యక్రియలు ఆదివారం ములకలచెరువులో బరువెక్కిన హృదయాలతో జరిగాయి. ఇద్దరు చిన్నారులకు తోడుగా వచ్చి మృతి చెందిన మరో చిన్నారి నందిత అంత్యక్రియలు కర్నాటక రాష్ట్రం కై వరమ్ క్రాస్‌లో జరిగాయి. నీళ్లలోకి దిగి నలుగురు మృత్యువాత పడిన విషయం విదితమే. ములకలచెరువులో జరిగిన ముగ్గురి అంత్యక్రియలకు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి హాజరయ్యారు. మృతులకు నివాళులు అర్పించారు. నలుగురికి రూ. 1.75 లక్షల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కూడా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ కంటతడిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మాధవరెడ్డి, నాయకులు అన్సర్‌బాషా, సిద్దారెడ్డి, చాంద్‌బాషా, రెడ్డెప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేజీ పీజీసెట్–2కే25కు విశేష స్పందన
కడప ఎడ్యుకేషన్ : కందుల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వారి ఆధ్వర్యంలో డిగ్రీ ఉత్తీర్ణులై పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలనే ఆశావహులకు నిర్వహించిన కేజీ పీజీసెట్–2కే25కు విశేష స్పందన లభించిందని కే.ఎస్.ఆర్.ఎం కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.నాగమణి తెలిపారు. ఈ పరీక్షకు ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ఉచిత అడ్మిషన్ కల్పిస్తామన్నారు. ఈ పరీక్ష రాయడం వల్ల విద్యార్థులకు రాబోయే ఐ సెట్–2025 పరీక్షపై మంచి అవగాహనతో పాటు, అనుభవం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి (నాని) మాట్లాడుతూ అధ్యాపకుల మార్గదర్శకాలను, సలహాలను తీసుకుని విద్యార్థులు ఉన్నత రంగాలలో స్థిరపడాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కందుల రాజేశ్వరి, కేఎల్ఎం ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రత్నమ్మ , కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎన్ ప్రసాద్, సీనియర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ నాగరాజు, కార్యనిర్వాహక సిబ్బంది, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
కళలకు నిలయం వైఎస్సార్ కడప జిల్లా
కడప కల్చరల్ : వైఎస్సార్ కడప జిల్లా కళలకు నిలయమని రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా అన్నారు. శ్రీ నవ్యకళానికేతన్ 50వ వార్షికోత్సవాన్ని ఆదివారం కడప నగరంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో నిర్వహించారు. దివంగత వైఎస్ సిలార్ కుమారుడు, సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు వైఎస్ సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచాన్ని తనదైన నాటకాలతో ముగ్దుల్ని చేసిన సురభి నాటక సంస్థతోపాటు బీఎన్ రెడ్డి లాంటి మహా దర్శకులు, మరెందరో సినీ నటులకు జిల్లా జన్మనిచ్చిందని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీనియర్ రంగస్థల కళాకారుడు, హోం గార్డు మాజీ కంపెనీ కమాండర్ వైఎస్ సిలార్, నవ్యకళానికేతన్ను స్థాపించి సంస్థ ద్వారా సంచలనాలు సృష్టించి ఎందరో కళాకారులను తయారు చేశారన్నారు. సినీ హాస్యనటుడు గౌతంరాజు ఈ సందర్భంగా ఉదయం నుంచి యువ ఔత్సాహిక కళాకారులకు ఆడిషన్స్ నిర్వహించారు. ప్రతిభ గల వారిని ఎంపిక చేసుకుని వారికి వెబ్ సీరిస్‌లో అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు షఫీ, పాకా సురేష్, సినీ యువ నటుడు కల్కి, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కళాకారులు పాల్గొన్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా -
సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్: మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం, క్రిస్టియన్, బుద్దిస్ట్, సిక్కు, జైను, పార్సీ మైనార్టీల సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి షేక్ హిదాయతుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏపీఓబీఎంఎంఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థి వయసు 21–55 ఏళ్ల మధ్య ఉండాలని, ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతం వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షలుగా నిర్ణయించారన్నారు. రూ.లక్ష యూనిట్‌కు సంబంధించి 50 శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.3 లక్షల యూనిట్ ఖర్చు వరకు గరిష్టంగా రూ.1.25 లక్షలు సబ్సిడీ, రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు యూనిట్ ఖర్చుకు గరిష్టంగా రూ.2 లక్షల సబ్సిడీ, రూ.5 నుంచి రూ.8 లక్షల యూనిట్ (డి.ఫార్మా/బి.ఫార్మా విద్యార్థులకు ప్రత్యేక కథనం) 50 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్ డి–బ్లాక్‌లో గల ఈడీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. 14 నుంచి బ్రహ్మోత్సవాలు రాజంపేట రూరల్: శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను మే 10వ తేది నుంచి 14వ తేది వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారుడు పసుపులేటి వీరప్రదీప్కుమార్ తెలియజేశారు. భువనగిరిపల్లి వద్దనున్న లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆలయ ధర్మకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని భక్తులు పాల్గొనాలని వారు కోరారు. -
నకిలీ సర్టిఫికెట్ల కలకలం
కడప రూరల్: కడపలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4(రాయలసీమ జిల్లాలు) పరిధిలో ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్ నియామకాలకు చర్యలు చేపట్టారు. మొత్తం 150 పోస్టులకు గాను 11 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆ కార్యాలయ సిబ్బంది పరిశీలించి జాబితా సిద్ధం చేయడానికి పెద్ద కసరత్తే చేశారు. గత వైఎస్సార్సీపీ పాలనలో రెండు విడతలుగా పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. ఆ పరంపరలోనే తాజాగా నియామకాలకు శ్రీకారం చుట్టారు. అనుమానంతో... వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 11 వేలకు పైగా వచ్చిన దరఖాస్తుల్లో 150 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయాలి. అందులో భాగంగా 200 మందితో అభ్యర్థుల తుది ఎంపిక జాబితా సిద్ధం చేశారు. 200 మందితో జాబితా ఎందుకంటే.. 150 మందిలో కౌన్సెలింగ్‌కు ఎవరైనా అభ్యర్థులు రాకపోతే, ప్రాధాన్యత ప్రకారం మిగతా వారికి ఆ స్థానంలో ఉద్యోగ అవకాశం కల్పించడానికి ముందస్తుగా ఎక్కువ మందితో జాబితా సిద్ధం చేయడం జరుగుతుంది. ఆ ప్రకారం అర్హులైన 200 మందితో తుది జాబితా తయారు చేశారు. ఇక ఆ జాబితాను ప్రకటించి నియామక కౌన్సెలింగ్‌ను చేపట్టడమే. అయితే ఆ శాఖ అధికారులకు అనుమానం రావడంతో ఎందుకై నా మంచిదని, ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్లను ధ్రువీకరణ కోసం బోర్డుకు పంపారు. అందులో భాగంగా 100 మంది బీఎస్సీ నర్సింగ్, మరో 100 మంది జీఎన్ఎమ్ నర్సింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థుల సర్టిఫికెట్స్‌ను.. పరిశీలన కోసం పారామెడికల్ బోర్డు, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పంపారు. బీఎస్సీ నర్సింగ్కు సంబంధించి 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పంపగా, అందులో 20 మంది సర్టిఫికెట్స్ బోగస్‌గా నిర్ధారించారు. జీఎన్ఎం నర్సింగ్ కోర్సు చేసిన 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్‌ను పారా మెడికల్ బోర్డుకు పంపగా, అక్కడి అధికారుల నుంచి సమాధానం రావాల్సి ఉంది. అందులో కూడా పెద్ద సంఖ్యలోనే నకిలీ సర్టిఫికెట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు.. ముఠాగా ఏర్పడి.. గతంలో కూడా బోగస్ సర్టిఫికెట్స్ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. కొంత మంది ఉద్యోగులు ఒక ముఠాగా ఏర్పడి బోగస్ సర్టిఫికెట్స్‌ను తయారు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కొందరు ఫిర్యాదు కూడా చేశారు. ఈ అంశాలపై ‘సాక్షి’ పలు కథనాలను ప్రచురించింది. ఇప్పుడు కూడా వారే ఈ బోగస్ వ్యవహారానికి తెరలేపారనే ప్రచారం ఆ శాఖకు చెందిన ఉద్యోగుల్లో నడుస్తోంది. నిరుద్యోగుల ఆశలను ఆసరాగా తీసుకొని కొందరు మోసానికి పాల్పడుతున్నారు. అడ్డంగా దోచుకుంటున్నారు. ‘అధికారం మాదే’ అనే మదంతో కొంత మంది ఒక్కో పనికి లెక్కకట్టి వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో చేపడుతున్న కాంట్రాక్టు స్టాఫ్‌నర్స్ నియామకాల్లో.. నకిలీ సర్టిఫికెట్స్ వెలుగు చూడటం కలకలం రేపుతోంది. కొంత మంది అన్ని వ్యవహారాల్లో ఆరితేరి.. అడ్డదారుల్లో అక్రమంగా సంపాదించు కోవడానికి ఒక ముఠాగా ఏర్పడి.. వీటిని తయారు చేస్తున్నట్లు వినికిడి. దీంతో అప్రమత్తమైన ఆ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంతో.. ఈ వ్యవహారం బయటపడింది. స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీలో వెలుగులోకి.. ధ్రువీకరించిన హెల్త్ యూనివర్సిటీ కొందరి హస్తలాఘవంతో తయారీ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం అప్రమత్తం అవును.. నిజమే.. బోగస్ సర్టిఫికెట్స్ వెలుగు చూసిన మాట వాస్తవమే. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా నియామకాలు చేపట్టక ముందే.. ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన కోసం బోర్డుకు పంపాం. అక్కడ బోగస్ సర్టిఫికెట్స్ అని తేలాయి. ఇంకా నిర్ధారణ కావాల్సిన సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఆ వివరాలు రాగానే చట్టపరమైన చర్యలు చేపడుతాం. అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరకముందే.. సర్టిఫికెట్స్ పరిశీలన చేపడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ చర్యలు చేపట్టాం. – డాక్టర్ రామగిడ్డయ్య, రీజినల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం -
● మార్కుల జాబితా మాయ
మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. జీఎన్ఎం కోర్స్‌కు 1800, బీఎస్సీ నర్సింగ్కు 2,700 మార్కులు ఉంటాయి. ఉద్యోగ నియామకాల్లో ఈ మార్కులతోపాటు సర్వీస్, అకడమిక్ వెయిటేజ్ మార్కులు ఉంటాయి. అలాగే కోవిడ్ కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేపట్టిన విధుల కాలాన్ని బట్టి మార్కులు ఉంటాయి. ఈ మార్కుల మెరిట్‌తోపాటు ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇక్కడ మార్కులకు ప్రాధాన్యత ఉంటుంది. దీంతో అభ్యర్థులు నకిలీ మార్కుల జాబితాను సమర్పించినట్లుగా సమాచారం. బీఎస్సీ నర్సింగ్ విద్యార్హతకు సంబంధించి మొత్తం 20 మంది బోగస్ సర్టిఫికెట్స్‌ను సమర్పించగా.. అందులో నలుగురు కరోనా డ్యూటీలకు సంబంధించి బోగస్ సర్టిఫికెట్స్ పొందుపరిచినట్లుగా సమాచారం. ఇలా మార్కుల జాబితా ఒక మాయలా మారింది. దీని ఫలితంగానే షెడ్యూల్ ప్రకారం ఎప్పుడో జరగాల్సిన నియామకాల కౌన్సెలింగ్ వాయిదా పడుతూ వచ్చింది. -
● ప్రిపరేషన్‌కు గడువు తక్కువే..
● ఇక 40 రోజులకు డీఎస్సీ పరీక్ష ●● దరఖాస్తు చేసుకునేందుకు సరిగా పని చేయని ఆన్లైన్ ● ప్రిపరేషన్‌కు సమయం లేక సతమతం ● ఆందోళనలో అభ్యర్థులుడీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినందుకు అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తం అయినా.. అంతలోనే ఆవిరైపోయే పరిస్థితి నెలకొంది. పరీక్ష సన్నద్ధతకు 40 రోజులు మా త్రమే గడువు ఇవ్వడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ పరీక్షకు సంబంధించి సిలబస్ పరంగా 6 నుంచి 10వ తరగతికి చెందిన 30 సబ్జెక్టులు ఉంటాయి. ఇంత తక్కువ కాలంలో అన్ని సబ్జెక్టులను ఏ విధంగా చదవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుకు కనీసం రెండు, మూడు రోజులైనా గడువుంటే బాగుటుందని.. అలాంటిది ఒక్కో సబ్జె క్టుకు ఒకటిన్నర రోజు మాత్రమే గడువు ఉందని వాపోతున్నారు. ఉన్న ఈ తక్కువ కాలంలో దరఖాస్తు ఎలా పిల్ చేసుకోవాలో.. పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు. జిల్లాలో ఖాళీ పోస్టుల వివరాలు ●గత ప్రభుత్వంలో... -
ప్రత్యేక బస్సు సర్వీసులు
కడప కోటిరెడ్డిసర్కిల్: విద్యా సంస్థలకు వేసవి సెలవుల నేపథ్యంలో పలు విహార ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం మీడియాకు వివ రాలు వెల్లడించారు. కడప డిపో నుంచి గోవా, ఊటీ, వేలాంగిణి, అరుణాచలానికి బస్సులు నడుస్తాయన్నారు. ● మే 9న కడప నుంచి గోవాకు ఇంద్ర (50301) సర్వీసు బయలుదేరుతుందని, ఇందులో రూ.4200 చార్జిగా నిర్ణయించామన్నారు. అదే రోజు బెంగళూరు, మైసూరు మీదుగా ఊటీకి సూపర్ లగ్జరీ సర్వీసు రాత్రి 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఇందులో చార్జిగా రూ.2400గా ఉంటుందన్నారు. మే 9వ తేదీనే వేలాంగిణికి వయా నాగపట్నం మీదుగా ఇంద్ర (950066) బస్సు సర్వీసు బయలుదేరి వెళుతుందన్నారు. ఇందులో చార్జిగా రూ.3200 ఉందన్నారు. ● పౌర్ణమి సందర్భంగా మే 11న కడప డిపో నుంచి అరుణాచలానికి రెండు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. రాత్రి 9 గంటలకు సూపర్ లగ్జరీ (6001) బయలుదేరి వెళుతుందన్నారు. ఇందులో రూ.1050 చార్జిగా ఉందన్నారు. ఈ బస్సు చిత్తూరు, వేలూరు మీదుగా వెళ్తుందన్నారు. అదే రోజు ఉదయం 6 గంటలకు అరుణాచలానికి మరో బస్సు వెళుతుందన్నారు. ఈ సూపర్ లగ్జరీ సర్వీసు (913337)లో చార్జిగా రూ. 1350 నిర్ణయించామన్నారు. ఈ బస్సు గోల్డెన్ టెంపుల్, కాణిపాకం మీదుగా అరుణాచలం వెళ్తుందన్నారు. ఈ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ఆన్లైన్ లేదా ఆర్టీసీ బస్టాండులోని రిజర్వేషన్ కౌంటర్లో తమ టిక్కెట్లను ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలన్నారు. -
● ఎగువ చెరువు లూటీ
పెండ్లిమర్రి మండలం వెల్లటూరు సమీపంలో ఉన్న ఎగువ చెరువును తెలుగు తమ్ముళ్లు లూటీ చేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్లతో ఎర్రమట్టి తరలిస్తున్నారు. పులివెందుల, కడప, ప్రొద్దుటూరు ప్రధాన పట్టణాలకు ఎగువ చెరువు నుంచి ఎర్రమట్టి తరలివెళ్తోంది. భారీ యంత్రాలతో లోడింగ్ చేస్తూ, పట్టపగలు దోపిడీకి పాల్పడుతున్నా.. మైనింగ్, రెవెన్యూ, పోలీసు అఽధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇది వరకూ అదే మండలంలోని గొందిపల్లె నుంచి మట్టి, గ్రావెల్ దోపిడీకి పాల్పడ్డ టీడీపీ వర్గీయులు తాజాగా ఎగువ చెరువులో తిష్టవేశారు. ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకున్న విధంగానే.. ఎర్రమట్టి ద్వారా నిత్యం లక్షలాది రూపాయాలు ఆర్జిస్తున్నారు. -
ఎర్రమట్టి.. కొల్లగొట్టి..
సాక్షి ప్రతినిధి, కడప: అధికారమే పెట్టుబడిగా టీడీపీ నేతలు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ఇసుక, గ్రావెల్, ఎర్రమట్టి ఎక్కడ ఎలాంటి అవకాశం ఉంటే.. అక్కడ దోపిడీకి తెరలేపుతున్నారు. కోట్లాది రూపాయాలు రాయల్టీ ప్రభుత్వ ఖజానాకు చేరాల్సి ఉండగా, ఒక్క రూపాయి చెల్లించకుండా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. జిల్లాలో పట్టపగలు ఇలాంటి వ్యవహారం నిత్యం తెరపైకి వస్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులు తెలుగు తమ్ముళ్ల అయితే.. ఎలాంటి ఆటంకాలు కల్గించవద్దనే దిశగా జిల్లాలో అధికారుల నడవడిక కన్పిస్తోంది. యథేచ్ఛగా దందా ప్రభుత్వ నిర్వాకం వల్ల గ్రావెల్, ఎర్రమట్టి మాఫియా తెరపైకి వచ్చింది. మైనింగ్ లీజుదారులకు పర్మిట్లు ఇవ్వకపోవడంతో అక్రమ మైనింగ్‌కు ఆస్కారమిచ్చారు. జిల్లా కేంద్రంలో ఐదు గ్రావెల్ మైన్లు ఉండగా, ఒక్క మైన్‌కు కూడా రాయల్టీలు ఇవ్వలేదు. వెరసి గ్రావెల్ మాఫియా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతోంది. ఆపై ఈ వ్యవహారం కమలాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా కొనసాగుతోంది. చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వల్లూరు, కమలాపురం మండలాల్లో అక్రమ మైనింగ్ ద్వారా కోట్లాది రూపాయాలు కొల్లగొట్టారు. ఎగువ చెరువును చెరపట్టిన టీడీపీ వర్గీయులు రాయల్టీ చెల్లించకుండా మిషన్లు పెట్టి దోపిడీ నిత్యం వందలాది టిప్పర్లతో తరలింపు పట్టించుకోని అధికార యంత్రాంగం -
ఉగ్రదాడిని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యుజే కొవ్వొత్తుల ప్రదర్శన
కడప కార్పొరేషన్ : జమ్మూ, కాశ్మీర్లో ఉగ్రవాదుల మారణకాండను నిరసిస్తూ ఏపీయూడబ్ల్యుజే, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా, వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులు శనివారం సాయంత్రం కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఎర్రముక్కపల్లె సర్కిల్ వరకూ జాతీయ జెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎర్రముక్కపల్లె సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యదర్శి పి. రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన కాశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు అంత్యంత పాశవికంగా కాల్పులు జరిపి 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకోవడం దుర్మార్గమన్నారు. ఈ చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయలేదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి ప్రగాఢ సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం. బాలక్రిష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు వెన్ను రశ్రీనివాసరావు, ఆంజనేయులు, రమణారెడ్డి, ఫోటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, వర్కింగ్ జర్నలిస్టులు, కెమెరామెన్లు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఆర్మీ ఉద్యోగి మృతి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని నారాయణ పాఠశాలకు వెళ్లే రహదారి సమీపంలో దేవిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి (55) శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు విజయ భాస్కర్ రెడ్డికి భార్య పద్మావతి, కుమారుడు కార్తీక్ రెడ్డి, కుమార్తె దీపిక రెడ్డి ఉన్నారు. ఇటీవల విజయభాస్కర్ రెడ్డికి, పద్మావతికి కుటుంబ సమస్యల వల్ల ఇద్దరు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. పద్మావతి కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి ముద్దనూరు రోడ్డులో ఉంటున్నారు. విజయభాస్కర్ రెడ్డికి బీపీ, షుగర్ ఎక్కువగా ఉండటంవల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, దీనికి తోడు కుటుబ సమస్యలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో విజయభాస్కర్ రెడ్డి మంచంపై మృతి చెంది పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకున్నారు. అతను ఆరోగ్యం సరిగా లేక మృతి చెందాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బ్రహ్మంసాగర్‌లో కృష్ణా జిల్లా వాసి ఆత్మహత్య
బ్రహ్మంగారిమఠం : కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన వీరబ్రహ్మచారి(45) శనివారం బ్రహ్మంసాగర్‌లో శవమై తేలాడు. పోలీసుల వివరాల మేరకు.. వీరబ్రహ్మచారి రెండు రోజుల క్రితం బ్రహ్మంసాగర్‌లో మునిగి శనివారం శవమై తేలాడు. అతని వద్ద ఉన్న ఆధార్ కార్డును పరిశీలించగా కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో అడవి దుప్పి మృతిచింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కడప–చిత్తూరు జాతీయ రహదారిపై జమాల్‌పల్లె సమీపంలోని షెంఫోర్డ్ స్కూల్ వద్ద శనివారం తెల్లవారుజామున పొడద్దుప్పి మృతి చెందింది. రోడ్డు దాటుతున్నపుడు గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కడప అటవీ శాఖ రేంజర్ ప్రసాద్ తమ సిబ్బందిని పంపి పోస్టుమార్టం చేయించి ఖననం చేయించారు. పాఠశాలలు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలుకడప ఎడ్యుకేషన్ : పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులందరికి పాఠ్యపుస్తకాలను అందజేస్తామని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. కడప పాఠ్యపుస్తకాల గోడౌన్ నుంచి శనివారం పాఠ్య పుస్తకాల వాహనాన్ని గోడౌన్ మేనేజర్ రామాంజనమ్మతో కలిసి డీఈఓ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పుస్తక గోడౌన్ నుంచి ఉమ్మడి జిల్లాకు సెమ్–1కు సంబంధించి 9,76,346 పుస్తకాలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 7,20, 161 పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. -
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
లింగాల : లింగాల మండలం వెలిదండ్ల గ్రామంలో విద్యుత్ షాక్‌తో నల్లపురెడ్డిగారి మేఘనాథరెడ్డి (42) అనే రైతు మృతి చెందాడు. వివరాలలోకి వెళితే.. మేఘనాథరెడ్డి స్వగ్రామం సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామం. ఆయన చీనీ కాయల వ్యాపారం చేస్తూ వ్యవసాయ పనులు చేసుకునేవాడు. ప్రస్తుతం ఆయన పులివెందులలో నివాసముంటున్నాడు. వెలిదండ్ల గ్రామంలోని కర్ణా నాగార్జునరెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కర్ణా నాగార్జునరెడ్డికి ఒకే కుమార్తె కావడంతో ఆయన పొలాలను కూడా మేఘనాథరెడ్డి చూసుకునేవాడు. శనివారం మధ్యాహ్నం చీనీ తోటలోని పొలంలోకి వెళ్లి మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య కంగారుపడి బిదినంచర్ల, వెలిదండ్ల గ్రామాల బంధువులకు ఫోన్లు చేసి వివరాలను అడిగింది. వారు అనుమానంతో పొలంలోకి వెళ్లి చూడగా, మేఘనాథరెడ్డి విగతజీవుడై పడి ఉన్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు లింగాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
గేదె అడ్డు రావడంతో.. బైకు అదుపు తప్పి
చాపాడు : కాలేజీకి బైక్‌లో వెళుతుండగా ఎదురుగా గేదె అడ్డు రావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. దువ్వూరు మండలంలోని కృష్ణంపల్లెకు చెందిన కామనూరు సుభాష్ చంద్ర బోస్(17) అనే విద్యార్థి చాపాడు సమీపంలోని సీబీఐటీలో పాలిటెక్నిక్ డిప్లమో సీఎంబీ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇతనితో పాటు చియ్యపాడుకు చెందిన కోగటం శృతికుమార్ కూడా చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో సుభాష్‌చంద్రబోస్ తన అక్క, బావలు ఉంటున్న చియ్యపాడుకు శుక్రవార సాయంత్రం వచ్చాడు. శనివారం ఉదయం 8గంటల ప్రాంతంలో ఇదే గ్రామంలో ఉన్న తన స్నేహితుడిని బైక్‌పై ఎక్కించుకుని చాపాడు మండలం పల్లవోలు వద్ద గల సీబీఐటీ కాలేజీకి బయలు దేరాడు. చాపాడు దాటుకుని రెండు నిమిషాల్లో కాలేజీకి చేరుకునే లోపే రోడ్డుపై గేదె అడ్డు వచ్చింది. దీంతో బైక్ గేదెన తగిలి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన సుభాష్ చంద్రబోస్ అక్కడికక్కడే మృతి చెందగా శృతికుమార్కు స్వల్ప గాయాలయ్యాయి. చేతికందే కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో సుభాష్ కుటుంబీకులు రోదించారు. మైదుకూరు–ప్రొద్దుటూరు జాతీయ రహదారిలో వెళ్లే వాహనదారులు అయ్యో పాపం అంటూ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు.రోడ్డు ప్రమాదంలో పాలిటెక్నిక్ విద్యార్థి దుర్మరణం -
ధ్వజారోహణంతో పుష్పగిరి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వల్లూరు : పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి ,శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల బ్రహ్మోత్సవాలు శనివారం రెండు ఆలయాల్లో నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు శ్రీనివాస మూర్తి ఆధ్వర్యంలో ఉదయం గణపతి పూజ నిర్వహించారు. నందీశ్వరుని చిత్ర పటాన్ని ధ్వజ స్తంభంపై అధిష్టింప జేశారు. రాత్రి హంస వాహనంపై శ్రీ కామాక్షీ వైధ్యనాథ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం దివిటీల వెలుగులు, మంగళ వాయిద్యాల మధ్య మాడ వీధుల్లో స్వామి వారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో తెల్లవారు జామున సుప్రభాత సేవ జరిగింది. అనంతరం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ నిర్వహించారు. అనంతరం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలతో ప్రారంభించి గరుడుని చిత్ర పటాన్ని ధ్వజ స్తంభంపై అధిష్టింప చేశారు. అనంతరం కొండపై నుండి స్వామి వారిని తిరుచ్చి వాహనంలో మోస్తూ గ్రామ మాడ వీధు ల్లో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
పలువురు దొంగల అరెస్టు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలో 2024 జనవరి నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు వరుస దొంగతనాలకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. శనివారం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పులివెందుల, బద్వేలు, కలమల్ల తదితర ప్రాంతాలలో వరుస దొంగతనాలు చేసిన నవీన్, గణేష్, గంగాధర్, రాజశేఖర్, చంద్ర, మహేష్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 300 గ్రాముల వెండి, టీవీతోపాటు ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జల్సాలకు, షికార్లకు అలవాటుపడిన ఆరుగురు యువకులు ఇళ్లలో ఎవరూ లేని సమయాల్లో ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసేవారన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం సీఐలు చాంద్ బాషా, వెంకటరమణల ఆధ్వర్యంలో నిఘావేసి బంగారు దొంగలను అరెస్టు చేశారన్నారు. ప్రత్యేక బృందానికి సహకరించిన కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రావు, రమేష్, పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఉగ్రవాదం, మతోన్మాదాలను అరికట్టాలి కడప సెవెన్‌రోడ్స్ : జమ్ము కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద మారణ హోమానికి నిరసనగా ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున దేశ సమైక్యతను కాపాడుతామని, ముస్లిం, హిందూ, క్రైస్తవులు భాయి భాయి అని, ఉగ్రవాదాన్ని అరికట్టాలని, దేశ సమైక్యతను కాపాడాలని, ఉగ్రవాదులను అణిచివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం ప్రజా ఐక్యవేదిక నాయకుడు డాక్టర్ రాజా వెంగల్ రెడ్డి మాట్లాడుతూ ర్యాలీలో కులాలు మతాలకు అతీతంగా పాల్గొనడం ప్రజల్లో మతసామరస్యానికి ప్రతిరూపమన్నారు. ఐక్యవేదిక నాయకులు డాక్టర్ ఓబుల్ రెడ్డి, గుజ్జుల ఈశ్వరయ్య, చంద్రశేఖర్, రవిశంకర్ రెడ్డి, బాబు భాయ్, జోగిరామిరెడ్డి, ముక్తియార్ అహ్మద్, రమణ మాట్లాడుతూ కొంతమంది స్వార్థపరులు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని ముక్కలుగా చేయటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఉగ్రవాదానికి కులం మతం ప్రాంతం ఉండదని, మతోన్మాదానికి కూడా అలాగే కులం మతం ప్రాంతం ఉండదని వారు తెలిపారు. ఈ ఉగ్రవాద దాడికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు చంద్రశేఖర్, లక్ష్మీరాజా, నాగ మునిరెడ్డి, శంకర్, రవికుమార్, నాజర్, రామ్మోహన్, అలీఖాన్, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ అశోక్ కుమార్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదులను బహిరంగంగా ఉరి తీయాలి రాజంపేట టౌన్ : పహల్గాంలో అభంశుభం తెలియని 28 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను బహిరంగంగా ఉరి తీయలాని పట్టణంలోని ముస్లీం మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల ఉన్మాదాన్ని నిరసిస్తూ, ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన వారి ఆత్మశాంతి కోసం శనివారం రాత్రి ముస్లీం మైనార్టీ నాయకులు ఆర్అండ్బీ బంగ్లా వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముస్లీం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి భారతీయుడు అండగా నిలుస్తాడని తెలిపారు.● రూ.23 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ మురళీ నాయక్ జమ్ము కశ్మీర్ సంఘటనపై ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ -
రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ కౌన్సిలర్ మృతి
బ్రహ్మంగారిమఠం : మండలంలోని మైదుకూరు – బద్వేలు జాతీయ రహదారిలోని జెడ్.కొత్తపల్లె సమీపంలో శుక్రవారం రాత్రి లారీ, కారు ఢీ కొన్న సంఘటనలో మైదుకూరుకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ షేక్ ఖాదర్‌బాషా(44) మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బి.మఠం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు పట్టణం బద్వేలు రోడ్డులో నివాసం ఉంటున్న టీడీపీకి చెందిన మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్ షేక్ ఖాదర్‌బాషా(44)కు చెందిన టిప్పర్ పీపీ కుంట వద్ద చెడిపోయి ఉండడంతో ఆయన శుక్రవారం రాత్రి తన సహాయకులు మహబూబ్ బాషా, మస్తాన్లను తీసుకుని కారులో బయలుదేరాడు. ముందు వెళుతున్న వాహనాన్ని క్రాస్ చేస్తుండగా ఎదుగా వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఖాదర్ బాషా అక్కడికక్కడే మృతి చెందగా, మహబూబ్‌బాషా, మస్తాన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్ బాషా పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. మృతుడు ఖాదర్బాషాకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ట్రిపుల్ ఐటీలతో.. ఉజ్వల భవిష్యత్తు
వేంపల్లె : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ)లో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో ట్రిపుల్ ఐటీకి 1000 సీట్ల చొప్పున 4వేల సీట్లను ఆర్జీ యూకేటీ అధికారులు కేటాయించారు. అలాగే ఈబీసీ కోటా కింద ఒక్కో ట్రిపుల్ ఐటీకి 100 సీట్ల చొప్పున 400 సీట్లను కేటాయించారు. 2024–25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల చూపంతా ట్రిపుల్ ఐటీ వైపు మళ్లింది. ఈ నెల 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 20వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎంపికై న అభ్యర్థుల జాబితా జూన్ 6న విడుదల చేస్తారు. జూన్ 11 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. స్పెషల్ కేటగిరి (పీహెచ్సీ/ క్యాప్/ఎన్సీసీ/స్పోర్ట్స్/భారత్ స్కౌట్స్) కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మే 28 నుంచి 31వ తేదీ వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం జూలై మొదటి వారంలో తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యను అందించేందుకు 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణా రాష్ట్రంలోని బాసరలో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఒక్కోదానికి 2000 సీట్లను కేటాయించగా.. తర్వాత ప్రభుత్వాలు 2010లో ఒక ట్రిపుల్ ఐటీలో 1000 సీట్లు ఉండేలా కుదించారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ తెలంగాణకు వెళ్లిపోవడంతో 2016లో ఏపీలో ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీలను ప్రారంభించారు. వీటిలో 26 జిల్లాల విద్యార్థులకు సమానంగా సీట్లు ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. 4000 సీట్లలో ఓపెన్ కేటగిరిలో 600 సీట్లను స్థానికేతరులు, తెలంగాణ ఎన్ఆర్ఐ, తదితరులకు కేటాయిస్తారు. మిగిలిన 3400 సీట్లను 26 జిల్లాల వారికి సమానంగా పంచుతారు. జిల్లాకు కేటాయించే సీట్ల ఆధారంగా మెరిట్ విద్యార్థులకు అవకాశం లభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులకే ట్రిపుల్ ఐటీల్లో అధిక సీట్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికే ఈ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ ఇలా ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇద్దరు విద్యార్థులకు సమాన మార్కులు వస్తే తొలుత గణితం అనంతరం జనరల్ సైన్స్ తర్వాత ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, ఫస్ట్ లాంగ్వేజ్‌లో అధిక మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. అప్పటికి సమానంగా వస్తే పుట్టిన తేదీ ప్రకారం అధిక వయస్సు ఉన్న వారిని హాల్ టికెట్ నెంబర్ నుంచి పొందిన అత్యల్ప సంఖ్య ఆధారంగా ఎంపిక చేస్తారు. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు.. ట్రిపుల్ ఐటీలలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు గిగిగి. ఖఎ్ఖఓఖీ. ఐూ. అ్క వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ విద్యార్థులకు దరఖాస్తు రుసుము రూ.300లు కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200లుగా నిర్ణయించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటిస్తారు. రాష్ట్రంలోని అభ్యర్థులకు 85 శాతం సీట్లు, మిగిలిన 15 శాతం సీట్లు రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు కేటాయిస్తారు. అడ్మిషన్లలో కచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు. ఎస్సీ–15 శాతం, అనగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్–2 ప్రకారం ఎస్సీ గ్రూపు–1 కి 1 శాతం, గ్రూప్– 2 కి 6.5 శాతం, గ్రూప్ –3 కి 7.5 శాతం ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు. మిగిలిన కేటగిరీలో ఎస్టీ–6, బీసీ(ఏ)–7, బీసీ(బి)–10, బీసీ (సి)1, బీసీ (డి)7, బీసీ(ఈ) 4, దివ్యాంగులకు–5 శాతం ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు. ఆర్మీ ఉద్యోగుల పిల్లలు (సీఏపీ)–2, ఎన్సీసీ–1, స్పోర్ట్స్–0.5, భారత్ స్కౌట్స్ ఆఫ్ గైడ్స్–0.5 శాతం సీట్లు కేటాయిస్తారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కేటగిరిలో బాలికలకు 33.1/3 శాతం సీట్లు కేటాయిస్తారు. మొత్తం 4400 సీట్లు రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో క్యాంపస్‌కు 1000 సీట్ల చొప్పున మొత్తం 4వేల సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఈబీసీ కోటా కింద ఒక్కో క్యాంపస్‌కు 100 సీట్ల చొప్పున 400 సీట్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2024–25 విద్యా సంవత్సరంలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 2,45,307 మంది, బాలికలు 2,53,278 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య అధికంగా ఉండడంతో గట్టి పోటీనే ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అన్ని జిల్లాలకు సమానంగా సీట్లు ఆర్జీయూకేటీ పరిధిలోని అన్ని ట్రిపుల్ ఐటీల్లో ఆయా జిల్లాల్లో సమానంగా సీట్లు కేటాయిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 4శాతం, డిప్రివేషన్ స్కోరును జోడించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తాం. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ సండ్ర(ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ కన్వీనర్), ఇడుపులపాయ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ పదవ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో ట్రిపుల్ ఐటీల ఏర్పాటు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు నాలుగు శాతం డిప్రివేషన్ స్కోరును జోడించి అభ్యర్థుల ఎంపిక -
ట్రేడింగ్ పేరుతో కోట్లు వసూలు
కడప రూరల్: ఫారెక్స్, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరుతో కడపలో పామిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లలో మోసం చేసి పరారైన ఘటన వెలుగు చూసింది. మీడియాకు శనివారం బాధితులు ఈ వివరాలు తెలియజేస్తూ, తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొన్నారు. బాధితుల ఆవేదన వారి మాటల్లోనే... నిండా మునిగాం.. పట్టణంలోని లోహియానగర్‌కు చెందిన పామిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయని పలువురిని నమ్మబలికాడు. రూ. 10 లక్షలకుగాను నెలకు రూ.40 వేలు లాభం వస్తుందని చెప్పాడు. అతని మాటలు నమ్మి నాతోపాటు నా కుటుంబ సభ్యులు మొత్తం రూ. 8.50 కోట్లు ఇచ్చారు. అలాగే నాతోపాటు ఇక్కడికి వచ్చిన బాధితులు సాయి రూ. 70 లక్షలు, వెంకట కృష్ణ రూ. 50 లక్షలు, మల్లికార్జునరెడ్డి రూ. 50 లక్షలు, కిరణ్‌కుమార్‌రెడ్డి రూ. 50 లక్షలు, రాజేశ్వర్‌రెడ్డి రూ. 60 లక్షలు, విష్ణువర్దన్‌రెడ్డి రూ. 50 లక్షలు ఇచ్చారు. ఇలా ఇచ్చిన డబ్బుపై కొన్నింటికి ప్రామిసరీ నోట్లు, మరికొన్నింటికి చెక్కులు ఉన్నాయి. వసూలు చేసిన డబ్బు కొంత సోమశేఖర్‌రెడ్డి తన ప్రేయసి ఖాతాలో కూడా జమ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చి ప్రశ్నిస్తే, సోమశేఖర్‌రెడ్డి బెదిరింపులకు దిగి చివరకు పరారయ్యాడు. ఈ దారుణంపై కడప రిమ్స్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టాం. పోలీసులు సోమశేఖర్‌రెడ్డి సోదరులను ప్రశ్నించారు తప్ప, అంతకుమించి ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. – టేకూరు రాజేశ్వర్‌రెడ్డి, కడప ఇల్లు తాకట్టుపెట్టి...అప్పు తెచ్చి... ఇంటిని తాకట్టుపెట్టి రూ. 50 లక్షలు, అప్పు తెచ్చి మరో రూ. 50 లక్షలు ఇచ్చాను. రూ. 50 లక్షలకు ప్రామిసరి నోటు రాసిచ్చాడు. మరో రూ. 50 లక్షలకు చెక్కు ఇచ్చాడు. నా పరిస్థితి దయనీయంగా మారింది. – కల్లూరి కిరణ్‌కుమార్‌రెడ్డి, పోరుమామిళ్ల రూ. 70 లక్షలు ఇచ్చాను ఇల్లు కుదువకు పెట్టి లోను తీసుకుని రూ. 70 లక్షలు ఇచ్చాను. ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వలేదు. నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నాలాంటి వారు ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. – సాయికుమార్, కడప నిండా మునిగిన బాధితులు ఆత్యహత్యలే శరణ్యమంటూ ఆవేదన -
బీసీ కుల గణనపై ప్రకటన చేయాలి
కడప రూరల్: కడపలో జరిగే మహానాడులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ కుల గణనపై స్పష్టమైన ప్రకటన చేయాలని.. అలాగే 52 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు డీఎం ఓబులేశు యాదవ్ అధ్యక్షతన శనివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బీసీ మహాసభ జాతీయ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఏ సత్తార్ మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీ కులాలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉండడం దారుణమన్నారు. బీసీలను కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని తెలిపారు. బీసీ ఓట్లను మాత్రం పొందు తూ సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలకు దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే కుల జన గణన చేపట్టాలని, బీసీ కులాలకు 52 శాతం రిజర్వేషన్లు, జనా భా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నా రు. ఓబులేశు యాదవ్ మాట్లాడుతూ కడపలో జరిగే మహానాడులో రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ కుల గణనపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గురుమూర్తి, లోక్‌సత్తా పార్టీ నాయకులు దేవర శ్రీకృష్ణ మాట్లాడారు. జాతీయ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రమణ, మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సంగటి మనోహర్, దళితమిత్ర రాష్ట్ర అధ్యక్షులు కై పు రామాంజనేయులు, సీఆర్వీ ప్రసాద్, తిరుమలేశ్, పట్టుపోగుల పవన్‌కుమార్, సీఆర్ఐ సునీల్ పాల్గొన్నారు. -
మనుంటి ముంగిటే సాంకేతిక విద్య!
కడప ఎడ్యుకేషన్: మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మను) అనుబంధ సంస్థ ‘మను’ పాలిటెక్నిక్ కళాశాల జిల్లా విద్యార్థులకు వరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని కడప నగర శివార్లలోని రిమ్స్ వద్ద 10.15 ఎకరాల స్థలాన్ని కేటాయించి యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్, మినిస్ట్రియల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి ఆర్థిక సహాయంతో రూ. 25 కోట్లతో నూతన భవనాలతోపాటు ఇన్ప్ట్రాస్టకర్స్, కంప్యూటర్ లాబ్య్, ఫిజిక్స్ ల్యాబ్, లైబ్రరీ వంటివి ఏర్పాటు చేశారు. అలాగే కళాశాల ఆవరణం మొత్తం ప్రహరీని ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా బీహార్‌లోని దర్గాంగ్, ఒరిస్సాలోని కటక్, కర్నాటకలోని బెంగులూరు, తెలంగాణలోని హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో మాత్రమే ఈ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయంటే.. మను పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో డిప్లమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లమా ఇన్ అప్పరల్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. ఇందులో ప్రతి కోర్సుకు 60 సీట్ల చొప్పున 240 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్, సెంట్రల్ లైబ్రరీలతోపాటు అన్ని కోర్సులకు సంబంధించి వర్కుషాపులు ఉన్నాయి. మే 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు.... మను పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి మే 13 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష జూన్ 13వ తేదీ కడప సమీపంలోని రిమ్స్ వద్ద ఉన్న మను పాలిటెక్నిక్ కళాశాలలో మధ్యాహ్న 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. ఇందులో ప్రవేశ పరీక్షకు బాలికలు రూ.350, బాలురు రూ.550 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల బట్టి రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు. ● ప్రవేశానికి అర్హులెవరంటే... ఈ మను పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులు చేరవచ్చు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఏ కేటగిరికి చెందిన వారైనా సరే పదవ తరగతిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో చదువుతున్నా సరే లాంగ్వేజికి సంబంధించి ఉర్దూ సబ్జెక్టు లేదా ఉర్దూ మీడియంలో చదివే వారే ఇందులో సీటుకు అర్హులు. ఇందులో చేరాలనుకునే వారు ఖచ్చితంగా ప్రవేశ పరీక్షను రాసి ర్యాంకును సాధించాలి. అలా ర్యాంకులు సాధించిన వారికి కేటగిరీల(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పిజికల్ హ్యాండీక్యాప్, ఉమెన్ కోటా) వారిగా రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం సీట్లను కేటాయిస్తారు. ఇందులో చేరే వారిలో ఆడపిల్లలకైతే మూడేళ్లకు రూ.13,100లు, మగపిల్లలు మూడేళ్లకు రూ.14,700 లు, వికలాంగ విద్యార్థులు మూడేళ్లకు రూ. 5100 రూపాయిల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇందులో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు నేషనల్ స్కాలర్షి ప్స్ వంటికి కూడా పొందవచ్చు. వెబ్సైట్ ద్వారా... మను పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన అడ్మిషన్ సమాచారం కోసం htpp:// manucoe.in /regular adimission వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. ఈ వెబ్సైట్ ద్వారా మరింత సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. దీంతోపాటు అడ్మిషన్ల పరంగా ఏదైనా సందేహాలు, సమాచారం కోసం 9398083058 నెంబర్‌కు కాల్ చేసి సంప్రదించవచ్చు. – మొహమ్మద్ సికిందర్ హుస్సేన్, అడ్మిషన్ కన్వీనర్, మను పాలిటెక్నిక్ కళాశాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏపీలో భాగంగా కడపలో ఏర్పాటు చేసిన మను పాలిటెక్నిక్ కళాశాలను జిల్లా విద్యార్థులు వినియోగించుకోవాలి. ఈ కళాశాలలో డిప్లమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లమా ఇన్ అప్పరెల్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. ఈ నాలుగు కోర్సులకు సంబంధించి 240 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – మీర్జా విలయత్ అలీ బేగ్, ఇన్చార్జు ప్రిన్సిపాల్, మను పాలిటెక్నిక్ కళాశాల, వైఎస్సార్‌జిల్లా విద్యార్థుల బంగరు భవితకు బాటలు వేస్తున్న ‘మను’ పాలిటెక్నిక్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆధ్వర్యంలోఏపీలో ఏకై క పాలిటెక్నిక్ కళాశాల నాలుగు బ్రాంచుల్లో ఏటా 240 సీట్లు కేటాయింపు మే 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కళాశాల ప్రవేశానికి జూన్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహణ -
రోజుకు ఆరు లీటర్లు నీరు తాగాలి
వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చర్మంలోని నీటి శాతం పూర్తిగా ఆవిరైపోతుంది. ఎండ విపరీతంగా పెరగడంతో చెమట ద్వారా సోడియం లవణాలు ఎక్కువగా వెళ్లిపోతాయి. కొంత పొటాషియం లవణాలు కూడా వెళ్లిపోవడంతో హీట్ హైపర్ పైరెక్సియా అనే వడదెబ్బ సొకే ప్రమాదం ఉంది. దీంతో జ్వరం, మగతగా కమ్మటం, వాంతులు రావడం జరుగుతుంది. లవణాల శాతం ఉధృతంగా తగ్గితే కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. బయటకు వెళ్లేవారు ఉప్పు బాగా వేసుకుని మజ్జిగ తీసుకోవాలి. అరటిపండు తప్పకుండా తీసుకోవాలి. బయట తిరిగే ప్రతి ఒక్కరూ రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల నీరు తాగుతూ ఉండాలి. – డాక్టర్ కొటకొండ మనోహర్, జనరల్ ఫిజిషియన్, రిమ్స్జాగ్రత్తలు పాటించాలి జిల్లాలో ఎండల తీవ్రత క్రమేపి పెరుగుతూ వస్తుంది. ప్రజ లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 10 గంటలలోపు పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలి. ఎండలకు ఎక్కువగా తిరిగేవాళ్లు తలపై టోపీ లేక కండువానో ధరించడంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి తోడు మంచినీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. వడదెబ్బకు గురైన వ్యక్తిని ముందుగా చల్లని ప్రదేశంలో ఉంచాలి. చల్లని తడి గుడ్డతో ఒళ్లంతా తుడవాలి. ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు చల్లని గాలి తగిలేలా చర్యలు తీసుకోవాలి. తరువాత ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ ద్రావణం, ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాపించాలి. తరువాత వైద్యుడిని సంప్రదించి ఆయన సూచనలు, సలహాల మేరకు వైద్య సేవలందించాలి. – నాగరాజు, డీఎంఅండ్ హెచ్ఓ -
10 నుంచి దేవుని కడపలో తెప్పోత్సవాలు
కడప కల్చరల్: తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి మే 10 నుంచి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు. స్వామి, అమ్మవార్లు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించనున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా మే 10న శ్రీ కృష్ణ సమేత గోదాదేవి మూడు మార్లు పుష్కరిణిలో విహరిస్తారన్నారు. 11న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఐదు మార్లు, 12న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఏడు మార్లు తెప్పలపై విహరించను న్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు. -
29న ఉద్యాన సమ్మేళనం
కడప అగ్రికల్చర్: కడపలో ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉద్యాన శాఖ వారు ‘జిల్లా ఉద్యాన సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి తెలిపారు. స్థానికంగా ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని నగర పరిధి రాయచోటి రోడ్డులోని మాధవి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యాన రంగంలోని వివిధ రకాల భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇందులో ఉద్యాన రైతులు, ఉద్యాన శాస్త్రవేత్తలు, విత్తన ఉత్పత్తిదారులు, ఎరువుల సరఫరా దారులు, విధాన నిర్ణేతలు, ఇతర సంబంధిత నిపుణులు పాల్గొంటారని చెప్పారు. ముఖ్యంగా ఉద్యాన రంగంలో ఎదుర్కొంటున్న తాజా సవాళ్లు, అవకాశాలపై చర్చించడంతో పాటు ఈ రంగంలో స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడానికి వినూత్న సాంకేతికతలు, ఉత్తమ పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం కూడా లక్ష్యం అన్నారు. వివిధ రకాలైన సెషన్లు ఉంటాయని వీటిలో నిపుణులచే ప్రసంగాలు, చర్చా వేదికలతోపాటు విజయవంతమైన ఉద్యాన పద్ధతుల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. తమ పరిజ్ఞానం, అనుభవాలను పంచుకోవడానికి, ఒకరికొకరు సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇది ఒక ప్రత్యేక మైన అవకాశం అన్నారు. కావున కడప, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఉద్యాన రైతులతోపాటు ఈ రంగంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. -
సేల్ రిజిస్ట్రేషన్లకు నిబంధనాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసిన, చేయాలని ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ) నిబంధనలు ముందరి కాళ్లకు బంధం వేస్తున్నాయి. ఏపీఐఐసీ వివిధ చోట్ల ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి నిర్ణీత ధరకు ప్లాట్లు విక్రయిస్తుంది. కడపలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్, కొప్పర్తి పారిశ్రామికవాడలో ఫేజ్–1, ఎంఎస్ఈ–సీడీపీ, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. ప్లాట్లు కేటాయించే క్రమంలో సేల్ అగ్రిమెంట్ చేసిన ఏపీఐఐసీ అధికారులు.. పరిశ్రమలు నెలకొల్పిన తర్వాత సేల్ డీడ్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ చెల్లిస్తేనే సేల్ రిజిస్ట్రేషన్ చేస్తామని సేల్ అగ్రిమెంట్లో ఎక్కడా లేకపోయినా.. ఏపీఐఐసీ అధికారులు కావాలనే మొండికేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా.. సేల్ డీడ్ కాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలన్నీ పారిశ్రామికవేత్తలకేనా.. ఏపీఐఐసీకి వర్తించవా? నీరు, కరెంటు, రోడ్లు, కాలువలు వంటి వసతులు కల్పించకుండానే ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్న ఏపీఐఐసీ అధికారులు.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పరిశ్రమలు స్థాపిస్తున్న వారిపై కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు విమర్శలున్నాయి. అన్ని రకాల అనుమతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని.. ‘అయ్యా మాకు సేల్ డీడ్ చేసివ్వండి’ అని కోరుతున్న వారికి అధికారులు పగలే చుక్కలు చూపిస్తున్నారు. వారికి ఎక్కడ లేని నిబంధనలు పెడుతూ నెలల తరబడి సేల్‌డీడ్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ‘మీరు మొదట డీపీఆర్‌లో ఎంత మందికి ఎంప్లాయిమెంట్ కల్పిస్తామన్నారు.. వారందరికీ కల్పించారా.. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ చేశారా.. ఫ్యాక్టరీ లైసెన్స్ తీసుకున్నారా.. మీకు ఇచ్చిన భూమిలో 90 శాతం భూమిని వినియోగించారా(అందుకు తగిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి).. ఇది లేదు, అదిలేదు.. అంటూ నానా కొర్రీలు వేస్తూ సేల్ డీడ్ చేయకుండా నెలలు, సంవత్సరాలు జాప్యం చేస్తున్నట్లు సమాచారం. అమ్యామ్యాల కోసమే వీరు ఇదంతా చేస్తున్నారని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. ఫ్యాక్టరీస్ యాక్టు పరిధిలోకి రాకపోయినా.. 20 కంటే తక్కువ మంది కార్మికులు పని చేస్తున్న పరిశ్రమలు, 30 హెచ్‌పీ కంటే తక్కువ కరెంటు వినియోగిస్తున్న సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఫ్యాక్టరీస్ యాక్టు పరిధిలోకి రావు. వీరి వద్ద పర్మినెంట్ కార్మికులెవరూ పని చేసే అవకాశం ఉండదు. రోజు వారీ కూలీలు మాత్రమే పని చేస్తుంటారు.. వాళ్లలో కొంత మంది ఒక రోజు వస్తే మరొక రోజు రారు. కొందరు నెల, రెండు నెలలు పని చేసి వెళ్లిపోతుంటారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ కూడా చెల్లించడం కష్టతరంగా మారుతోంది. కానీ ఏపీఐఐసీ అధికారులు మాత్రం ప్రతి ఒక్కరూ ఫ్యాక్టరీ లైసెన్స్ తీసుకోవాలి, కార్మికులకు ఫీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలనే నిబంధనలు విధిస్తున్నారు. సేల్ అగ్రిమెంట్లో లేకపోయినా అధికారులు ఎందుకు పట్టుబడుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ● వారి తప్పులు.. వీరికి శాపాలు ‘పరిశ్రమలు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రండి.. కొనుగోలు చేసే భూముల్లో రాయితీలు ఇస్తాం.. పరిశ్రమలు పెట్టిన తర్వాత ప్రోత్సాహకాలు అందిస్తాం.. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే వడ్డీ రాయితీ కల్పిస్తాం’ అని ఊదరగొట్టి, కల్లబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వాలు.. పరిశ్రమలు పెట్టిన వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. ఇటు ఏపీఐఐసీ, అటు పరిశ్రమల శాఖ అధికారుల వైఖరి వల్ల పారిశ్రామికవేత్తలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అడ్డుగా మారిన ఏపీఐఐసీ నిబంధనలు సేల్ అగ్రిమెంట్లో లేకపోయినాపీఎఫ్, ఈఎస్ఐ కోసం పట్టు కార్యాలయం చుట్టూ పారిశ్రామికవేత్తల ప్రదక్షిణలు నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు..ప్రభుత్వ ఆదాయానికి గండి ఎంఎస్ఎంఈ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అసోషియేషన్ల ప్రతినిధులు మంత్రి నుంచి కరువైన స్పష్టమైన హామీ అధిక శాతం పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుపై వారికి తగిన పరిజ్ఞానం ఉన్నప్పటికీ.. డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) కోసం చార్టెడ్ అకౌంటెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడే తప్పులు జరుగు తున్నాయి. అన్ని రకాల యూనిట్లకు పేర్లు, విషయం(సబ్జెక్ట్) మార్చి కాపీ, పేస్ట్ చేయడం వల్ల అన్ని పరిశ్రమలకు కార్మికుల సంఖ్యను గుడ్డిగా నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది సరిచూసుకోలేని వారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ‘డీపీఆర్‌లో మీరు ఇంత మందికి ఎంప్లాయిమెంట్ చూపారు కదా.. వారందరికీ పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించండి’ అంటూ ఏపీఐఐసీ అఽధికారులు మెలిక పెడుతున్నట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో తెలియక పారిశ్రామికవేత్తలు తల పట్టుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆటోమేటిక్ మెషీన్లు వచ్చినందున ఎక్కువ మంది కార్మికులతో పెద్దగా అవసరముండదు. సూక్ష్మ, చిన్న స్థాయి పరిశ్రమలకు ఇంత మంది కార్మికులతో ఏం అవసరమని ఆలోచన చేయని అధికారులది కూడా ఇందులో తప్పుంది. ఏ పరిశ్రమలో ఎంత మంది కార్మికులు పని చేస్తున్నారో ఆయా పరిశ్రమల యాజమాన్యాల నుంచి అఫిడవిట్ తీసుకొని సేల్ డీడ్ చేయవచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇటీవల జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎంఎస్ఎంఈ, సెర్ఫ్ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ల ప్రతినిధులు తీసుకుపోయినట్లు సమాచారం. అయితే దానిపై ఆయన్నుంచి స్పష్టమైన హామీ లభించనప్పటికీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతానని చెప్పినట్లు తెలుస్తోంది. -
లోక్‌అదాలత్ వాయిదా
కడప అర్బన్: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారంగా ‘జాతీయ లోక్ అదాలత్’ షెడ్యూల్ ప్రకారం మే 10న (రెండవ శనివారం) జరగాల్సి ఉండగా.. జూలై 5 (మొదటి శనివారం)వ తేదీకి వాయిదా పడింది. ఈ సమాచారాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, ఎస్.బాబా ఫక్రుద్దీన్ శుక్రవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని కక్షిదారులు, వివిధ శాఖల అధికారులు గమనించాలని వారు కోరారు. నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి కడప సెవెన్‌రోడ్స్: వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి కొరత రాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చే ఏర్పాట్ల సన్నద్ధతపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రెండు నెలలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి కొరత రాకుండా ప్రత్యేక, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా కడప నగరానికి మైలవరం ప్రాజెక్టు ద్వారా ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద నీటిని నిల్వ చేసి పొదుపుగా వాడుకునే చర్యలు చేపట్టాలన్నారు. మే నెల నాటికి పులివెందుల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా తాగునీరు అందేలా పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసేలా దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాజెక్టుల ఇంజినీరింగ్ అధికారులు, ఏపీఎస్పీడీసీఎల్, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, ఆర్అండ్బీ, మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
● కేజీబీవీలలో టాపర్స్ వీరే..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయం నెరవేరుతోంది. ఏ ఆధారం లేని బాలికల చదువు కోసం.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) నెలకొల్పారు. వైఎస్సార్ తనయుడు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో కేజీబీవీలకు కార్పొరేట్ హంగులు సమకూర్చారు. వాటిలో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టారు. ఆ విద్యాలయాలు నేడు ఫలితాల పరంగా సత్తా చాటుతున్నాయి. ఇంటర్, పదో తరగతి ఫలితాల్లో తిరుగులేని ఆధిపత్యం చూపి భళా అనిపించాయి. కడప ఎడ్యుకేషన్: జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో ఫలితాల పరంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) బాలికలు మెరిశారు. జిల్లా వ్యాప్తంగా 17 కేజీబీవీలు ఉండగా వాటిల్లో నుంచి 621 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వారిలో 534 మంది పాసై 85.99 శాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. పెండ్లిమర్రి కేజీబీవీ మినహా మిగతా అన్ని కేజీబీవీల్లో 500 పైన మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నారు. నేరవేరుతున్న వైఎస్సార్ కల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం నెరవేరుతోంది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన, ఆర్థిక స్థోమత లేకుండా, పేదరికంలో ఉండి చదవాలనే ఆసక్తి ఉన్నా.. పరిస్థితులు అనుకూలించని ఎంతో మంది నిరుపేద బాలికలు చదువుకోవాలనే లక్ష్యం ఫలిస్తోంది. నేడు ఎంతో మంది విద్యార్థులు బాగా చదివి.. విద్యావంతులై తమ ప్రతిభ చాటుతూ భళా అనిపిస్తున్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఏర్పాటు చేశారు. వాటిలో ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంగ్లిషు మీడియంలో బోధన, అత్యంత భద్రతతో కూడిన సవతి సదుపాయాలు కలిగి.. బాలికలు విద్యావంతులుగా తయారవుతున్నారు. ఈ విద్యాలయాల్లో సాధారణ విద్యతోపాటు ఆంగ్లమాధ్యమం, యోగా, క్రీడలు, వృత్తి విద్యాకోర్సుల ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవి బాలికలకు చదువుతోపాటు బతుకు దెరువుకు భరోసా కల్పిస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు– నేడు మనబడి కార్యక్రమం ద్వారా కేజీబీవీలకు లక్షలు ఖర్చు చేసి మరిన్ని వసతులు, సౌకర్యాలు కల్పించారు. పదో తరగతి తరువాత వారు డ్రాపౌట్స్‌గా మారేందుకు వీలులేకుండా కేవీజీబీలలో ఇంటర్ విద్యను కూడా ప్రవేశ పెట్టి మరో అడుగు ముందుకు వేశారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన కేజీబీవీలు ఇవే.. జిల్లాలో మూడు కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. దువ్వూరు కేజీబీవీలో 39 మందికి 39 మంది పాస్ అయి వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. అలాగే సింహాద్రిపురం కేజీబీవీలో 39 మందికి 39 మంది పాస్ అయ్యారు. మైదుకూరు కేజీబీవీలో 37 మందికి 37 మంది ఉత్తీర్ణత పొందారు. గతేడాది 10 కేజీబీవీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. అలాంటిది ఈ ఏడాది మూడు మాత్రమే సాధించడం గమనార్హం. 90 శాతం పైన ఉత్తీర్ణత జిల్లాలోని అట్లూరు కేజీబీవీలో 38 మందికి 37 మంది పాసై 97 శాతం ఉత్తీర్ణత సాధించారు. జమ్మలమడుగు కేజీబీవీలో 39 మందికి 37 మంది పాసై 92 శాతం, వేముల కేజీబీవీలో 38 మందికి 35 మంది పాసై 92 శాతం ఉత్తీర్ణత పొందారు. 80 శాతం పైన ఉత్తీర్ణత చాపాడు కేజీబీవీలో 36 మందికి 32 మంది పాసై 89 శాతం ఉత్తీర్ణత, పెండ్లిమర్రి కేజీబీవీలో 31 మందికి 27 మంది పాసై 87 శాతం ఉత్తీర్ణత, పెద్దముడియం కేజీబీవీలో 38 మందికి 33 మంది పాసై 86 శాతం, బి.కోడూరు కేజీబీవీలో 32 మందికి 27 మంది పాసై 84 శాతం, ఖాజీపేట కేజీబీవీ 35 మందికి 28 మంది పాసై 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో మెరిసిన కేజీబీవీలు మొత్తం 85.99 శాతం ఉత్తీర్ణత మూడు విద్యాలయాలు వంద శాతం ప్రథమ స్థానం విద్యార్థినికి 578 మార్కులు నిత్యం పర్యవేక్షిస్తూ.. జిల్లాలోని ఆర్జేడీ, డీఈఓల సూచనలు, సలహాలు పాటిస్తూ కేజీబీవీలను నిత్య పర్యవేక్షించాం. నిత్యం స్టడీ అవర్స్‌తోపాటు వారాంతం పరీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు మార్కుల పరంగా పర్యవేక్షిస్తూ వచ్చాం. తక్కువ మార్కులు వచ్చే వారి పట్ల ఎస్ఓలతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించాం. – అనిత, జీసీడీఓ, సమగ్రశిక్ష సంతృప్తికర ఫలితాలు కేజీబీవీల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. కేజీబీవీల ఫలితాల పరంగా 85.99 శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు 17 కేజీబీవీలకు గాను మూడు కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణతను సాధించాం. చాలా మంది విద్యార్థినులు 500 మార్కులుపైన సాధించారు. ఫలితాల పరంగా సంతోషంగా ఉంది. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారిదువ్వూరు కేజీబీవీకి చెందిన గురుధరణి 578 మార్కులు సాధించి కేజీబీవీల్లో ప్రథమ స్థానం(టాపర్‌గా)లో నిలిచింది. మైదుకూరు కేజీబీవీకి చెందిన నిహారిక 576 మార్కులు సాధించి ద్వితీయ స్థానం, సింహాద్రిపురం కేజీబీవీలో రిషిత 571 మార్కులు సాధించి తృతీయ స్థానం సాధించారు. కేజీబీవీల వారిగా టాపర్స్ వివరాలు అట్లూరు కేజీబీవీలో స్పందన అనే విద్యార్థి 516 మార్కులు సాధించి ఆ కేజీబీవీ టాపర్‌గా నిలిచింది. చక్రాయపేటలో వి.వర్షిణి 529, పెండ్లిమర్రిలో దీక్షితారెడ్డి 493, వల్లూరులో ఽమణివీణ 553, వేములలో సాత్విక 562, బి.కోడూరులో బాను మాధురి 537, కాశినాయనలో హుస్సేన్ బీ 515, చాపాడులో దివ్య కుళాయమ్మ 531, జమ్మలమడుగులో వందన 576, పెద్దముడియంలో సుప్రియ 563, కలసపాడులో మధులత 511, ఖాజీపేటలో భారతి 547, బి.మఠంలో వెంకట సుమశ్రీ 522 మార్కులు సాధించి ఆయా కేజీబీవీల్లో టాపర్స్‌గా నిలిచారు. -
పోలీసుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్
– జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ కడప అర్బన్ : పోలీసు శాఖ సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పోలీస్ స్టేషన్లు, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది తమ వ్యక్తిగత, బదిలీలు, స్పౌస్, వైద్య సమస్యలపై ఎస్పీకి విన్నవించారు. వారి సమస్యలను విన్న ఎస్పీ తగిన పరిష్కారం చూపుతామని సిబ్బందికి భరోసా ఇచ్చారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత జిల్లా పోలీసు కార్యాలయ అధికారులను ఆయన ఆదేశించారు. ఒడిషా వాసి మృతి వేముల : రహదారి పనులు చేస్తున్న టిప్పర్ కింద పడి ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజునాయక్(56) శుక్రవారం మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. ఒడిషా రాష్ట్రంలోని గంజామ్ జిల్లాకు చెందిన రాజునాయక్ నెల రోజుల కిందట డీబీఎల్ కంపెనీలో కూలి పనుల్లో చేరాడు. డీబీఎల్ కంపెనీ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల్లో భాగంగా గురువారం రాత్రి టిప్పర్‌తో మట్టిని రోడ్డు పనులకు తరలిస్తున్నారు. ప్రమాదవశాత్తూ టిప్పర్ రాజునాయక్‌పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి మృతుడి బావమరిది బజ్యా నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.దరఖాస్తుల ఆహ్వానం కడప అగ్రికల్చర్ : ఏపీ పశుసంవర్థ శాఖ ఆధ్వర్యంలో ఊటకూరు కోళ్ల ఫారంలో మూడు ప్రధాన యూనిట్ల అభివృద్ధికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శారదమ్మ తెలిపారు. పబ్లిక్, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ యూనిట్లకు ముందస్తుగా పెట్టుబడి అవసరం లేదని, ప్రభుత్వ మౌలిక వసతులను వాడుకునే అవకాశాన్ని ఇస్తామన్నారు. నిర్వహణ, నాణ్యత, ఉత్పత్తి పెరుగుదల అంశాల్లో నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు. రిమ్స్ ఓపీలోక్యాంటీన్ ప్రారంభం కడప అర్బన్ : కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ఓపీలో 24 రోజుల తరువాత క్యాంటీన్ గురువారం తిరిగి ప్రారంభించారు. క్యాంటీన్ తెరవ లేదని, ప్రజలు, వైద్యులు, సిబ్బంది ఇబ్బందిపడుతున్నారనీ ఇటీవల పత్రికలలో వార్తలు రావడంతో స్పందించిన ఆస్పత్రి అధికారులు క్యాంటీన్‌ను ఒకరికి అప్పగించారు. త్వరలో జరిగే ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశంలో అక్కడ ఏ పద్ధతిలో ఇవ్వాలనేది తీర్మానించనున్నట్లు అధికారులు తెలియజేశారు. -
ధనార్జనే ధ్యేయంగా బాబాయ్, అబ్బాయిల లూటీ
ఎర్రగుంట్ల(జమ్మలమడుగు) : నియోజకవర్గంలో ధనార్జనే లక్ష్యంగా పరిశ్రమలను లూఠీ చేయడానికి బాబాయ్, అబ్యాయిలు అరాటాపడుతున్నాని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ లూటీకి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెరలేపారని, స్థానికులను మరచి.. స్థానికేతరుడు మదుసూదన్రెడ్డికి పనులు అప్పగిస్తున్నారన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి ఆర్టీపీపీలో ఫ్లయాష్ కోసం టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డితో ఘర్షణ పడింది ప్రజలందరికీ తెలుసన్నారు. గెలుపు కోసం ప్రత్యేక విమానంలో వచ్చి ఆదినారాయణరెడ్డికి ఓటువేసిన రమేష్నాయుడుతోనూ సోలార్ ప్లాంట్ కాంట్రాక్టు కోసం గొడవపడిన నీచ చరిత్ర ఎమ్మెల్యేదేనని విమర్శించారు. నియోజకవర్గంలో తప్పు మీద తప్పులు చేస్తున్న ఎమ్మెల్యే ఇపుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డిలపై నిందలు వేస్తున్నారన్నారు. కార్యకర్తలను వదిలేసి తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేందుకే ఎమ్మెల్యే పనిచేస్తున్నావన్నారు. సిమెంట్ పరిశ్రమలకు వెళ్లే ముడిసరుకు రవాణా వాహనాలు సీజ్ చేయిచడం దారుణం అన్నారు. ఎమ్మెల్యే ధనార్జనకు సిమెంట్ పరిశ్రమలు మూతపడిపోయి పరిస్థితి వస్తోందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాలయ్య, మేకల భాస్కర్, జయరామకృష్ణారెడ్డి, దాసరి నారాయణరెడ్డి, రషీద్, మహమ్మద్ ఆలీ, వెంకటశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే మూలే సుధీర్‌రెడ్డి -
కేసుల పరిష్కారంలో అందరి సహకారం అవసరం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని కడప అర్బన్ : కేసుల పరిష్కారం విషయంలో కడప బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదుల సహకారం అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సి.యామిని అన్నారు. కడప కోర్టులో పనిచేసి బదిలీపై వెళ్తున్న న్యాయ మూర్తులు జె.నందిని, జె,హేమస్రవంతి, భార్గవిలకు శుక్రవారం వీడ్కోలు సభ నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి సి.యామిని మాట్లాడుతూ కేసులు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తులు జే.నందిని, జే.హేమ స్రవంతి, భార్గవి మాట్లాడుతూ కడప కోర్టులో పని చేసినంత కాలం త్వరితగతిన కేసులు పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకరించారన్నారు. బదిలీపై వెళ్లిన చోట బాధ్యతగా విధులు నిర్వర్తించి కేసు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కడప బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు ఎ.ఉమాదేవి ప్రధాన కార్యదర్శి చంద్రవదన, సురేష్‌కుమార్, ఎల్. వెంకటేశ్వరరావు, కె. ప్రత్యూష కుమారి, ఎస్.బాబా ఫకృద్దీన్, అసోసియేషన్ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
టీచర్ల సర్టిఫికెట్లలో వైకల్యం..!
ఉపాధ్యాయుల బదిలీలకు వికలత్వం సర్టిఫికెట్ల పరిశీలనలో కొందరు రిమ్స్ అఽధికారులు, వైద్యులు, కొందరి సిబ్బంది అక్రమంగా డబ్బు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడ్డారు. వికలత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్ల మంజూరులో అక్రమాలకు పాల్పడుతున్నారు. టీచర్ల బదిలీల కోసం వికలత్వ ధ్రువపత్రం, వ్యాధులు కలిగిన ఉపాధ్యాయులపై ఆధారపడిన కుటుంబసభ్యుల సర్టిఫికెట్ల పున:పరిశీలన విషయంలోనూ వసూళ్లకు పాల్పడుతూ జేబులను నింపుకొంటున్నారు. సాక్షి, టాస్క్‌ఫోర్స్ : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది బదిలీల కోసం ఏకంగా చట్టం చేశారు. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. దానికనుగుణంగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రతి జిల్లాలో ఈ నెల 24వ తేదీ నుంచి 26వతేదీ వరకు మూడు రోజుల పాటు బోధన, బోధనేతర సిబ్బందికి చెవుడు, మూగ, కుంటి, గుడ్డి, అంగ వికలత్వం, బుద్ది మాంద్యం, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బు, ఇలా వ్యాధులు కలిగిన సిబ్బంది లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు పునఃపరిశీలించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయా విభాగాల్లో నిష్ణాతులైన డాక్టర్లచే రిమ్స్ జనరల్ హాస్పిటల్‌తో వికలత్వ, వ్యాధి నిర్ధారణ పునఃపరీక్షలు రిమ్స్ సూపరిండెంట్ పర్యవేక్షణలో జరురగుతున్నాయి. వివిధ విభాగాలు డాక్టర్లు, అధికారులను, సిబ్బందిని ఇందుకోసం నియమించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ నెల 24న జరిగిన పరిశీలనలో చేయి తడపనిదే కొందరు సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ముందుకు రాలేదనే విమర్శలున్నాయి. రిమ్స్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి కొందరు డాక్టర్లు, అటు టీచర్లను మేనేజ్ చేశారనే అరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. డబ్బులిచ్చిన వారికి కోరుకున్నట్లు సర్టిఫికెట్లు జారీ చేసేశారు. కొందరు యూనియన్ లీడర్లు, మండల విద్యాధికారులతో రెండు రోజుల ముందుగానే సిబ్బంది టచ్‌లోకి వచ్చి సర్టిఫికెట్ల జారీపై చెప్పినట్లు సమాచారం. ఒక్కో రేటుతో వసూళ్లు వికలత్వానికి ఒక రేటు, వ్యాధులకు మరో రేటు నిర్ధారించి వసూలు చేసినట్లు సమాచారం. ఆఫీసులో పని చేసే పెద్దస్థాయి అధికారి, సంబంధిత సెక్షన్ అధికారులుచ, సిబ్బంది ఉపాధ్యాయుల యూనియన్ లీడర్లు, మండల అధికారులతోనూ లాలూచీ పడినట్లు సమాచారం. రిమ్స్ పరిపాలనా విభాగంలో పనిచేసేఆఫీస్ సిబ్బందిలో కొందరు ఈ వ్యవహారాన్ని సాగించారు. ఉపాధ్యాయుల స్థాయిని బట్టి రేటు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలకు తెరతీసిన పరిపాలనా సిబ్బంది పారదర్శకంగా వికలత్వ సర్టిఫికెట్ల పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. బోగస్ వికలత్వ సర్టిఫికెట్లు బోగస్ వ్యాధుల పేరున సర్టిఫికెట్ల ధృవీకరణ లేకుండా అధికారులు డాక్టర్లు వ్యవహరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఉపాధ్యాయుడు, వారి కుటుంబ సభ్యులచే రిమ్స్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ పేరిట నిర్ధారణ పరీక్ష ఫీజు రూ.1000 చెల్లించాలని నిబంధన ఉండగా, ఈ డబ్బు బ్యాంకులో చెల్లించి రసీదు తీసుకువచ్చి వికలత్వ సర్టిఫికెట్‌కు జతచేసి, ఇస్తే డాక్టర్ పరిశీలించాల్సి వుంది. ఈ నిబంధనను తొలి రోజున తుంగలో తొక్కి డబ్బు తామే కట్టించుకున్నారు. కలెక్టర్, రిమ్స్ పరిపాలనాధికారులు ఇప్పటికై నా స్పందించి మిగిలిన రెండు రోజులైనా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. తొలి రోజున 190 మందికి వికలత్వ పున:పరీక్షలు నిర్వహించారు. రిమ్స్ అధికారుల సూచన మేరకు రెండు రోజుల వికలత్వ సర్టిఫికెట్ల నిర్ధారణ పరీక్షల ఫీజు యూనియన్ నాయకులే వసూలు చేసి ‘ఆసుపత్రి అభివృద్ది కమిటీ’ ఖాతాలో ఎట్టకేలకు జమచేశారు. మూడు రోజుల పరిశీలనలో ‘గోల్మాల్’ డాక్టర్ల క్లినిక్‌లకు వెళ్లి కొందరి బేరసారాలు ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.30 వేల వరకు వసూళ్లు తొలి రోజున నగదు రూపంలో ఫీజుల వసూలు అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే -
గీతాశ్రమంపై నివేదిక ఇవ్వండి
ప్రొద్దుటూరు : గీతాశ్రమంలోని మలయాళ స్వామి బీఈడీ కళాశాల నిర్వహణపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్(రెవెన్యూ) గురు ప్రసాద్ తెలిపారు. దేవ దేవా.. ఆదాయం స్వాహా, దేవుడి సొమ్మును దోచుకుతింటున్నారు అంటూ ప్రచురితమైన సాక్షి కథనాలకు ఆయన స్పందించారు. శుక్రవారం గీతాశ్రమాన్ని డిప్యూటీ కమిషనర్ సందర్శించి వివరాలు సేకరించారు. మలయాళస్వామి బీఈడీ కళాశాల భవనాలు పరిశీలించారు. ఎందుకు అద్దె చెల్లించడం లేదు? అని కళాశాల ప్రతినిధి సుదర్శన్‌రెడ్డిని ఆరా తీశారు. తమ కళాశాలకు సంబంధించి రూ.18 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయని సుదర్శన్ రెడ్డి తెలపగా.. అందులో వాస్తవం లేదని ఈవో అన్నారు. ఆ డబ్బు గంగాధరానందగిరి స్వామి జమ చేశారని, దానితో కళాశాలకు సంబంధం లేదన్నారు. వెంటనే అద్దె చెల్లించకపోవడంపై తగిన ఆధారాలతో సహా నివేదిక సమర్పించాలని ఈఓను ఆదేశించారు. అనంతరం అక్కడికి వచ్చిన కళాశాల చైర్మెన్ సురేష్‌బాబురెడ్డి డిప్యూటీ కమిషనర్‌ను కలిశారు. ఈవోపై చర్యలు తీసుకోవాలి అక్రమాలకు పాల్పడుతున్న ఈఓ రామచంద్రాచార్యులుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు గౌరీ శంకర్ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్‌కు విన్నవించారు. కళాశాల భవనాలకు రూ.60 వేల వరకు అద్దె వచ్చే అవకాశం ఉన్నా, రూ.29 వేలకే ఇచ్చారని అన్నారు. గతంలో తొలగించిన ఉద్యోగి జనార్దన్‌రెడ్డిని తిరిగి విధుల్లోకి తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా పాత బకాయిలు రూ.5 లక్షలు చెల్లించారన్నారు. శ్రీకృష్ణ గీతాశ్రమానికి అనధికారికంగా తానే ఈవోనని ఆశ్రమాన్ని నడిపిస్తున్నారని జనసేన ప్రొద్దుటూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ మాదాసు మురళి డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ -
కలిసి మెలిసి జీవిస్తేనే దేశాభివృద్ధి
కడప కార్పొరేషన్ : దేశంలో ఎన్నో కులాలు, మతాలు ఉన్నాయని, అందరూ కలిసి మెలిసి జీవిస్తేనే దేశాభివృద్ధి జరుగుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిఽథి గృహంలో దళిత ఫోరం ఛైర్మెన్ కిశోర్ బూసిపాటి ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. మతం ముసుగులో దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ మతమైనా ఆచరించే హక్కు ఉందని, బలవంతంగా ఎవరినీ మతం మార్చకూడదన్నారు. దాడులపై శాంతి కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. దళిత ఫోరం జిల్లా ఛైర్మెన్ కిశోర్ బూసిపాటి మాట్లాడుతూ మతం పేరుతో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకోవడం సమాజానికి, దేశానికి మంచిది కాదన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేయడం దుర్మార్గమన్నారు. కమ్యునిస్టు నేత బి.నారాయణ మాట్లాడుతూ దేశంలో అంటరానితనం, వివక్ష ఉన్నప్పటికీ ఇటీవల ప్రభుత్వాలే దాడులకు పురికొల్పుతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం దళితులు, క్రిష్టియన్ మైనార్టీలపై దాడులను సమైక్యంగా ఎదుర్కొందామని వక్తలు తీర్మానించారు. అందరూ జేఏసీగా ఏర్పడి దాడులను ఎదుర్కోవాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పులిసునీల్, సీహెచ్.వినోద్, వేణుగోపాల్‌నాయక్, చిన్నసుబ్బరాయుడు, బండిప్రసాద్, కె.బాబు, చిన్నయ్య, శ్యాంసన్, త్యాగరాజు, సంపత్, రత్నకుమారి, తులశమ్మ, సుశీలమ్మ, చైతల్య, మల్లీశ్వరి, పద్మ, వెంకటేశ్వర్లు, గుర్రప్ప, సీఆర్వీ.ప్రసాద్, జేవీ.రమణ, డా. పెంచలయ్య, 32మంది పాస్టర్లు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఏ మతమైనా స్వీకరించవచ్చు రౌండ్ టేబుల్ సమావేశంలో రవీంద్రనాథ్‌రెడ్డి -
ఆదీ.. స్థాయి మరచి మాట్లాడకు
– ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.. ముందు నీ స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడు. నీకు రాజకీయ భిక్ష పెట్టిందే వైఎస్కుటుంబం. వైఎస్సార్సీపీ ఫ్యాన్ గుర్తుపై గెలిచిన సంగతి మరచిపోరాదు.. అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగు వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2014లో వైఎస్సార్సీపీ టికెట్‌పై గెలిచి.. దొడ్డిదారిలో టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డి అక్రమాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కల్వటాల, పాపాయపల్లెలో సోలార్ పనులను అడ్డుకుంటే కేసులు పెట్టించే బెదిరిస్తున్నారన్నారు. నాగిరెడ్డిపల్లెలో 500 ఎకరాల కొండను ఎమ్మెల్యే అండతో అనుమతులు లేకుండా యంత్రాలు పెట్టి పనులు చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డిని రాజకీయాల్లో లేకుండా చేస్తానని ప్రగల్బాలు పలికిన నీ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ÝùÌêÆŠæḥ MýS…ò³-±MìS ï³BÆŠ‡ òßæ^èlaÇMýS రైతులను బెదిరించి సొమ్ము చేసుకోవాలని చూస్తే సహించమని రామసుబ్బారెడ్డి హెచ్చరించారు. వ్యవసాయం చేసే రైతు దొంగతనం చేశాడంటూ కేసు పెట్టడం చరిత్రలో తొలిసారి అన్నారు. సోలార్ కంపెనీ ప్రతినిధులు అక్రమ కేసులు పెడితే ప్లాంట్ నడుపుకోవడం కష్టం అవుతుందని హెచ్చరించారు. -
అంధుల ప్రభుత్వ పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత
కడప ఎడ్యుకేషన్ : కడప శంకరాపురం ప్రభుత్వ అంధుల ఉన్నత పాఠశాల పది ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించింది. ఈ పాఠశాల నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను నలుగురు పరీక్ష రాయగా నలుగురు ఉత్తీర్ణులై వందశాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో దువ్వూరు గురమ్మ 323 మార్కులు, మంగోని స్వర్ణలత 322 మార్కులు, బాతల రెవంత్కుమార్ 321 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో(ఫస్ట్ క్లాస్) నిలువగా, లింగాల నందీశ్వరెడ్డి 229 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో (సెకెండ్ క్లాస్) నిలిచారు. తమ పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ప్రధానోపాధ్యాయుడు ఎబినైజర్ హర్షం వ్యక్తం చేశారు. వేంపల్లి శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం వేంపల్లె : పదవ తరగతి పరీక్షా ఫలితాలలో స్థానిక శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ పాఠశాల కరస్పాండెంట్ బి.చక్రపాణి రెడ్డి తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలలో జి సాయినాథ్ 600/597 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడవ స్థానం, జిల్లా స్థాయిలో రెండవ స్థానం సాధించారన్నారు. అలాగే పి. గురుభావన 595, బి.వి ఉదయ్ అర్జున్ 592లు సాధించారని తెలిపారు. అలాగే 590కిపైగా 40 విద్యార్థులు, 580–590 మధ్య మార్కులు 7 మంది విద్యార్థులు, 550–580 మార్కుల మధ్య 32 మంది విద్యార్థులు రాణించారన్నారు. మొత్తం 155 మంది విద్యార్థులు హాజరు కాగా, 500 మార్కులకు పైగా 95 మంది విద్యార్థులు సాధించారన్నారు. -
ఉచిత శిక్షణ వినియోగించుకోవాలి
కడప ఎడ్యుకేషన్ : యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత డీఎస్సీ కోచింగ్ అభ్యర్థులకు వరం లాంటిదని కడప ఉప విద్యాశాఖాధికారి జి.రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కడపలోని యూటీఎఫ్ భవన్లో జరిగిన డీఎస్సీ ఉచిత కోచింగ్ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీని నిర్వహిస్తున్నదని, కేవలం 45 రోజులు మాత్రమే పరీక్షలకు సమయం ఉందన్నారు. ఈ పరిస్థితులలో డీఎస్సీ అభ్యర్థులు కోచింగ్ కోసం వేలాది రూపాయలను వెచ్చిస్తూ, సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కడపలోని యూటీఎఫ్ భవన్లో ఉచితంగా కోచింగ్ ను నిర్వహించడం అభినందనీయమన్నారు. డీఎస్సీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదివి, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే అద్భుత ఫలితాలను పొందవచ్చని పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, మహేష్ బాబు మాట్లాడుతూ విద్యా రంగ పరిరక్షణ కోసం యూటీఎఫ్ తన వంతు పాత్ర పోషిస్తోందన్నారు. డీఎస్సీ కోచింగ్‌లో శిక్షణ ఇచ్చే అధ్యాపకులు వి.బ్రహ్మయ్య, కోవెల ప్రసాద్ రెడ్డి, కె.సత్యానందరెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, మహేష్, ప్రభాకర్, జి.గోపీనాథ్ లు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్.సుదర్శన్ రెడ్డి, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు సుజాతరాణి, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈల సాధికారతతో రాష్ట్రాభివృద్ధి
కడప సెవెన్‌రోడ్స్: సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల సాధికారతతోనే రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిపుష్ఠి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అఽధికారులు, ఎంఎస్ఎంఈల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా రాణించాలన్నారు. పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు. జిల్లా నుంచి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు, బైరెటీస్, బేరియం క్లోరైడ్ వంటి ఉత్పత్తులు అధికంగా ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ ఇండస్ట్రీలో మ్యాన్ పవర్ అవసరం చాలా ఎక్కువగా ఉందన్నారు. స్థానిక యువత అందుబాటులో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి మాట్లాడారు. టిక్కి ఆర్గనైజేషన్ ప్రతినిధి రామ్మూర్తి నాయక్, డిక్కి కో–ఆర్డినేటర్ శివశంకర్, ఫ్యాప్సియా ప్రతినిధి గల్లా శ్రీధర్, జ్ఞాన ప్రకాశ్‌లతోపాటు ఏపీఐఐసీ, పరిశ్రమలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌పై అపోహలు వద్దు కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కులోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌పై జిల్లాలో అపోహాలు వద్దని ఎంఎస్ఎంఈ, గ్రామీణ పేదరిక నిర్మూలన, ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. టెక్నాలజీ సెంటర్‌ను ఇక్కడే ప్రతిపాదించామని చెప్పారు. పీపీపీ మోడల్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామిని గుర్తించే పనిలో ఉందని తెలిపారు. మే 1వ తేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో 10 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభిస్తారని చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో ఒక ఎంఎస్ఎంఈ పార్కుకు ప్రారంభోత్సవం చేస్తామని, మరో రెండు పార్కులకు భూమిపూజ నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు జిల్లాలో ఉన్న అవకాశాలు, వాటిని ఎలా ప్రమోట్ చేయాలో కార్యచరణ రూపొందించేందుకు జిల్లా పర్యటనకు వచ్చామన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్, డిక్కీ, సిక్కి, టిక్కి, కొప్పర్తి ఐలా ప్రతినిధులతో సమావేశమై ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ఏపీఐఐసీ నుంచి సేల్ రిజిస్ట్రేషన్లు చేయించండి కడప కార్పొరేషన్: సేల్ రిజిస్ట్రేషన్ల సమయంలో ఏపీఐఐసీ నుంచి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మైదుకూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిశ్రమల యజమానులు కోరారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను వారు కొప్పర్తి పారిశ్రామికవాడలో కలిసి వినతి పత్రం అందజేశారు.సూక్ష్మ పరిశ్రమలకు పీఎఫ్, ఈఎస్‌ఐలతో నిమిత్తం లేకుండా ఏపీఐఐసీ సేల్ రిజిస్ట్రేషన్లు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కొప్పర్తి, మైదుకూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతినిధులు పల్లేటి రమణారెడ్డి, మదన్‌కుమార్, కిశోర్‌బాబు, కేవీ సురేష్ పాల్గొన్నారు. కలెక్టర్ గారూ.. ఇదేమిటి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారిక హోదాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి సైతం పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఆయనకు ఎలాంటి ప్రభుత్వ హోదా లేకపోయినా వేదికపై కూర్చోవడం, అందుకు కలెక్టర్ శ్రీధర్ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో కూడా డీఆర్సీ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు విమర్శలు వచ్చాయి. మంత్రి శ్రీనివాస్ -
దొంగ సర్వే నంబర్ వేసి మోసం చేశారు
మాది చక్రాయపేట మండలంలోని గంగారపువాండ్ల పల్లె గ్రామం. జిల్లా కేంద్రమైన కడపలో సొంత ఇల్లు ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో 2021లో శ్రీ సాయి ఫార్చ్యూన్స్ పార్టనర్ అయిన ఆర్. కవిత, ఆమె భర్త ఆర్. మణి ప్రసాద్‌రెడ్డిల వద్ద నాలుగున్నర సెంట్ల ప్లాటు కొనుగోలు చేశాను. రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సర్వే నంబర్ వేశారు. మేము రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నారు కదా అని సరిగ్గా చూసుకోలేదు. ప్లాటు అప్పగించమంటే ఫోన్లు ఎత్తడం లేదు. – శివకొండారెడ్డి పోలీసులు రక్షణ కల్పించాలి మణి ప్రసాద్‌రెడ్డి, కవిత వల్ల చాలామంది మోసపోయారు. ఫోన్లు చేస్తే ఎత్తరు, ఇంటికిపోయినా సరిగా స్పందించరు. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికై నా మేము ఇల్లు కట్టుకునేలా పోలీసులు రక్షణ కల్పించాలి. వారు బకాయి ఉన్నదానికి మమ్మల్ని ప్లాట్లలోకి రానీకుండా అడ్డుకోవడం సరికాదు. సొంత ఇల్లు లేక, కట్టిన డబ్బు వెనక్కి రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. – బాలయ్య పనులు ప్రారంభించాలనుకుంటే అడ్డుపడుతున్నారు మేము ఈ వెంచర్లో 19,47,48 ప్లాట్లు కొనుగోలు చేశాము.అప్పూసప్పూ చేసి లక్షల రూపాయలు వారి చేతిలో పెట్టాం. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఇసుక, కంకర తెచ్చి పనులు మొదలు పెడదామంటే ఎవరో ఒకరు వచ్చి అడ్డుపడుతున్నారు. మాకు తెలియకుండా ఎవరికో ఆయకానికి పెట్టారట ఆయన వచ్చి ఈ ఎకరం స్థలం నాది అంటాడు. మరి ప్లాట్లు కొన్న మా పరిస్థితి ఏంటి. ఈ విషయంలో ఎవరూ న్యాయం చేయడం లేదు. – ఓబులేసు, అంగడి వీధి. -
శభాష్.. ఆచార్యా!
పుస్తకాలు చేతబట్టి పాఠాలు వల్లెవేసిన పల్లెటూరి పిల్లాడు.. నేడు అవే పుస్తకాలు చేతబట్టి విద్యార్థులకు బోధిస్తూ.. తన పరిశోధనలతో దేశ, విదేశాల్లో ఖ్యాతినర్జిస్తూ పుట్టినగడ్డకు పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నాడు. తాజాగా రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో ఫెలోగా నియమితులు కావడంతో పాటు సంస్థ రాయల్‌సొసైటీ బ్యాడ్జిని అందుకున్నాడు. ఆయనే ఆచార్య సుధాకర్ రెడ్డి. ● కడప ఆచార్యుడు సుధాకర్ రెడ్డికి అరుదైన గౌరవం ● పలు పేటెంట్లు కై వసం ● దేశ, విదేశాల్లో పరిశోధన కడప ఎడ్యుకేషన్: చింతకొమ్మదిన్నె మండలం గూడావాండ్లపల్లెకు చెందిన సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన బుసిరెడ్డి మల్లారెడ్డి, మల్లమ్మల కుమారుడైన డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి ప్రాథమిక విద్య బయనపల్లె ఎస్.వి. హైస్కూల్లో పూర్తి చేశాడు. అనంతరం డాక్టర్ పండ్రా కోటేశ్వరమ్మ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఎస్.వి. డిగ్రీ కళాశాలలో డిగ్రీ, తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్డీ పూర్తిచేశారు. అనంతరం తాను చదివిన ఎస్.వి. డిగ్రీ కళాశాలలోనే అధ్యాపకుడుగా ప్రస్తానం ప్రారంభించారు. ప్రస్తుతం కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యులుగా పనిచేస్తున్నారు. పరిశోధనల్లో ఘనాపాటి.. డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి పరిశోధన రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయనకు రెండు యూకే పేటెంట్లు ఉండగా, 75 పైగా అంతర్జాతీయ జర్నల్స్‌లో ఆయన పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. 2008లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న ఈయన 2017లో ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారాన్ని అందుకున్నాడు. 2018లో ఎన్‌ఈఎస్‌ఏ ఫెలోగా పరిశోధనలో ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్నాడు. అదే ఏడాది విశిష్ట ప్రొఫెసర్ అవార్డును, 2024లో జాతీయ అధ్యాపక అవార్డును అందుకున్నారు. అదే విధంగా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ (న్యాక్) కమిటీ మెంబర్‌గా కూడా వ్యవహరించారు. ఏడీ ర్యాకింగ్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల జాబితాలో భారతదేశం నుంచి ఎంపికై న అతికొద్ది మంది భౌతికశాస్త్రవేత్తలో ఈయన ఒకరుగా నిలిచారు. ఇప్పటివరకు ఈయన 101 జర్నల్స్, 3 పుస్తకాలు, కోట్లాది రూపాయలు విలువ చేసే 6 ప్రాజెక్టులు పూర్తి చేశారు. రెండు పేటెంట్లు... ‘డివైజ్ ఫర్ కంట్రోలింగ్ ది స్టెమ్ బోరర్ ఇన్సెక్ట్ ఇన్ క్రాప్ మేనేజ్మెంట్’అన్న అంశంపై ఈయన పరిశోధన వ్యాసానికి 2025 జూలై 10వ తేదీన యునైటెడ్ కింగ్డమ్కు చెందిన కంప్ట్రాలర్ జనరల్ఆఫ్ పేటెంట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వారు పేటెంట్ సర్టిఫికెట్ (పేటెంట్ నెంబర్ 6377539) అందజేశారు. ఈ పరిశోధనల ద్వారా ఎల్ఈడీ, నూనెలను ఉపయోగించి కీటకాలను రెండు విధాలుగా ఆకర్షించడానికి వినూత్న పరికరాన్ని రూపొందించారు. అదే విధంగా వేస్ట్ హెచ్‌జీ బేస్డ్ ల్యాంప్స్ కలెక్టింగ్ డివైజ్‌పై చేసిన పరిశోధనకు గాను పేటెంట్ నెంబర్ 6404043ను 2024 నవంబర్ 22న పొందారు. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో ఫెలోగా.. ప్రపంచవ్యాప్తంగా 50వేల మంది సభ్యులుగా ఉండే రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో ఫెలోగా అవకాశం దక్కించుకున్న ఈయన తాజాగా సొసైటీ వారు మెటీరియల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల్లో చేసిన ప్రతిభను గుర్తించి ఎఫ్ఆర్ఎస్సీ (ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ) అందించారు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను, అదే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘రాయల్ సొసైటీ బ్యాడ్జి’ను డా. బుసిరెడ్డికి పంపడం విశేషం. డాక్టర్ బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి పాఠాలు చెప్పిన అధ్యాపకులకే గైడ్‌గా.. తనకు డిగ్రీలో పాఠాలు చెప్పిన అధ్యాపకులు పి. గిరిధర్, భూషణ్రెడ్డిలకు.. తర్వాత కాలంలో ఆయనే వారికి గైడ్‌గా వ్యవహరించి పీహెచ్‌డీలు అందించారు. ఇప్పటి వరకు 8 మంది విద్యార్థులకు పీహెచ్డీ గైడ్ వ్యవహరించి వారికి డాక్టరేట్ రావడంతో కృషిచేశారు. ప్రస్తుతం మరో ఇద్దరు పరిశోధకులు ఈయన వద్ద పరిశోధనలు చేస్తున్నారు. 2010లో తొలుత విదేశాల్లో పరిశోధనలు ప్రారంభించిన ఈయన ఇప్పటి వరకు సౌత్‌కొరియా, హాంకాంగ్, స్వీడన్, ఫిన్లాండ్, సౌత్ ఆఫ్రికా దేశాల్లో పరిశోధనలు చేశారు. -
పుట్టాయపల్లెలో ఉద్రిక్తత
బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని పుట్టాయపల్లెలో ఆక్రమణల తొలగింపు విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఓ వర్గానికి చెందిన గ్రామస్తుల అనుభవంలో ఉన్న ప్రభుత్వ స్థలాలపై మాత్రమే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీసులు, పంచాయతీ కార్యదర్శులు ఇరువర్గాల వారితో చర్చించి ఆక్రమణల తొలగింపునకు 15 రోజులు గడువు ఇవ్వడంతో సమస్య సద్దుమనిగింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పుట్టాయపల్లెలో గల పలు సర్వే నెంబర్లలో చెరువు పోరంబోకు స్థలాలు, రస్తాలు, గ్రామకంఠాలు, కాలువలు ఆక్రమణకు గురయ్యాయని గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు ఆక్రమిత భూములు స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో గురువారం పుట్టాయపల్లె పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, రూరల్ పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించేందుకు గ్రామానికి వెళ్ళారు. ఈ సమయంలో గ్రామస్తులు గత 35 ఏళ్లుగా ఆయా సర్వే నెంబర్లలోని ప్రభుత్వ స్థలాల్లో వామిదొడ్లు, పశువుల పాకలు, ఇల్లు నిర్మించుకుని ఉన్నామని, ఇప్పుడు ఉన్నపలంగా ఓ వర్గానికి చెందిన వారి ఆక్రమణలు మాత్ర మే తొలగించాలని నిర్ణయం తీసుకోవడం సరికాదని, తమ కు కొద్ది రోజులు సమయం ఇవ్వాలని కొందరు గ్రామస్తులు అధికారులకు విన్నవించారు. అంతేకాకుండా హైకోర్టుకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకుల వర్గీయులు గ్రామంలోని పలు సర్వేనెంబర్లలో చెరువు స్థలాలు, గ్రామకంఠాలను ఆక్రమించి పంటలను సాగు చేయడంతో పాటు ఇల్లు నిర్మించుకున్నారని, వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకుపోయారు. దీంతో చేసేదేమీ లేక ఇరువర్గాల వారితో చర్చలు జరిపి 15 రోజులు గడువు ఇవ్వడంతో సమస్య సద్దుమనిగింది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన జెడ్పీటీసీ సభ్యులు చిన్నపోలిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దపోలిరెడ్డి, సర్పంచ్ జయరామిరెడ్డిలు జిల్లా పరిషత్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సమయం ఇచ్చేలా స్థానిక అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: విజయవాడ కీట్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు డీడీయూ జీకేవై కార్యక్రమం ద్వారా వివిధ సాఫ్ట్వేర్ కోర్సులతోపాటు జూనియర్ సాఫ్ట్వేర్ వెబ్ డెవలపర్ కోర్సులో ఆరు నెలలపాటు ఉచిత శిక్షణ, భోజన వసతి సౌకర్యం కల్పిస్తామని సంస్థ అడ్మిషన్ కో ఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ కేంద్రంలో ఇచ్చే శిక్షణలో ప్రతి విద్యార్థికి సీ, సీ++, జావా స్క్రిప్ట్, పైథాన్, వెబ్ డిజైనింగ్, జేఎస్డీ కోర్సులతోపాటు స్పోకన్ ఇంగ్లీషు, కంప్యూటర్ లైఫ్ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తామని వివరించారు.అభ్యర్థులు 20–30 ఏళ్లలోపు కలిగి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కోర్సులో చేసి ఉండాలన్నారు. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 90004 87423 నెంబరులో సంప్రదించాలన్నారు.మే 10న జాతీయ లోక్ అదాలత్కడప అర్బన్: జాతీయ న్యాయసేవాధికారసంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికారసంస్థ ఆదేశానుసారం జిల్లా న్యాయసేవాధికారసంస్థ వారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మే 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు 08562 258622, 244622 నంబర్లో సంప్రదించాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే కడప.డీకోర్ట్స్.జీఓవి.ఇన్, డిఎల్ఎస్ఏకేడిపి అట్‌దిడేటాఫ్ జి మెయిల్.కంలోనూ సంప్రదించవచ్చని వివరించారు.కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.నేటి నుంచి పెంచలకోనకు ప్రత్యేక సర్వీసుకడప కోటిరెడ్డిసర్కిల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనకు శుక్రవారం నుంచి రాజంపేట డిపోకు చెందిన ప్రత్యేక సర్వీసును నడపనున్నట్లు ఆర్టీసీ రాజంపేట డిపో మేనేజర్ రమణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు ఉదయం 5.15 గంటలకు రాజంపేటలో బయలుదేరి 6.30 గంటలకు కడప బస్టాండుకు చేరుతుందని పేర్కొన్నారు. అనంతరం 6.40 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి రాజంపేట, చిట్వేలి, రాపూరు మీదుగా ఉదయం 10.45 గంటలకు పెంచలకోనకు చేరుతుందని వివరించారు. తిరిగి 11.15 గంటలకు పెంచలకోనలో ఇదే మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు రాజంపేటకు చేరుతుందని వివరించారు. తిరిగి 2.15 గంటలకు రాజంపేటలో బయలుదేరి రాపూరు కు 3.45 గంటలకు చేరుకోవడం జరుగుతుందని వివరించారు. 4.00 గంటలకు రాపూరులో బయలుదేరి చిట్వేలి, రాజంపేట మీదుగా కడపకు రాత్రి 7 గంటలకు చేరుకుంటుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.పండ్ల మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనివ్వాలిఒంటిమిట్ట: పండ్ల మొక్కల పెంపకానికి ప్రాధా న్యం ఇవ్వాలని సుస్థిర వ్యవసాయ సంస్థ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రవితేజ పేర్కొన్నారు. గురువారం ఒంటిమిట్ట రైతు సేవా కేంద్రంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం సిట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ యాజమాన్య పద్ధతుల ద్వారా పండ్ల మొక్కల పెంపకంపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఒంటిమిట్ట, సుండుపల్లి, ఓబులవారిపల్లి మండలాలకు చెందిన రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. మొక్కల పెరుగుదలకు పురుగులు, తెగుళ్లు నివారణకు పాటించాల్సిన సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి రవితేజ వివరించారు. మొక్కల ఎంపిక, నాటే విధానం, కొమ్మల కత్తిరింపు, నీటి యాజమాన్య పద్ధతుల గురించి సుస్థిర వ్యవసాయ సంస్థ ఆర్డబ్ల్యూఐ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ విద్యాసాగర్ వివరించారు.అలాగే మొక్కలు ఇచ్చిన పది మంది రైతులకు నవధాన్య కిట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌పీఓ సోషల్ మొబులైజర్ ఓబులేశు, ఏకశిలా ఎఫ్‌పీఓ చైర్మన్ సుబ్బరాయుడు, సుస్థిర వ్యవసాయ సంస్థ న్యాచురల్ ఫార్మింగ్ కో–ఆర్డినేటర్ అనుషా, ఎఫ్‌పీఓ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో హజ్ కమిటీ ద్వారా గురువారం స్థానిక రాధాకృష్ణనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ 125 మందికిగాను 115 మందికి వ్యాఽధి నిరోధక టీకాలు వేశామన్నారు. ఇంకా ఈ టీకాలు వేయించుకోని హజ్ యాత్రికులకు తిరిగి ఈనెల 28న టీకాలు వేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీఐఓ ఉమామహేశ్వరకుమార్, డీఎల్ ఏటీఓ డాక్టర్ రవిబాబు, యూపీహెచ్సీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉబేదుల్లా, డాక్టర్ సుమధుర, సూపర్వైజర్ మహబూబ్‌బాష పాల్గొన్నారు. -
రియల్ రాబందులు
కడప నగరంలో రియల్ ఎస్టేట్ రాబందులు ఎక్కువయ్యారు. అక్రమంగా వెంచర్లు వేసి, అమాయకులకు ప్లాట్లు విక్రయించి, దొంగ సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసి మాయమైపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. సొంత ఇల్లు నిర్మించుకోవాలని ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఆడోళ్ల పుస్తెలు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు... వారి చేతుల్లో పెట్టి నష్టపోతున్నారు. ఇల్లు కట్టుకోలేక ఇచ్చిన డబ్బు తిరిగి రాక అనేక ఇబ్బందులు పుడుతున్నారు. నగరంలోని అంగడి వీధిలో ఓ రియల్ ఎస్టేట్ రాబందు 90 మంది వద్ద సుమారు రూ.25కోట్లు తీసుకొని వారికి చుక్కలు చూపిస్తున్న వైనంపై ప్రత్యేక కథనం.కడప కార్పొరేషన్: కడప నగరంలో తెలుగుగంగ కార్యాలయం గేటు ఎదురుగా సీఎంఆర్ పల్లిలో సర్వే నంబర్ 365–1లో ఎస్ఆర్ నగర్–2 వెంచర్లో 2021 సంవత్సరంలో భార్యాభర్తలు రాఘవరెడ్డి మణిప్రసాద్‌రెడ్డి, రాఘవరెడ్డి కవిత ఎలాంటి అనుమతులు పొందకుండా వెంచర్ వేసి అందులో 90 పాట్లను ఏర్పాటు చేసి విక్రయించారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ఆలోచనతో చాలామంది ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందిన వారు, ప్రైవేటు ఉద్యోగులు ఈ ప్లాట్లను ఒక్కొక్కరు రూ.20లక్షలకుపైగా పెట్టి కొనుగోలు చేశారు. ఇంట్లో బంగారు తాకట్టు పెట్టి, బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు డ్రా చేసి వారి చేతుల్లో పెట్టారు. బాధితుల నుంచి పూర్తి డబ్బు తీసుకున్న కవిత, మణిప్రసాద్‌రెడ్డి రిజిస్ట్రేషన్ సమయంలో ఆ భూమికి సంబంధించిన సర్వే నంబర్ కాకుండా, దొంగ సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికి నాలుగేళ్లు కావొస్తున్నా తాము కొన్న ప్లాట్లలో ఇళ్లు కట్టుకోవడానికిగానీ, చదును చేసేందుకుగానీ వీలు కావడం లేదని బాధితులు వాపోతున్నారు. ఎందుకంటే కవిత ఎవరిదగ్గరైతే భూమి కొనుగోలు చేసిందో ఆ యజమాని సీఎంఆర్పల్లికి చెందిన రెడ్డెయ్యకు రూ.80లక్షలకు పైగా బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ప్లాట్లు కొన్నవారికి తెలియకుండా సదరు కవిత, మణిప్రసాద్‌రెడ్డి అనిల్ కుమార్ అనే మరో వ్యక్తి వద్ద సుమారు ఎకరా భూమిని ఆయకం పెట్టినట్లు సమాచారం. దీంతో ఆయకానికి పెట్టుకున్న వ్యక్తి ప్లాట్లు కొన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి వీల్లేకుండా ఇబ్బందులు సృష్టిస్తున్న ట్లు తెలుస్తోంది.రూ.25కోట్లకు పైగా మోసంఎస్ఆర్ నగర్–1, ఎస్ఆర్ నగర్–2, సంస్కృతి లే ఔట్, అపార్ట్మెంట్ల ద్వారా రూ.25కోట్లకు పైగా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టినట్లు బాధితుల మాటల ద్వారా అర్థమవుతోంది. ఇదొక్కటే కాదు కడప నగరంలో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇదే తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. పట్టా భూములు కొనుగోలు చేసి వాటిని కన్వర్షన్ చేయకుండా, ప్లాన్ అప్రూవల్స్ పొందకుండా, ప్లాట్లను అభివృద్ధి చేయకుండా అమ్మేస్తున్నారు. పిల్లల భవిష్యత్ కోసమే, కుమార్తెల పెళ్లిళ్ల కోసమో స్థిరాస్థి ఉంటుంది కదా అని కొనుగోలు చేసేవారు ఇలాంటి మోసాల వల్ల సర్వం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.అడ్వాన్సులు తీసుకుంటారు... చుక్కలు చూపిస్తారుతక్కువ ధరలకే ప్లాట్లు విక్రయిస్తామని ప్రజలకు ఆశ కల్పిస్తున్న ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి దగ్గరినుంచి అడ్వాన్సుల రూపేణ ప్లాటు ధరలో 1/4 మొత్తం, 50 శాతం, లేదా పూర్తి మొత్తాన్ని తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసి ప్లాట్లు స్వాధీన పరచకుండా మోసాలకు పాల్పడుతున్నారు. కడప– కర్నూలు జాతీయ రహదారి పక్కనే ఉన్న శేషయ్యవారిపల్లె వద్ద గ్లోబల్ వెంచర్లో కూడా ఇదే తరహా మోసం జరిగినట్లు తెలుస్తోంది.అక్రమ వెంచర్... ఆపై కరువైన మౌలిక వసతులు ఎవరైనా ఒక వెంచర్ వేయాలంటే ముందుగా నగరపాలక సంస్థ నుంచి ప్లాన్ అప్రూవల్ పొందాలి. 30 అడుగుల సిమెంటు రోడ్లు, తాగునీటి పైపులు, కాలువలు, గ్రీనరీ పెంపొందించాల్సి ఉంటుంది. కానీ ఎస్ఆర్ నగర్–2 వెంచర్లో నాలుగు సిమెంటు రోడ్లు మినహా ఎలాంటి వసతులు లేవు. అందులో ఒక రోడ్డు మాత్రమే 30 అడుగుల వెడల్పు ఉంది. నగరపాలక సంస్థ అప్రూవల్ అసలే లేదు. అయినా సెంటు ధర రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షలే కదా అనే చాలామంది 4 సెంట్లు, 5 సెంట్ల ప్లాట్లను కొనుగోలు చేశారు. 2021లో వారు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటి నుంచి వెంచర్‌ను అభివృద్ధి చేసి, తాము ఇళ్లు నిర్మించుకోవడానికి వీలుగా చేయా లని ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్‌లు పెట్టినా స్పందించలేదని సమాచారం. చివరకు ప్లాట్లు కొన్నవారంతా ప్రొద్దుటూరులోని వారి ఇంటికి కూడా అనేకసార్లు వెళ్లి అడిగినట్లు తెలిసింది. ఇంట్లో అందుబాటులో లేకుండా, ఫోన్లకు స్పందించకపోవడంతో బాధితులంతా జిల్లా ఎస్పీలను కలిసి తమ గోడు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. వారిపై 420 కేసు నమోదు చేయడం మినహా మరేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేయడంతో బాధితులు ఏం చేయాలో తెలియక లోలోపలే కుమిలిపోతున్నారు. శ్రీసాయి ఫార్చ్యూన్స్ వారు ఎస్ఆర్ నగర్–1, ఎస్ఆర్ నగర్–2, ఆలంఖాన్‌పల్లె వద్ద సంస్కృతి వెంచర్, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ పక్కన ఆపార్ట్మెంట్ నిర్మించి అనేక మందికి ప్లాట్లు విక్రయించినట్లు సమాచారం. సమగ్ర విచారణ చేస్తే బాధితులు ఎక్కువ సంఖ్యలో బయటికి వచ్చే అవకాశముంది. -
వ్యక్తిపై కత్తితో దాడి
బద్వేలు అర్బన్ : స్థానిక నెల్లూరు రోడ్డులోని భారత్ పెట్రోలు బంకు సమీపంలో బుధవారం అర్ధరాత్రి బాకీ విషయమై ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కోటిరెడ్డినగర్కు చెందిన రమణయ్య లారీడ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. కడపకు చెందిన లారీ ఓనర్ దస్తగిరి అనే వ్యక్తి వద్ద రమణయ్య డ్రైవర్‌గా వస్తానని నమ్మబలికించి కొంత నగదును అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. అయితే లారీకి డ్రైవర్‌గా వెళ్లకుండా.. డబ్బులు తిరిగి చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంతో బుధవారం దస్తగిరి బద్వేలుకు వచ్చి రమణయ్యను నిలదీశాడు. ఈ సమయంలో ఇరువురి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో దస్తగిరి తన వద్ద ఉన్న కత్తితో రమణయ్యను కడుపు భాగంలో, వీపు భాగంలో పొడిచాడు. ఇంతలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని రక్తగాయాలైన రమణయ్యను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. దస్తగిరిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు స్వాధీనం కడప అర్బన్ : జిల్లా వ్యాప్తంగా రికార్డులు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధ, గురువారాల్లో మొత్తం 108 ద్విచ క్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిల్లో రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అ నుమానితులు, పాత నేరస్తుల ఇళ్లలో తనిఖీలు చేశా రు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించా రు. కడప టూ టౌన్ పి.ఎస్ పరిధిలోని బిస్మిల్లా నగర్ లో నిర్వహించిన కార్డన్ అండ్ సర్చ్ లో 4 ద్విచక్ర వా హనాలను స్వాధీనం చేసుకున్నారు. కడప టూ టౌన్ సి.ఐ బి.నాగార్జున, ఎస్.ఐలు హుస్సేన్, సిద్దయ్య, చిన్నచౌక్ ఎస్.ఐ రాజరాజేశ్వర రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. బస్సులో వెళుతూ వడదెబ్బతో మహిళ మృతి సింహాద్రిపురం : మండలంలోని బలపనూరు గ్రామంలో గురువారం బస్సులో ప్రయాణిస్తున్న మహిళ వడదెబ్బకు గురై మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మృతురాలి అల్లుడు శివ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తాడిపత్రి నుంచి పులివెందులకు వస్తున్న ఆర్టీసీ బస్సులో యనమల భవాని(50) తన మనవరాలితో బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో బస్సులో మనుమరాలు ఏడుస్తున్నా భవాని నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో తోటి ప్రయాణీకులు ఆమెను లేపడంతో భవాని అక్కడే కుప్పకూలారు. దీంతో తోటి ప్రయాణీకులు ఆమెను 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే వడదెబ్బకు గురై మృతి చెందినట్లు నిర్ధారించారు. -
రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు
పులివెందుల టౌన్ : గత ప్రభుత్వంలో ఇంటింటికీ రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ జరిగేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారులు, కూటమి నాయకులు కుమ్మకై ్క రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా చేయడం లేదని, ఇందులో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో నూతన కోనేరు ప్రారంభానికి వచ్చిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో ఎండీయూ ఆపరేటర్లు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వెంటనే కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు ఫోన్ చేసి సమస్యను విన్నవించారు. గతంలో మాదిరి రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ జరగడంలేదని, ఎంతోమంది లబ్ధిదారులు కూడా ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చారన్నారు. బియ్యం పంపిణీ ఒకట్రెండు రోజులు చేసి లేవని చెబుతున్నారని, కొందరికి రెండు, మూడు కేజీల బియ్యం తక్కువగా వస్తున్నాయన్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎండీయూ ఆపరేటర్లను భయానికి గురి చేసి బియ్యం పంపిణీ వద్ద లేకుండా చేసి ఇష్టానుసారంగా రేషన్ పంపిణీ చేస్తున్నారని.. దీనిపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌కు ఫోన్లో వివరించారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ జేసీతో మాట్లాడి సక్రమంగా పంపిణీ జరిగేలా చూస్తామన్నారు. ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాణితోపును అద్భుతంగా తీర్చిదిద్దామని.. దాన్ని ప్రస్తుత ప్రభుత్వం మెయింటెనెన్స్ చేయలేకపోతోందని, ఉలిమెల్ల లేక్ వ్యూను మెయింటెనెన్స్ చేయలేక శిల్పారామానికి ఇచ్చారన్నారు. అరటి రైతుల కోసం రూ.25కోట్లతో గత ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌ను నిర్మించామని, ప్రస్తుత ప్రభుత్వం ఆ స్టోరేజ్‌ను వినియోగంలోకి కూడా తీసుకురాలేదన్నారు. అలాగే వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఐదంతస్తుల భవనంతోపాటు క్రీడా మైదానాన్ని అత్యాధునికంగా నిర్మించామని, ఇప్పటికీ కూడా వినియోగంలోకి తీసుకరాలేదన్నారు. పులివెందులకే తలమానికమైన మెడికల్ కాలేజీను రూ.350కోట్లతో నిర్మిస్తే ప్రస్తుత ప్రభుత్వం మంజూరైన సీట్లను రద్దు చేసిందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యాభాస్యం ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉగ్రవాదుల దాడి అత్యంత బాధాకరం పులివెందుల : కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రదాడి అత్యంత హృదయ విదారకమైన సంఘటన అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. గత కొన్నేళ్లుగా దేశంలో ప్రశాంత వాతావరణం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరమన్నారు. పులివెందులలో గురువారం ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతోందని, అక్కడ మినీ స్విట్జర్లాండ్ వాతావరణ పరిస్థితులు ఉంటాయన్నారు. అక్కడికి మన దేశ ప్రజలే కాకుండా, ఇతర దేశాల ప్రజలు కూడా వస్తారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదులు దాడి చేయడం వలన టూరిజం వ్యవస్థ కూడా దెబ్బతింటోందన్నారు. ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే మనసు కలచివేసిందన్నారు. ఉగ్రదాడిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఆ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులు ఏ గ్రూపునకు చెందిన వారైనా, వారిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఉగ్రవాదులు చేసిన చర్యకు ప్రతి చర్యగా గట్టిగా సమాధానం ఇవ్వాలన్నారు. కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి -
జూనియర్ కళాశాలల అభివృద్ధికి కృషి
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని ప్రభుత్వ కళాశాలల్లో విద్యతోపాటు కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తామని ఇంటర్ ఎఫ్ఏసీ ఆర్జేడీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఎప్ఏపీ ఆర్జేడీగా శ్రీనివాసులు గురువారం కడప ఇంటర్ ఆర్జేడీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు డీఐఈఓగా నియమితులైన శ్రీనివాసులను ఎఫ్ఏసీ ఆర్జేడీగా ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ఆయన గురువారం ఇంటర్ ఆర్జేడీగా బాధ్యతలు చేపట్టారు. నూతన ఆర్జేడీ, డీఐఈఓలను ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంఘ నేతలు ఘనంగా సన్మానించారు. -
జల్ జీవన్ ప్రాజెక్టు పూర్తి చేయాలి
చక్రాయపేట : జల జీవన్ మిషన్ కింద చేస్తున్న పనులను ఆగస్టు నాటికి పూర్తి చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు నీటిని అందించాలని నేషనల్ వాష్ ఎక్స్పర్ట్ (కేంద్ర పరిశీలన కమిటి) హర్యాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ విజయకుమార్ సంబంధిత పనులు చేస్తున్న మెగా కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. గురువారం మండలంలోని కె.ఎర్రగుడి, కల్లూరుపల్లె గ్రామాల్లో జలజీవన్ మిషన్ కేంద్ర కమిటీ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా జలజీవన్ మిషన్ ప్రాజక్టు కింద చేస్తున్న పనులను పరిశీలించారు. అనంతరం వారు సర్పంచులు హరిశేఖర్నాయుడు, నాగరత్నమ్మల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సమస్య తదితరాలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో బోర్లు వేయాలంటే ఎంత మేర ఖర్చు వస్తుంది. ఎంత లోపల నీరు ఉంది. నీటిలో ఫ్లోరైడ్ ఉందా.. వాటి పరీక్షలు నిర్వహిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. నీటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ విజయ భాస్కర్, డీఈ సాలన్న తదితరులు పాల్గొన్నారు. -
పెద్దముడియం డీటీ, ఆర్‌ఐలపై చర్య తీసుకోవాలి
కడప సెవెన్‌రోడ్స్ : ఒకరి భూమి మరొకరి పేరిట మార్చడం ద్వారా అక్రమాలకు పాల్పడిన పెద్దముడియం డిప్యూటీ తహసీల్దార్ గౌసియాబేగం, ఆర్ఐ భువనేశ్వరిపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి బుధవారం జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌ను కోరారు. వీరిరువురూ దీర్ఘకాలంగా పెద్దముడియంలో పనిచేస్తూ అనేక అవకతకవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ మండలంలోని కొండపాపయ్యపల్లెకు చెందిన పి.గౌరీదేవికి దిగువ కల్వటాల గ్రామంలో వారసత్వంగా వచ్చిన 40 ఎకరాల భూమిని ఇతరుల పేరుతో రికార్డుల్లోకి ఎక్కించి ఆన్లైన్ చేశారని ఆరోపించారు. సర్వే నెంబర్లకు శ్రీపిశ్రీ అనే అక్షరాన్ని చేర్చి సర్వే నెంబరు 691/1పీలో గిరిధర్‌రెడ్డి, సుబ్బయ్య అనే వ్యక్తుల పేర్లతో, అలాగే సర్వే నెంబర్లు 722, 692/1లోని భూమిని మునగల భాస్కర్‌రెడ్డి, సతీష్‌కుమార్‌రెడ్డి పేర్లతో సర్వేనెంబరు 691/3లోని భూమి పుణ్యావతమ్మ పేర్లతో ఆన్లైన్ చేశారని పేర్కొన్నారు. ఈ అంశంపై పలుమార్లు బాధితురాలు గౌరీదేవి విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదన్నారు. విచారణ చేపట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, బాధితురాలు గౌరీదేవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాది ఇంట్లో చోరీ
కడప అర్బన్ : కడప నగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓంశాంతినగర్ రోడ్ నంబర్ 20లో నివాసం ఉంటున్న నీలిమ అనే న్యాయవాది ఇంటిలో దొంగలు బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లారు. న్యాయవాది గతనెల 21న తన పుట్టింటికి వెళ్లారు. ఈనెల 22వ తేదీన రాత్రి తమ ఇంటికి రాగానే వాకిలి తెరిచి ఉండటం, బీరువాలను పగులగొట్టి బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లారు. సంఘటన స్థలాన్ని మంగళవారం రాత్రి చిన్నచౌక్ సీఐ ఓబులేసు, ఎస్ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. పోలీసులు తమ విచారణలో 9 తులాల బంగారు ఆభరణాలు దోచుకుని వెళ్లినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా న్యాయవాది నీలిమ తమ ఇంటిలో సుమారు 1000 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
దేవుడి సొమ్మును దోచుకు తింటున్నారు
ప్రొద్దుటూరు : లోకకల్యాణార్థం పూర్వం నామా ఎరుకలయ్య శ్రీ కృష్ణ గీతాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. 1946 సంవత్సరంలో తన స్థిర, చరాస్తులన్నింటిని శ్రీ కృష్ణ గీతాశ్రమానికి చెందేట్లుగా రిజిస్టర్ చేయించారు. సర్వే నంబర్ 383లో మొత్తం 4.30 ఎకరాల విస్తీర్ణంలో భవనాలను నిర్మించడంతోపాటు మైదానాన్ని ఏర్పాటు చేశారు. పలు గ్రామాల్లో ఈ ఆశ్రమానికి సంబంధించిన భూములు ఉండగా అధికారులు కౌలుకు ఇచ్చారు. జీపీఏ ద్వారా గతంలో గంగాధరానంద గిరి స్వామి ఈ ఆశ్రమాన్ని నిర్వహించే వారు. 2020లో కరోనాతో ఆయన మరణించారు. పట్టించుకోని అధికారులు ఆశ్రమ నిర్వాహకుడు గంగాధరానంద గిరి స్వామి తర్వాత కాలంలో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మలయాళ స్వామి బీఈడీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ మున్సిపల్ చైర్మన్ నరాల బాలిరెడ్డి, డాక్టర్ చెన్నకేశవరెడ్డి లాంటి ప్రముఖులతోపాటు గంగాధరానంద గిరిస్వామి బంధువు భాస్కర్‌రెడ్డి సభ్యులుగా ఉండేవారు. 2014లో భాస్కర్‌రెడ్డికి, గంగాధరానంద గిరి స్వామికి వివాదం ఏర్పడటంతో కమిటీ నుంచి భాస్కర్‌రెడ్డిని తొలగించారు. గంగాధరానంద గిరి స్వామి మరణానంతరం భాస్కర్‌రెడ్డి తాను కూడా బీఈడీ కళాశాలలో సభ్యుడిగా ఉన్నానని చెప్పడంతోపాటు కళాశాల భవనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అడ్డు చెప్పే అధికారులు లేకపోవడంతో మూడు అంతస్తుల కళాశాల భవనం ఆయన స్వాధీనంలో ఉండేది. రెండేళ్ల క్రితం భాస్కర్‌రెడ్డి దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. భాస్కర్ రెడ్డి మరణం తర్వాత మరికొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలను సృష్టించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీఈడీ కళాశాలకు అనుమతి ఇవ్వాలని కోరడంతో హైకోర్టు 2024 ఏప్రిల్ 23న స్టే మంజూరు చేసింది. మూడంతస్తుల భవనానికి ఏడాదికి కేవలం రూ.4వేలు అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. తక్కువ అద్దెకు భవనాన్ని స్వాధీనం చేసుకున్న వ్యక్తులు కోచింగ్ సెంటర్లు, స్పోకెన్ ఇంగ్లీషు సెంటర్ నిర్వహించేందుకు అద్దెకు ఇచ్చి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న దేవాదాయశాఖ అధికారులు బహిరంగంగా ఇవన్నీ చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వం విచారణ అధికారులను నియమిస్తే శ్రీకృష్ణ గీతాశ్రమంలోని అక్రమాలన్నీ వెలుగు చూసే అవకాశం ఉంది. -
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
వేంపల్లె : స్థానిక నాలు గు రోడ్ల కూడలిలోని జీవాల మార్కెట్ సందులో గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఉదయం నుంచి తోపుడు బండిపై పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మద్యం తాగి వాహనం నడిపినందుకు జరిమానా బద్వేలు అర్బన్ : రోడ్డు ప్రమాద నియంత్రణలో భాగంగా పట్టణ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు విస్తృతం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదుగురిని అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వారిని బద్వేలు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ముకేష్‌కుమార్ ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరు పరుస్తామని తెలిపారు. వంద బియ్యం బస్తాలు పట్టివేత ఎర్రగుంట్ల(జమ్మలమడుగు) : ఎర్రగుంట్ల పట్టణంలోని రాణివనం కాలనీలో ఓ గదిలో నిల్వ ఉంచిన 100 ప్రభుత్వ బియ్యం బస్తాలను పట్టుకున్నట్లు కడప విజిలెన్స్ శాఖ సీఐ శివన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఎర్రగుంట్ల పట్టణంలో పలు చోట్ల బియ్యాన్ని కిలో రూ.18లకు కొనుగోలు చేసి వాటిని రాణివనంలోని ఒక గదిని అద్దెకు తీసుకుని అందులో భద్రపరిచారన్నారు. తమకు అందిన సమాచారం మేరకు దాడి చేసి నిల్వ ఉంచిన 100 ప్రభుత్వ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని వీరకుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. పట్టుకున్న బియ్యం బస్తాలను సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ గోవింద్‌కు అప్పగించామన్నారు. ఈ దాడిలో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా చందనాజ్ జ్యువెలరీ షోరూం ప్రారంభం
ప్రొద్దుటూరు : పట్టణంలోని గాంధీ రోడ్డులో నూతనంగా చందనా బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చందనాజ్ జ్యువెలరీ షోరూంను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం ప్రతినిధులు మాట్లాడుతూ తమ షోరూంలో లైఫ్ టైం వారంటీతో హాల్ మార్క్ బంగారు ఆభరణాలు లభిస్తాయని తెలిపారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ఒక గ్రాము గోల్డ్ కొన్న వారికి రెండు గ్రాముల వెండిని ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈనెల 25వ తేదీ వరకు కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదుపు తప్పి లారీ బోల్తా ముద్దనూరు : ముద్దనూరు– తాడిపత్రి జాతీయ రహదారిలో యామవరం గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం లారీ బోల్తా పడింది. తాడిపత్రి వైపు ప్రయాణిస్తున్న లారీ వేగం అదుపు తప్పడంతో రహదారి పక్కన బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సైన్స్ ఒలంపియాడ్లో భారతి డీఏవీ విద్యార్థుల ప్రతిభ కమలాపురం : సిల్వర్ జోన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ పోటీల్లో డీఏవీ భారతి విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ తెలిపారు. మండల పరిధిలోని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) భారతి డీఏవీ పాఠశాలలో బుధవారం సిల్వర్ జోన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ పోటీలు ఆన్లైన్లో నిర్వహించారు. ఈ పోటీల్లో జోనల్ స్థాయిలో 41 మంది బంగారు పతకాలు సాధించారు. అలాగే 6 మంది రజత పతకం, 8 మంది వెండి పతకాలు సాధించారని ఆయన తెలిపారు. కాగా హెచ్ఆర్ హెడ్ గోపాల్ రెడ్డి, డీఏవీ రీజనల్ ఆఫీసర్ శేషాద్రి ఒలంపియాడ్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులందరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మూలపల్లెలో చిరుతల సంచారం సిద్దవటం : మండలంలోని మూలపల్లె గ్రామ సమీపంలో చిరుత పులులు సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కడప రేంజి పరిధిలోని కనుమలోపల్లె బీటులో చిరుత పులి, చిరుత కూనలు సంచరిస్తుండటంతో గ్రామ ప్రజలు, చుట్టు పక్కల పొలాల రైతులకు కంటినిండా నిద్ర లేకుండా పోయింది. కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన రాజశేఖర్‌యాదవ్ అనే వ్యక్తి తన మేక కనిపించకపోవడంతో గాలింపు చేపట్టగా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత దాడిలో మేక మృతి చెందినట్లు గ్రామస్తులు గుర్తించారు. మంగళవారం రాత్రి చిరుత పులి, రెండు చిరుత కూనలు మూలపల్లె– సిద్దవటం రోడ్డులో సంచరిస్తూ గ్రామ సమీపంలోని పొట్టేటి పద్మావతమ్మ మామిడి తోటలోకి వెళుతుండగా మాచుపల్లె నుంచి బొలెరోలో వస్తున్న హెచ్‌పీసీఎల్ గ్యాస్ కంపెనీ లైన్ వాకర్లు బి. యల్లయ్య, విష్ణులకు కనిపించాయి. దీంతో వారు మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న కడప రేంజర్ ప్రసాద్ సిబ్బందితో కలిసి చిరుత పాద ముద్రలను గుర్తించేందుకు చిరుత పులి సంచరించిన ప్రాంతాల్లో పరిశీంచారు. -
దళితులు, క్రిష్టియన్ మైనార్టీలపై జరిగే దాడులను ఎదుర్కోవాలి
కడప కార్పొరేషన్ : దళితులు, క్రిష్టియన్ మైనార్టీలపై జరిగే దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ దళిత నాయకులు, కిష్ట్రియన్ మైనార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, క్రిష్టియన్లు, మైనార్టీలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్‌ను హత్య చేశారని, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేశారన్నారు. ఇలాంటి అన్యాయాలు, అక్రమాలను వైఎస్సార్సీపీ దళిత నాయకులు ఎత్తిచూపాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బూసిపాటి కిశోర్, పులి సునీల్, సీహెచ్ వినోద్, త్యాగరాజు, సుబ్బరాయుడు, పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి -
మట్టి తవ్వకాలను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గడ్డమాయపల్లె ప్రాంతంలో బుధవారం మైనింగ్ శాఖ విజిలెన్స్ అధికారులు మట్టి తవ్వకాలను పరిశీలించారు. గడ్డమాయపల్లె సమీపంలో సర్వే నంబర్ 83లోని ప్రభుత్వ భూముల్లో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ అనుమతి లేకున్నా తవ్వకాలు జరుపుతున్నారని గ్రామానికి చెందిన తప్పెట శశిధర్‌రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు విజిలెన్స్ అధికారులు మట్టి తవ్వకాలను పరిశీలించారు. అనుమతి లేనట్లు తేలితే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. -
మద్యం స్కాం అంటూ మాయామశ్చీంద్ర కథలు
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో మద్యం కుంభకోణం అంటూ కూటమి ప్రభుత్వం మాయా మశ్చీంద్ర కథలు చెబుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహిహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైజాగ్‌లో ఉర్సా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కూటమి ప్రభుత్వం 60 ఎకరాలు కట్టబెట్టిందన్నారు. ఐటీ పార్కులో డేటా సెంటర్ పేరుతో 3.50 ఎకరాలు కట్టబెట్టారన్నారు. రూ.3200 కోట్లు విలువ జేసే భూమిని అడ్రస్ లేని టీడీపీ బినామీ షెల్ కంపెనీకి ధారాదత్తం చేయడం దారుణమన్నారు. దీన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మద్యం స్కాంను తెరపైకి తెచ్చారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ పారదర్శకంగా జరిగిందన్నారు. దశల వారీగా మద్య నిషేధం చేయాలని, రాష్ట్రంలో 50 వేల బెల్టు షాపులు, 4వేల పర్మిట్ రూములను రద్దు చేశారన్నారు. మద్యం ధరలు ఎక్కువగా ఉంటే దాన్ని కొనేవారు తగ్గుముఖం పడతారని వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారన్నారు. ప్రైవేటు పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం లేనిది ఉన్నట్లు సృష్టించి ఏవేవో కేసులు పెట్టి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి తప్పుడు వాంగ్మూలం ద్వారా రాజ్‌కసిరెడ్డిని అరెస్ట్ చేయించారన్నారు. సంబంధం లేని సెక్షన్లు ఉన్న ఈ కేసు చూసి న్యాయమూర్తి కూడా నివ్వెరపోయారన్నారు. 2014–19లో టీడీపీ ప్రభుత్వంలో ఎంఆర్పీ ధరల కంటే 20 శాతానికి ఎక్కువ వసూలు చేసేలా ఉత్తర్వులిచ్చి రూ.1255 కోట్లు దోచుకున్నారన్నారు. ఆ వ మద్యం స్కాం పై సీఐడీ కేసు కూడా నమోదు చేసిందని, అప్పటి మంత్రి కొల్లు రవీంద్రతో పాటు చంద్రబాబు పై కూడా కేసు నమోదైందని గుర్తు చేశారు. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే వైఎస్ జగన్ చుట్టూ ఉన్నవారందరిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. తప్పుడు ఆరోపణలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, రాబోయే రోజుల్లో తప్పనిసరిగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, పులి సునీల్ కుమార్, సీహెచ్ వినోద్, మునిశేఖర్ రెడ్డి, షఫీ, దానమయ్య పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అఽధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి -
అసాంఘిక కార్యక్రమాల నిరోధానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
పులివెందుల రూరల్ : అసాంఘిక కార్యక్రమాలైన క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదం లాంటి వాటిని ఎదుర్కొనేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పులివెందుల పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లను గుర్తించి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. పలు నియోజకవర్గాలలో సీసీ టీవీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే డ్రోన్ కెమెరాల ద్వారా బందోబస్తు నిర్వహిస్తామన్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాలలో జూదమాడుతున్నట్లు సమాచారం వస్తోందనానరు. దాన్ని అరికట్టేందుకు కూడా ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ గ్రామాల్లో ఆధిపత్య పోరువల్ల గొడవలు జరగకుండా గట్టి నిఘా ఉంచుతామన్నారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు విభూతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మిస్సింగ్ కేసులు, వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లాంటి సంఘటనలు జరగకుండా పోలీసులతో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం పులివెందుల ప్రాంతంలోని సీఐలు, ఎస్ఐలతో ఆయన పలు విషయాలపై చర్చించారు. పోలీస్ భవనాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ లింగాల : మండల కేంద్రమైన లింగాల పోలీస్ స్టేషన్‌ను బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించి స్టేషన్‌లోని సిబ్బందిని మండల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో శాంతిభద్రతలు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో నూతనంగా నిర్మించిన పోలీస్ భవనాన్ని పరిశీలించారు. నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం కాకపోవడానికి గల కారణాలను ఎస్ఐ మధుసూదనరావును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. శాంతిభద్రతలు పరిరక్షించాలి చక్రాయపేట : మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమా ర్ పోలీసులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన చక్రాయపేట పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరి శీలించారు. అనంతరం ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్ఐ కృష్ణయ్యలకు పలు సూచనలు ఇచ్చారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రంతుబాషా, అద్యాపకుడు గంగయ్యలు స్టేషన్ వద్ద ఉన్న ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశారు. పోలీసు స్టేషన్ల తనిఖీ వేంపల్లె : ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, వేంపల్లె పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ పోలీసును ఏర్పాటు చేసి అల్లర్లు, గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మురళి నాయక్, సీఐలు నరసింహులు, ఉలసయ్య, ఎస్ఐలు రంగారావు, తిరుపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వేములలో వేముల : మండల కేంద్రమైన వేముల పోలీస్‌స్టేషన్‌ను బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌కు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ -
శభాష్.. కీర్తిరెడ్డి
భర్త ప్రోత్సాహంతో సివిల్స్‌లో 316వ ర్యాంకు కడప ఎడ్యుకేషన్: ఆమె సాధించిన ఈ విజయం మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ఎంత పెద్ద లక్ష్యమైనా చేరుకోవచ్చునని ఆమె విజయం తెలియజేస్తోంది. ఆమె పేరే శ్రీనివాస కీర్తిరెడ్డి. కడప నగరానికి చెందిన ఈమె భర్త ప్రోత్సాహంతో సివిల్స్ ఫలితాల్లో 316 ర్యాంకు సాధించింది. కీర్తిరెడ్డి భర్త ఎంపాటి శ్రీసాయి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లో భాగంగా విజయవాడలోని ఆల్ ఇండియా రేడియోలో న్యూన్ ఏపీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా భర్త ప్రోత్సాహంతో పాటు ఆయన గైడెన్స్‌తోనే కీర్తిరెడ్డి సివి ల్స్‌కు ఇంటి వద్దే నుంచే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 316వ ర్యాంకు సాధించింది. కీర్తిరెడ్డి తండ్రి కేవీ చలమారెడ్డి కడపలోని ఎల్ఐసీలో అడ్మినిస్టేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చెందారు. తల్లి శ్రీకృష్ణ ఎల్ఐసీలో హైయర్ గ్రేడ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కీర్తిరెడ్డి ప్రాథమిక విద్య రాజంపేటలోని నలంద హైస్కూల్లో పూర్తి చేయగా ఇంటర్మీడియట్‌ను హైదరాబాదులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో , ఇంజనీరింగ్ రాజస్తాన్‌లోని బిట్స్పిలానీలో పూర్తి చేశారు. కీర్తిరెడ్డికి ర్యాంకు రావడంపై బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. -
ఓపెన్ ఫలితాల్లో ప్రతిభ
కడప ఎడ్యుకేషన్: ఓపెన్ పది, ఇంటర్ ఫలితాల్లో అభ్యాసకులు ప్రతిభ చాటారు. జిల్లా వ్యాప్తంగా 2135 మంది అభ్యాసకులు పరీక్ష రాయగా ఇందులో 1550 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇంటర్మీడియట్‌కు సంబంధించి 6248 మందికిగాను 4984 మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు వెల్లడించారు. పులివెందుల వాసికి గిన్నిస్ బుక్‌లో చోటుపులివెందుల రూరల్: పులివెందుల పట్టణంలోని రాజీవ్ కాలనీలో నివాసముంటున్న దిద్దెకుంట రాజేష్ కుమార్ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. విజయవాడలోని హలెల్ మ్యుజిక్ స్కూల్ ఆన్లైన్ క్లాస్ ద్వారా సంగీతం నేర్చుకున్నారు. కాగా, 2024 డిసెంబర్ 1న 18 దేశాలలోని 1046 మంది స్వరాలు ఆలపించినవారిలో ఈయన ఒకడు. రాజేష్‌కుమార్ ఈ రికార్డును సొంతం చేసుకున్నందుకు పులివెందుల పాస్టర్ అసోసియేషన్ సభ్యులు, ఎరబ్రల్లి కొత్త పల్లి ఇమ్మనుయేలు, చర్చి పాస్టర్ సిమోను, వైవీయూ లలిత కళల విభాగం అకడమిక్ ఇన్‌ఛార్జి శేఖర్‌రెడ్డి, సుబ్బరాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రారంభమైనహేలాంబ తిరునాల కమలాపురం : మండలంలోని పెద్దచెప్పలిలో వెలసిన శ్రీ ఎల్లమ్మ(హేలాంబ) తిరునాల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తోట రవీంద్ర ఆధ్వర్యంలో, ధర్మకర్తల మండలి సభ్యుల పర్యవేక్షణలో తిరునాల మహోత్సవా లు ప్రారంభం అయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో బాజా భజంత్రీల నడుమ, భక్తుల సమక్షంలో ఎల్లమ్మను ప్రతిష్టించారు. సమీప ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచి పెట్టా రు. ప్రముఖ రంగ స్థల నటుడు, నంది అవార్డు గ్రహీత సుబ్బరాయుడు తన బృందంతో కల సి చెప్పిన ఎల్లమ్మ కథ భక్తులను ఆకట్టుకుంది. -
డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి
ప్రొద్దుటూరు రూరల్: ప్రొద్దుటూరులో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, ప్రధానమైన డ్రైనేజీ కాలువల సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపుతామని కలెక్టర్ శ్రీధర్ తెలిపా రు. స్థానిక మున్సిపల్ కార్యాలయ సభాభవనంలో బుధవారం ఆయన నియోజకవర్గ, జిల్లా స్థాయి అధికారులతో అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొద్దుటూరు నుంచి మురికి నీరు వెళ్లే కాలువల వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించాలన్నారు. ఆక్రమణల తొలగింపులో ఎవరైనా పేదలు నష్టపోతే వారికి ఇళ్లస్థలాలను మంజూరు చేయా లని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధి నుంచి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిన మడూరు కాలువ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కాలువల ఆధునీకరణకు నిధులు లేకపోతే విడతల వారిగా పూర్తి చేయలని సూచించారు. కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, అందుకు సంబంధించిన గతంలో మంజూరైన నిధులు, ప్రస్తుతం అవసరమైన నిధుల ప్రతిపాదనలు తెలపాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రతి కట్టడానికి బిల్డింగ్ పర్మిషన్ తీసుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. హౌసింగ్ పథకం కింద పేదలకు మంజూరైన ఇళ్లు, టిడ్కో గృహసముదాయాల పరిస్థితిపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. వాణిజ్యపరంగా పేరున్న ప్రొద్దుటూరులో గ్యాంబ్లింగ్, బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలను, గంజాయి అమ్మకాలను సమూలంగా నిర్మూలించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పారదర్శకంగా పనిచేయాలన్నారు. అటవీ భూములు, పెన్నా ఏటి పోరాంబోకు స్థలాల్లో నిర్మించిన అక్రమ భవనాలపై త్వరలో ప్రభుత్వ ద్వారా ఒక కమిటీ వేస్తామన్నారు. ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్ గంగయ్య పాల్గొన్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ -
‘చింతమనేని’పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
జేసీకి జర్నలిస్టుల వినతి కడప సెవెన్‌రోడ్స్: ఏలూరు సాక్షి దినపత్రిక కార్యాలయంపై దాడికి పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పి.రామసుబ్బారెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వెన్ను శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని తొలినుంచి క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తి అని, అలాంటి వారిని అందలమెక్కిస్తే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలే చోటుచేసుకుంటాయన్నారు. ఎమ్మెల్యే, అతని అనుచరవర్గం సాక్షి కార్యాలయంపై దాడి చేసి కంప్యూటర్లు ధ్వంసం చేయడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న విలేకరిపై దాడి చేయడం దారుణమన్నారు. సాక్షి పత్రికలో తమకు వ్యతిరేకంగా వార్త వచ్చిందని దాడి చేయడం దుర్మార్గమన్నారు. పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవాలు లేకపోతే వివరణ ఇవ్వాలేగానీ కార్యాలయాలపై, విలేకరులపై దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందన్నారు. చంద్రబాబు వెంటనే స్పందించి చింతమనేనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దిశ బ్యూరో ఇన్‌ఛార్జి మన్యం శివరాం, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టర్ నాగరాజు, సాక్షితో పాటు వివిధ మీడియా సంస్థల జర్నలిస్టులు విలియమ్స్, ప్రసాద్, ఆనంద్, భూమిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి, రవికుమార్, ఫణి, కిషోర్, యల్లారెడ్డి, జయరాజు, దుర్గా ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఫలితాలు సంతృప్తినిచ్చాయి
జిల్లాలో ప్రస్తుతం వచ్చిన పదో తరగతి ఫలి తాలు సంతృప్తినిచ్చాయి. సింహాద్రిపుర మండలం రావులకొలను జెడ్పీ హైస్కూల్‌కు చెందిన జోషిక ్థ 595 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల టాపర్‌గా ప్రథమ స్థానంలో నిలిచింది. సిద్దవటం జెడ్పీ హైస్కూల్ విద్యార్థి పల్లవి 594 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచింది. చాలా మంది గ్రామీణ విద్యార్థులు 500 మార్కులు పైనే సాధించారు. ప్రైవేటు విద్యార్థులకంటే మా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. – షేక్ షంషుద్దీన్, డీఈఓ, వైఎస్సార్‌జిల్లా -
ఫెయిల్ పరీక్షకే.. జీవితానికి కాదు
చదువులో వెనకబడ్డా.. గొప్ప వ్యక్తులయ్యారు ● క్రికెట్ క్రీడాభిమానులు తమ ఆరాధ్యదైవంగా భావించే సచిన్ టెండూల్కర్ టెన్త్ ఫెయిల్ అయ్యారు. అయితేనేం తనకు ఆసక్తి ఉన్న క్రికెట్లో రాణించి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గడించారు. ● పాతతరం ప్రజలను, సినీ ప్రేక్షకులను అలరించిన దివంగత అక్కినేని నాగేశ్వరరావు విద్యాభ్యాసం ప్రాథమిక స్థాయిలోనే ఆగిపోయింది. అయితే ఆ యన ఏమాత్రం కుంగిపోలేదు. నటనపై ఉన్న ఆసక్తితో చైన్నెకి వెళ్లి గొప్ప నటుడయ్యారు. అంతేకాదు దేశంలోనే మేటిగా ఉన్న అన్నపూర్ణ స్టూడియోను నిర్మించి అనేక మందికి ఉపాధిని కల్పించారు. ● అబ్దుల్‌కలాంకు మార్కులు తక్కువగా వచ్చేవి. కాని చదవడం, నేర్చుకోవడం అంటే ఆయనకు ఎనలేని ఇష్టం. అదే అబ్దుల్ కలాంను శాస్త్రవేత్తను, మనదేశానికి రాష్ట్రపతిని చేసింది. ‘భారతరత్న’ను కూడా తెచ్చిపెట్టింది. ● ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఎప్పు డూ స్కూల్‌కు వెళ్లలేదు. అయినా పాటల తోటలో గానకోకిలగా కీర్తి గడించారు. ● శ్రీనివాసరామానుజన్ గొప్ప గణిత మేధావి. కొన్నిసార్లు చదువులో ఇబ్బంది పడినా ఎప్పుడూ నిరాశ చెందకుండా లెక్కల్లో కొత్త విషయాలు తెలుసుకునేవారు. అతని మేథాశక్తిని గుర్తించిన గణిత ఆచార్యుల ద్వారా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనకు అవకాశం పొందారు. ఆత్మస్థైర్యం..సాధించాలన్న తపన ఉంటే చాలు...ఎంతటి కష్టాలనైనా ఎదుక్కోవచ్చు. పరీక్షలు..మార్కులు ర్యాంకులే పరమావఽధి కాదు. తక్కువ మార్కులు వచ్చినా.. ఫెయిలైనా జీవితం ముగిసిపోదు. క్షణికావేశ నిర్ణయాలు మంచిది కాదు. నిరాశ చెందకుండా మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం పాదాక్రాంతం అవుతుందని విద్యావేత్తలు, సైకాలజిస్తులు సూచిస్తున్నారు. బుధవారం పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. కడప ఎడ్యుకేషన్: ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామన్న బాధతో కొంతమంది, తక్కువ మార్కులు వచ్చాయని మరికొంత మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇక ఏం చేసినా, ఎన్నికోట్లు ఖర్చుపెట్టినా వారి ప్రాణాలు మాత్రం తిరిగిరావు. అంతేకాదు ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చారు. వారు ‘ఒక్కటంటే ఒక్క నిమిషం’ మనసు నిబ్బరంగా చేసుకొని ప్రశాంతంగా ముందున్న భవిష్యత్తు, తల్లిదండ్రుల గురించి ఆలోచించివుంటే వారు ఆత్మహత్యలు చేసుకునేవారు కాదు. ఈ విషయాలు మరువద్దు ● పాస్, ఫెయిల్ అన్నవి అత్యంత సాధారణ విషయాలు. అందువల్ల విద్యార్థులు ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా చాలా లైట్‌గా తీసుకోవాలి. ప్రశాంతంగా ఆలోచించాలి. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని ముందుకు సాగాలి ● జరిగిన పొరపాటుకు కుంగిపోకుండా ఆత్మస్దైర్యాన్ని నింపుకోవాలి ● ఒత్తిడి నుంచి వేగంగా బయటపడేందుకు ప్రయత్నించాలి. ● వెనకబడిన పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలి. అవసరమైతే ఉపాధ్యాయులు, సీనియర్ల సూచనలు, సలహాలు తీసుకోవాలి. ● ఫలితాలు విడుదలయ్యే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు దగ్గరగా ఉండాలి.వారికి ధైర్యం చెప్పాలి. ● ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా తల్లిదండ్రులు ఏమాత్రం కోపగించుకోకుండా పిల్లలతో చిరునవ్వుతో మాట్లాడాలి. ముభావంగా ఉంటే అప్రమత్తం కండి ● టెన్త్ చదివే విద్యార్థులది కౌమారదశ. అందువల్ల వారి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. ఫలితాలు విడుదలయ్యాక మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా తల్లిదండ్రులు తమ పిల్లలను ఓ కంటకనిపెట్టి ఉంచాలి. ● ఆహారం తీసుకోక పోయినా, ఏదో ఆలోచిస్తూ మూభావంగా ఉన్నా వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ● ఫెయిల్ అయిన వారిని ఒంటరిగా ఉంచకూడదు. క్షణికావేశం వద్దు టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. టెన్త్ ఫలితాల్లో ఎవరైనా ఫెయిల్ అయినా,ఎవరికై నా తక్కువ మార్కులు వచ్చినా.. క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యావేత్తలు, మేధావులు చెబుతున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఓటమి విజయానికి తొలిమెట్టులాంటిది. పరీక్షల్లో మనం ఎందుకు తప్పాం, లోపం ఎక్కడుంది అని ఆలోచించి దాని అధిగమిస్తే త్వరలో జరిగే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో తప్పక ఉత్తీర్ణులు కాగలరని విద్యావంతులు చెబుతున్నారు. జిల్లాలో 27,800 మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూపులు నేడు పది పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు క్షణికావేశానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మార్కులు తక్కువగా ఫెయిల్ అయ్యే విద్యార్థులను చిన్నచూపు చూడకూడదు. విద్యార్థి ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి తీసుకురాకూడదు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగిన వారే ఏదైనా సాధిస్తారు. ప్రపంచ విజేతలుగా నిలుస్తారు. – షేక్. షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి, వైఎస్సార్‌జిల్లా ధ్రువపత్రాలు కేవలం అర్హతకే... ప్రపంచ కుబేరుల్లో ఎక్కువ మంది పెద్ద చదువరులేం కాదు. వారు చేసిందల్లా ఒకటే.. నచ్చిన మార్గంలో ప్రయాణించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. మనం చదివిన విద్యా ధ్రువపత్రాలు కేవలం అర్హతగానే పరిగణించాలి. మార్కులు తక్కువ వచ్చాయనో..మనం కోరుకున్న కళాశాలలో సీటు దక్కలేదనో కుంగుబాటుకు గురవటం అనవసరం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని తెలుసుకున్న రోజు ప్రపంచంలోను మనకన్నా గొప్పవారు ఎవరు ఉండరు. – ఓ. వెంకటేశ్వరరెడ్డి, ప్రముఖ సైకాలజిస్టు, కడప జీవితం నష్టపోదనే భరోసా ఇవ్వాలి ఒకసారి పరీక్షలో తప్పితే జీవితం నష్టపోదనే భరోసానివ్వాలి. మళ్లీ చదివి పాస్ కావచ్చనే ధైర్యం నింపాలి. పాస్ కాలేదని తిట్టకుండా, వేధించకుండా సముదాయించాలి. తిరిగి మంచిగా చదివి పాసయ్యేలా ప్రోత్సహించాలి. విద్యార్థులు కూడా క్షణికావేశానికి లోనుకాకుండా సమస్యను స్నేహితులు, తల్లిదండ్రులతో చర్చించాలి. మార్కులు కాదు జ్ఞానం ముఖ్యమనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. – డాక్టర్ మహబూబ్అలీ, ఎండీ, కడప -
సామాజిక రుగ్మతలను నిర్మూలిద్దాం
కడప సెవెన్‌రోడ్స్: దళితులకు ఎక్కడా అన్యాయం జరగకూడదని, జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా పారదర్శకంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలాని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్‌తోపాటు ఎస్పీ అశోక్ కుమార్, ఇన్చార్జి డీఆర్వో వెంకటపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు న్యాయంతో పాటు త్వరితగతిన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై తదుపరి సమావేశం నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే పోక్సో చట్టం, బాల్య వివాహాలు నిరోధక చట్టం పైన ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కడప, జమ్మలమడుగు, బద్వేలు డివిజన్ల ఆర్.డి.ఓ లు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, సంబందిత డివిజన్ల డీఎస్పీలు పాల్గొన్నారు. అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘ఉల్లాస్’ ఉద్దేశ్యం సమాజంలో ప్రతి ఒక్కరినీ నిరక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ‘ఉల్లాస్‘కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో రెండవ విడత ‘ఉల్లాస్‘కార్యక్రమం నిర్వహణపై.. జిల్లా స్థాయి కమిటీ కన్వర్జేన్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025–26లో జిల్లాలో మొత్తం 33,132 మందికి అక్షరాస్యత లక్ష్యం నిర్దేశించడం జరగగా, అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని చేరుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పశు పోషణతో రైతులకు ఆర్థిక బలంగ్రామీణ స్థాయిలో పశు పోషణ ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో జేడీ డాక్టర్ శారదమ్మ అధ్యక్షతన పశుసంవర్ధక శాఖ జిల్లాస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ఆ శాఖలో విభాగాల వారీగా సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
పీహెచ్ఎన్ పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతం
కడప రూరల్: వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో మంగళవారం నిర్వహించిన పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 22 మంది ఎంపీహెచ్ఎస్ (ఎఫ్)లకు పీహెచ్ఎన్ (ఎన్టీ)లుగా పదో న్నతి కల్పించారు. ఈ కౌన్సెలింగ్‌కు 22 మందికి గాను 18 మంది ప్రమోషన్లు పొందారు. నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించినట్లు ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ భక్తవత్సలం, సూపరింటెండెంట్ వెంకటసుబ్బమ్మ, సీనియర్ అసిస్టెంట్స్ వనీష, బత్తనయ్య పాల్గొన్నారు. ఆర్పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఫణీంద్ర కుమార్ కడప కార్పొరేషన్: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జవ్వాజి ఫణీంద్ర కుమార్ నియమితులయ్యారు. కేంద్రమంత్రి రాందాస్ అతవాలే, ఆ పార్టీ నేషనల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఎం. వెంకట స్వామి ఆదేశాల మేరకు మంగళవారం విజయ వాడలోని ఆ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మా రెడ్డి బ్రహ్మానంద రెడ్డి చేతుల మీదుగా ఫణీంద్ర కుమార్ నియామక పత్రాన్ని అందుకున్నారు. -
8న జెడ్పీ సమావేశం
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మే 8వ తేది ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నట్లు జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఓబులమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, వైఎస్సార్, అన్నమయ్య జిల్లా అధికారులు సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు.25న టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సమావేశంకడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని సీఎస్ఐ ఉన్నత పాఠశాలలో ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటలకు కడప జిల్లా టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా విశ్వనాథరెడ్డి, బాలశౌరిరెడ్డి తెలిపారు. సొసైటీ సభ్యులందరూ సమావేశానికి హాజరుకావాలని కోరారు.నేడు మంత్రి కొండపల్లి రాకకడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ నెల 23, 24 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు ఇన్‌ఛార్జి డీఆర్వో వెంకటపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23వ రాత్రి కడప ఆర్అండ్బీగెస్ట్కు చేరుకుని బస చేస్తారని పేర్కొన్నారు. 24న ఉదయం కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ను సందర్శనని, ఆపై కలెక్టర్ తో కలసి ఎంఎస్ఎంఈపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటల నుండి 3 గంటల వరకు సెర్ప్ కార్యక్రమాలపై జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారని వివరించారు.మెడికల్ అండ్ హెల్త్ డీడీగా శేఖర్కడప రూరల్: వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 డిప్యూటీ డైరెక్టర్‌గా వై.శేఖర్ మంగళవారం బాధ్యత లు స్వీకరించారు. కడప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఈయన..వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం డీడీగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న భక్తవత్సలం ఏపీ రిక్రూట్మెంట్ బోర్డ్ జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు.మైలవరానికి నీరు విడుదలకొండాపురం: గండికోట జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి వేల క్యూసెక్కుల నీటిని మైలవరం జలాశయానికి విడుదల చేసినట్లు జీఎన్ ఎస్ఎస్ ఈఈ ఉమామహేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం జలాశయం పరిధిలోని గ్రామాల ప్రజలకు సాగు, తాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసి నీటిని గండికోట ప్రాజెక్టు నుంచి తరలిస్తున్నామని వివరించారు. -
● చెన్నంరెడ్డి శివగణేష్‌రెడ్డి @ 119
కడప మండలం ఆలంఖాన్‌పల్లెకు చెందిన చెన్నంరెడ్డి మల్లికార్జునరెడ్డి, ఇందిరా ప్రియదర్శిని కుమారుడు చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియాస్థాయిలో 119వ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రుల కలను నెరవేర్చడంతో పాటు ఊరి పేరును నిలబెట్టాడు. శివగణేష్‌రెడ్డి 1 నుంచి 10వ తరగతి వరకు కడప బాలవికాస్ హైస్కూల్లో చదివాడు. ఇంటర్మీడియట్‌ను నెల్లూరు నరసింహకొండ నారాయణ కళాశాలలో పూర్తి చేశాడు. తరు వాత బీటెక్ హైదరాబాదు ఐఐటీలో పూర్తి చేశారు. తరువాత సివిల్స్ కోచింగ్‌ను ఢిల్లీలో తీసుకున్నాడు. ● తొలిసారి సివిల్స్ రాసినప్పుడు ర్యాంకు రాలేదు. రెండవసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి రెండు మార్కులతో వెనుదిరిగాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా మూడవ సారి మరింత గట్టిగా ప్రయత్నించి 119వ ర్యాంకు సాధించాడు. చెన్నంరెడ్డి శివగణేష్‌రెడ్డి తండ్రి మల్లికార్జునరెడ్డి గతంలో కడప నగర శివార్లలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ ఉండేవారు. తరువాత ఉద్యోగాన్ని మానేసి వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించుకునేవాడు. శివగణేష్‌రెడ్డి చెల్లెలు శివజ్యోతిక బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ చేసేందుకు ప్రిపేర్ అవుతోంది. శివగణేష్‌రెడ్డి సివిల్స్‌లో 119 ర్యాంకు సాధించడంపై తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ● కడప బాలవికాస్ హైస్కూల్ పూర్వపు విద్యార్థి అయిన చెన్నంరెడ్డి శివగణ్ష్రెడ్డి 119వ ర్యాంకు సాధించడంపై పాఠశాల డైరెక్టర్ గంగయ్య, కరస్పాండెంట్ సుబ్బరాయుడు ఆనందం వ్యక్తం చేశారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ అశోక్ కుమార్
కడప అర్బన్ : కడపలోని జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఈనెల 20న బాధ్యతలను స్వీకరించిన డాక్టర్ సి. యామిని మంగళవారం జిల్లా కోర్టుకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్‌కుమార్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. న్యాయ వ్యవస్థ, పోలీస్ శాఖ సమన్వయంతో కృషి చేసి ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండేలా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కడప జిల్లా జ్యుడీషియల్ ఎంప్లాయాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.శశికాంత్‌రెడ్డి, సభ్యులు కూడా జిల్లా ప్రధాన న్యాయమూర్తిని మర్యాద పూర్వకంగా కలిశారు. -
భార్యాభర్తల సమస్యను రాజకీయం చేయొద్దు
వేంపల్లె : భార్యాభర్తల సమస్యను కొందరు వ్యక్తులు రాజకీయం చేయడంతో కుటుంబాలు నాశనమవుతున్నాయని, ఇది మంచిది కాదని పఠాన్ మున్వర్, ఖాసీం వలీలు పేర్కొన్నారు. మంగళవారం నందిపల్లెలో వారు విలేకరులతో మాట్లాడుతూ గత రెండేళ్ల క్రితం వీరపునాయునిపల్లె మండలంలోని నేలతిమ్మయ్యగారిపల్లెకు చెందిన పెద్ద బాదుల్లా కుమార్తె షీరిన్ భానును వివాహం చేసుకున్నట్లు చెప్పారు. అయితే వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు ఎప్పుడు లేవని, భార్యను ఎప్పుడు హింసించలేదని వారు తెలిపారు. చిన్న మాట విషయంలో తన భార్య అయిన షీరిన్ పుట్టింటికి వెళ్లిందన్నారు. పెద్ద మనుషులను తీసుకొని వచ్చి సంజాయిషీ చెప్పకపోగా, చిన్నమామ చిన్న బాదుల్లా అనే వ్యక్తి ఘర్షణ జరగడానికి మూల కారణమన్నారు. గత ఆదివారం రాత్రి చిన్న బాదుల్లా అనే వ్యక్తి రాజకీయం చేసి వేంపల్లెలోని బిడ్డాలమిట్ట ప్రాంతంలో ఉన్న అబ్దుల్‌తోపాటు 40 మందిని కత్తులు, రాడ్లతో పిలుచుకొని వచ్చి తమ కుటుంబంపై దాడి చేశారని తెలిపారు. గ్రామస్తులందరూ ఏకమై అడ్డుకోవడంతోనే తాము ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. కుటుంబ సమస్యలను రాజకీయాలకు అంటగట్టడం తగదన్నారు. -
పద్మశాలీయ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
ప్రొద్దుటూరు కల్చరల్ : పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన పద్మశాలీయ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించనున్నట్లు పద్మశాలీయ అభ్యుదయ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నా చంద్రబాబు తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం పద్మశాలీయ ప్రతిభా పురస్కారాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ.4వేలు, ద్వితీయ బహుమతి రూ.3వేలు అందిస్తామన్నారు. స్థానికంగా ఇంటర్ చదివి ప్రతి గ్రూపులో 900 మార్కులకుపైగా సాధించిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ.4వేలు అందిస్తామని చెప్పారు. టెన్త్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 450కిపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కన్సొలేషన్ బహుమతి రూ.3వేలు, ఎంసెట్, నీట్, మెడిసిన్, ఇంజనీరింగ్, ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రూ.5వేలు నగదు బహుమతి, మెమెంటో, ప్రశంసా పత్రాలు అందిస్తామన్నారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి టౌన్ ఫస్ట్‌గా నిలిచిన పద్మశాలీయేతర విద్యార్థులకు రూ.4వేలు నగదు బహుమతి అందిస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు మే 17వ తేదీలోపు తమ దరఖాస్తులను పద్మశాలీయ కల్యాణ మండపంలో అందించాలని కోరారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మే 27న ప్రముఖుల చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలను అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9032705866, 9290571411 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. సమావేశంలో పద్మశాలీయ అభ్యుదయ సంఘం ప్రధాన కార్యదర్శి వద్ది నాగరాజు, ఉపాధ్యక్షుడు మునిస్వామి, కోశాధికారి శ్రీనివాసులు, ఆనంద్, సంజీవరాయుడు, జానకిరామయ్య పాల్గొన్నారు. -
ఉద్దేశ పూర్వకంగానే డీఎస్పీపై ఎమ్మెల్యే వరద ఆరోపణలు
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : ఎలాంటి తప్పు చేయకుండా, ఆధారం లేకుండానే అధికార పార్టీ నేతలపై పోలీసులు కేసులు పెట్టే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయా అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. కాశీ నుంచి మంగళవారం లైవ్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ కేవలం ఉద్దేశ పూర్వకంగానే పోలీసులు, రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి విమర్శలు చేస్తున్నారన్నారు. తన మాట వినని అధికారులపై లంచగొండి అనే ట్యాగ్ వేయడం ఆయనకే చెల్లునన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఆయన అధికారులు లంచగొండులు అని, అసమర్థులని, అవినీతిపరులని మాట్లాడటాన్ని బట్టి ప్రభుత్వం పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోందన్నారు. కేవలం తన అనుచరుడు దొరసానిపల్లె సర్పంచ్ భర్త మునివరపై క్రికెట్ బుకీ కేసు నమోదు చేసినందుకే ఆయన డీఎస్పీని అవినీతి పరురాలిగా చిత్రీకరించారన్నారు. డీఎస్పీతోపాటు పోలీసులు మద్యం షాపుల నుంచి నెల మామూళ్లు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపించడంలో అర్థం లేదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. 30 ఏళ్లకుపైగా అటు ఎకై ్సజ్ అధికారులు, ఇటు పోలీసులు మామూళ్లు తీసుకోవడం ఆనవాయితీ అయిందన్నారు. ఇటీవల టీడీపీ కార్యక్రమం నిర్వహణ కోసం మద్యం షాపుల యజమానుల నుంచి రూ.10లక్షలు అడిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. -
క్రీడలతో పాటు వ్యాయామం తప్పనిసరి
కర్నూలు : పోలీసు సిబ్బందికి క్రీడలు, వ్యాయామం చాలా అవసరమని, వీటి ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ అన్నారు. కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల (రేంజ్ పరిధిలో) పోలీసులకు కర్నూలు నగరంలోని ఔట్‌డోర్ స్టేడియంలో మంగళవారం క్రీడల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. కర్నూలు డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో క్రీడాపోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న పోలీసు సిబ్బందికి అవకాశం కల్పించారు. ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, షటిల్, రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌పుట్, క్రికెట్, బాస్కెట్ బాల్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ భాస్కర్‌రావు, ఆర్ఐలు, రేంజ్ పరిధిలోని వివిధ జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బంది పోటీల్లో పాల్గొన్నారు. రేంజ్ పోలీసుల క్రీడా పోటీల్లో ఏఆర్ అడిషనల్ ఎస్పీ -
హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్టు
కడప అర్బన్ : కడప నగరంలోని బిల్టప్ సర్కిల్ వద్ద ఈనెల 15వ తేదీ రాత్రి జరిగిన హత్య కేసులో నలుగురు నిందితులను కడప తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రవీంద్రనగర్‌కు చెందిన షేక్ సాదిక్‌వలీ (32) పాతబస్టాండ్‌లో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడన్నారు. ఈనెల 15 వ తేదీ రాత్రి 8.20 గంటల సమయంలో హతుడు షేక్ సాదిక్ వలీ, ఇంకొక వ్యక్తితో కలిసి బిల్టప్ సర్కిల్లోని వైన్ షాప్ వద్ద ఉండటాన్ని నిందితులు గమనించారన్నారు. నలుగురు నిందితులు పథకం ప్రకారం షేక్ సాదిక్ వలీతో మాట్లాడినట్లుగా నటించారన్నారు. 2024 జూలై 19వ తేదీ రాత్రి బిల్టప్ సమీపంలో జరిగిన చింపిరి వెంకటేశు అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న షేక్ సాదిక్ వలీపై ప్రతీకారంతో ఉన్న నిందితులు కత్తులతో దారుణంగా హత్య చేశారన్నారు. సాదిక్ వలీ హత్య కేసులో ప్రధాన నిందితుడైన చప్పిడి రాయప్ప అలియాస్ పెద్దోడుకు చింపిరి వెంకటేశు ప్రధాన అనుచరుడని తెలిపారు. సాదిక్ వలీ హత్య కేసులో నిందితులైన కడప నగరం రవీంద్రనగర్, మరాఠీవీధికి చెందిన రౌడీషీటర్ చప్పిడి రాయప్ప అలియాస్ పెద్దోడు, కడప నగరం మోచంపేటకు చెందిన రౌడీషీటర్ షేక్ గౌస్‌బాషా అలియాస్ కాలియా, కడప నగరం మరియాపురానికి చెందిన రౌడీషీటర్ శీలం బాలస్వామి అనే ముగ్గురు రౌడీషీటర్లతో పాటు రవీంద్రనగర్, మరాఠీ వీధికి చెందిన సుంకర వెంకటేశును అరెస్టు చేశామని తెలిపారు. కడప తాలూకా స్టేషన్లో షేక్ సాదిక్ వలీ భార్య షేక్ యాస్మిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడప తాలూకా సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో అన్ని కోణాలలో కేసు దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను మంగళవారం రామరాజుపల్లె దగ్గర అరెస్టు చేసి, హత్య చేసేందుకు వారు ఉపయోగించిన రెండు కత్తులు, మూడు సెల్ ఫోన్లు, నేరం జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నామన్నారు. అతి తక్కువ సమయంలో హత్య కేసులో నలుగురు నిందితులను అత్యంత చాకచక్యంగా పట్టుకోవడంలో కృషి చేసిన కడప తాలూకా సీఐ జి. వెంకటేశ్వర్లు, ఎస్ఐలు తులసి నాగ ప్రసాద్ , తాయర్ హుస్సేన్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుళ్లు విద్యా సాగర్, నాగరాజు, కానిస్టేబుళ్లు సుబ్బయ్య, పుల్లయ్య, రఘు రాముడులను జిల్లా ఎస్పీ, కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు. నిందితుల్లో ముగ్గురు రౌడీషీటర్లు హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, సెల్ఫోన్లు స్వాధీనం విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఈ.జీ. అశోక్‌కుమార్ వెల్లడి -
సిబ్బంది కొరత.. వాహనదారులకు వెత
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలోని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో వాహనదారులకు సేవలు కాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ఎల్ఆర్ నుంచి వాహనాల బదిలీల వరకు అన్నీ జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో జరగాల్సి ఉంది. అయితే ఓవైపు ఉన్న సిబ్బంది తీరు, మరో వైపు సిబ్బంది కొరత వల్ల సేవలు కుంటుపడుతున్నాయి. రెండు నెలలుగా ఇన్చార్జి పాలన.. ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో గత రెండు నెలల నుంచి రెగ్యులర్ రవాణాశాఖ అధికారి లేరు. దీంతో ఇన్చార్జి డీటీసీగా అన్నమయ్య జిల్లా డీటీసీ ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన అన్నమయ్య జిల్లాతో పాటు వైఎస్ఆర్ జిల్లాలో తమ సేవలను అందించాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. వేధిస్తున్న సిబ్బంది కొరత .. రవాణాశాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత వేధి స్తోంది. మొత్తం కార్యాలయంలో సిబ్బంది పది మంది ఉండాల్సి ఉండగా నలుగురు మాత్రమే ఉన్నారు. ఫలితంగా వాహనదారులకు సేవలు సకాలంలో అందడం లేదు. కడప రవాణా శాఖ కార్యాలయంలో ఇద్దరు ఎంవీఐలు ఉండాల్సి ఉండగా ఒక ఎంవీఐ సెలవులో వెళ్లడంతో ఉన్న ఒక ఎంవీఐనే దిక్కయ్యారు. వాహనాల ఎఫ్‌సీలో దళారుల ఇష్టారాజ్యం.. వాహనాలకు ఎఫ్‌సీ చేయాలంటే దళారులను సంప్రదిస్తే సేవలు సులువుగా అందుతున్నాయి. ఎవరైనా ఎఫ్‌సీ నేరుగా చేయించుకుంటే వారికి ఎఫ్‌సీ అయి పోయినా పత్రాలు అందడం లేదు. కింది స్థాయి సిబ్బంది పెత్తనం చెలాయిస్తూ దండుకుంటున్నారు. వీటన్నింటికి కారణం రెగ్యులర్ అధికారి లేకపోవడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుం కంటే మూడింతలు దళారులకు ఇస్తే వారు సకాలంలో పనులు చేయిస్తున్నారు. లేకుంటే రవాణా శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. రవాణా శాఖలో సకాలంలో వాహనదారులకు అందని సేవలు ఎఫ్‌సీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ వరకు తప్పని ఇబ్బందులు రెండు నెలల నుంచి రెగ్యులర్ అధికారి లేని వైనం రవాణా శాఖలో వాహనదారులకు మెరుగైన సేవలు రవాణాశాఖ తరఫున వాహనదారులకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాం. కార్యాలయంలో సిబ్బంది కొరత ఉండటంతోనే సేవలు సకాలంలో అందడం లేదు. వాహనదారులకు వారి వాహనాలకు సంబంధించిన పత్రాలను సకాలంలో అందిస్తాం. – ప్రసాద్, ఇన్చార్జి డీటీసీ. -
బెల్ట్‌షాపులపై దాడులు
కమలాపురం : కమలాపురం పట్టణంలోని బెల్ట్ షాపులపై ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. మంగళవారం ఎకై ్సజ్ సీఐ గోపీక్రిష్ణ తన సిబ్బందితో ఈ దాడులు నిర్వహించారు. కమలాపురం పట్టణంతో పాటు మండలంలో పుట్టగొడుగుల్లా బెల్ట్‌షాపులు వెలిశాయి. పట్టణంలో 7 బెల్ట్‌షాపులు నడుస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో దాడులు చేశామని సీఐ తెలిపారు. కాగా దాడుల సమయంలో కేవలం ఒక షాపులో మాత్రమే 6 క్వార్టర్ మద్యం బాటిళ్లు లభించాయని, నిర్వాహకుడు గోపాల్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. కాగా పట్టణంలో అర కిలోమీటరుకు ఒక బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, బెల్ట్‌షాపులను పూర్తిగా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. బ్రహ్మంగారిమఠంలో బ్రహ్మంగారిమఠం : పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో బెల్ట్ షాపులపై బి.మఠం పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ‘సాక్షి’లో ప్రచురితమైన బెల్ట్‌పై కొరవడిన నిఘా అనే వార్తతో పోలీసుల్లో చలనం వచ్చింది. బి.మఠం టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. రెండు వర్గాలకు చెందిన వారు పోటాపోటీగా బెల్ట్‌షాపులను ఏర్పాటు చేయించారు. 20 మద్యం బాటిళ్లు పట్టివేత చాపాడు : మండల పరిధిలోని సోమాపురం గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న 20 మద్యం బాటిళ్లను సోమవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ట్రైనీ డీఎస్పీ భవానీ సిబ్బందితో కలసి గ్రామంలోని బెల్టు షాపులపై దాడులు నిర్వహించగా గ్రామానికి చెందిన రాధా అనే మహిళ ఇంటి వద్ద నిర్వహిస్తున్న దుకాణంలో సోదాలు చేయగా రూ.2వేలు విలువ చేసే 20 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య ప్రొద్దుటూరు క్రైం : తన ప్రేమ విఫలమైందనే బాధతో వెంకటనరసింహులు (24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రొద్దుటూరులో జరిగింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని ఈశ్వరరెడ్డినగర్కు చెందిన సానా లక్ష్మీదేవికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. పెద్ద కుమారుడు సురేష్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా మరో కుమారుడు వెంకటనరసింహులు కాంట్రాక్ట్ పనులు చేసుకునేవాడు. వీరు తొగట కులస్తులైనప్పటికీ క్రైస్తవ మతంలోకి మారారు. వెంకటనరసింహులు కొన్ని నెలల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాడు. అయితే వారి మధ్య ఏం జరిగిందో ఏమోగానీ ప్రేమ విఫలమైంది. ఈ విషయమై అతను కొన్ని రోజుల నుంచి తనలో తాను బాధ పడుతూ ఉండేవాడు. ఆ అమ్మాయి ఎవరో చెబితే తాము వెళ్లి మాట్లాడుతామని కుటుంబ సభ్యులు పలుమార్లు అడిగినా అతను చెప్పలేదు. ‘నాకు బతకాలని లేదు.. జీవితంపై విరక్తి కలుగుతోంది.. బతకడం కంటే చనిపోవడం మేలు’ అని చెబుతూ ఉండేవాడు. అయినా కుటుంబ సభ్యులు వెంకటనరసింహులుకు ధైర్యం చెబుతూ సముదాయించేవారు. ఈ క్రమంలో ఈస్టర్ పండుగ సందర్భంగా కడపలో ఉన్న చెల్లెలు శిరీష, హైదరాబాద్‌లో ఉంటున్న అన్న సురేష్ ఇంటికి వచ్చారు. పండుగ అనంతరం సోమవారం చెల్లెలిని వదిలి పెట్టేందుకు సురేష్‌తో పాటు తల్లి లక్ష్మీదేవి కడపకు వెళ్లారు. వారు రాత్రి ఇంటికి వచ్చి చూడగా వెంకటనరసింహులు ఇంటి రేకులకు ఉన్న ఇనుప పైపునకు చీరను చుట్టి ఉరేసుకున్నాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. ఈ మేరకు మృతుడి అన్న సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్ఐ సంజీవరెడ్ది తెలిపారు. -
మాయ మాటలతో బంగారం చోరీ
జమ్మలమడుగు : పట్టణంలో ఎస్సీ కాలనీలో కరపాకుల సుజాత అనే మహిళకు మాయ మాటలు చెప్పి బంగారాన్ని చోరీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పది తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం అర్బన్ పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా సిరివెళ్ల గ్రామానికి చెందిన మురిర్నే కనకమ్మ, ఆమె భర్త శ్రీనివాసులు గత నెల 24వ తేదీన జమ్మలమడుగు ఎస్సీ కాలనీలో ఉన్న సుజాత ఇంటికి వెళ్లి అనారోగ్యం తొలగాలంటే ఇంట్లో పూజలు చేయాలని నమ్మించారు. సుజాత చేత ఆమె ఇంట్లో ఉన్న బంగారం లాంగ్‌చైన్, రెండు బంగారం కడియాలు, హారం మొత్తం 10 తులాల బంగారాన్ని పెట్టేలో బియ్యం పోసి అందులో పెట్టించారు. పూజలు చేసే సమయంలో పెట్టెలు మార్చేశారు. సాయంత్రం వరకు పెట్టెను తెరవద్దు అని చెప్పి వారు వెళ్లిపోయారు. సాయంత్రం సుజాత ఆమె భర్త చంద్రశేఖర్‌లు బియ్యం పెట్టెను తెరిచి చూశారు. అందులో బంగారం లేకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ లింగప్ప ఆధ్వర్యంలో ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది దేవదాసు, రియాజ్ ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టి నిందితులను గుర్తించారు. వీరపునాయునిపల్లి, వేంపల్లి ప్రాంతాలలో కూడా ఇదే తరహాలో చోరీలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ప్రస్తుతం వీరిని అరెస్టు చేసి వారి వద్దనుంచి పదితులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు.నిందితులను అరెస్టు చేసిన పోలీసులు -
రిమ్స్‌ను వీడని నిర్లక్ష్యపు జబ్బు!
కడప టాస్క్‌ఫోర్స్ : జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కడప రిమ్స్ ఆసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోగులకు సేవ చేసేందుకే తాము విధుల్లో ఉన్నామనే కనీస బాధ్యతను విస్మరించి కొందరు వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పేద రోగులంటే వారి దృష్టిలో మనుషులు కాదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. గతంలో రిమ్స్ దుస్థితిపై పత్రికల్లో కథనాలు వెలువడినా అధికారుల్లో కనీస చలనం లేదు. తాజాగా సోమవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఎముకల విభాగం, గైనకాలజీ విభాగాల్లో వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఉదయం 9:40 గంటల సమయమైనా ఓపీలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడం గమనార్హం. రకరకాల సమస్యలతో బాధపడుతూ వైద్యం కోసం వ్యయప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు వైద్యుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్ని విభాగాలలో పీజీలు, హౌస్ సర్జన్లకే వైద్య పరీక్షల సేవలను అప్పగించి వైద్యులు మాత్రం కళాశాల వద్దకో, లేక వార్డులకో వెళ్లినట్లుగా చెప్పుకొస్తున్నారు. వీరిలో చాలామంది బయోమెట్రిక్, ఎఫ్ఆర్ఎస్లను వేసి, కడప నగరంలోని తమ సొంత క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి. ● ఏబీహెచ్ఏ (అభా) అప్లికేషన్‌ను రోగులు, వారి బంధువుల ‘ఆండ్రాయిడ్’ ఫోన్లలో డౌన్లోడ్ చేయించే విషయంలో అక్కడి సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కానీ, లేక సులువుగా అప్లికేషన్ పొందుపరిచే విషయంలోగానీ సంబంధిత మెడికల్ ఆఫీసర్లుగానీ, ఇతర వైద్య సిబ్బందిగానీ పట్టించుకోవడం లేదు. దీంతో ఓపీ చీటీల కౌంటర్ వద్ద కొన్ని అడుగుల దూరం రోగులు, వారి సహాయకులు వేయాలంటేనే అరగంట నుంచి గంట సమయం పడుతోంది. ఓపీ, ఐపీ విభాగాలలో విధులను నిర్వహిస్తున్న డీఈఓలు 6 మంది, స్టాఫ్ నర్స్ పోస్టులలో ఎంపికై డీఈఓలుగా విధులు నిర్వహిస్తున్న వారు 13 మందిలో కొందరు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ సమయపాలన పాటించాల్సి ఉంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 లేక 12:30 గంటలకే తమ విధులను ‘మమ’ అనిపించుకుంటున్నారు. ఓపీ వేళలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరలా 2 గంటల నుంచి 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంది. మధ్యాహ్నం ఓపీ వేళలలో కొందరు డాక్టర్లు, డీఈఓలలో కొందరు ఎఫ్ఆర్ఎస్, బయోమెట్రిక్ సమయాలలో అంటే సాయంత్రం 4 గంటలకు వచ్చి ఆ ప్రక్రియ ముగించుకుని తమదారిన తాము వెళ్లిపోతున్నారు. వీరిపై పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం ‘పక్కా’ ఆధారాలుంటే చూపించండి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ● వార్డులలో విధులను నిర్వహిస్తున్న డాక్టర్లలో కొందరు, స్టాఫ్, హెడ్ నర్సులలో కొందరు నిక్కచ్చిగా తమకు కేటాయించిన విధులను నిర్వహిస్తుంటే, మరికొందరు మాత్రం ‘నామమాత్రంగా’ విధులను నిర్వహిస్తున్నారు. హెడ్ నర్సులు సమయపాలన పాటించకపోవడం, తమకు కేటాయించిన వార్డులన్నీ పరిశీలించకుండానే ఒకే చోట కూర్చుని రికార్డులను తెప్పించుకుని ‘కాలక్షేపం’ చేస్తున్నారు. ● జీజీహెచ్ రిమ్స్‌కు వచ్చే రోగుల, వారి సహాయకులు దాహార్తిని తీర్చే విషయంలో ఇంకా అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కడప నగర పాలక సంస్థ నుంచి ఒప్పందం ప్రకారం రిమ్స్‌కు సరఫరా చేయాల్సిన 2లక్షల గ్యాలన్ల నీటిని ప్రతి రోజు సక్రమంగా సరఫరా చేయడం లేదు. నాలుగు రోజులకు ఒకసారి కూడా ఈ నీటిని సరఫరా చేయకపోవడం గమనార్హం. ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కి కొందరు వాటర్మాన్లు ఈ నీటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, నీటి వ్యాపారులకు అప్పనంగా అమ్మేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● కడప సెంట్రల్ ల్యాబ్ విభాగాలలో సామగ్రిని తీసుకుని రావడంలో పారామెడికల్ కోర్సులలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులే ఫార్మసీ విభాగం నుంచి తీసుకుని వస్తున్నారు. ల్యాబ్ విభాగాలలో విధులను నిర్వహిస్తున్న అటెండర్లు వారికి కేటాయించిన విధులలో కాకుండా ఇతర విభాగాలలో పనిచేస్తున్నారు. రిమ్స్‌ను పట్టి పీడిస్తున్న నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి రోగులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓపీలోని కొన్ని విభాగాల్లో సమయం పాటించని డాక్టర్లు ‘ఏబీహెచ్ఏ’(ఆభా) అప్లికేషన్ అప్లోడ్ కోసం తప్పని నిరీక్షణ వార్డుల్లో కొందరు డాక్టర్లు, హెడ్ నర్సుల కాలక్షేపం ఇంతవరకు పరిష్కారం కాని నీటి సమస్య -
వక్ఫ్ చట్టం రాకముందే కార్పొరేట్లకు లీజులు
కడప సెవెన్‌రోడ్స్ : వక్ఫ్ బిల్లు చట్టంగా రాకముందే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఆస్తులను 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టే యత్నాలు చేస్తోందని ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సుభాన్ విమర్శించారు. సీపీఎం జిల్లా కమిటీ కార్యదర్శి జి.చంద్రశేఖర్ అధ్యక్షతన సోమవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ధార్మిక బోర్డులలో పరమతస్తులను నియమించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. జస్టిస్ సచార్ కమిటీ ముస్లిం ధార్మిక సంస్థల ఆస్తుల రక్షణకు చేసిన ప్రతిపాదనల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. దస్తావేజులు లేవని బై యూజర్ పేరిట వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం తగదన్నారు. బిల్లు చట్టంగా మారకమునుపే 52 బడా కార్పొరేట్ సంస్థలకు ప్రధాన నగరాల్లోని విలువైన ఆస్తులను అప్పగించాలని కేంద్రం చూస్తోందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కన్వీనర్ డబ్ల్యు రాము, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా అధ్యక్షుడు ఓబయ్య, ఏపీ దళిత మిత్ర సంఘం అధ్యక్షుడు కై పు రామాంజనేయులు, ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు పఠాన్ చాంద్‌బాషా, లోక్‌సత్తా నాయకుడు దేవర శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఘర్షణ ఘటనలో 17 మందిపై కేసు
వేంపల్లె : మండలంలోని నందిపల్లెలో జరిగిన ఘర్షణ కేసులో ఇరువర్గాలకు చెందిన 17 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. ఆదివారం రాత్రి నందిపల్లె గ్రామంలో జరిగిన భార్యాభర్తల పంచాయితీలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. దీంతో ఇరువర్గాల్లో ఉన్నవారికి గాయాలు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఐ నరసింహులు ఇరు వర్గాలకు చెందిన 17 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భర్త తరపున నందిపల్లెకు చెందిన మునవర్, అన్వర్ , మారం శ్రీకాంత్ రెడ్డితోపాటు 6మందిపై కేసు నమోదు కాగా, నేలతిమ్మయ్యగారిపల్లెకు చెందిన పెద్ద బాదుల్లా, చిన్న బాదుల్లా, అబ్దుల్లతోపాటు మరో ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వడదెబ్బకు వృద్ధురాలి మృతి కొండాపురం : మండల పరిధిలోని ఎస్. తిమ్మాపురం గ్రామానికి చెందిన గోసువారిపల్లె రామసుబ్బమ్మ(77) సోమవారం వడ దెబ్బతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రోజు మాదిరిగానే సోమవారం గ్రామంలో వ్యవసాయ కూలి పనికి వెళ్లింది. ఎండ తీవ్రంగా ఉండటంతో కూలి పనులు చేస్తుండగానే సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే తోటి కూలీలు కొండాపురం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. -
పేదలకు భూ పంపిణీ చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : గ్రామీణ పేదల వలసలు నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారికి భూ పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేష్, దాసరి వెంకటేశ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామీణ పేదలకు భూ పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని విమర్శించారు. కూటమి పార్టీలకు చెందిన వ్యక్తులు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని దొంగ పట్టాలు, పాసు పుస్తకాలు పొంది అనుభవిస్తున్నారని ఆరోపించారు. పేదలు ఎక్కడైనా ఒక ఎకరా ప్రభుత్వ భూమిని దున్నుకుంటే వెంటనే రెవెన్యూ, పోలీసులు వచ్చి కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వెంకటేశు, వీరయ్య, నరసయ్య, సురేష్‌బాబు, సరస్వతి, పుష్పమ్మ, చంద్రమ్మ, జహీరాబీ తదితరులు పాల్గొన్నారు. -
భూములు కొనలేం.. లీజుకు మాత్రమే తీసుకుంటాం
జమ్మలమడుగు : సోలార్ పరిశ్రమ కోసం తాము భూములను రైతుల వద్దనుంచి కొనలేము. ఏడాదికి 32 వేల రూపాయలు కౌలుతో పాటు అడ్వాన్సుగా రెండు లక్షల రూపాయలు రైతులకు ఇస్తాము. దీనికి సానుకూలంగా ఉన్న రైతుల నుంచి భూములను తీసుకుంటాము.. అని సోలార్ కంపెనీ ప్రతినిధులు రైతులకు స్పష్టం చేశారు. సోమవారం పెద్దముడియం మండలం తహసీల్దార్ కార్యాలయంలో కల్వటాల గ్రామానికి చెందిన డీకేటీ పట్టాలు కలిగిన రైతులతో తహసీల్దార్ నరసింహులు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు సరైన గిట్టుబాటు ధరతో భూములు కొనుగోలు చేస్తే తాము తమ భూములను సోలార్ కంపెనీకి ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అయితే యాజమాన్యం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో తాము భూములను కొనుగోలు చేయలేమని లీజుకు మాత్రమే తీసుకుంటామన్నారు. దీంతో రైతులు కూడా ఆలోచించి చెబుతామని వెళ్లిపోయారు. మాకు న్యాయం చేయాలి.. తమకు పట్టాలు లేవు. అయితే భూములను అనుభవంలోకి తెచ్చి సాగు చేసుకుంటున్నామని తమకు న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కల్వటాల గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్ నరసింహులుకు వినతి పత్రం ఇచ్చారు. కొండ భూములను తాము చదును చేసుకోవడంతో పాటు భూమిగా మార్చుకోవడం కోసం భూమిపై ఎంతో ఖర్చు పెట్టామన్నారు. ప్రస్తుతం సోలార్ కంపెనీకి తమ భూములు కేటాయిస్తే తాము అన్యాయమైపోతామని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో సోలార్ కంపెనీ ప్రతినిధి నరేన్ చౌదరి, వైఎస్సార్సీపీ నాయకులు శేఖర్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, మహేష్ పాల్గొన్నారు.సేల్ యాజమాన్యం స్పష్టీకరణ -
ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక రామేశ్వరంలోని శ్రీ ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన బండలాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ప్రథమ బహుమతి రమేష్ బాబు(తాడిపత్రి), ద్వార్శల గురివిరెడ్డి (ప్రొద్దుటూరు) ఎద్దులు 1949.06 అడుగులు లాగి రూ.1.00,116, ద్వితీయ బహుమతి మార్తల చంద్ర ఓబుళరెడ్డి (చౌటపల్లె) ఎద్దులు 1806.04 అడుగులు లాగి రూ.75,116, తృతీయ బహుమతి రామసుబ్బారెడ్డి (హుస్సేనాపురం), చిన్న నాగన్న (పీఆర్‌పల్లె, నంద్యాల జిల్లా) 1640.07 అడుగులు లాగి రూ.50,116 నగదు అందుకున్నారు. గెలుపొందిన ఎడ్ల యజమానులకు నగదు బహుమతులు అందించి సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజారెడ్డి, ఈఓ శ్రీధర్, దాతలు, భక్తులు పాల్గొన్నారు. -
పాత కడప ఎస్సీల భూ సమస్యలు పరిష్కరించాలి
కడప సెవెన్‌రోడ్స్ : పాత కడప ఎస్సీల భూ సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాత కడప ఎస్సీలకు 1993లో చిన్నచౌకు పొలం సర్వే నెంబర్లు 1045, 1046లలోని కొండ పోరంబోకు భూమిని అప్పటి అధికారులు పట్టాలు, పాసు బుక్కులు ఇచ్చారని తెలిపారు. అప్పటి నుంచి ఎస్సీలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. అక్కడి కొంతమంది పెత్తందారులు ఆ భూములపై కన్నెసి అధికారుల వత్తాసుతో తప్పుడు పత్రాలు చూపిస్తూ ఎస్సీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. భూముల్లోకి వెళ్లనీయకుండా పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లినా అధికారులు సాచివేత ధోరణి అవలంబిస్తున్నారన్నారు. దళితులను వారి భూముల్లోకి వారు వెళ్లే విధంగా రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీ నాయకులు మగ్బూల్‌బాషా, లక్ష్మిదేవి, సుబ్బరాయుడు, తస్లీమ్, దళిత గిరిజన హక్కుల పోరాట సమితి నాయకులు వెంకటేశు, నిత్య పూజయ్య, శేఖర్, ఓబులేశు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
దేవ..దేవా.. ఆదాయం స్వాహా !
ప్రొద్దుటూరు : దేవుడు చూడలేడు.. వినడలేడు.. ఏమీ చేయలేడు అని అనుకున్నారేమో కానీ.. దేవదాయశాఖ అధికారులు బరితెగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ దేవదాయ సంస్థకు లక్షలాది రూపాయల నష్టం కలిగిస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని గీతాశ్రమం దేవదాయశాఖ పరిధిలో ఉంది. సంస్థకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆస్తులను పరిరక్షించేందుకు ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించారు అధికార పార్టీ అండతో అధికారులు అక్రమాలకు తెర తీశారు. ● లోకకల్యాణార్థం శ్రీకృష్ణ గీతాశ్రమాన్ని నామా ఎరుకులయ్య ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమాన్ని గతంలో గంగాధరానంద స్వామి నిర్వహిస్తుండగా అవినీతి ఆరోపణలు రావడంతో 2017లో దేవదాయశాఖ స్వాఽధీనం చేసుకుంది. కరోనా సమయంలో గంగాధరానంద స్వామి మరణానంతరం దేవదాయశాఖ ఈ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమించింది. గీతాశ్రమంలోని భవనాల్లో అనేక విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి. ఇందులో ఎంఎస్ శారద జూనియర్ కళాశాల ఒకటి. ఇందుకుగాను ప్రతినెల నామమాత్రపు అద్దెను చెల్లిస్తోంది. ఎంఎస్ శారద జూనియర్ కళాశాల యాజమాన్యం సక్రమంగా అద్దె చెల్లించకపోవడంతో ఈ కళాశాలకు భవనాలు లీజుకు ఇవ్వొద్దని గతంలో పనిచేసిన ఈఓ శంకర్‌బాలాజీ లిఖిత పూర్వకంగా దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. 2021 జూలై 31వ తేదీ నాటికి ఎంఎస్ శారద జూనియర్ కళాశాల లీజు అగ్రిమెంట్ పూర్తయింది. తర్వాత అధికారులు బహిరంగ వేలం నిర్వహించాలని ప్రకటించగా తమకు 11 ఏళ్లకు భవనాలు లీజుకు కావాలని కాలేజీ యాజమాన్యం దేవదాయశాఖ అధికారులకు లేఖ రాశారు. అప్పటి వరకు రూ.16,500 బాడుగను రూ.21,945కు పెంచుతూ అధికారులు తీర్మానించారు. ● శ్రీకృష్ణ గీతాశ్రమంలోని 10,998.9 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండు అంతస్తుల్లోని భవనాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సుమారు రూ.88వేలు నెలకు అద్దె చెల్లించాల్సి ఉంది. కేవలం రూ.29వేలతో ఈ భవనాలను అధికారులు అద్దెకు ఇచ్చారు. ఇందులోని మొదటి అంతస్తులో ఉన్న 9వేల చదరపు అడుగుల భవనాలను తమకు అద్దెకు ఇస్తే రూ.60వేలు చెల్లిస్తామని గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన ఒకరు, రూ.80వేలు ఇస్తామని 2021 జూలై 2న మరొకరు దేవాదాయశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. వేలం నిర్వహించే సమయంలో తమకు తెలపాలని వారు కోరారు. ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 8న బహిరంగ వేలం ద్వారా ప్రస్తుతం నిర్వహిస్తున్న సంస్థలకే భవనాలను అద్దెకు కేటాయించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి బహిరంగ వేలం నిర్వహించలేదు. ఎవరు పోటీలో పాల్గొనలేదు. లోపాయికారి ఒప్పందం ప్రకారం ఈ భవనాలను ప్రస్తుత ఈఓ రామచంద్రాచార్యులు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2016 మార్చి 7న జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 37 ప్రకారం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న ప్రొద్దుటూరులో చదరపు అడుగుకు రూ.8 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంది. దేవాదాయశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏడాదికి రూ.7లక్షల వరకు నష్టం వాటిల్లినట్లయింది. ● ఎంఎస్ శారద జూనియర్ కళాశాల యాజమాన్యానికే గీతాశ్రమంలోని భవనాలను అద్దెకు ఇవ్వాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గత ఏడాది ఆగస్టు 6న దేవాదాయశాఖ కమిషనర్‌కు సిఫారసు చేశారు. ఆ లేఖ ఆధారంగా కళాశాల యాజమాన్యం లబ్ధి పొందింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న ఈఓ రామచంద్రాచార్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ కమిషనర్‌కు ఇటీవల ఫిర్యాదు చేయడం గమనార్హం. అద్దె భవనాల కేటాయింపులో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ● గతంలో గీతాశ్రమంలో కాంట్రాక్టు పద్ధతిలో అటెండర్‌గా పనిచేస్తున్న బి.జనార్ధన్ రెడ్డి నడవడిక సరిగా లేకపోవడంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత ఈఓ రామచంద్రాచార్యులు విధుల్లో చేరిన తర్వాత జనార్ధన్ రెడ్డిని తిరిగి తీసుకుని పెద్దపీట వేశారు. పైగా అతన్ని తొలగించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.5లక్షలు వేతన బకాయిలను ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంపై ఈఓ రామచంద్రాచార్యులును వివరణ కోరగా తాను విధుల్లో చేరిన తర్వాత బహిరంగ వేలమే నిర్వహించలేదని, ఎవరిని విధుల్లోకి తీసుకోలేదని తెలిపారు. తక్కువ అద్దెకు భవనాల లీజు ఏడాదికి రూ.7లక్షలు నష్టం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సిఫారసు మామూళ్ల మత్తులో దేవదాయశాఖ అధికారులు -
సమస్యల పరిష్కారానికి స్పందించాలి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన స్పందించి నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను నాణ్యతతో పరిష్కార నివేదికలు పంపాలన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు శ్రీనివాసులు, వెంకటపతి, జెడ్పి సీఈవో ఓబులమ్మ, డీఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
అభ్యంతరాలను 24 లోపు సమర్పించాలి
– పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ పరిధిలోని అనంపురం, చిత్తూరు, కడప, కర్నూల్ పూర్వపు జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్(గవర్నమెంట్) నుంచి (గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు సవరించడానికి తాత్కాలిక జాబితాను htppr://rjdrekadapa.bofrpot.comలో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈ నెల 24వ తేదీలోల సమర్పించాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలి – ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’లో ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలని జిల్లా ఎస్.పి ఈ.జి అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్‌న్స్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యను విన్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులకు సిబ్బంది తమ వంతుగా సహాయం చేసి ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి కృషి చేశారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, డి.టి.సి డి.ఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 178 ఫిర్యాదులు వచ్చాయి. పరీక్ష ఫీజు చెల్లింపునకు నేడు ఆఖరు కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా మే 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు సంంధించిన పరీక్ష రుసుము చెల్లించుటకు మంగళవారంతో గడువు ముగుస్తుందని ఆర్ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన, ఇంప్రూమెంట్ రాయు విద్యార్థులు వెంటనే పరీక్ష రుసుము సంబంధించిన కళాశాలలో చెల్లించాలని తెలిపారు. ఏదైనా ప్రైవేట్ జూనియర్ కళాశాల యజమాన్యం విద్యార్థుల ఫీజు బకాయి సాకు చూపుతూ కట్టించుకోకుంటే ఆయా కళాశాలలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదోన్నతి కౌన్సెలింగ్ ప్రశాంతం కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సోమవారం స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్సులుగా చేపట్టిన పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 15 మందికి గాను 9 మంది పదోన్నతులు పొందారు. నిబంధనల ప్రకారం ప్రమోషన్ల కౌన్సెలింగ్ ను చేపట్టినట్టు ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సూపరింటెండెంట్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ డీఐఈఓగా సత్యనారాయణరెడ్డి కడప ఎడ్యుకేషన్ : డిస్ట్రిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డీఐఈఓ)గా సత్యనారాయణరెడ్డిని నియమిస్తూ విద్యాశాఖ సెక్రటరీ కొన శశిదర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పయాకపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఈయన్ను వైఎస్సార్‌జిల్లా డీఐఈఓగా నియమించారు. గతంలో డీవీఈఓగా పనిచేస్తున్న శ్రీనివాసులరెడ్డి ఉద్యోగ విరమణ చేయడంతో కడప ఆర్‌ఐవోగా పనిచేస్తున్న బండి వెంకటసుబ్బయ్య డీవీఈఓగా ఉన్నారు. ఇంటర్ ఆర్జేడీగా శ్రీనివాసులు... ఇంటర్మీడియట్ ఎప్ఏపీ ఆర్జేడీగా శ్రీనివాసులును ప్రభుత్వం నియమించింది. ఈయన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డీకే గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. చిత్తూరు డీఐఈఓగా నియమించిన శ్రీనివాసులను ఎఫ్ఏసీ ఆర్జేడీగా కడపకు నియమించారు. ప్రస్తుతం కడప ఆర్జేడీగా పనిచేస్తున్న రవిని రాయచోటి డీఐఈఓగా నియమించారు. -
సజావుగా ఇసుక పంపిణీ ప్రక్రియ
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇసుక పంపిణీ ప్రక్రియ సజావుగా జరగాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో ఇసుక బుకింగ్, సరఫరా, ఇసుక లభ్యత వంటి అంశాలపై ఎస్పీ అశోక్ కుమార్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ లతో కలసి జిల్లా స్థాయి సాండ్ కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు. ఉచిత ఇసుక విధానంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఇసుక రీచుల వద్ద ఎంత క్వాంటిటీ బుక్ చేసుకుంటున్నారు. ఎంత నిల్వ ఉంటుంది రోజువారి డేటాను రికార్డును తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. పర్యవేక్షణ, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి వీఆర్వోలు, వీఆర్ఏ లను లేదా అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ అధికారులను పర్యవేక్షక ఇన్‌ఛార్జ్‌లుగా నియమించి ఇసుక రవాణాలో క్రమాలు జరగకుండా చూడాలన్నారు. జిల్లాలో 6 సెమి మెకనైజ్డ్ ఇసుక రీచుల నిర్వహణకు నోటిఫికేషన్ ఇవ్వాలని, అలాగే.. అదనంగా అందుబాటులో ఉన్న డిసిల్టేషన్ పా యింట్లను గుర్తించాలన్నారు. అలాగే ప్రతి స్టాక్ పాయింట్ వద్ద సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసే లా చూసుకోవాలన్నారు. అలాగే ఆర్డీవోలు తమ పరిధిలోని స్టాక్ రీచ్ లను తనిఖీ చేసి అక్కడి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నారు. జెడ్పి సీఈఓ ఓబులమ్మ, గనులు భూ గర్భ శాఖ డీడీ సూర్యచంద్రరావు, రీజినల్ ట్రాన్స్‌పోర్టు, పోలీస్ అధికారులు, గ్రౌండ్ వాటర్ , ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
ఆపుకోలేని ఆవేదనకు బ్రేక్ !
● లోకోపైలట్లను కరుణించిన రైల్వేశాఖ ● రైలింజన్లోనే యూరినల్స్, ఏసీ, ఎర్గోనామిక్ సీట్లు ● తొలుత గూడ్స్ రైళ్లలో ఏర్పాటుదిశగా చర్యలు డివిజన్ : గుంతకల్ లోకోపైలెట్స్ : 2500 రన్నింగ్‌స్టాప్ క్రూసెంటర్ : తిరుపతి, రేణిగుంట, నందలూరు, ఎర్రగుంట్ల, గుత్తి, గుంతకల్లు, రాజంపేట : ఆపుకోలేని ఆవేదనకు రైల్వేశాఖ బ్రేక్ వేసింది..ఇదేంటబ్బా అనుకోవచ్చు..విధి నిర్వహణలో రైలింజన్ నడిపే లోకోపైలెట్స్, అసిస్టెంట్ లోకోపైలట్స్ యూరినల్స్ తదితర సమస్యలు ఉత్పన్నమైతే ఇబ్బందులు పడాల్సి వచ్చేది. లోకోపైలట్స్ ఒక్కోసారి నీళ్లు తాగటానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచించే పరిస్థితి..మూత్ర విసర్జనకు వెళ్లాంటే రైలు ఆగే స్టేషన్ రాకకోసం ఎదురుచూడాల్సిందే. అందుకు ఒక్కోసారి ఐదారు గంటలు కూడా పట్టొచ్చు.. మహిళాలోకోపైలట్లు చాలా అవస్థలు పడేవారు.ఈ సమస్యను పరిష్కరించాలని ఇంతకాలానికి రైల్వేశాఖ ముందడుగు వేసింది. రైలింజన్ క్యాబిన్లో యూరినల్స్, ఏసీవసతి, ఆధునిక ఎర్గోనామిక్ సీట్ల ఏర్పాట్లను తప్పనిసరి చేసింది. దీంతో ఎల్పీ,ఎల్‌పీలకు పెద్ద ఉపశమనం లభించనుంది.రైల్వేశాఖ నిర్ణయంపై హర్హాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ● కొత్తగా తయారుచేసే అన్ని లోకో క్యాబిన్లలో యూరినల్స్, ఏసీ, ఎర్గోనామిక్సీట్లు ఏర్పాటు కోసం వాటి డిజైన్లను రైల్వేశాఖ మార్చింది. ఇప్పటికే వినియోగిస్తున్న లోకోమోటివ్‌లలో వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గుత్తి, విజయవాడ, లాలాగూడా, మౌలాలి, లోకోషెడ్లను ఈ పనులు ప్రారంభించారు. తొలుత గూడ్స్‌రైళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 42 లోకోమోటివ్‌లలో ఏర్పాటుచేశారు. ఇంజిన్‌ను పరిశీలించేందుకు వీలుగా అన్ని కారిడార్ చిన్న క్యాబిన్ ఏర్పాటుచేసి ,అందులో యూరినల్స్ కమోడ్ ఏర్పాటుచేస్తున్నారు. లోకోమోటివ్‌లో నీటి వసతి ఉండదు. కాబట్టి టాయిలెట్ కాకుండా యూరినల్స్ వసతి మాత్రమే ఏర్పాటుచేస్తున్నారు. క్లీనింగ్ ప్రశ్నార్థకరం.. సాధారణ కోచ్ నాలుగురోజులకొకసారి స్పెషల్ క్లీనింగ్‌కు షెడ్డుకు వెళుతుంది. అప్పుడు అందులోని మానవ వ్యర్థాలను తొలగిస్తారు. కానీ లోకోమోటివ్ 90రోజులకొకసారి మాత్రమే షెడ్డుకు వెళుతుంది. అప్పటి వరకు వ్యర్థాలను నిల్వ ఉంచలేరు. లోకోమోటివ్ కంపు కొడుతుందని ఎల్పీలు అంటున్నారు. దీంతో క్లీనింగ్ ప్రశ్నార్థకరంగా మారింది. ఎర్గోనాటిక్ సీట్లు... గతంలో 90 డిగ్రీల కోణంలో సీట్లు ఉండేవి. ఇవి ఏమాత్రం అనుకూలంగా ఉండేవి కాదు. వీటిల్లో ఎ క్కువ గంటలు కూర్చొని పనిచేస్తే నడుము, వెన్నముక నొప్పులొస్తున్నాయనే ఆరోపణలున్నాయి. రైల్వేశాఖకు ఫిర్యాదులు వెళుతున్నాయి. మహిళా సిబ్బంది మరింత ఇబ్బందికి గురవుతున్నారు. ఇప్పుడు వీటి స్థానంలో ఎర్గోనామిక్ సీట్లను ఏర్పాటుచేస్తున్నారు. -
సన్నద్ధతకు సమయమేదీ !
కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీ అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. నోటిఫికేషన్‌కు.. పరీక్షలకు మధ్య గడువు 45 రోజులు మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో పరీక్షలకు సన్నద్ధం కావడం సాధ్యం కాదనే ఆందోళన అభ్యర్థుల్లో మొదలైంది. ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోందని సంతోషించాలో సన్నద్ధమయ్యేందుకు కనీస గడువు ఇవ్వకుండా హడావుడిగా షెడ్యూల్ జారీ చేసినందుకు బాధపడా లో తెలియని అయోమయ పరిస్థితుల్లో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. డీఎస్సీ పరీక్ష సన్నద్ధమయ్యేందుకు 45 రోజులు సమయం సరిపోదని సబ్జెక్టు నిపుణులు సైతం అంటున్నారు. దరఖాస్తులో ఇవ్వని ఎడిట్ ఆప్షన్.... పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేందుకు చాలా రకాల పత్రాలను అడిగారని వాటిని సమకూర్చుకునేందుకే వారం పది రోజులు సమయం పడుతుందని అభ్యర్థులు వాపోతున్నారు. దీంతోపాటు దర ఖాస్తు చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా చేసు కోవాల్సిన పరిస్థితి నెలకొనడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు సమయంలో ఏదైనా పొరబాటు జరిగితే ఎడిట్ చేసుకునేందుకు ఆప్షన్ ఇవ్వలేదని డీఎస్సీ అభ్యర్థులు తెలిపారు. దీనికి తోడు డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులకు డిగ్రీలో కనీసం 45 శాతం మార్కులు ఉండాలనే నిబంధన పెట్టారని గతంలో 40 శాతం మార్కులే ఉండేవని దానిని ఈ కూటమి ప్రభుత్వం 45 శాతానికి పెంచారని వాపోతున్నారు. ఇన్ని రకాల నిబంధనలకు తోడు.. పరీక్ష ప్రిపరేషన్‌కు కేవలం 45 రోజులు గడువు ఇవ్వడం చాలా అన్యాయం అని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు నెలరోజులు.... డీఎస్పీ పరీక్ష నిర్వహణ జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు చేపట్టనున్నారు. అంటే నెల రోజుల పాటు నిర్వహించనున్నారు.కంప్యూటర్ బేస్డ్ టెస్టు(సీబీటీ విధానం) విధానంలో నిర్వహించనున్నారు. ిసీబీటీ విధానంలో నెల రోజులపాటు పరీక్షలను నిర్వహించడంతో ఒక రోజు పరీక్ష సులభంగా వస్తే మరో రోజు పరీక్ష కఠినంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో కొంతమంది అభ్యర్థులకు మంచి జరిగితే మరికొంత మందికి ఇబ్బంది జరిగే అవకాశం ఉండటంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఒక్కరోజులోనే డీఎస్సీ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేవారు. ఇలాంటిది ఈసారి నెల రోజులపాటు సీబీటీ విధానంలో నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెతుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక మెలిక పెట్టాలనే ఇలా నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఖాళీ పోస్టుల వివరాలు సబ్జెక్టు ప్రభుత్వ, జెడ్పీ మున్సిపల్ మొత్తం కార్పొరేషన్ఎస్ఏ సంస్కృతం – – 01 01 ఎస్ఏ తెలుగు 26 – – 26 ఎస్ఏ ఉర్దూ 06 – 01 07 ఎస్ఏ హిందీ 16 01 01 18 ఎస్ఏ ఇంగ్లీస్ 78 01 02 81 ఎస్ఏ మ్యాథ్స్(టీఎం) 42 – 01 43 ఎస్ఏ మ్యాథ్స్(యూఎం) – 01 – 01 ఎస్ఏ పీఎస్(టీఎం) 28 – – 28 ఎస్ఏ పీఎస్(యూఎం) 02 – 01 03 ఎస్ఏ బీఎస్(టీఎం) 49 02 – 51 ఎస్ఏ బీఎస్(యూఎం) 02 – – 02 ఎస్ఏ ఎస్ఎస్(టీఎం) 58 1 1 60 ఎస్ఏ ఎస్ఎస్(యూఎం) 05 – – 05 ఎస్ఏ పీఈ 77 01 04 82 ఎస్జీటీ (టీఎం) 219 21 12 252 ఎస్జీటీ(యూఎం) 31 07 07 45 మొత్తం 639 35 31 705 డీఎస్సీ సన్నద్ధ్దతకు కేవలం 45 రోజులే గడువు ప్రిపరేషన్‌కు 3 నెలల గడువు అవసరం అంటున్న సబ్జెక్టు నిపుణలు టీఎం: తెలుగు మీడియం... యూఎం: ఉర్దూ మీడియం -
డీఎస్సీకి ఉచిత కోచింగ్
కడప ఎడ్యుకేషన్: యూటీఎఫ్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు తెలిపారు. ఆదివారం కడప యూటీఎఫ్ భవన్లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. డీఎస్సీ బోధనలో ఉభయ రాష్ట్రాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంచే ఉచిత డీఎస్సీ కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ నిర్వహిస్తున్న ఉచిత డీఎస్సీ కోచింగ్ ఎంతో ఉపయోగకరమని.. అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డీఎస్సీ బోధనలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం కోవెల ప్రసాద్‌రెడ్డి (ఇంగ్లిష్), సిరివెల జయశంకర్ (తెలుగు), సుబ్బారెడ్డి (గణితం), శ్రీనివాసులు (బయలాజికల్ సైన్స్), సత్యానందరెడ్డి (ఫిజికల్ సైన్స్), మస్తాన్ (ట్రై మెథడ్స్) షేక్ షంషుద్దీన్ (సైకాలజీ) మహేష్ (జీకే – కరెంట్ అఫైర్స్) అనే ఉపాధ్యాయులు బోధిస్తారని వివరించారు. ఈనెల 24వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఫ్రీ డెమో తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తరగతులకు కడప జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోపు కె.నరసింహరావు : 9440384701, గాజులపల్లి గోపీనాథ్ :9885125056 నంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. -
టీటీడీ బోర్డు దృష్టిసారించాలి
టీటీడీలోకి సౌమ్యనాథాల యం విలీనమయ్యాక ఒంటిమిట్ట రామాలయం తరహాలో అభివృద్ధి చెందుతుందని ఆశించాం. టీటీడీ పాలకమండలి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలి. శనివారం రోజున టీటీడీ భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేయాలి. –మేడా విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీపీ, నందలూరు భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి గతంలో భక్తులు సహకారంతో ప్రతి శనివారం భక్తుల ఆకలి తీర్చేవిధంగా అన్నప్రసాదాలను పంపిణీ చేసేవారము. టీటీడీలోకి విలీనమైన తర్వాత అన్నప్రసాదాలను పంపిణీ చేయడం లేదు. ఈ విషయంపై టీటీడీ తక్షణమే స్పందించాలి. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. – అరిగెల సౌమిత్రి, ఆలయ మాజీ చైర్మన్, నందలూరు -
డీఎస్సీ శిక్షణ వైపు పరుగులు
కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ అభ్యర్థుల ఎదురుచూపులు ఫలించాయి. ఆశలు మళ్లీ చిగురించాయి. ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదల అయింది. ఇప్పటికే చాలా మంది డీఎస్సీ అభ్యర్థులు వేలకు వేలు ఖర్చు పెట్టుకుని నెలల తరబడి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇన్నాళ్లు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఇక కోచింగ్ సెంటర్లకు పరుగులు తీయనున్నారు. దీంతోపాటు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ను ఇచ్చేందుకు సిద్ధమవుతుండడం విశేషం. జిల్లాలో 705 పోస్టులు.. ఉమ్మడి వైఎస్సార్‌జిల్లాలో 705 ఉపాధ్యాయ పోస్టులు ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల ప్రజా పరిషత్తు, మున్సిపాలిటి పరిధిలో భర్తీకానున్నాయి. ఇందులో 407 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులుకాగా 298 సెకండ్ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు భర్తీకానున్నాయి. ఇందులో 219 తెలుగు మీడియం ఎస్జీటీ, 31 ఉర్దూ ఎస్జీటీ, 21 ఎస్జీటీ మున్సిపాలిటి, 07 ఉర్దూ ఎస్జీటీ, 12 కార్పొరేషన్ ఎస్జీటీ, ఎస్జీటీ ఉర్దూ 8 పోస్టులు భర్తీకానున్నట్లు తెలిసింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ ఉర్దూ 06, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ 79, స్కూల్ అసిస్టెంట్ హిందీ 16, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 26, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 42, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు 28, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ ఫిజికల్ సైన్సు 02, స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ తెలుగు మీడియం 49, బయలాజికల్ సైన్సు ఉర్దూ మీడియం 02, తెలుగు మీడియం సోషియల్ 58, ఉర్దూ 05, ఫిజికల్ సైన్సు ఉర్దూ 07 పోస్టులు భర్తీకానున్నాయి. 20 నుంచి...మే 15 వరకు.. ఈ నెల 20 నుంచే మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మే 15వ తేదీ వరకు ఉంటుంది. జూన్ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతోపాటు డీఎస్సీ పరీక్షకు సంబంధించిన పూర్తి సమా చారం, జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్, నోటికేషన్ కోసం వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు htpp:// cse.ap. go.inతోపాటు htpp://apdsc.apcfss.inలో అందు బాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కోచింగ్్ సెంటర్లలో మొదలైన హడావుడి ఉచిత కోచింగ్‌కు సన్నాహాలు చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు జిల్లాలో 705 పోస్టుల భర్తీకి అవకాశం -
●ముగ్గురూ..కూటమి నేతలే కదా!
సాక్షి ప్రతినిధి, కడప: ఆయన కూటమి ఎమ్మెల్యే. పూటకో మాట.. రోజుకో రంగు మార్చడంలో ఆరి తేరిన వ్యక్తి. ‘ఆది’నుంచి.. నియంతృత్వ ధోరణే. స్వపక్షనేతలతో కయ్యానికి దిగుతూ విపక్షంపై వేలెత్తి చూపించడంలో దిట్ట. అక్రమ ఆదాయం కోసం అర్రులు చాస్తూ వైఎస్సార్సీపీని బూచిగా చూపెట్టి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నవ్వుల పాలవుతున్నారు. ఓవైపు ప్రభుత్వ పెద్దల వద్ద పట్టుకోల్పోగా మరోవైపు క్షేత్రస్థాయిలో సమర్థించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆయనే జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆది. ● జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై ఇటీవల కాలంలో ప్రధానంగా మూడు వివాదాలు తెరపైకి వచ్చాయి. గండికోట రిజర్వాయర్ ఆధారంగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు సివిల్ పనులు తన బంధువులను పంపించి అడ్డుకున్నారు. అక్కడున్న సిబ్బందిపై దాడులకు తెగబడ్డారు. మిషనరీ ధ్వంసం చేశారు. ఇక రెండోది ఆర్టీపీపీ నుంచి సరఫరా అవుతోన్న ఫ్లయాష్ ట్యాంకర్లు అడ్డుకున్నారు. తాము చెప్పిన సూచించిన ట్యాంకర్లు నుంచే ఫ్లైయాష్ సరఫరా చేయాలని హుకుం జారీ చేశారు. తాజాగా అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమకు సరఫరా చేస్తున్న ముడి ఖనిజం రవాణా చేస్తున్న లారీలను అడ్డగించి సిమెంటు ఉత్పత్తికి ఆటంకం కల్గించారు. ఈ మూడు ఘటనల వ్యవహారంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీ వర్గీయులంటూ ఆ పార్టీ పేరు వాడుకొని ఎదురుదాడి చేశారు. ఫ్లైయాష్ ట్రాన్సుపోర్టులో టీడీపీ ఎమ్మెల్యే... ఆర్టీపీపీ నుంచి ప్రతిరోజు 3,926 టన్నులు ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతోంది. దానిని 25 ప్రైవేటు కంపెనీలకు, 15 సిమెంటు పరిశ్రమలకు కేటాయిస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు టన్ను రూ.550 చొప్పున, సిమెంటు పరిశ్రమలకు టన్ను రూ.410 చొప్పున ఇచ్చేలా అగ్రిమెంటు చేసుకున్నారు. తాడిపత్రిలో ఉన్న ఎల్అండ్టీ సిమెంటు పరిశ్రమకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్‌రెడ్డి తండ్రి జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన ట్యాంకర్లు ఫ్లైయాష్ సరఫరా చేస్తున్నాయి. తాడిపత్రికి కూడా తమ వర్గీయుల ట్యాంకర్లు ద్వారానే ఫ్లైయాష్ సరఫరా చేయాలంటూ ఎమ్మెల్యే మంకుపట్టు పట్టారు. ఈక్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ట్యాంకర్లకు లోడింగ్ చేయకుండా అడ్డుకున్నారు. అదే స్థాయిలో జేసీ ప్రభాకరరెడ్డి ప్రతిఘటించారు. ఈవ్యవహారం ఉద్రికత్తల నేపధ్యంలో మరోమారు సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అల్ట్రాటెక్ ముడి ఖనిజం ట్రాన్సుపోర్టు కాంట్రాక్టులో ఎంవీ రమణారెడ్డి.. ఎర్రగుంట్ల మండలం చిలంకూరు పరిధిలో ఉన్న అల్ట్రాటెక్ (ఐసీఎల్) సిమెంటు పరిశ్రమకు ఫ్లయాష్, సున్నపురాయి ఇతర ముడి ఖనిజం సరఫరా, ప్యాకింగ్ ప్లాంట్ కాంట్రాక్టు పనులు 40 ఏళ్లుగా మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు ఎంవీ రమణారెడ్డి చేస్తున్నారు. ఆ పనులన్నీ తమ వర్గీయులకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొంతకాలంగా సిమెంటు పరిశ్రమ యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి వివాదం లేని కారణంగా ఆ పరిశ్రమ యాజమాన్యం నుంచి ఎమ్మెల్యే డిమాండ్‌కు ఆశించిన స్థాయిలో మద్దతు కొరవడింది. దాంతో ఏకంగా తన వర్గీయులతో ట్రాన్సుపోర్టు వాహనాలను అడ్డుకున్నారు. సిమెంటు ఉత్పత్తికి కావాల్సిన ముడి ఖనిజం సరఫరా నిలిచి పోవడంతో ఉత్తత్పి ఆగిపోయింది. ఇలాంటి తరుణంలో ఆ సంస్థ యాజమాన్యం హైలెవెల్లో ఫిర్యాదు చేసింది. దాంతో సీఎంఓ జోక్యం చేసుకుంది. కలెక్టరేట్ ఆగమేఘలపై స్పందించి అడ్డుకున్నవారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఎలాంటి ఆటంకం లేకుండా వ్యవహరించింది. ●రమేష్‌నాయుడు బీజేపీ ఎంపీ... వైఎస్సార్సీపీని బూచిగా చూపెట్టి తన చర్యను సమర్థించుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఆది యాజమాన్యంతో సంప్రదించాల్సిన ధోరణి అదేనా! ఎమ్మెల్యేకి ప్రజాస్వామ్య పద్ధతులు ఉండవా... నిలదీస్తున్న ప్రజాస్వామ్యవాదులు ఈ ఘటనల్లోని ముగ్గురు ‘కూటమి’నాయకులే. ఒకరేమో బీజీపీ పార్లమెంటు సభ్యుడు , మరొకరు తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే, ఇంకొకరు చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించిన మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు. ఈముగ్గురు కూడా వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేని వారే. పైగా కూటమి నాయకులే. కాగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ‘మొగుణ్ణి కొట్టి మొగసాల ఎక్కినట్లు’గా స్వపక్షనేతలపై కాలుదువ్వుతూనే వైఎస్సార్సీపీని బూచిగా చూపెడుతున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఆదాయ మార్గాలు తమకు మాత్రమే ఉండాలి. జమ్మలమడుగు ప్రాంతం తమదే.. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న ఏరియాలో ఇతరులెవ్వరూ కాంట్రాక్టు పనులు చేయవద్దనే నియంతృత్వ ధోరణిని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రదర్శిస్తున్నా రని విశ్లేషకులు ఘాటుగా విమర్శిస్తున్నారు. గండికోట ప్రాజెక్టు ఆధారంగా కొండాపురం మండలంలోని దొబ్బుడుపల్లె, రావికుంట, తిరువాలయపల్లె గ్రామాలతోపాటు మైలవరం మండలంలోని బొగ్గులపల్లె ఆదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వ అనుమతులు దక్కాయి. తొలివిడతగా రూ.1800 కోట్లతో నిర్మాణ పనులకు ఆసంస్థ శ్రీకారం చుట్టింది. టెండర్లల్లో అనకాపల్లె ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు సివిల్ పనులు దక్కాయి. క్షేత్రస్థాయిలో పనులు మొదలు పెట్టారు. ఈపనులను తమ వర్గీయులే చేయాలంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి, మరో సోదరుడు కుమారుడు రాజేష్‌రెడ్డి నేతృత్వంలో మందీ మార్బలంతో వెళ్లి దొబ్బుడుపల్లె వద్ద చేపడుతున్న నిర్మాణ పనుల్లో విధ్వంసం సృష్టించారు. ఆదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అడ్డుకుంటున్న వైనాన్ని రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి రాజేష్‌నాయుడు సీఎం చంద్రబాబునాయుడుకు మొరపెట్టుకున్నారు. -
నిర్లక్ష్యపు నీడలు!
రాజంపేట: దక్షిణాది రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాల్లో అతిపెద్దది చోళుల కాలంనాటి సౌమ్యనాథాలయం. ఈ ఆలయంపై టీటీడీ నిర్లక్ష్యపు నీడలు వెంటాడుతున్నాయి. టీటీడీ దీనిని పేరుకే విలీనం చేసుకున్నట్లు కనిపిస్తోందని భక్తులు పెదవి విరిస్తున్నారు. సెంట్రల్ ఆర్కియాలజీ, టీటీడీ మధ్య సమన్వయం కొరవడటంతో ఆలయ అభివృద్ధి అటకెక్కిందనే విమర్శలు ఉన్నాయి. టీటీడీ, కేంద్రపురావస్తుశాఖ మధ్య సమన్వయం లేకపోవడమే దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆలయంలో కల్యాణవేదిక, పరిపాలనగదులు, పోటు, సిబ్బంది గదులు నిర్మించడానికి కూడా అభ్యంతరాలు పుట్టుకొచ్చాయి. దీంతో రేకులషెడ్డ్ నిర్మితం చేసుకున్నారు. ఆలయంలో భక్తుల సౌకర్యాల విషయంలో కూడా నిర్లక్ష్యధోరణే కనిపిస్తోంది.. ఇప్పటికే ఆలయంలో సెంట్రల్ ఏసీతోపాటు అంతరాలయంలో ఏసీ తదితర సౌకర్యాల కల్పన దిశగా వచ్చిన పరికరాలు మూలనపడేశారు. పేరుకే విలీనం: 2022లో తిరుమల తిరుపతి దేవస్ధానంలోకి సౌమ్యనాథాలయం విలీనమైంది. ఒంటిమిట్ట రామాలయం తర్వాత దీనిని విలీనం చేసుకున్నారు. ఇక ఆలయం అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్న భక్తుల ఆశలు అడియాసలయ్యాయి. ఈ ఆలయం వైపు టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు, ఈవో, జేఈవోలు కనీసం కన్నెత్తిచూడటంలేదన్న విమర్శలున్నాయి. కొన్ని నెలలుగా ఒంటిమిట్టకు వెళుతున్నా.. సౌమ్యనాథాలయం టీటీడీలో ఉందనే భావనలో వారు లేనట్లు కనిపిస్తోందని భక్తులు పెదవివిరిస్తున్నారు. శిథిలావస్థలో ప్రాచీన ప్రహరీ:11 వశతాబ్దంలో చోళవంశరాజు కుళోత్తుంగచోళుడు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చుట్టూ వున్న ప్రహరీగోడ శిథిలావస్థకు చేరుకుంది. దక్షిణ, ఉత్తర, తూర్పు గాలిగోపురాలతో మిళితమైన ప్రహరీగోడ పై భాగం కూలిపోయినా ఇంతవరకు పునర్నిర్మించచలేదు. సౌమ్యనాథా.. ఏదీ అన్నప్రసాదం ఆలయంలో 108 ప్రదక్షణలు చేస్తే కోరిన కోర్కేలు తీరుతాయని భక్తుల విశ్వాసం.దీంతో శనివారం అధికసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లానుంచే కాకుండా ఇతర జిల్లాలనుంచి కూడా భక్తులు అధఙక సంఖ్యలో వస్తుంటారు. దేవదాయశాఖ పరిధిలో ఆలయం ఉన్నప్పుడు దాతల సహకారంతో అప్పట్లో చైర్మన్ అరిగెల సౌమిత్రి, పాలకమండలి ఆధ్వర్యంలో ప్రతి శనివారం భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేసేవారు. భక్తులు ఇక్కడే భోజనం చేసుకుని వెళ్లేవారు. ప్రస్తుతం టీటీడీలో విలీనమైనా అన్నప్రసాదాలను అందచేసేందుకు టీటీడీ ముందుకురాలేదు. నందలూరు బస్టాండులో నాన్వె వెజ్ హోటల్స్ ఉండటంతో భోజనం తినడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికై నా టీటీడీ అధికారులు స్పందించి అన్నప్రసాదం పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టీటీడీలోకి విలీనమైనా మారని సౌమ్యనాథాలయం పరిస్థితి కన్నెత్తిచూడని టీటీడీ చైర్మన్, ఈఓలు శనివారం భక్తుల ఆకలి తీర్చని టీటీడీ -
దైవదర్శనానికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
బద్వేలు అర్బన్ : నెల్లూరు జిల్లాలోని పెంచల కోనకు వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఇరువురు బద్వేలు వాసులు మృతిచెందారు. ఆదివారం నెల్లూరు జిల్లాలోని కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన ఎం.నరసింహులు (26) పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అలాగే పట్టణంలోని రూపరాంపేటకు చెందిన వై.ఝాన్సీ (26) అదే ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఇరువురు కలిసి శనివారం సాయంత్రం బద్వేలు నుండి ద్విచక్ర వాహనంలో పెంచలకోనకు బయలుదేరారు. అక్కడ దైవదర్శనం చేసుకుని రాత్రికి అక్కడే ఉండి ఉదయాన బద్వేలుకు బయలుదేరారు. ఈ క్రమంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిలోని కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలోకి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. ఈ ఘటనలో ఝాన్సీ అక్కడికక్కడే మృతిచెందగా నరసింహులును స్థానికులు 108 వాహనంలో బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మర్రిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లెసమీపంలో రోడ్డు ప్రమాదంఇరువురు బద్వేలు వాసులు మృతి -
ఆపరేషన్ కగార్‌ను ఆపాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : దండకారణ్యంలో భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్‘ పేరుతో ఆదివాసీలపై చేస్తున్న మారణ హోమాన్ని ఆపాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జాతీయ నాయకులు ప్రసాద్, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, విప్లవ రచయిత సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు వరలక్ష్మి, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఎన్ఆర్సి, సిఏఏ జేఏసీ కన్వీనర్ బాబు బాయ్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని విశ్వేశ్వరాయ భవన్లో జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై నరమేధాన్ని ఆపండి’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో అంతమొందించడం తగదన్నారు. ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకించ వలసిన బాధ్యత భారత దేశ ప్రజలందరిపైన ఉందన్నారు. భవిష్యత్తు తరాలకు చెందాల్సిన సహజ వనరులైన అటవీ సంపదను, పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆదివాసీ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ముస్లిం మైనార్టీ వ్యతిరేక మతతత్వ విధానాలను తూర్పారబట్టారు. సమాజంలో వివిధ మత సమూహాల మధ్య సామరస్యతను భగ్నం చేయటానికి బీజేపీ యత్నిస్తోందన్నారు. ఇది ఎంత మాత్రం తగదన్నారు. సామాన్య ప్రజల జీవితాలను అభద్రతకు గురి చేస్తూ, అధికారాన్ని కాపాడుకుంటూ, బహుళ జాతి సంస్థలైన అంబానీ, ఆదానీ, ఎస్సార్, వేదాంత లాంటి కంపెనీలకు అక్రమంగా లబ్ధి చేకూరుస్తోందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చీమలపెంట వెంకటేశ్వర్లు, ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ద్రాక్షం శ్రీనివాసులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొన్నారు. -
రైల్వే లోకో పైలెట్లకు వసతుల కల్పన
ఎర్రగుంట్ల (జమ్మలమడుగు) : రైల్వే లోకో పైలెట్ అండ్ గాడ్స్ ఎనిమిది గంటల ప్రయాణం చేసి ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు రైల్వే ఏడీఆర్ఎం సుధాకర్ అన్నారు. ఆదివారం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో ఉన్న రైల్వే రన్నింగ్ రూమ్‌ను ఆయన పరిశీలించి అక్కడ లోకో పైలెట్లకు ఉన్న సదుపాయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ ఆవరణలో 2022లో రూ.97 లక్షలతో గ్రౌండ్ ఫ్లోర్‌ను నిర్మించామన్నారు. ఇప్పుడు రూ.1.37 కోట్లతో మహిళలకు, పురుషులకు వేరువేరుగా అన్ని వసతులతో విశ్రాంతి గదిని నిర్మించామన్నారు. ఇక్కడ విశ్రాంతి గది, యోగ, లైబ్రరీ, లోకో పైలెట్లకు అవగాహన కోసం సూచనలు ఇచ్చే ప్రత్యేక గది ఏర్పాటు చేశామన్నారు. అంతేకాక రూ.60 లక్షతో ఎర్రగుంట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని ఇది జూన్ నెలకు పూర్తి చేస్తామన్నారు. ఎర్రగుంట్ల రైల్వే రన్నింగ్ రూమ్‌లో ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. లోకోపైలెట్లకు ప్రత్యేక వంట గది కూడా ఉందని, వారికి ప్రత్యేక మెను ప్రకారం భోజన సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీఈఈ వీరయ్య, చీఫ్ క్రూప్ కంట్రోలర్ సిద్దు సాహెబ్, ఏడీఈయన్ రాధాక్రిష్ణ, ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాసులు, చీఫ్ లోకో ఇన్స్పెక్టర్ బాబాజాన్, ముధుసూదన్, వీఎస్ రాజు పాల్గొన్నారు. రూ.60 లక్షలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేస్తాం రైల్వే ఏడీఆర్ఎం సుధాకర్ -
ఎన్జీఓలకు ఇంటి స్థలాల కోసం కృషి
కడప కల్చరల్ : జిల్లాలోని ఎన్జీఓలకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు తగిన కృషి చేస్తామని కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు లెక్కల కొండారెడ్డి తెలిపారు. ఆదివారం సంస్థ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన లెక్కల కొండారెడ్డి జమా ఖర్చులను సభ్యులకు వివరించారు. సొసైటీకి అందరూ సహకరించాలని కోరారు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు బి.శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు డి.రవికుమార్‌లు మాట్లాడుతూ స్థలాలు రాని సభ్యులకు రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.విద్యాసాగర్‌ల సహకారంతో తప్పక స్థలం అందించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.ప్రసాద్ యాదవ్, జిల్లా కార్యదర్శి డి.రవికుమార్‌లు మాట్లాడుతూ ఇంటి స్థలాల విషయంగా ఎలాంటి సందేహాలు, ఆందోళన అవసరం లేదని, తప్పక అందరికీ అందగలవని స్పష్టం చేశారు. సమావేశంలో సొసైటీ పాలక వర్గ డైరెక్టర్లు, ఉమ్మడి కడప జిల్లా తాలూకా అధ్యక్షలు, కార్యదర్శులు, మాజీ జిల్లా అధ్యక్షలు ఎస్ మునెయ్య, పెన్షనర్ల అధ్యక్షలు రామమూర్తి నాయుడు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
కడప అర్బన్ : జిల్లాలో అగ్నిప్రమాదాల పట్ల నిరంతరం అప్రమత్తంగా వుండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలియజేశారు. జిల్లా అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. ఈ వారోత్సవాల ముగింపు సందర్భంగా కడప ఫైర్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ అగ్నిప్రమాదాలే కాకుండా విపత్తుల, రోడ్డు ప్రమాదాలలో కూడా అగ్నిమాపక శాఖ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తూ ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా కృషి చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రధానంగా అగ్నిమాపక సేవలను కొనియాడారు. ఎక్కడైనా అగ్నిప్రమాదాలు జరిగితే ఆయా డిపార్ట్మెంట్ల వారు అగ్నిమాపక శాఖ వారు వచ్చేలోపు చేపట్టాల్సిన కార్యక్రమాలపై శిక్షణ పొందాలన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి ధర్మారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ ప్రమాదాలపై, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలపై అవగాహన ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి బసివిరెడ్డి, కడప అగ్నిమాపక సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. -
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
ఒంటిమిట్ట : మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామం, హరిజనవాడకు చెందిన ఎర్రబల్లి గంగాధర్ (31) అనే వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఒంటిమిట్ట పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గంగాధర్‌కు 10 సంవత్సరాల క్రితం వల్లూరు మండలం, కొట్లూరు గ్రామంలో రెడ్డమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి సంతానం లేదు. గంగాధర్ వివాహం చేసుకున్నప్పటి నుండి మద్యానికి బానిస కావడంతో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఎంత చెప్పినా భర్త గంగాధర్ మద్యాన్ని మానుకోకపోవడంతో భార్య రెడ్డమ్మ ఐదేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుండి గంగాధర్ వద్దకు భార్య రెడ్డమ్మ రాకపోగా మూడు నెలల క్రితం రెడ్డమ్మ మరో వివాహం చేసుకుందని భర్త గంగాధర్‌కు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన గంగాధర్ ఇక నేను బతకను.. చనిపోతాను అని బంధువులకు, ఊరి ప్రజలకు చెప్పుకుంటూ ఉండేవాడని, చివరకు ఈనెల 17వ తేది తన ఇంటివద్ద ఉన్న మామిడి తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు గంగాధర్‌ను కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాలి వాన బీభత్సంచింతకొమ్మదిన్నె : ఆదివారం రాత్రి 9 గంటలకు వీచిన ఉధృతమైన గాలులకు, వర్షానికి మండల పరిధిలోని మద్దిమడుగు సుగాలి బిడికి గ్రామంలో పెద్ద చెట్లు విరిగిపడి కొన్ని ఇల్లు దెబ్బ తిన్నాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గ్రామానికి చెందిన బుక్కే గోమీలమ్మ మేకల మందపై పెద్ద చెట్టు పడడంతో సుమారు 20 పైగా మేకలు మృతి చెందాయి. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు అందరూ స్పందించి చెట్టుకొమ్మలను కత్తిరించి మేకలను బయటికి తీయడంతో కొన్ని బతికిపోయాయి. రాత్రి కావడం, విద్యుత్తు లేకపోవడంతో పూర్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం
రాజంపేట టౌన్ : ప్రచండ భానుడి భగభగలతో అల్లాడుతున్న వేసవిలో చల్లని పదార్థాలకు, ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించే పదార్థాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం భానుడు తన ప్రతాపం చూపుతుండటంతో శరీరానికి చలువచేసే వివిధ పదార్థాలతో ప్రజలు సేద తీరుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా శరీరం డీహైడ్రేషన్ కాకుండా మజ్జిగ, కొబ్బరిబోండాలు, పుచ్చకాయలు, పండ్ల రసాలు వంటివి వేసవి తాపాన్ని తీర్చుతున్నాయి. అయితే వేసవిలో తాటిముంజలకు ప్రత్యేక స్థానం ఉంది. వేసవి తాపాన్ని అధిగమించేందుకు, వేసవిలో శరీరంలో సంభవించే అనేక రుగ్మతలను నివారించి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చేందుకు ప్రకృతి ప్రసాదించిన తాటిముంజలు (ఐస్ యాపిల్) విశేష ప్రాచుర్యం పొందాయి. తాటిముంజల సీజన్ ప్రారంభం కావడం, దీనికితోడు భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ముంజలకు డిమాండ్ ఏర్పడింది. కొంత మంది వ్యాపారులు వైఎస్సార్ జిల్లా వేంపల్లె నుంచి తాటిముంజలను రాజంపేటకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. తాటిముంజలు శరీరంలో చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేసే లక్షణం కలిగివున్నందున ముంజల విక్రయాలు హాట్ కేకుల్లా సాగుతున్నాయి. ఆరోగ్య ప్రదాయిని.. ప్రకృతిలో విరివిగా లభ్యమయ్యే తాటిముంజలు కల్తీలేని, స్వచ్ఛమైనవి కావడంతో ఆరోగ్య ప్రదాయిని అని వైద్యులు కూడా చెబుతున్నారు. ధర ఎక్కువైనా ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. డజను నూరు రూపాయిల నుంచి నూట ఇరవై రూపాయిలకు విక్రయిస్తున్నారు. అనేక మంది ఇవి విక్రయించే ప్రాంతంలో వేచివుండి మరీ కొనుగోలు చేస్తున్నారు. లేతగా ఉండే వాటికి గిరాకీ ఎక్కువగా ఉంది. అనేక ప్రయోజనాలు.. ● తాటి ముంజల్లో విటమిన్లు, ఫాస్పరస్, థయామిన్, బీ–కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియంతో పాటు సోలెబుల్ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ● వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవితాపం, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. ● తాటిముంజలు తినడం వల్ల శరీరంలో పేరుకున్న హానికర వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ● వేసవిలో ఏటా క్రమం తప్పకుండా తినడం ద్వారా చెడుకొలస్ట్రాల్ తగ్గించి, మంచి కొలస్ట్రాల్ వృద్ది చేస్తుంది. ● వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్‌ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ● చర్మానికి కావాల్సినంత తేమను అందించి చెమటకాయల్ని నివారిస్తుంది. తాటిముంజల్లో పుష్కలంగా విటమిన్లు భానుడి ప్రతాపంతో హాట్ కేకుల్లా తాటిముంజల విక్రయాలు ఐస్ యాపిల్‌గా ప్రాచుర్యంవ్యాపారం జోరుగా సాగుతుంది ఎండలు ఎక్కువగా ఉన్నందున తాటిముంజల వ్యాపారం జోరుగా సాగుతోంది. మేము వేంపల్లె నుంచి తాటిముంజలను తీసుకొస్తున్నాము. కొంతమంది తాటిముంజలు ఎప్పుడు వస్తాయా అని వేచివుంటున్నారు. ఖర్చులన్ని పోను ఆశాజనకంగా మిగులుబాటు ఉంది. – శివ, తాటిముంజల వ్యాపారిపోషక విలువలు అధికం వేసవిలో అధికంగా ఎండలు ఉండటం వల్ల మనిషి శరీరంలో నీటిని కోల్పోతాడు. అందువల్ల శరీరానికి కావాల్సిన పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తుండాలి. తాటిముంజలు వేసవితాపాన్ని తీర్చడంతో పాటు పోషకాలను అందిస్తాయి. వీటిలో ముఖ్యంగా తేమ, కార్పోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు వంటి పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. – డాక్టర్ పాలనేని వెంకటనాగేశ్వరరాజు, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి రాజంపేట -
ఘనంగా అంకాలమ్మ విగ్రహ ప్రతిష్ట
ఖాజీపేట : తుడుమలదిన్నె గ్రామంలో నూతనంగా నిర్మించిన అంకాలమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. మూడు రోజుల నుంచి ఆలయ విగ్రహప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయి. చివరి రోజున అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగింది. ప్రతిష్ట పురస్కరించుకుని బండలాగుడు పోటీలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గెలిచిన వారికి కమిటీ సభ్యులు బహుమతి ప్రదానం చేశారు. ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ ఛైర్మన్ విగ్రహ ప్రతిష్టా మహోమత్సం పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జెడ్పీ ఛైర్మన్ రామగోవిందురెడ్డి పాల్గొన్నారు. పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే ఎండోమెంట్ ద్వారా రూ. 34లక్షల నిధులు మంజూరుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ఘన సత్కారం చేశారు. విరిగిన ధ్వజస్తంభం ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభం ఏర్పాటు చేసే కార్యక్రమం నిర్వహించారు. అయితే దురదృష్టవశాత్తు ధ్వజస్తంభం విగిరింది. విరిగిన భాగం ఆలయ పైభాగంలో పడింది. ఆలయం పై భాగం కొద్దిమేరకు దెబ్బతింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నా ఎవ్వరికీ ఎలాంటి అపాయం జరగక పోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్రహారంలో అమ్మవారి విగ్రహప్రతిష్ట ఖాజీపేట మేజర్ పంచాయితీ లోని అగ్రహారం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంకాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ రాఘవరెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ మాజీ అధ్యక్షుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఏపీఐఐసీ మాజీ డైరెక్టర్ గంగాధర్‌రెడ్డి, కేసీ కెనాల్ ప్రాజక్టు కమిటీ మాజీ అధ్యక్షుడు డీఎల్ శ్రీనివాసులరెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, మండల కన్వీనర్ మురళీమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటికి పోతుండగా పోలీసులు కొట్టారు
సాక్షి టాస్క్‌ఫోర్స్ : యర్రగుంట్ల పట్టణంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి పోవడానికి నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉండగా యర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ వచ్చి చెప్పేది వినకుండానే చెంపపై కొట్టి, లాఠీతో కొట్టాడని బాధితుడు సింగారపు నీలకంఠ వాపోయాడు. నీలకంఠ బాధతో తనకు జరిగిన దానిపై ప్రచార మాధ్యమాలలో పెట్టాడు. దీనిపై బాధితుడు మాట్లాడుతూ ‘మా ఇల్లు ప్రొద్దుటూరు రోడ్డులోని పెట్రోల్ బంకు వెనుక ఇందిరమ్మ కాలనీలో ఉంది. నేను శనివారం రాత్రి 11 గంటలకు ఇంటి పోవడానికి నాలుగు రోడ్ల కూడలిలో బస్సు కోసం నిలబడి ఉన్నాను. అయితే బస్సు రాకపోవడంతో నా కుమారుడిని బైక్ వేసుకుని రమ్మని ఫోన్ చేసి చెప్పాను. అయితే ఆ సమయంలో ఓ కానిస్టేబుల్, హోంగార్డు వచ్చి ఏమి ఇక్కడ ఉన్నావే అని అడిగారు. నేను విషయం చెబుతుండగానే నన్ను చెంపపై కొట్టారు.. ఎందుకు కొడుతున్నారని అడిగితే మళ్లీ లాఠీ తీసుకుని చేతి మీద కొట్టారు. రాత్రి సమయంలో ఇంటికి పోవడానికి ఇబ్బందులు పడుతున్న వారిని పోలీసులు దగ్గర ఉండి ఇంటికి చేర్పించాల్సింది పోయి మాపైనే దాడి చేయడం అన్యాయం’ అని బాధితుడు ప్రశ్నించాడు. జరిగిన విషయాన్ని తాను ప్రచార మాధ్యమాలలో పెట్టినట్లు తెలిపారు. అతడు పెట్టిన వీడియో ప్రచార మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. దీనిపై సోమవారం జిల్లా ఎస్పీని కలసి తన బాధను చెప్పుకుంటానని, తనకు న్యాయం చేయాలని నీలకంఠ కోరారు.ప్రచార మాధ్యమాలలో ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు నీలకంఠ -
ఉన్నత చదువుకు తొలిమెట్టు
కడప ఎడ్యుకేషన్ : ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఇక విద్యార్థులు డిగ్రీనా, ఇంజినీరింగ్నా అనేది తేల్చుకునే సమయం కూడా ఆసన్నమైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీసెట్ –2025 ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అవి కూడా ఈ నెల 24వ తేదీకి ముగియనున్నాయి. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులెవరైనా ఉంటే త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఏపీ ఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు అధారంగా జిల్లాతోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. సీనియర్ ఇంటర్ ముగిసిన ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు cetr.aprche.ap.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ఏపీ ఈఏసీసెట్–2025ను ఎంపిక చేసకోవాలి. ఏపీఈఏపీసెట్ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియతోపాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్‌కు సంబంధించిన తేదీలు, సూచనలు తదితర పూర్తి వివరాలు పొందవచ్చు. దరఖాస్తుకు ధ్రువపత్రాల వివరాలు తప్పని సరి.. ఏపీ ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసే సమయంలో వివిధ కేటగిరీల పరిధిలోకి వచ్చే విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తప్పని సరిగా సిద్ధం చేసుకోవాలి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, పీహెచ్సీ కేటగిరిల వారిగా తమ సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్లో క్లిక్ చేయాలి. అదే విధంగా ధ్రువపత్రాలకు సంబంధించిన నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రవపత్రాలు నంబర్‌ను సైతం విధిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ తరువాత తీసుకున్న ధ్రుపత్రాలను పరిగణనలోకి తీసుకున్నారు. స్థానికత నిర్ధారణకు... విద్యార్థులు స్థానికత నిర్ధారణకు 6వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు ఏ విద్యా సంస్థల్లో చదివాడు, ఏ ఊరిలో చదివాడనే వివరాలు ఆయా విద్యా సంవత్సరాల వారిగా నమోదు చేయాలి. చివరలో ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ఏ జిల్లాలో రాస్తారనే సమాచారంతో కూడిన ట్యాబ్‌లను ప్రాధాన్యత క్రమంలో క్లిక్ చేయాలి. ఈ విధంగా ఐదు ప్రాధాన్యతలను క్లిక్ చేయాల్సి ఉంటుంది. సొంత జిల్లాకు చెందిన విద్యార్థి తమ సొంత జిల్లాలో పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ అక్కడి పరీక్షా కేంద్రంలో పరిమితి మించిపోవడం, ఇతర కారణాలతో పరీక్షా కేంద్రం అందుబాటులో లేని పక్షంలో తరువాత వరుస క్రమంలో ఇచ్చిన ప్రాధాన్యతల వారిగా ఆయా జిల్లాలో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత.. ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేసిన తరువాత ప్రింటవుట్ తీసుకోవాలి. పరీక్ష జరిగే రోజున ఏపీ ఈఏపీ సెట్ హాల్‌టికెట్‌తోపాటు ఆన్లైన్ ప్రింటవుట్ కాపీపై ఫొటో అంటించి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ఫీజు చెల్లించే సమయంలో ఇచ్చిన రెఫరెన్స్ ఐడీ, విద్యార్థి పేరు, సీనియర్ ఇంటర్ హాల్‌టికెట్, పుట్టిన తేదీ వివరాలతో భవిష్యత్తులో ఈఏపీ సెట్ హాల్ టికెట్, పరీక్షకు హాజరయ్యే సమయంలో సంబంధిత వివరాలు కీలకంగా మారుతాయి. కనుక జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుకు ఈ నెల 24 వరకు గడువు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు పరీక్ష మే 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ పరీక్ష దరఖాస్తు సమయంలో జాగ్రత్తలు తప్పని సరి -
బోగస్ పట్టా అని తేలితే జైలుకు వెళ్లేందుకు సిద్ధం
కడప రూరల్ : కడప భగత్‌సింగ్‌నగర్ సర్వే నంబరు 344లో తన భార్య పేరిట ఉన్న 2.50 సెంట్ల స్థలం నకిలీ పట్టా అని తేలితే తాను జైలుకు వెళ్లేందుకై నా సిద్ధమేనని సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి బి.నారాయణరెడ్డి అన్నారు. శనివారం కడప ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ స్థలం తన భార్య పేరిట ఎలా వచ్చిందో విచారించి చర్యలు తీసుకోవాలంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. భగత్‌సింగ్ నగర్ భూపోరాటం జరిగిన 1996, 1998 సంవత్సరాలలో వీరెవరూ ఆ పార్టీలో లేరని తెలిపారు. భగత్‌సింగ్ నగర్ స్థలం తన భార్య పేరిట పట్టా ఉందంటూ 2016 డిసెంబరు 31న కడప తాలూకా పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేసిన సీపీఎం నాయకులకు ఇప్పుడది నకిలీ పట్టాగా ఎలా కనబడుతోందో వివరించాలన్నారు. డీకేటీ పట్టాపై తహసీల్దార్ వద్ద విచారణ జరుగుతోందన్నారు. సంబంధం లేని స్థలంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పాతిన బోర్డును తక్షణమే తొలగించాలన్నారు. లేకపోతే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం ద్వారా ఆయనపై చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. 2014 తర్వాత సీపీఎం రాష్ట్ర నాయకత్వం అవలంబిస్తున్న విధానాలతో తాను విబేధించి బయటకు వచ్చానని స్పష్టం చేశారు. బోర్డు తొలగించకుంటే మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి బి.నారాయణరెడ్డి -
కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిందేమీ లేదు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు చేసిందేమీ లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయి బీసీ విభాగం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ జిల్లా నుంచి బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు శివరామ్‌తోపాటు పలువురు బీసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ విభాగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, పార్టీని ఎలా పటిష్టం చేయాలనే అంశాలపై బీసీ నేతలు దిశానిర్దేశం చేశారని, తదనుగుణంగా రాబోయే రోజుల్లో జిల్లా బీసీ విభాగం పనిచేస్తుందని తెలిపారు. త్వరలోనే జిల్లా, మండల కమిటీలు పూర్తి చేసి, కూటమి ప్రభుత్వంలో బీసీలకు జరిగే అన్యాయాలు, టీడీపీ వారు చేసే అక్రమాలను బయటపెడతామన్నారు. -
వడ దెబ్బతో ఉపాధి కూలీలు మృతి
సింహాద్రిపురం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శనివారం వడదెబ్బతో ఇద్దరు ఉపాధి కూలీలు మృతి చెందారు. సింహాద్రిపురం మండలం నంద్యాలమ్మ బావి న్యూ ఫీడర్ ఛానల్ కాలువ పనులరే వెళ్లిన ఓబుళరెడ్డి దాహం వేయటంతో నీరు తాగి కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయి మృత్యువాత పడ్డాడు. ఈ విషయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ భవాని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు కరుణాకర్ రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉపాధి కూలీ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఏపీఓ జయభారతి, ఈసీ శ్రీనివాసులరెడ్డి, టీఏలు రజిత, లక్షుమయ్యలు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అట్లూరు : మండల పరిధిలోని మణ్యంవారిపల్లె పంచాయతీ పార్వతీపురంలో చాట్ల పోలయ్య (43) అనే ఉపాధి కూలీ శనివారం ఉదయం సమీపంలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. అక్కడ తోటి కూలీలతో పనులు చేస్తూ మండే ఎండలకు తాళలేక ఉన్నపళంగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు, స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య భాగ్యమ్మ, కుమారుడు సంపత్, కుమార్తె శృతి ఉన్నారు. -
అక్రమంగా కొండను తవ్వేస్తున్నారు
జమ్మలమడుగు : పశువుల మేత కోసం వదిలిన కొండ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుని పూర్తిగా చదును చేస్తున్నారని , పైగా ఎలాంటి అనుమతులు లేకుండా సోలార్ కంపెనీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఆర్డీఓ ఆదిమూలపు సాయిశ్రీకి ఫిర్యాదు చేశారు. శనివారం పెద్దముడియం మండలంలోని కొండ పాపాయపల్లి, దిగువకల్వటాల గ్రామాలకు చెందిన రైతులతో కలిసి ఆర్డీఓను కలిశారు. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ కొండపాపాయపల్లి పంచాయతీ పరిధిలో నాగరెడ్డిపల్లె గ్రామంలోని సర్వే నంబర్ 224లో నంద్యాల, కడప జిల్లా ప్రాంతాలకు చెందిన రైతులు పశువులను మేపుకునేందుకు వస్తుంటారని తెలిపారు. రబీ, ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాంతంలో పూర్తిగా పంటలు వేసుకుంటారన్నారు. పశువుల మేత కోసం అన్ని వర్గాల ప్రజలకు ఈ కొండనే ఆధారంగా నిలిచిందని చెప్పారు. అలాంటి కొండను సోలార్ కంపెనీ కోసం పూర్తిగా చదును చేస్తున్నారన్నారు. కల్వటాల గ్రామానికి చెందిన రైతుల పట్టా భూముల్లో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా పనులు చేసి వదిలేశారన్నారు. వారు వేసిన సిమెంట్ దిమ్మెలను తొలగించాలంటే రైతులకు లక్షల రూపాయలలో ఖర్చు అవుతుందన్నారు. వారికి న్యాయం జరిగే విధంగా అధికారులు సోలార్ కంపెనీ ద్వారా హామీ ఇప్పించాలని కోరారు. అధికారులు ఒకవైపు అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. అక్కడ పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయన్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ విష్ణువర్దన్‌రెడ్డి, కొండపాపాయపల్లె నాయకుడు వెంకటసుబ్బారెడ్డి, కల్వటాల నాయకుడు శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణ చట్టం.. రాజ్యాంగ విరుద్ధం
ప్రొద్దుటూరు కల్చరల్: వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు ప్రతినిధి కేఎం అబ్దుసుభాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ముబారక్షాదీ మంజిల్ నుంచి శివాలయం సర్కిల్ వరకు ముస్లింలు భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టసవరణను ముస్లిం సమాజం, ముస్లిం పర్సనల్ లాబోర్డు పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఇది ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉందని తెలిపారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 14, 25, 26కు విరుద్ధంగా ఉందని, ఇస్లాం సంప్రదాయాలు, మత స్వేచ్ఛ, సాంస్కృతిక హక్కులు, మత సామరస్యం, సామాజిక ఐక్యతను ప్రభావితం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు.. ఈ సవరణ చట్టానికి వత్తాసు పలకడం ముస్లిం సమాజాన్ని కలచివేసిందన్నారు. 400 ఏళ్ల నాటి స్థలాలకు రిజి స్ట్రేషన్ పత్రాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. దీనివల్ల పురాతన మసీదులు, దర్గాలు ఉనికి కోల్పేయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు పోరాడతామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజల మధ్య అశాంతిని సృష్టిస్తున్నాయన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సాయినాథరెడ్డికి వక్ఫ్ సరవణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ఖాజా, జేఏసీ కన్వీనర్ అబ్దుసమద్, కో కన్వీనర్ సలీం, సభ్యులు రహమతుల్లా, హిదాయతుల్లా, సీపీఐ ఏరియా సమితి కార్యదర్శి సుబ్బరాయుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ బాషా, విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి, సీఎంఎస్ నాయకురాలు పద్మ, పలు మసీద్‌ల ఇమాంలు, ధార్మిక పండితులు, ముస్లిం పెద్దలు, ప్రజాస్వామ్యవాదులు, ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు ప్రతినిధి అబ్దుసుభాన్ భారీగా ముస్లింల శాంతి ర్యాలీ -
నేడు హౌసింగ్ కమిటీ సమావేశం
కడప కల్చరల్: జిల్లా ఎన్జీఓ సహకార గృహ నిర్మాణ సంఘం సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నామని పాలక వర్గ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని శాటిలైట్ సిటీలోగల సంస్థ కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇందులో జమా ఖర్చుల ఆమోదం, డ్యూయల్ మెంబర్ షిప్ గల వారి సమస్యలను అధ్యక్షుల అనుమతితో చర్చిస్తామన్నారు. నేడు పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాలకు సంబంధించి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రైవేటు, ఎయిడెడ్, మండల పరిషత్, కేజీబీవీ, ఎంపీయంఎస్ పాఠశాలలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ ఈ నెల 20న నిర్వహించరాదని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్య ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ నిర్వహిస్తే ప్రధానోపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. రేపు జాబ్ మేళా కడప కోటిరెడ్డి సర్కిల్: స్థానిక రిమ్స్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం ప్రముఖ 18 కంపెనీలతో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సురేష్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ చదివి 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు ఫొటోలు తీసుకుని రావాలన్నారు. ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆర్టీసీ అధికారిపై విచారణ కడప కోటిరెడ్డి సర్కిల్: కడప ఆర్టీసీలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శనివారం విచారణ చేపట్టారు. నెల్లూరు జోన్ విజిలెన్స్ అధికారి ధర్మతేజను రాష్ట్ర ఉన్నతాధికారులు విచారణాధికారిగా నియమించారు. ఆయన శనివారం కడపకు వచ్చి ఆర్టీసీ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఆర్టీసీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. రాయలసీమలోని 8 జిల్లాల 40 మంది పోలీసు కానిస్టేబుళ్లను విచారణ చేయనున్నట్లు సమాచారం. ఆ నివేదికను త్వరలో రాష్ట్ర ఉన్నతాధికారికి అందజేయనున్నారని తెలిసింది. బాధ్యతలు స్వీకరణ కడప కోటిరెడ్డి సర్కిల్: ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా షేక్ హిదాయతుల్లా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన నియమితులయ్యారు. శనివారం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరిని మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హిదాయతుల్లా మాట్లాడుతూ మహిళలు, యువత, విద్యార్థులు, వ్యాపారులు వంటి అన్ని మైనారిటీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న మైనారిటీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన వ్యక్తులకు చేరుస్తామని తెలిపారు. సంబంధీకులు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్లో ఉన్న తమ కార్యాలయాన్ని సంప్రదించాలని వివరించారు. -
అన్నదాతలు ఆరుగాలం శ్రమించారు.. పంటలను కన్నబిడ్డల్లా పెంచుకున్నారు.. దిగుబడి చేతికి వస్తోందని ఎంతో ఆనందించారు.. ఈ నేపథ్యంలో అకాల గాలివాన విరుచుకు పడింది. దీంతో అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పండ్ల తోటలు భారీగా దెబ్బతిన్నాయి. అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. వార
లింగాల మండలంలో విరిగి పడిన బొప్పాయి చెట్లు మండలం గ్రామం పంట విస్తీర్ణం రైతులు పంటనష్టం హెక్టార్లలో లక్షల్లో ఒంటిమిట్ట చింతరాజుపల్లి అరటి 16 11 5.60 బొప్పాయి 10 10 2.50 కర్జూజ 6 5 1.50 పచ్చిమిరప 6 9 2.10 దువ్వూరు క్రిష్ణంపల్లి బొప్పాయి 8 9 2,00 కానగూడూరు బొప్పాయి 6 7 1.50 ఇడమడక బొప్పాయి 8 9 2 చక్రాయపేట చక్రాయపేట నిమ్మపంట 16.8 30 5.88 వెంపల్లి వెల్లిమవారిపల్లె అరటి 4 6 1.40 సింహాద్రిపురం అంకాలమ్మ అరటి 10 5 3.50 గూడూరు కొవరంగుంటపల్లె అరటి 2 2 0.70 బిదనంచెర్ల అరటి 10 13 3.50 కసనూరు అరటి 0.82 1 0.29 సిద్దవటం మాచుపల్లి అరటి 2 2 0.70 ముద్దనూరు గంగాదేవ్పల్లి మునగ 1 1 0.25 లింగాల వెలిదండ్ల అరటి 48 55 16.80 బొప్పాయి 6 5 1.50 లింగాల అరటి 20 15 7.00 చిన్నకూడాల అరటి 18 20 6.30 వేముల వేముల అరటి 46 55 16.10 వేల్పుల అరటి 120 135 42.00 మీడిపెంట్ల అరటి 45 55 15.75 గొంతిపల్లి అరటి 3 5 1.05 మొత్తం 412.62 464 139.917 కడప అగ్రికల్చర్: నెలల తరబడి వేలకు వేలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంటలు.. తీరా దిగుబడులు చేతికొచ్చే సమయంలో ఈదురు గాలులు, అకాల వర్షాలతో దెబ్బతిన్నాయి. దీంతో అన్నదాతలు నిండా మునిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కనీసం సాగు ఖర్చులు కూడా చేతికి రాకుండానే.. చివరకు అప్పులను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇదే తరహాలో శుక్రవారం సాయంత్రం జిల్లాలో ఉన్నట్లుంటి వీచిన ఈదురుగాలులకు పలు మండలాల్లో అరటి, బొప్పాయి, కర్బూజ, నిమ్మ, మునగ వంటి పలు ఉద్యాన పంటలు నేలకొరిగాయి. దీంతో అన్నదాతలకు రూ.139.91 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా నష్టాన్ని అంచానా వేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించారు. జిల్లాలో 464 మంది రైతులకు సంబంధించి.. ఒంటిమిట్ట, దువ్వూరు, చక్రాయపేట, వేంపల్లి, సింహాద్రిపురం, సిద్దవటం, ముద్దనూరు, లింగాల, వేముల మండలాల పరిధిలోని 464 మంది రైతులకు సంబంధించి 412.62 హెక్టార్లలో అరటి, బొప్పాయి, కర్బూజ, మిరప, నిమ్మ, మునగ వంటి వివిధ పంటల నేలకొరిగి దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.139.91 లక్షల మేర రైతులకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా నష్టపరిహారాన్ని అంచానా వేసినట్లు వారు తెలిపారు. అత్యధికంగా దెబ్బతిన్న పంటలు జిల్లాలోని కొన్ని మండలాల్లో అత్యధిక నష్టం జరిగింది. ఇందులో భాగంగా వేముల మండలం వేల్పుల గ్రామంలో అత్యధికంగా అరటి పంటలకు సంబందించి 135 మంది రైతులకు చెందిన 120 హెక్టార్లలో పంట దెబ్బతిని రూ.42 లక్షల మేర నష్టం జరిగింది. అదే మండలం వేముల గ్రామంలో అరటికి సంబంధించి 55 మంది రైతులకు 46 హెక్టార్లలో పంట దెబ్బతిని 16.10 లక్షలు, మీడిపెంట్ల గ్రామంలో 55 మంది రైతులకు 45 హెక్టార్లలో అరటి పంట దెబ్బతిని రూ.15.75 లక్షలు, అలాగే లింగాల మండలం వెలిదండ్లలో అరటి పంటకు సంబంధించి 55 మంది రైతులకు 48 హెక్టార్లలో పంట దెబ్బతిని 16.80 లక్షలు, చక్రాయపేట మండలం చక్రాయపేట గ్రామంలో 30 మంది రైతులకు సంబంధించి 16.8 హెక్టార్లలో నిమ్మపంట దెబ్బతిని రూ.5.88 లక్షలు, ఒంటిమిట్ట మండలం చింతమరాజుపల్లెలో అరటి, బొప్పాయి, కర్బూజ పంటలు 27 మంది రైతులకు సంబంధించి 32 హెక్టార్లలో పంట దెబ్బతిని రూ.9.60 లక్షల మేర నష్టం వాటిల్లింది. బీభత్సం సృష్టించిన గాలివాన దెబ్బతిన్న ఉద్యాన పంటలు రూ.1.40 కోట్ల మేర నష్టం ఆదుకోవాలని అన్నదాత వేడుకోలు -
స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదాం
కడప సెవెన్‌రోడ్స్: స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాను కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డితో కలిసి కలెక్టర్ ‘ఈ–చెక్‘ (ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ) కార్యక్రమాన్ని కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేసీ అదితిసింగ్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడప నగరం ఏడురోడ్ల కూడలి నుంచి స్వచ్ఛత ర్యాలీని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. వన్‌టౌన్ సర్కిల్ వరకు సాగిన స్వచ్ఛతా ర్యాలీలో అధికారులు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గ్రీన్ అంబాసిడర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ దివస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ శనివారాన్ని ‘ఈ–చెక్‘ అంశంతో మనం వాడిన ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాలను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతూ ఈ మాసంలో ‘ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్‘(ఈ వేస్ట్ రీసైక్లింగ్) అంశంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రభుత్వం సూచించిన మేరకు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి పోగు చేసేందుకు కడప మున్సిపాలిటీలో ఒక అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేశామని, నగరంలోని నివాసాల నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరణ కేంద్రంలో అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్‌రెడ్డి, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, డీపీఓ రాజ్యలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య, ప్రజారోగ్య శాఖల అధికారులు, ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడపలో స్వచ్ఛతా ర్యాలీ -
ఖాకీలకు సవాల్.. పట్టుకోండి చూద్దాం..!
● పగలు రెక్కీ.. రాతిళ్లు లూఠీ ● తాళం వేసిన ఇళ్లను కొళ్లగొడుతున్న దుండగులు ● ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున జరిగిన భారీ చోరీలు ● దొంగల జాడ కనిపెట్టలేకపోతున్న పోలీసులు ● చోరీ సొత్తు దొరక్క లబోదిబోమంటున్న బాధితులు ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో దొంగలు దొరికింది దొరికినట్లు దోచుకొని ఇళ్లను కొల్లగొడుతున్నారు. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, శివారు ప్రాంతాలు వేటినీ వదల్లేదు. పగలు రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో ఇళ్లను ఊడ్చేస్తున్నారు. ఇంటికి తాళం వేస్తే చాలు ఎంతటి సెక్యూరిటీ ఉన్నా రంగంలోకి దిగుతున్నారు. పక్కా ప్లాన్ అమలు చేస్తూ మరీ సులభంగా దొంగతనాలు చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో దొంగలపై పోలీసులు నిఘా పెడుతుంటే.. పోలీసుల ఊహలకు దొరక్కుండా వారి కంటే ఫాస్ట్‌గా దొంగలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రొద్దుటూరులో జరుగుతున్న వరుస దొంగతనాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఎక్కడ చోరీ జరిగినా 40–50 తులాల బంగారు, కిలోల లెక్కన వెండి, రూ. లక్షల్లో నగదు ఉంటోంది. నాలుగైదు రోజులు లోతుగా రెక్కీ నిర్వహించి సంపన్నుల ఇళ్లనే దుండగులు టార్గెట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రశాంతంగా ప్రొద్దుటూరులో వరుస దొంగతనాలతో అలజడి నెలకొంది. ఎప్పుడు ఏ ఇంట్లో దొంగలు పడతారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చోరీలు ఫుల్.. రికవరీ నిల్: ప్రొద్దుటూరుతో పాటు రూరల్ మండలంలో ఇటీవల కాలంలో చోరీలు ఎక్కువగా జరిగాయి. దొంగలు మాత్రం పోలీసులకు దొరక్కుండా ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. దీంతో చోరీ సొత్తు రికవరీ కాక పోవడంతో బాఽధితులు ఆందోళన చెందుతున్నారు. బంగారం బాగా ప్రియమైంది. తులం బంగారు రూ. 1 లక్ష చేరువలో ఉంది. రెండు, మూడు తులాలు బంగారు చోరీకి గురైనా సుమారు రూ. 3 లక్షల వరకు ఆయా బాధితులు నష్టపోవాల్సి వస్తుంది. ఇంట్లో బంగారు పెట్టుకోకుండా లాకర్లలో భద్రపరుచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సీసీ కెమెరాల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న దొంగలు చోరీ జరిగిన తర్వాత దొంగల ఆచూకి కోసం పోలీసులు సీసీ కెమెరాలపై ఆధారపడటం సహజంగా జరిగే ప్రక్రియ. సీసీ కెమెరాలను పరిశీలించి అందులో దొంగల కదలికలు రికార్డు అయితే పోలీసుల దర్యాప్తు సులభతరం అవుతుంది. సీసీ పుటేజీల్లో నిందితుల జాడ కనిపించపోతే ఫింగర్ ప్రింట్ల ఆధారంగా దొంగల ఆచూకి కనుగొంటారు. అయితే ఇటీవల దొంగలు నిఘా కెమెరాల్లో పడకుండా జాగ్రత్త పడుతున్నారు. రెక్కీ నిర్వహించే క్రమంలో ఇంటి పరిసరాలను కూడా వారు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలు ఉన్నా వాటి కంట పడకుండా ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నారు. చేతి గుర్తులు పడకుండా గ్లౌజ్‌లు తొడుక్కుంటున్నట్లు పోలీసులే చెబుతున్నారు. ఇటీవల లక్ష్మీనగర్‌లో జరిగిన చోరీ ఘటనను పరిశీలిస్తే దొంగలు ఎంత తెలివి మీరారో ఇట్టే అర్థం అవుతుంది. అక్కడి ప్రవేశ ద్వారంలోనూ. కాంపౌండ్ లోపల సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే దొంగలు వాటిలో పడకుండా చోరీ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో కూడా దొంగలు సీసీ కెమెరాల్లో పడలేదు. చోరీ జరిగిన ఇంటి ఎదురుగా, పక్క వీధుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. దొంగలు ఇంటి వెనుక వైపు నుంచి శివశంకర్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. కాగా పట్టణంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రధాన వీధులు, రహదారులు, కూడళ్లలో సీసీ కెమెరాలు పని చేయలేదు. దీంతో దొంగతనాలు జరిగినప్పుడు దొంగల ఆచూకి తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారుతోంది. ప్రధాన కేసుల్లో దొంగలు ఇప్పటికీ దొరకలేదు. దీంతో సొత్తు రికవరీ కాక పోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. రాత్రి గస్తీ ముమ్మరం చేసిన పోలీసులు : ప్రొద్దుటూరులో వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు రాత్రి గస్తీ ముమ్మరం చేశారు. బ్లూకోల్ట్స్‌ను అప్రమత్తం చేశారు. బొల్లవరంలో రెండు రోజుల క్రితం చోరీ జరిగిన ప్రాంతంలో అర్దరాత్రి 12 గంటల సమయంలో బ్లూ కోల్ట్స్ పోలీసులు అక్కడికి వచ్చి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అయితే బ్లూకోల్ట్స్ పోలీసులు వచ్చి వెళ్లిన తర్వాత అనగా 1.10 గంటల ప్రాంతంలో దొంగలు కాలనీలోకి ప్రవేశించారు. ఆయా స్టేషన్ల పరిధిలో సీఐలు, ఎస్ఐలు కూడా రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతున్నారు. ఇళ్లకు తాళం వేసి బయటికి వెళ్లాల్సి వస్తే ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో పని చేసే నిఘా కెమెరాలను ఇంట్లో పెట్టుకోమని పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసుల సూచనలను ప్రజలు పెడచెవిన పెట్టడం వల్లనే చోరీలు జరుగుతున్నాయి. తమకు సమాచారం ఇస్తే తాళం వేసిన ఇంటిపై బ్లూ కోల్ట్స్ పోలీసులు నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుందని పోలీసు అధికారులు అంటున్నారు. చోరీలను అరికట్టడానికి ప్రజల సహకారం కూడా అవరసమని వారు చెబుతున్నారు. -
క్రీస్తు సందేశం.. క్షమా గుణం
సాక్షి, నెట్వర్క్: జిల్లా వ్యాప్తంగా గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లోక రక్షకుడైన క్రీస్తు.. సర్వ మానవపాప విముక్తి కోసం మరణ శిక్ష పొందిన రోజును శుభ శుక్రవారంగా పేర్కొంటూ.. క్రైస్తవ విశ్వాసులందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరుణామయుడు సిలువ మోసిన రోజును స్మరించారు. అన్ని క్రైస్తవ మందిరాలు కిక్కిరిశాయి. మానవులు చేసిన పాపాలను తను మోస్తూ సిలువపై ప్రాణాలను అర్పించి త్యాగాన్ని చాటిన ఏసును స్తోత్రాలతో కీర్తించారు. సిలువ ధ్యానాన్ని పాటించారు. భక్తితో 40 రోజులపాటు ఉపవాస దీక్షలు ఆచరించిన విశ్వాసులు.. శుక్రవారం వాటి విరమణ చేశారు. సంప్రదాయం ప్రకారం పేదలకు దానం చేశారు. అనంతరం చర్చిలకు తరలివెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగర, పట్టణ వీధుల్లో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు సిలువ మార్గ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ప్రజల రక్షణ కోసం ప్రాణ త్యాగం D çÜ…§ýl-Æý‡Â…V> {MðS•çÜ¢Ð]l Ð]l$™èl VýS$Æý‡$-Ð]l#Ë$ VýS$yŠæ {òœ•yól {´ëÐ]l¬-QÅ-™èl¯]l$ ÑÐ]l-Ç…-^éÆý‡$. VýS$yŠæ {òœ•yól¯]l$ »êÏMŠS {òœ•yól A° MýS*yé í³Ë$-Ýë¢Æý‡° ™ðlÍ´ëÆý‡$. ©°° JMýS Ô¶æ$¿ýæ-M>-Æý‡Å…Ìê M>MýS$…-yé.. {MîSçÜ$¢ çÜ…™éç³ ¨¯]l…V> fÆý‡$-ç³#-Mö…-sêÆý‡° õ³ÆöP-¯é²Æý‡$. HçÜ$MýS$ ÕË$Ð]l Ðólíܯ]l Ð]lÊyýl$ ÆøkÌS ™èlÆ>Ó-™èl.. ç³#¯]l-Æý‡$-™é¦-¯é°² B¨-ÐéÆý‡… Æøk DçÜt-ÆŠ‡V> ´ësìæ-Ýë¢Æý‡° ^ðl´ëµÆý‡$. {MðS•çÜ¢Ð]l çÜÐ]l*f…ÌZ A™èlÅ…™èl {ç³™ólÅMýS-OÐðl$¯]l ÆøkV> ç³ÇVýS-×ìæ-Ýë¢-Æý‡-¯é²Æý‡$. §ólÐ]l#yìlV> BÆ>-«¨…^ól HçÜ$-{MîS-çÜ$¢MýS$ ÕË$Ð]l Ðólíܯ]l Æøgôæ VýS$yŠæ{òœ•yól A° ™ðlÍ-´ëÆý‡$. {ç³fÌS Æý‡„ýS׿ MøçÜ… {MîSçÜ$¢ ™èl¯]l iÑ-™é°² ™éÅVýS… ^ólÔ>Æý‡° õ³ÆöP-¯é²Æý‡$. A…§ýl$MóS D Æøk¯]l A…§ýlÆý‡* Eç³ÐéçÜ ©„ýSË$ ^ólíÜ {MîSçÜ$¢¯]l$ ç³Nh-Ýë¢Æý‡° ÑÐ]lÇ…^éÆý‡$. „ýSÐ]l* VýS$׿Ðól$ HçÜ$ {MîSçÜ$¢ ç³Ç-^èlÆý‡Å A°, {ç³f-ÌS…-§ýlÆý‡* Ô>…† çÜÐ]l*-«§é¯]l… MýSÍW E…yéÌS° íßæ™èlÐ]l# ^ðl´ëµÆý‡$. A°² VýS$×ê-ÌS-MýS¯é² „ýSÐ]l* VýS$׿… Vöç³µ§ýl-¯é²Æý‡$. {MîSçÜ$¢ iÑ-™èl…, »Z«§ýl¯]lË$ A…§ýl-ÇMîS B§ýlÆý‡Ø-±Ä¶æ$Ð]l$-¯é²Æý‡$. భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు ప్రసంగించిన క్రైస్తవ మత గురువులు -
దంత సంరక్షణపై అవగాహన
కడప అర్బన్: వరల్డ్ ఓరల్ హెల్త్ డే మార్చి 20 సందర్భంగా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం వారిచే నిర్వహించే వివిధ నోటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. నెల రోజులు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా వాకతాన్ చేశారు. పుచ్చిన పళ్ల సమస్యలు, దంతాల సంరక్షణతోపాటు గుట్కా, కై ని, పొగాకు, మందు మొదలగునవి అరికట్టే విధానం ప్రాథమిక దశలో రోగనిర్ధారణ చేయగలిగిన పరికరాలు, నోటి క్యాన్సర్‌పై ప్రజలలో అవగాహన కల్పించారు. నోటి ఆరోగ్యం, శరీర ఆరోగ్యం ఎలా సంరక్షించుకోవాలో ముందుగా దంత వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వాళ్లకు వివిధ పోటీలు నిర్వహించారు. ఏప్రిల్ 9న వాకతాన్ మహావీర్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో యూజీ, పిజి దంత వైద్య విద్యార్థులు, స్టాఫ్ పాల్గొన్నారు. ఏప్రిల్ 17న గ్రూప్ టూత్ బ్రెషింగ్ పద్ధతి, నోటి ఆరోగ్యం అవగాహన ప్రజల్లో దంత సంరక్షణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు కడప ప్రభుత్వ దంతవైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎం.జ్యోత్స్న, వైస్ ప్రిన్సిపాల్ (అకడమిక్)డాక్టర్ పి.సురేష్ ప్రోత్సహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లీల తమవంతుగా కృషి చేశారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ జోత్స్న, డాక్టర్ శంకర్ వాకతాన్లో పాల్గొన్నారు.మెడికల్ అండ్ హెల్త్ డీడీగా శేఖర్ కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్‌గా శేఖర్ నియమితులయ్యారు. ఈయన కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న భక్తవత్సలం పదోన్నతిపై ఏపీ రిక్రూట్మెంట్ బోర్డు జాయింట్ డైరెక్టర్‌గా వెళ్లారు. దీంతో ఈ స్థానంలోకి శేఖర్ వస్తున్నారు. -
● బుగ్గవంక పనుల టెండర్లు రద్దు చేయాలి
కడప కార్పొరేషన్: బుగ్గవంకను అభివృద్ధి చేయడానికి ఇరిగేషన్ శాఖ నిర్వహించిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పొట్టిపాటి జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బుగ్గవంకలో జంగిల్ క్లియరెన్స్, గుర్రపుడెక్కను తొలగించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు రూ.3.25 కోట్లతో పది భాగాలుగా విభజించి టెండర్లు పిలిచారన్నారు. ఇందులో తక్కువకు టెండరు వేసిన కాంట్రాక్టర్‌ను బిల్లులు రాకుండా చేస్తామని, విజిలెన్స్‌తో విచారణ చేయిస్తామని బెదిరించారన్నారు. అతనితోనే ఈ పనులు చేయలేనని లెటర్ తీసుకొని, ఎక్కువ మొత్తానికి టెండర్ వేసిన వారికి పనులు అప్పగించారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు లబ్ధ్ది చేకూర్చడానికే ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్ వారికి వర్క్‌ను కట్టబెట్టారన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఈ పనులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2014–19లో కూడా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి నీరు–చెట్టు పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన పనులను కడప నగరంలోని బుగ్గవంకలో చేసి ఆ పనులకు ఇప్పుడు బిల్లులు నమోదు చేస్తున్నారన్నారు. అలాగే కడప నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైద్యులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలనుకోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రామక్రిష్ణారెడ్డి, శ్రీరంజన్‌రెడ్డి, ఐస్‌క్రీం రవి, సుబ్బరాయుడు పాల్గొన్నారు. -
యువకుడి లాకప్‌డెత్‌పై విచారణ
కడప అర్బన్: కడప టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం జరిగిన యువకుడి లాకప్‌డెత్‌పై పోలీస్ అధికారులు సమగ్ర విచారణ చేపడుతున్నారు. కడప నగ రం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాసాపేటలో నివాసం వుంటున్న షేక్ సోను (23)ను ఈ నెల 16వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో 211/2024 గంజాయి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మరుసటి రోజున 17న ఉదయం 10 గంటల సమయంలో కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. ఈ క్రమంలో లాకప్‌లో ఉంచారు. దాదాపు తెల్లవారుజా మున 3:20 గంటల సమయంలో అతను తన షర్ట్‌కు ఉన్న ఒక చేతిగుడ్డను మెడచుట్టూ చుట్టుకున్నాడు. తరువాత ఇంకో చేతిగుడ్డను లాకప్‌లోని బాత్రూం పిట్టగోడను ఎక్కి.. కిటీకికి వున్న గ్రిల్‌కు దగ్గరగా వెళ్లి కట్టి వేలాడాడు. గిలగిలా కొట్టుకుని, గింజుకుంటూ ఉండగా.. చివరి నిమిషంలో విధుల్లో వున్న మహ మ్మద్ అనే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఏఎస్ఐ నారాయణ గమనించి వెంటనే బయ టికి తీసుకుని వచ్చారు. తమ వంతుగా సీపీఆర్‌ను నిర్వహించారు. వెంటనే రక్షక్ పోలీసు వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌కు చేరుకోగానే డాక్టర్లు షేక్ సోనుకు వైద్య పరీక్షలు చేసి మృతి చెందా డని నిర్ధారించారు. ఈ నెల 17న అతని మృతదేహానికి ఇన్చార్జి ఆర్డీఓ ఎ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో మెజిస్టీరియల్ విచారణ చేపట్టి, రిమ్స్ వైద్యులచే పోస్టుమార్టం నిర్వహింపచేసి బంధువులకు అప్పగించారు. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తాం: డీఎస్పీ ఈ సంఘటన జరిగిన తరువాత విచారణ అధికారిగా జమ్మలమడుగు డీఎస్పీ కె.వెంకటేశ్వరరావును నియమించారు. మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం ప్రక్రియకు ముందుగా.. మృతుడి బంధువులను డీఎస్పీ విచారణ చేశారు. పోస్టుమార్టం తరువాత కడప టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు విచ్చేశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని అంశాలపై సమగ్రంగా విచారణ చేశారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడారు. తనను విచారణ అధికారిగా ఉన్నతాధికారులు నియమించిన క్షణం నుంచే విచారణ ప్రారంభించామన్నారు. కడప టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు గంజాయి కేసులో నిందితుడిగా వున్న షేక్ సోనును తీసుకుని వచ్చినప్పటి నుంచి.. ఉరేసుకున్న తరువాత పోలీసు రక్షక్ వాహనంలో అతన్ని తరలించే వరకు సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. అలాగే కానిస్టేబుల్ మహమ్మద్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఏఎస్ఐ నారాయణ విధుల్లో వున్నపుడు ఏయే అంశాలు జరిగాయో వివరంగా విచారణ చేన్నామన్నారు. పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌లో వున్న బాత్రూం కిటికీ గ్రిల్‌కు చొక్కాతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తరువాత ఉన్నతాధికారులకు నివేదికను సమర్పిస్తామన్నారు. పోలీసు సిబ్బందితో డీఎస్పీ వివరాల సేకరణ సీసీ ఫుటేజీల పరిశీలన -
ఫోన్ పోయిందా.. వచ్చి తీసుకెళ్లండి
కడప అర్బన్: కడప సైబర్ పోలీస్ వారు 6 నెలలుగా 602 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఇప్పటి వరకు 275 మంది బాధితులు మాత్రమే వారి ఫోన్లను ఆధారాలు చూపించి తీసుకెళ్లడం జరిగింది. ఇంకా సుమారు 327 మంది వారి మొబైల్స్ తీసుకు వెళ్లాల్సి ఉంది. మీ మొబైల్ ఫోన్ పోయినట్లుగా పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ చేసిన వారు.. మీ మొబైల్‌కు సంబంధించిన ఆధారాలతో కడప సైబర్ క్రైమ్ కార్యాలయాన్ని సంప్రదించి, మీ మొబైల్ ఫోన్‌ను తీసుకొని వెళ్లగలరు. మరిన్ని వివరాలకు 08562 245490 నంబర్‌కు ఫోన్ చేయాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. నేడు స్వచ్ఛ దినోత్సవం కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ఈ నెల 3వ శనివారం ఈ–చెక్ అనే థీమ్‌తో స్వచ్ఛ దినోత్సవాన్ని నిర్వహించాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన అంశాలపై శుక్రవారం టెలీ కాన్ఫెరెన్సు ద్వారా అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శనివారం జరగనున్న కార్యక్రమాల గురించి శుక్రవారం రోజున టాంటాం, మైక్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అన్ని కార్యక్రమాలు ఏ ప్రదేశాలలో జరుగుతాయో ప్రజలకు తెలియజేసి, వారందరినీ భాగస్వాములుగా చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఈ–వేస్ట్ సేకరణ/కలెక్షన్ డ్రమ్/బాక్సు ఏర్పా టు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సంస్థలు, ప్రజలంతా పాల్గొని ఈ–వేస్ట్ బాధ్యతను గుర్తించాలని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. అలాగే పబ్లిక్ ప్లేస్‌లలో పోస్టర్లు ప్రదర్శించాలని, ఈ–వేస్ట్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని, ప్రతి గ్రామ పంచాయతీలో ర్యాలీలు, మానవహారాలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు. ఉపాధ్యాయుల వివరాలు తెలపాలి కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న డీఎస్సీ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని ఎంఈఓలు అందజేయాలని పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శామ్యూల్ సూచించారు. శుక్రవారం కడప డీఈఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంఈఓలకు జీవో నంబర్ 117పై వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నంబర్ 117లో భాగంగా 3,4,5 తరగతులను హైస్కూల్‌ను నుంచి వెనక్కు తెచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. అలాగే 60 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలను బేసిక్ మోడల్ ప్రైమరీ స్కూల్‌గా, 60 నుంచి 150 మందిలోపు ఉన్న పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా ఏర్పాటు చేయనుందన్నారు. దీంతోపాటు డీఎస్సీ నిర్వహణ కూడా ఉందన్నారు. డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఈ నెల 24 నుంచి 26 వరకు అనారోగ్య సమస్యలున్న ఉపాధ్యాయులకు మెడికల్ సర్టిఫికెట్ల కోసం రిమ్స్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రమణ్యం, ఏడీ మూనీర్ఖాన్ ఏఎస్ఓ బ్రహ్మనందరెడ్డి, ఏపీఓలు జాలాపతి నాగేంద్రరెడ్డి, ఎంఈఓలు పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక వైఎంఆర్ కాలనీలోని పెద్దమ్మ చెట్టు వద్ద ఉన్న ట్రాన్స్ఫారంపై కోతి పడటంతో శుక్రవారం మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మైదుకూరు రోడ్డులో.. అలాగే మైదుకూరు రోడ్డులోని ఒక ఇండస్ట్రీ ఆరుబయట కొబ్బరి పీచు, పొట్టు అగ్ని ప్రమాదానికి గురై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. రూ.20వేలు నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక అధికారి రఘునాథ్ తెలిపారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం ప్రొద్దుటూరు క్రైం : స్థానిక హౌసింగ్‌బోర్డులోని భగత్‌సింగ్ కాలనీలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో బ్యాంక్ క్యాబిన్‌తో పాటు కంప్యూటర్, కౌంటింగ్ మిషన్, ఫ్యాన్, కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. శుక్రవారం సెలవు కావడంతో బ్యాంక్ తెరవలేదు. ఈ క్రమంలో రాత్రి బ్యాంక్‌లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది బ్యాంక్ వద్దకు చేరుకొని మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారి రఘునాథ్ తెలిపారు. టూ టౌన్ సీఐ సదాశివయ్య, ఎస్ఐ రాఘవేంద్రారెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం గురించి అగ్నిమాపక అధికారితో మాట్లాడారు. బాలిక అదృశ్యం రాజంపేట : ఎర్రబల్లిలో నివాసం ఉంటున్న సయ్యద్ ముస్కార్ తార (18) అనే బాలికకు మతిస్థిమితం సరిలేక అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు శుక్రనవారం పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేది రాత్రి నుంచి కనబడుట లేదని, తమ కుమార్తె ఆచూకీ తెలిసిన వారు 9121100573, 9133817996 నెంబర్లకు సమాచారం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కారు, స్కూటర్ ఢీ – స్కూటరిస్టు మృతి రామాపురం : మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదురుగా శుక్రవారం కారు, స్కూటర్ ఢీ కొని పప్పిరెడ్డి ఇరగంరెడ్డి (50) మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటసుధాకర్‌రెడ్డి తెలిపారు. వివరాలిలా.. మండలంలోని హసనాపురం పంచాయితీ గొల్లపల్లికి చెందిన పప్పిరెడ్డి ఇరగంరెడ్డి రామాపురంకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా పోలీస్‌స్టేషన్ సమీపానికి రాగానే కడప నుంచి రాయచోటి వైపు వెళ్తున్న కారు స్కూటర్ ఢీ కొంది. ఇరగంరెడ్డి కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మండల పోలీసులు తెలిపారు. ఇరగంరెడ్డి మృతికి నివాళి పప్పిరెడ్డి ఇరగంరెడడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సోదరుడు టీడీపీ నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇరగంరెడ్డి మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యాన్ని కల్పించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకంటామన్నారు. గ్లోబల్ ఇండియా ప్రైమ్ కబడ్డీ లీగ్‌కు ఎంపిక రామాపురం : మండలంలోని నల్లగుట్టపల్లె గ్రామం బీసీకాలనీకి చెందిన గంప నాగేంద్ర కుమారుడు గంపరెడ్డిప్రసాద్ గ్లోబల్ ఇండియా ప్రైమ్ కబడ్డీ లీగ్‌కు ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన కబడ్డీ సెలక్షన్లో గంప రెడ్డిప్రసాద్ తనదైన ప్రతిభను కనబరచడంతో ప్రైమ్ కబడ్డీ లీగ్‌కు ఎన్నికయ్యాడు. హర్యానా రాష్ట్రంలో ప్రపంచదేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో కబడ్డీ నిర్వహించనున్నారు. గంపరెడ్డిప్రసాద్ ఎంపికపై కుటుంబ సభ్యులు, మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు. -
సీపీఎంతో నారాయణరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు
కడప సెవెన్‌రోడ్స్ : తమ పార్టీతో బి.నారాయణరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, 2023 నుంచి ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శుక్రవారం సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తమ పార్టీ జిల్లా కమిటీ తీర్మానాన్ని వివరించారు. ఈనెల 3, 18 తేదీల్లో నారాయణరెడ్డి , ఆయన కుటుంబ సభ్యుల భూ కబ్జాలపై పత్రికల్లో కథనాలు ప్రచురించారని, అయితే తమ పార్టీతో అతడికి ఎలాంటి సంబంధం లేన్నారు. సీపీఎం పద్ధతులకు భిన్నంగా వ్యవహారించిన తమ పార్టీ జిల్లా కార్యదర్శులను, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులను, జిల్లా కమిటీ సభ్యులను, పూర్తి కాలపు కార్యకర్తలను బహిష్కరించిన ఉదంతాలు గతంలో చాలా ఉన్నాయని పేర్కొన్నారు. చెమ్ముమియాపేట గ్రామ సర్వే నెంబరు 344లోని స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీలో 2017లో తమ పార్టీ విజ్ఞప్తి మేరకు సుందరయ్య స్మారక కేంద్రం లైబ్రరీకి కేటాయిస్తూ తీర్మానం చేశారని పేర్కొన్నారు. సదరు స్థలాన్ని కబ్జాకోరులు ఆక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిన వెంటనే ఈ విషయాన్ని ఈనెల 2వ తేది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చామన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం వల్ల ఆ స్థలంలో కార్పొరేషన్ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. భగత్‌సింగ్ కాలనీలోని కమ్యూనిటీ స్థలాన్ని అధికారులు, స్థానిక ప్రజల అభీష్టం మేరకు కమ్యూనిటీ లైబ్రరీగా మార్చాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. నారాయణరెడ్డికిగానీ, వారి కుటుంబ సభ్యులకుగానీ పట్టా ఎలా వచ్చిందో విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణరెడ్డి భూ కబ్జాలపై ఏవైనా కథనాలు రాసేవారు తమ పార్టీ పేరు ఉపయోగించరాదని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్, ఎ.రామ్మోహన్, వి.అన్వేష్‌తోపాటు దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ -
జెడ్పీ చైర్మన్లకు గన్మెన్లను తొలగించడం దారుణం
వేంపల్లె : రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీ చైర్మన్లకు గన్మెన్లను తొలగించడం దారుణమని జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వేంపల్లెలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురవక తాగునీటి సమస్య అధికంగా ఉందని, వచ్చే జెడ్పీ నిధులతో ఎక్కడా కూడా తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మే 8న జెడ్పీ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో కలెక్టర్‌తో చర్చించి మొదటి ప్రాధాన్యతగా తాగునీటికి ఇవ్వనున్నామని, గత సమావేశాలలో కూటమి ఎమ్మెల్యేలు హాజరై జిల్లాలోని అనేక సమస్యలపై చర్చించకుండా గైర్హాజరు కావడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట, వేంపల్లె, సింహాద్రిపురం, లింగాల తదితర మండలాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందన్నారు. వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.16కోట్లను వేసవికాలంలో తాగునీటికి వినియోగిస్తామని తెలిపారు. ఇప్పటికే వివిధ రకాల పనులకు సంబంధించి రూ.6.కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి, మాజీ మైనింగ్ డైరెక్టర్ వీర ప్రతాపరెడ్డి, వైఎస్సార్సీఫీ నాయకులు భరత్ కుమార్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎం. రామగోవిందరెడ్డి -
మొరాయించిన జలాశయం గేటు
జమ్మలమడుగు రూరల్: మైలవరం జలాశయం నుంచి ప్రొద్దుటూరు మీదుగా వెళ్లే దక్షిణ కాలువ కొన్ని నెలల నుంచి ప్రవహిస్తోంది. 5 నెలల క్రితం కాలువ వెంట పరిమితికి మించి నీళ్లు వస్తుండటంతో ఇవి కాస్త పొలాల్లోకి వెళ్లి అడ్డంగా పారుతున్నాయి. దీంతో తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయంటూ నర్సోజీకొట్టాల, పొన్నతోట రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. అసలు విషయానికి వస్తే దక్షిణ కాలువకు అడ్డంగా ఉండాల్సిన జలాశయం గేటు కిందికి దిగడం లేదు. గతంలో దక్షిణా కాలువ ద్వార ప్రొద్దుటూరు ప్రాంతానికి నీటి అవసరాల కోసం అధికారులు గేటును కాస్త పైకి ఎత్తి వదిలేశారు. ఆ తరువాత పట్టించుకోక పోవడంతో గేటు కింది భాగం రబ్బరు సీల్స్ దెబ్బతినడంతో పూర్తిగా స్ట్రక్ అయింది. వారం క్రితం గేటు దించడానికి సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా దిగనంటూ మొరాయించడంతో సిబ్బంది చేసేదిలేక వెనుదిరిగారు. మైలవరం దక్షిణ కాల్వలో ఇరుక్కుపోయిన గేటు కిందికి దించడానికి సిబ్బంది ప్రయత్నాలు విఫలం నీరు తగ్గితే పనులు చేస్తాం ప్రస్తుతం మైలవరం జలాశయంలో నీరు ఉండటంతో దక్షిణ కాలువ గేటు మరమ్మతులు చేయలేకపోతున్నాం. గేటు కింది భాగాన రబ్బర్ సీల్స్ దెబ్బతిని ఉన్నాయి. జూన్, జులై మాసంలో జలాశయంలో నీరు తగ్గిన వెంటనే మరమ్మతులు నిర్వహిస్తాం. దక్షిణ కాలువ ద్వారా ప్రతి రోజూ 20 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం 2.9 టీఎంసీల నీరు ఉన్నాయి. – నరసింహమూర్తి, డీఈ, మైలవరం జలాశయం -
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
లింగాల: అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఇటీవల వీచిన ఈదురుగాలులకు లింగాలలో భారీ స్థాయిలో అరటి తోటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించారు. ఈదురుగాలు లు, వడగండ్ల వానకు తీవ్రంగా దెబ్బతిన్న, నేలకూలిన అరటి పంటలను ఆయన పరిశీలించారు. గ్రామంలోని యోడుగూరు ప్రతాప్‌రెడ్డి, వేలూరు ఆనంద్‌రెడ్డి, తేరా గంగాధరరెడ్డి, రామచంద్రారెడ్డిల అరటి తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును విలపిస్తూ ఎంపీ అవినాష్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. వారం రోజుల్లో చేతి కందే పంట నోటికి అందకుండా పోయిందని, పంట సాగు కోసం లక్షలాది రూపాయలు వెచ్చించామని పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొందని రైతులు విలపించారు. పంట చేతికి వస్తే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేద్దామనుకున్నామని, పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉందని.. తమను ఆదుకోవాలంటూ లోకేశ్వర మ్మ, వేలూరు నీలిమలు ఎంపీకి మొర పెట్టుకున్నారు. ● ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సోమవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు, వడగండ్ల వానకు మండలంలోని లింగాల, గుణకణపల్లె, చిన్నకుడాల, రామట్లపల్లె, పెద్దకుడాల, కామసముద్రం, బోనాల గ్రామాల్లో సుమారు 750ఎకరాలలో అరటి పంట నేలకూలిందన్నారు. మూడు వారాల క్రితమే మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, వెలిదండ్ల, ఎగువపల్లె గ్రామాల్లో 1450ఎకరాలలో అరటి పంట ఈదురుగాలులు, వడగండ్ల వానకు తీవ్రంగా దెబ్బతిందన్నారు. మూడు వారాల వ్యవధిలోనే 2150ఎకరాలలో అరటి తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. రైతులు పంటల సాగు కోసం ఎకరాకు రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షల వరకు వెచ్చించాల్సి వచ్చిందన్నారు. దీంతో మండల వ్యాప్తంగా రూ.42కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని, ఇన్పుట్ సబ్సిడీతోపాటు వాతావరణ భీమాను రైతులకు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చి నెలలో కూలిపోయిన అరటి పంటలకు మార్చి 31వ తేదీలోగా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని చెప్పిందని, ఇంతవరకు ఇవ్వ లేదని ఆయన తూర్పారబట్టారు. ప్రభుత్వం ఎకరాకు రూ.14వేలు ఇన్పుట్ సబ్సిడీ మాత్రమే అందిస్తోందని, ప్రభుత్వం అందించే ఈ ఇన్పుట్ సబ్సిడీ కూలిపోయిన అరటి తోటలను తొలగించడానికి కూడా సరిపోదని మండిపడ్డారు. ఒక్క ఎకరాలో కూలిన అరటి పంటను తొలగించుకోవడానికి రైతులు రూ.20వేల నుంచి రూ.25వేలు కూలీలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 2024 ఖరీఫ్‌కు సంబంధించిన ఈ అరటి పంట 2023 ఇన్సూరెన్స్ గైడ్‌లైన్స్ ప్రకారం 2024–25కు వాతావరణ భీమా వర్తింపజేసి రైతులకు ఇన్పుట్ సబ్సిడీతోపాటు వాతావరణ బీమా అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు మండలంలో పనిచేయడం లేదని, కొన్ని పనిచేస్తున్నా అవి కచ్చితమైన వెదర్ అప్డేట్ అందించడంలేదని, పాడైపోయిన వాటిని వెంటనే తొలగించి నూతన ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లను, డివైజర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం సాకులు వెతకకుండా ఉద్యాన శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫొటోలు, రైతుల వివరాలను పరిగణలోకి తీసుకుని ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమాలు అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి, నియోజకవర్గ రైతు విభాగపు కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, యూత్ కన్వీనర్ మనోహర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల నాయకులు మల్లికార్జునరెడ్డి, మల్లికేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, నాగభూషణంరెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ మండల కన్వీనర్ బాలసముద్రం రవి, లింగాల సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వైఎస్సార్ సీపీ కడప పార్లమెంటరీ కన్వీనర్ భాస్కర్ రెడ్డి, పెద్ద కుడాల మాజీ సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి, హక్కులు వారి పల్లె సర్పంచ్ భాస్కర్ రెడ్డి, రామన్నూతనపల్లె, పెద్దకుడాల, లింగాల, చిన్నకుడాల గ్రామాలకు చెందిన నాయకులు, రైతులు పాల్గొన్నారు. గాలివానకు దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తమ గోడును విలపిస్తూ ఎంపీకి మొరపెట్టుకున్న మహిళా రైతులు